నేను పతివ్రతను కాను!!

ఒక్క భర్తనే భద్రంగా కాపు కాయలేను
పాంచాలినై ద్రౌపదినంటూ ఎలా బ్రతికేది
ఆమె పతివ్రతే అనుకుంటే నేను కాను!!

నేనే బ్రతుకలేక చచ్చి బ్రతికేస్తున్నాను
సావిత్రినై పతి ప్రాణాలు దక్కించుకోలేక
పోరాడి ఊపిరిపోసి పతివ్రతను కాలేను!!

పని వత్తిడిలో ఒక్క పసివాడినే పెంచలేను
అనసూయలా ముగ్గురు పిల్లల్ని పోషించి
పాతివ్రత్యం నిరూపించుకోలేని పతివ్రతను!!

రకరకాల రోగాలతో నీరసించి ఉన్న నేను
పతిని సతీసుమతి వలె భుజాల పై మోసి
కోరింది తీర్చి పతివ్రతను అనిపించుకోలేను!!

ముసుగు మోములో కోర్కె గుర్తించగలను
కానీ, అహల్యలా నేటి ఇంద్రుళ్ళలో రాయినై
రామపాదం తాకి పావనం అవ్వాలనుకోను!!

నిందించడం రాక నన్నునే తిట్టుకుంటాను
వేరెవరో నిందలు వేస్తే సీతలా మౌనం దాల్చి
భరించమని భూమాతను బ్రతిమిలాడలేను!!

అతిరథ సతీమణులతో పోటీపడి గెలవలేను
ఎప్పటికీ రంగులు అంటుకోని శ్వేతపద్మాన్ని,
నేను పతివ్రతను కాను అనుకున్నా కాలేను!!

104 comments:

 1. Try cheyandi tappuledu:)))
  nice pic and poem photo

  ReplyDelete
 2. నేటి సమాజానికి అసలుసిసలైన పతివ్రత....కాదు అని అన్నది ఎవరు? :-)

  ReplyDelete
 3. one more bold and beautiful arrow from your thoughts...claps claps

  ReplyDelete
 4. ద్రౌపది, సావిత్రి, అనసూయ, సుమతి, అహల్య, సీత...వీళ్ళేనా పతివ్రతలు.!!!???

  ReplyDelete
 5. ఎందుకు అవ్వాలని తాపత్రయ పడాలి

  ReplyDelete
 6. wah wah....bullets doosukelutundi.

  ReplyDelete
 7. అహల్యలా నేటి ఇంద్రుళ్ళలో రాయినై రామపాదం తాకి పావనం అవ్వాలనుకోను..వ్రాయాలంటే ధైర్యం కావాలి. మీకు ఉన్నది. చాలా చాలా బాగుంది పద్మగారు.

  ReplyDelete
 8. పంచభూతాల తత్వం శరీరం. ఐనా ఆత్మ ప్రాణం లేనిదే అవి ప్రకృతిలోనే మిళితమౌతాయి..
  సత్యమెరిగిన వానికి దైవగుణముతో పాటుగా దయాగుణము కలదని ఉవాచ.. అమ్మను మించిన దైవం లేదని అమ్మ సృష్టికే మూలమని తెలియజేశి అమ్మ ఒడిలో త్రిముర్తులే సేదతిరారు.. ధైర్య సాహసాలను ఊటంకిస్తు పోరాడే ప్రతి ఒక్కరు రాణి రుద్రమే సందేహమే లేదు..దైవాలకే ఆశ్రయమిచ్చిన పుణ్యభూమి భారతావని.. ముల్లోకాలలో తరించే పావని..

  బాగుంది మీ ఎక్సపెరిమెంటల్ కవిత పద్మగారు.

  ReplyDelete
  Replies
  1. శ్వేత పద్మమైనా సప్తవర్ణాల సమ్మేళనమే

   Delete
 9. గంభీర విగ్రహానికి చందనలేపనం పూసి అందించినట్లుంది మీ కవిత. ఎందరికో ఇది చర్చనీయా అంశం. అసలు ప్రాతివత్యం మనసుకా లేక మనిషికా అని ఇప్పటికీ తేలని విషయాన్ని తేలికైన పదాల్లో తేల్చి చెప్పేశారు.

  ReplyDelete
 10. పద్మార్పితగారూ, ఒక్క చిన్న సందేహమండీ. "పాంచాలినై ద్రౌపదినంటూ ఎలా బ్రతికేది" అన్న వాక్యం నాకు అర్థం‌కాలేదు. మీరు దయచేసి కొంచెం వివరించగలరా?

  ReplyDelete
 11. ఒక్క భర్తకే సరిగ్గా సపర్యలు చేసి చూసుకోలేని ఈ కాలంలో అయిదుగురికి భార్య అయిన ద్రౌపదిలా ఎలా బ్రతికేది అని చెప్పాలి అనుకున్నానండి.

