ప్రయత్నించు

 ప్రయత్నించు, ప్రయత్నిస్తూనే ఉండు..
ఊపిరి ఉన్నంత వరకూ ప్రయత్నించు
ఓడిపోక, ఆగిపోక అలసట అన్నదే లేక
ఆశ తీరేదాక గెలుపు కోసం ప్రయత్నించు!

విశ్వాసాన్ని విరిచేసే కష్టాలు ఎదురైనా..
ఇబ్బందులన్నీ ఏకమై ధైర్యాన్ని వెలివేసి
జీవితానికే విశ్రాంతని రెచ్చగొట్టినా, బెదరక
తుదిశ్వాస వరకూ గమ్యానికై ప్రయత్నించు!

నిబ్బరాన్ని నీలో నిండుగా నింపుకుని..
ఎందరో మహానుభావులను తలచి కొలచి
స్వార్థం వీడి, పేరు ప్రతిష్టల కొరకు ఆశించక
ప్రాణం పోయే వరకూ తప్పక ప్రయత్నించు!

దారిలో విఛ్ఛిన్నం చేసే విభేధాలని వీడి..
గాఢనిద్ర నుండి మేల్కొని, బద్ధకాన్ని బలిచ్చి
సంఘర్షణలని గెలిచి, ఆకర్షణలకి అంతుచిక్కక
అపజయంలోని జయం దక్కేలా ప్రయత్నించు!

24 comments:

  1. ప్రయత్నించడమే ఏ పని అయినా...మంచి సందేశాత్మక కవిత.

    ReplyDelete
  2. ఉత్తేజంతోపాటు ఉల్లాసాన్ని ఇచ్చింది మీ పోస్ట్

    ReplyDelete
  3. ఉత్తేజభరితంగా సందేశాత్మకంగా సాగింది.. అభినందనలు పద్మాజీ..

    ReplyDelete
  4. हे भगवान ! मुझे मोती दे दे
    चांदनी के सुहाना दे दे
    फूलों का खुशबू दे दे
    जमीन पर जन्नत दे दे ……
    अगर ये सब ना मुमकिन हो तो
    పద్మార్పిత जैसे शायरी दे दे

    ReplyDelete
  5. ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకి సాగిపొమ్మని చెప్పే మీ పోయం ప్రశంసనీయం.

    ReplyDelete
  6. ఇకపై ఏదీ వదిలేదిలేదు...ప్రయత్నం పై ప్రయత్నం :)

    ReplyDelete
  7. అక్షర అనుసంధానం చేసారు పద్మార్పిత.
    చక్కని సందేశాన్ని మీదైన కూర్పుతో అందించారు.

    ReplyDelete
  8. ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కకపోతే ఏం చేసేది చెప్పలేదు

    ReplyDelete
  9. గట్లనే మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తనే ఉంటా ;)

    ReplyDelete
  10. ప్రయత్నంలో శ్రధ్ధ లోపించిన అది వ్యర్థం

    ReplyDelete
  11. ఇంతకీ మీ ప్రయత్నం ఎంతవరకో చెప్పలేదు. మీరు ఆచరిస్తున్నారా

    ReplyDelete
  12. యద్భావం తద్భవతి

    ReplyDelete
  13. ప్రయత్నించి ప్రయాసే తప్ప ప్రతిఫలం కనిపించడంలేదు....అయినా చేస్తూనే ఉంటాం.

    ReplyDelete
  14. బులెట్స్ మాటలు చెప్పినారు.

    ReplyDelete
  15. ప్రయత్నించి విశ్వాన్ని జయించాలన్నమాట..

    ReplyDelete
  16. సందేశాత్మకంగా ఉంది..అభినందనలు-హరినాధ్

    ReplyDelete
  17. ఇది...ఇలా మీరు ఊతమివ్వండి ప్రయత్నిస్తూ సాగిపోతాం విత్ సక్సెస్ ;)

    ReplyDelete
  18. చదువరులందర్నీ ప్రభావితం చేసే ఒక ఉద్వేగభరిత ఇన్స్పిరేషన్ కవిత. హ్యాట్సాఫ్ మేడం !

    ReplyDelete
  19. స్పందనలు తెలియజేసిన అందరికీ పద్మార్పిత అభివందనాలు _/\_

    ReplyDelete
  20. స్ఫూర్తిదాయకం మీ కవిత. బొమ్మ కూడా బాగుంది

    ReplyDelete
  21. quite inspiring. any number of times, I say that i take a holy dip in the divine sea of your poetry. with every dip, i get new energy, new focus, new inspiration, new life. Ultimately, your poetry has become my life blood and breath Padma garu. hats off. i bow before you.

    ReplyDelete