  ReplyDelete
  Replies
  1. వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

   మీరు పాంచాలి అంటే అది పంచ + ఆలి అని అనుకున్నారన్నమాట, ఇలా అనుకొనేవారు తరచుగా తటస్థపడుతూ ఉంటారండి,

   పాంచాలదేశపు రాజకుమారి కాబట్టి ఆవిడకు పాంచాలి అని పేరండి. మీరనుకొన్నట్లుగా కాదు.

   అలాగే ద్రుపదస్య ఆపత్యం ద్రౌపదిః అనగా ద్రుపదుడి కూతురు కాబట్టి ఆవిడ ద్రౌపది అయ్యింది.

   అలాగే నల్లగా ఉంటుంది కాబట్టి ఆవిడను కృష్ణ అని కూడా అంటారండి.

   Delete
  2. This comment has been removed by the author.

   Delete
  3. This comment has been removed by the author.

   Delete
  4. శ్రీధర్ బుక్యాగారి అభిప్రాయాలను గురించి.

   "పంచ +ఆలి ఐతే ఐదుగురు భార్యలు అని అర్దం వస్తుంది." అనుకోవటం పొరపాటు. పంచ శబ్దం సంస్కృతపదం. ఆలి అన్నది తెలుగు మాట. అందుచేత పంచ+ఆలి- > పాంచాలి అని కుదరదు. అది
   సరికాదు.

   "కృష్ణుని చేత రక్షింపబడిన సందర్భముగా కూడా కృష్ణా అంటారు." అన్నది చిత్రమైన ఆలోచన, అది కూడా సరికాదు. మహాభారతకథలో ముగ్గురి కృష్ణులున్నారు. మొదటిది దేవకీవసుదేవసుతుడైన శ్రీకృష్ణుడు. రెండవవాడు అర్జునుడు. మూడవవ్యక్తి కృష్ణామహాదేవి అనగా ద్రౌపదీదేవి. ఉదాహరణకు ఘోషయాత్రఘట్టంలో శుక్రాచార్యుడు దుర్యోధనుడితో, కృష్ణుని చేత చచ్చిన నరకుని అంశ కర్ణుని ఆవహించును. అప్పుడు ఆ కర్ణుడు "కృష్ణుల నిద్దర నిర్దహించు" అంటాడు. ఈ "కృష్ణుల నిద్దర నిర్దహించు" అన్నది తిక్కనగారి మాటలే. ఇక్కడ ఇద్దరు కృష్ణులు అంటే నరనారాయణులు అనగా అర్జునుడు, శ్రీకృష్ణుడు అని అర్థం. అలాగే భారతంలో ద్రౌపదిని కృష్ణ అని సంబోధించటం కూడా అక్కడక్కద కనిపిస్తూ ఉంటుంది.

   Delete
  5. This comment has been removed by the author.

   Delete
  6. This comment has been removed by the author.

   Delete
  7. శ్యామలీయం గారూ .. దూరానికీ స్థానభ్రంశానికి మథ్య తేడా కూడా ఇక్కడ వివరించగలరు. (దీనికీ పోస్ట్ కి సంబంధంలేదనుకోండి )

   Delete
  8. మహాభారతకథలో ముగ్గురు కృష్ణులున్నారు. అయితే ఆ ముగ్గురు ఎవరన్న విషయంలో శ్యామలీయం గారు చెప్పింది పూర్తిగా వాస్తవం కాదు.

   1. వసుదేవుని పుత్రుడయిన క్రిష్ణుడు
   2. క్రిష్ణ అన్న పేరుగల ద్రౌపది.
   3. క్రిష్ణ ద్వైపాయనుడు అన్న పేరుగల వ్యాసుడు.

   ఇందులో మొదటి ఇద్దరికి నలుపు వర్ణం వల్ల ఆ పేరు రాగా, వ్యాసుడికి మాత్రం దట్టమైన అడవి కారణంగా ఎప్పుడూ నల్లని చీకటితో వున్న ద్వీపంలో జన్మించిన కారణంగా వచ్చింది.

   పోతన గారి "ఇద్దరు క్రిష్ణులు" కేవలం గణాల పొందిక కోసం వాడినట్టు భావించాలి. అసలు మహాభారతంలో ఎక్కడా అలా వున్నట్టు కనిపించదు.

   Delete
  9. శ్రీకాంత్ చారి గారు మన్నించాలి. మీతో విబేధిస్తుంన్నందుకు

   మొదటి విషయం. వ్యాసులవారికి కృష్ణద్వైపాయనులనే పేరుంది. ఆ పేరు రావటానికి కారణం, మీరు చెప్పిందే. అది నన్నయ్యగారు పేరొన్నట్లుగా గుర్తు. కాని కృష్ణుడని ఆయనకు పేరున్న దని అనుకోను. ఒక వేళ అలాంటి సందర్భం ఉంటే వీలైతే దయచేసి చూపగలరు. నాయెఱుకలో ఐతే లేదు.

   రెండవ సంగతి.పోతన గారి "ఇద్దరు క్రిష్ణులు" కేవలం గణాల పొందిక.... .... ఘోషయాత్రాఘట్టంలో తిక్కన్నగారి మాటలు, నా వ్యాఖ్యను మరొకసారి పరిశీలించగలరు. అక్కడ తిక్కన్నగారు శుక్రాచారులనోట పలికించిన మాటగా 'కృష్ణుల నిధ్దర నిర్దహించు' అన్నది ఉదహరించాను. ముఖంగా గమనించవలసిన మరొక మాట ఏమిటంటే అది తిక్కన్నగారు వ్రాసిన ఒక వచనంలో‌ భాగం కాని పద్యంలో బాగం‌ కాదు. ఇది నా కళాశాలాదినాలలో ఘోషయాత్రాఘట్టం పాఠ్యాంశంగా ఉండటం వలన బాగా గుర్తుంది - నలభైఐదు సంవత్సరాల తరువాత కూడా. నేను అర్జునునికి తిక్కనగారు కృష్ణశబ్దంతో సంబోధన ఇచ్చిన ఘట్టాన్ని కూడా ఉదహరించాను కాబట్టి ఒకమారు వీలైతే పరిశీలించగలరు. నా దగ్గర ఆంద్రమహాభారతం లేదు.

   Delete
  10. శ్రీకాంత్ చారిగారు,
   ఆంధ్రమహాభారతం ఈ విషయానికి సంబంధించిన పేజీ‌ వెబ్‌లో ఉంది ఆ భా 3 6 031 to 3 6 060 అక్కడ నుండి ఈ విషయాన్ని స్పష్టీకరించే తిక్కనగారి వచనాన్ని ఈ క్రింద చూపుతున్నాను.

   "3_6_046 వ. భీష్మ ద్రోణ కృపాదులు గొందఱు దేవంశ సంభవు లైనను దదీయ భావంబులు రాక్షసావేశంబు నొందెడు దానం జేసి వారు నిర్దయులై విమూఢులుం బోలె నన్యోన్య పరుషంబులు పలుకుచు నలుక మిగులం బుత్త్ర పౌత్త్ర మిత్త్ర భ్రాతృ శిష్య గురు బాల వృద్ధ జన భేదంబులు విచారింపక సమరంబు సేసి దివ్యంబులు మానుషంబులు నైన వివిధాస్త్ర శస్త్రంబులఁ బాండవ పక్ష క్షయంబు గావింపం గలవారు పాండవులు బంధు స్నేహంబు విడిచి తెగువకుం జొచ్చి నీ చంత నిహతు లగుదురు నీ మనంబుల బీభత్సువలని భయంబు గొంత గలదు దాని నెఱింగి నేమును దగు నుపాయంబు దలంచితి మది యెట్లనినఁ గృష్టుచేతం జచ్చిన నరకాసురు వంశంబు గర్ణు నావేశింపం గల యది తత్కారణంబునం గృష్ణార్జునులతోడ బద్ధ వైరుండై యవ్వీరుండు నిజ దివ్యాస్త్రంబులం గృష్ణుల నిద్దఱ నిర్దహించు నివ్విధం బెఱింగి యింద్రుండు పాండవ రక్షణార్థంబు వచ్చి కర్ణు కవచ కుండలంబులు గపట రూపంబున నపహరింప గలవాఁడు మఱియును."

   గమనించండి, "గృష్ణుల నిద్దఱ నిర్దహించు" అన్న మాటలను. ఆ మాటల అర్థం ఒకడు శ్రీకృష్ణుడు రెండవవాడు అర్జునుడు. కృష్ణుడు అంటే నల్లనివాడు అన్న మాట విస్పష్టమే. ఆ కృష్ణపదానికి తెలుగుగా అర్జునుడిని 'కఱ్ఱి' అని పిలవటం కూడా కద్దు (కఱ్ఱి విక్రమంబు గాల్పనే! అని ద్రౌపది మాట శ్రీకృశ్ణుణ్ణి రాయబారం పంపే‌ఘట్టంలో హరితో ద్రౌపది మాటల్లో) అలాగే అర్జునుడికి సవ్యసాచి అన్న నామధేయం తెలుగు కవ్వడి ఐనది. ఇత్యాదయః

   Delete
  11. శ్యామలీయం గారు,

   వివరణకు ధన్యవాదాలు. తెలుగులో సరే, మూల గ్రంధంలో ఎక్కడైనా అర్జునుడు నలుపు వర్ణం వాడని గాని, క్రిష్ణ నామంతో పిలువబడే వాడని గాని ఉంటే ఆ సందర్భం తెలుపగలరు.

   Delete
  12. శ్రీకాంత్ చారిగారూ,
   అర్జునుడి దశనామాలు:
   అర్జునః ఫల్గుణః పార్థః కిరీటీ శ్వేతవాహనః
   బీభత్సుర్విజయః కృష్ణః సవ్యసాచీ ధనంజయః
   వీటిలో‌ కృష్ణ నామం కూడా ఉన్నది చూడండి.

   Delete
 12. చక్కని వివరణ అందించిన శ్యామలీయంగారికి ధన్యవాదాలు.

  ReplyDelete
 13. నీ ఆలోచనలకి అక్షర రూపం బాగుంది
  ప్రాతివత్యం మనసుకి కాని దేహానికి కాదు
  అయినా ఎవరు ఉండమన్నారు పతివ్రతగా :-)

  ReplyDelete
 14. పురాణాలతో పోటీ ఎందుకు పద్మార్పిత ఎవరికి నచ్చిన రీతిలో వారు ఉంటే సరి, పతివ్రతలు అంటూ పురాణ స్త్రీలతో పోల్చిన తీరు అభినందనీయం-హరినాథ్

  ReplyDelete
 15. అందరిలా ఎందుకు, మీరు మీరుగా ఉండండి.

  ReplyDelete
 16. ఒకసారి సప్తమహర్షులూ ఎందుకో ఏదో యాగం చేశారు , అప్పుడు యజ్ఞగుండంలో ఉన్న అగ్నిదేవుడు తెల్లకలువ పువ్వుల్లా ధగధగా మెరిసిపోతున్న ఋషిపత్నులని చూసి , మోహపరవశుడై మనసు పారేసుకున్నాడట . అది గమనించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి తానే ఒక్కొక్కసారి ఒక్కో ఋషిపత్ని రూపం ధరించి పతి కోరిక తీర్చిందట . ఆవిడ దేవతా స్త్రీ కనుక కామరూపవిద్య ప్రదర్శించి భర్తను సంతృప్తి పరచగలిగింది . ఘనతవహించిన నేటి పతిదేవులు ఏ కేలండరో చూసి ఏ స్కర్టు పిల్ల మీదో , ఏ పుస్తకమో చూసి ఏ బికినీ పిల్ల మీదో , ఏ సైటో చూసి మరేదో పిల్ల మీదో మనసు పారేసుకుంటే , పతివ్రత గారు తలుపులు మూసుకునో , కళ్ళు మూసుకునో ఆ డ్రెస్సులు వేసుకుని , అయ్యగారి మురిపెం తీర్చవచ్చు గాక , కానీ , ఆయన ఏకంగా అనుష్క మీదో కత్తిరినా కైఫ్ మీదో మనసు పారేసుకుంటే ... పాపం ఏ దివ్య విద్యలూ రాని ఈ పతివ్రతా శిరోమణి ఏంచేస్తుంది ? నేను పతివ్రతను కాను అనుకున్నా కాలేను.... అని ఆక్రోశించడం తప్ప !! పద్మార్పితగారు హల్వా పెడదాం అనుకున్నారు , రుచి కూడా హల్వాలాగే ఉంది ...... కానీ అది చూడడానికి మాత్రం కేసరిబాత్ లా కనిపిస్తోంది .

  ReplyDelete
  Replies
  1. :)))))))))))))సారో సారూ మస్తుగ సెప్పిండ్రు దిల్ కి బాత్

   Delete
  2. గదేంది మాతాజీ , గట్లంటరు , దిల్ కి బాత్ ఎవ్రన్న ఖుల్లాల సెప్తారా ఏంది ? అయినా మనకీ కౌంటర్లు ఎన్కౌంటర్లు ఎందుకు గానీ , మంచిగ ఓ పాట పాడత , జర్ర ఇనుకొండ్రి ...మస్తు గుంటది ....

   మగవాడే మహనీయుడు ....
   టిట్టిం ....టిట్టిం ...టిట్టిం ...టిట్టిం ..
   మగవాడే మహనీయుడు.....
   మంచివాడు మహాత్ముడు , మగవాడే .......
   మాననీయుడు ! !
   మగవాడే మహనీయుడు........

   ఆడోళ్ళని లవ్ చేసి అభాసయ్యే అభాగ్యుడు ....
   ఆడదాని ప్రేమ కొరకు అలమటించే అర్భకుడు ...
   మగవాడే .......
   మాననీయుడు ! !

   మగవాడే మహనీయుడు .....
   టిట్టిం ....టిట్టిం ...టిట్టిం ...టిట్టిం ..
   మగవాడే మహనీయుడు......
   మంచివాడు మహాత్ముడు , మగవాడే .......
   మాననీయుడు ! !

   Delete
  3. నాకేం సమజ్ కాలే

   Delete
  4. ఎట్ట సమజైతది జననీ మాతా ! మీరు కూడా ఆడోళ్ళే కదా ! పైగా తరతరాలుగా మెన్ ఆర్ ది సక్కర్స్ ఆఫ్ ది ఉమెన్స్ టీర్స్ అని నరనరాన జీర్ణించుకున్నోళ్ళాయే , నిజం ఏంటంటే ఆడోళ్ళు హార్ట్ బ్రేకర్స్ . మొగోళ్ళ గురించి చెప్పింది సమజ్ కాలె అన్నారు కనుక ఇంకొంచెం సెప్త , జర్ర మీరూ , మీ పద్మార్పిత గారూ ఇనుకోండి .

   ప్రియురాలిని కనురెప్పగ చూసుకునే దేవుడు
   బుట్టలు బుట్టలు పూలతో పూజించే భక్తుడు
   సత్తె కాలమైనా , ఈనాటి కాలమైనా
   ఆడదాన్ని గుండెల్లో దాచుకునే భగవంతుడు .

   మగవాడే మహనీయుడు......
   మంచివాడు మహాత్ముడు , మగవాడే .......
   మాననీయుడు ! !

   మగవాడే మహనీయుడు......
   మగవాడే మహనీయుడు......

   Delete
 17. Life is a Limited Lease agreed to by the Supreme Soul and the Humans.

  ReplyDelete
 18. పద్మార్పిత గారికి అభిమానులకంటే విమర్శకులే దన్నుగా నిలుస్తున్నారు... ధన్యవాదాలు.
  ఆమె అద్భుతమైన భావాలను రాసినపుడు కామెంటు పెట్టడం కాదుకదా అసలు మెచ్చుకొని మహానుభావులు ఒక చిన్న మచ్చ దొరగ్గానే, బాణం లా దూసుకొచ్చి తమ విజ్ఞానాన్ని పుంఖానుపుంకాలుగా ఇక్కడ కుమ్మరిస్తున్నందుకు అభినందనలు.
  పాండిత్యాన్ని ప్రదర్శించడానికి ఇది వేదిక కాదనుకుంటాను. కవితల్లోని భావాలని మాత్రమె ఇక్కడ చుస్తే బావుంటుంది (మదిలోని భావాలని మీతో పంచుకోవాలని... అని బ్యానర్ పై గమనిచవచ్చు). అందునా ఆమె వాక్యాలని కవితా దృక్పదం కంటే భావ దృక్పదం తో చూస్తే బావుంటుంది. నిజానికి పద్మార్పిత భావాలు కవిత్వానికి అందనివి. అంతకంటే గొప్పవి. పద్మార్పిత గారు ఏనాడూ తనను తానూ కవయిత్రిగానో, విజ్ఞానవంతురాలిగానో, ప్రజ్ఞాశాలిగానో చెప్పుకోలేదు.
  “ I'm a rain tear in a storm, A drop of water in the huge ocean, A piece of dust in the hot desert, The breath of wind wing, The sea kiss on the shore, A book with lot’s of pages unwritten, An ephemeral moment of earthly existence, That help hand given to a friend, hope and curse. I'm so many things in the same time…. And NOTHING important/special for the world! Only a human being, I’m GOD creation! As all of us! "
  నేను భీకర తుఫాన్లో వర్షపు కన్నీరు, మహా సంద్రంలో ఒక నీటి బొట్టు, మండే ఎడారిలో సుక్ష్మ ధూళికణం, రెక్కలు తొడుక్కున్న గాలి శ్వాస, తీరంపై సముద్రపు చిలిపి చుంబనం, లిఖించబడని అనంత పుటల పుస్తకం, పుడమి మనుగడపై మానవత్వపు ఓ చిన్ని సందర్భం, స్నేహితుడు/స్నేహితురాలికి అందివ్వబడిన సహాయహస్తం, నమ్మకం మరియు శాపం..
  ఒకే సందర్భంలో గల అనేకాన్ని....ప్రపంచానికి ఏమాత్రం గొప్పదనం, ప్రత్యేకత చూపలేనిదాన్ని. కేవలం మనిషిని, అందరిలా ఓ భగవంతుడి సృష్టిని " అని తనకు తానూ ఇలా చెప్పుకున్నారు. కనుక ఆమె భావాల్లో విజ్ఞానాన్నో, వేదాల్నో, ఛందస్సునో వెదకటం మన మూర్ఖత్వం అవుతుంది.
  అక్షాల్లోని దోశాలకంటే భావం – శబ్దం చాలా ఇంపార్టెంట్. శివుడి ధమరుక శబ్దం నుంచి జనించిన అక్షరాల్లో ఏవిధమైన వ్యాకరణం ఉందో??.. భ్రహ్మి నుంచి దేవనాగరికి షిఫ్ట్ అయ్యిన సంస్కృత లిపి అసలు దక్షిణ భారతంలో నిజంగా ఎలా ప్రభలింది?? తెలుగు ఇతర భాషలకు ఎలా మాతృక అయ్యిందో ఇప్పటికీ ఏ చరిత్రకారులూ ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పలేదు. అసలు సంశ్ర్కుతానికి జాతీయ హోదా ఉందా అన్నది ప్రశ్నించుకోవాలి. మాటిమాటికీ సంస్కృతం తో తెలుగుభాషను ముడిపెట్టి ఇక్కడేవో రెండక్షరాలు రాసుకునేవాల్లకు భయపెట్టేస్తే ఎలా??
  వైదిక సంస్కృతి గల్గిన ఉత్తర భారతావని దక్షిణ భారత దేశానికి పూర్తీ విరుద్ధం. భౌగోళికంగా గానీ చారిత్రకంగా గానీ... ఇప్పుడు +బరేలీ+ గా పిలువబడుతున్న పాంచాల దేశానికి పాంచాల పేరు ఎలా వచ్చిందో కూడా తెలుసుకోవడం మరింత జ్ఞానాన్ని ఇస్తుంది. ఇలాంటివన్నీ ఇక్కడ ప్రదర్శించడం అతిలా అనిపిస్తుంది.
  వ్యాకరణాలు, సాంప్రదాయాలు అంటూ భాషనూ మరింత క్లిష్టతరం చేసిన కొందరు మేధావుల వలన ఈ కాలం పిల్లలు అసలు తెలుగు జోలికి రావాలంటేనే భయపడుతున్నారు. ఇతిహాసం లో లేని మాయాబజార్ మనకు రంజుగా ఉంటుంది. లేని పదాలు వాడి బుర్ర తినే ‘షేక్స్పియర్” తో కాళిదాసును పోల్చుతాము.. ఇక్కడ ఒక చిన్న తప్పు దొరిలిందో లేదో లగేత్తుకొచ్చి చాంతాడంత కామెంట్లు పెట్టేస్తాం. అదేదో మెసేజ్ లో చెప్పి ఇక్కడ మంచిగా సరిదిద్దే ప్రయత్నం చేసి ఒక్క మెచ్చుకోలు ఇవ్వచ్చుగా... పరమ పండితులకు మెచ్చుకునే మాటలు పురానేతిహాసాల్లో ఎక్కడ దొరకలేదేమో. పద్యాల్లో సౌకర్యం కోసం తు. చ. లు వాడి తుప్పు పట్టించిన భాశాకోవిధులను విమర్శించలెం గానీ ఒక స్త్రీ తన ఉన్నతమైన భావాలను అక్షరాల్లో ఒంపి అందంగా చెబుతుంటే నిగూడంగా ఆటపట్టించి, చంకలు గుద్దుకోవడం వెర్రితనం. అది హుందాతనం అనిపించుకోదు. విమర్శ - సద్విమర్షలకు తేడా ఉంటుంది. ఇక్కడ విమర్శ కంటే తమ విజ్ఞాన ప్రదర్శన ... కుళ్ళు, ఇంకేవో జుగుప్సాకరమైన పదాలు నేను వాడదలుచుకోలేదు) కనిపిస్తున్నాయి. ఇక్కడ కొందరి విమర్శల్లో గుంబనంగా దాగిన వెకిలితనం, పురాణాలను పుక్కలించామన్న గొప్పదనం గోచరిస్తున్నది. అది బ్లాగ్ వాతావరణంలో అంత మంచిది అనిపించుకోదు.
  మీ విలువైన విజ్ఞాన్నాన్ని అందరికి పంచినందుకు పండిత బ్రహ్మలవారికి ధన్యవాదములు. మునుముందు మా సమయమును ఇలాంటి కామెంట్లతో వృదా అవ్వనివ్వరని భావిస్తూ శెలవు.....

  ReplyDelete
  Replies
  1. ఎవరికో పాండిత్యం ఎక్కువైందని అంటూ మీరు పాండిత్యం ఎక్కువగా చూపిస్తున్నారు!శివుడి ఢమరుకం నుంచి పుట్టినవి విచ్చలవిడి శబ్దాలు కావు గదా!లయబధ్ధమైన అమరిక ఉండటం వల్ల దాని చుట్టూ కొన్ని వ్యాకరణ నియమాల్ని రాసుకోవడం భాషను సరిగ్గా ఉపయోగించటానికే గదా?వ్యాకరణం లేకుండా భాషే ఉండదు కవిత్వమెలా ఉంటుది?

   జ్ఞానం లేనిది భావం యెలా పుడుతుంది?మాకు భావమే చాలు,దోషాలు ఉన్నా ఫరవాలేదు అంటే లల్లల్లా లిల్లిల్లీ అన్నా కూడా కవిత్వమే అవుతుంది,మరి?

   ఒక సంస్కృత పదాన్నీ ఒక తెలుగు పదాన్నీ కలపడం ఖచ్చితంగా దుష్టమే!మాట్లాడే టప్పుడు "తారు రోడ్డు","సూపరు అందం" అంటాం గదా అని అన్ని చోట్లా,ముఖ్యంగా కవిత్వంలో ఎడాపెడా వాడేస్తే మీరు మెచ్చుకుని ఫ్యాన్సు అయ్యే స్థాయిలో పద్మార్పిత గారు కవిత్వం చెప్పగలరా?!

   ఆమె తన తప్పుని సవరించినదుకు(ఒక రకంగా శ్యామలీయం కూడా అది తప్పు అని వ్యతిరేకించలేదు,పైగా కవిత్వంలో తప్పులు కూడా ఒకోసారి అందంగా ఉంటే సర్దుకుపోవచ్చును,The Day Dawned అనే ఒక ఉదాహరణ ఉంది ఇంగ్లీషులో!ఆయనా సర్దుకుపోయినట్టే ఉంది) ధన్యవాదాలు కూడా చెప్పాక్ మీరు ఈ ఘోషని వెళ్ళగక్కడం అంటే మీరు ఫ్యాను స్థాయిని దాటి చాలాదూరం వెళ్ళినట్టు కనబడుతుంది,కొంచెం తగ్గితే మంచిది.

   Delete
  2. -------------------------------------
   ఒక చిన్న తప్పు దొరిలిందో లేదో లగేత్తుకొచ్చి చాంతాడంత కామెంట్లు పెట్టేస్తాం. అదేదో మెసేజ్ లో చెప్పి ఇక్కడ మంచిగా సరిదిద్దే ప్రయత్నం చేసి ఒక్క మెచ్చుకోలు ఇవ్వచ్చుగా... పరమ పండితులకు మెచ్చుకునే మాటలు పురానేతిహాసాల్లో ఎక్కడ దొరకలేదేమో. పద్యాల్లో సౌకర్యం కోసం తు. చ. లు వాడి తుప్పు పట్టించిన భాశాకోవిధులను విమర్శించలెం గానీ ఒక స్త్రీ తన ఉన్నతమైన భావాలను అక్షరాల్లో ఒంపి అందంగా చెబుతుంటే నిగూడంగా ఆటపట్టించి, చంకలు గుద్దుకోవడం వెర్రితనం. అది హుందాతనం అనిపించుకోదు. విమర్శ - సద్విమర్షలకు తేడా ఉంటుంది. ఇక్కడ విమర్శ కంటే తమ విజ్ఞాన ప్రదర్శన ... కుళ్ళు, ఇంకేవో జుగుప్సాకరమైన పదాలు నేను వాడదలుచుకోలేదు) కనిపిస్తున్నాయి. ఇక్కడ కొందరి విమర్శల్లో గుంబనంగా దాగిన వెకిలితనం, పురాణాలను పుక్కలించామన్న గొప్పదనం గోచరిస్తున్నది.
   -------------------------------------
   శ్యామలీయం మూర్ఖంగా మీ కవిత్వం బాగులేదు అనకుండా(నీహారిక ఇక్కడే మరీ ఇంత అతి శ్రంగారం బాగలేదు అని ముఖాన్నే అనేసినట్టు గుర్తు!),చిన్న తప్పుని సరిదిద్దినందుకే అసలు బ్లాగు యజమాని ఎంతె సంస్కారవంతంగా శ్యామలీయం గారికి ధన్యవాదాలు తెలిపితే మీరు ఇలాంటి భాషతో స్పందించారు,"లగెత్తుకు రావటం","పుక్కిలించి ఉయ్యానే తాపత్రయం" లాంటి మాటల ద్వారా మొదట మీరే బ్లాగు వాతావరణాన్ని ఆల్రెడీ కలుషితం చేసేశారు.

   అది బ్లాగ్ వాతావరణంలో అంత మంచిది అనిపించుకోదు.

   మగవాళ్లలో నిర్భయ హంతకుడి లాంటివారూ ఆడవాళ్ళలో ఇంద్రాణీ ముఖర్జీ లాంటివాళ్ళూ ఉనికిలోకి రావడానికి ముఖ్యకారణం ఇది తప్పు అని చెబితే వినకపోవటం!అవిత్వంలో ఒక్కొక్కపుడు తప్పులు కూడా అందంగానే ఉంటాయి కాబ్ట్టి పద్మార్పిత గారు ఇక్కడి కవితలో సవరించుకోకపోయినా పర్లేదు, కానీ మీకు వ్యక్తిగతంగా ఒక సలహా ఇవ్వదల్చుకున్నాను మనం చేస్తునది తప్పు అని ఎవరయినా చెబితే పాటించగలిగినా పాటించలేకపోయినా కనీసం ఎదురు తిరిగి వెక్కిరించకుండా నిశ్శబ్దంగా అన్నా ఉండేపాటి సంస్కారమైనా అలవాటు చేసుకోండి,బాగుపడతారు.

   Delete
  3. మితిమీరిన శృంగారం! (ఈ మాట అనే ముందు వెళ్లి భారతీయ గుళ్ళన్నీ ధ్వసం చేయండి. నెట్లో తిరగాడే బూతంతా మన గుళ్ళపై ఉంటుంది.) అంటే అర్థం తెలుసా మీకు. రుద్రుడు షుమారు నూరు సంవత్సరాలు పార్వతితో రాతి చేసాడని, ఆసమయంలో భ్రాహ్మణ ఋషులు ఆయన గారితో ఒక డిస్కర్షన్ చేసారని... వెధవ రతిభంగిమల వర్ణనలు రాసిన ప్రాచీన కవులగురించి చర్చించండి నరోత్తమా!!
   బొమ్మ చూసి సోల్లుకార్చుకుంటే ఇలానే అనిపిస్తాయి. ఇప్పటిదాకా పద్మార్పిత రాసిన కవితల్లో ఎక్కడ శృంగారం మితిమీరిందో సెలవివ్వండి మహాప్రభో...
   "ఒక్క భర్తనే భద్రంగా కాపు కాయలేను
   పాంచాలినై ద్రౌపదినంటూ ఎలా బ్రతికేది
   ఆమె పతివ్రతే అనుకుంటే నేను కాను!!"
   ఇందులో ఏం తప్పు ఉందో అసలు మీరు గుర్తించారా.? పాంచాల రాణినై ద్రౌపదిలా బ్రతకలేను" అని అర్థం కదా? పద్మార్పిత గారికి ఈ విషయం తెలియదే అనుకుందాం! విషయజ్ఞానం లేనంతమాత్రాన ఇక్కడ వాక్యంలో తప్పు దోర్లలేదు. పెద్దలు (అని డబ్బాకోట్టుకునేవాల్ల్లు) గమనించగలరని విన్నపం.

   మగవాళ్లలో నిర్భయ హంతకుడి లాంటివారూ ఆడవాళ్ళలో ఇంద్రాణీ ముఖర్జీ లాంటివాళ్ళూ ఉనికిలోకి రావడానికి ముఖ్యకారణం ఇది తప్పు అని చెబితే వినకపోవటం! అవిత్వంలో ఒక్కొక్కపుడు తప్పులు కూడా అందంగానే ఉంటాయి. ....// ఇక్కడ వాక్యం లో తప్పు లేదు మొర్రో అంటుంటే నిక్రుష్టలతో వెదవ కంపారిజన్ లు ఒకటి. ఆమె వాక్యాల్లో పాంచాలి ' పదాన్ని సవరించుకోనక్కర్లేదు గురువా? పాంచాలి అంటే ఏంటో అర్థం చేస్కుంటే సరిపోద్ది. దానికి ఇంత హడావుడి అవసరం లేదు.
   పండిత గుంపంతా కట్టగా కలిసి రోజూ ఒక న్యూసుపేపర్ తీస్కోని తీరిగ్గా చదవండి. పేజికి బోలెడు తప్పులుంటాయి. వాటిని సరి చేసి ఎడిటర్ ఆఫీసుకి పంపిస్తే కోట్ల మంది జనాలకు అపార మేదాసంపత్తిని పంచినవారు అవుతారు.

   Delete
  4. @padmarpita fans blog.అవును ఆస్వాధించి హాయిగా కాసేపు ఆనందించక ఎందుకో ఈ అక్షరాలతో యుధ్ధాలు అనవసరమైన ఉపోధ్ఘాతాలు. అర్పితగారి కవితలు ఎప్పుడు ఆనందాన్ని ఇస్తాయి ఇవి అభిమానించేవారు చదువుతారు లేనివారు సరిచేస్తున్నాము అనుకుని తప్పులు వెతుకుతారు. వాటిని పట్టించుకోరాదు.

   Delete
  5. పద్మార్పిత గారి మిత్రుల గురించి కొందరికి తెలియాలి . వీరిలో చాలామందికి ఒకరికొకరు తెలియదు . కనీసం నేరుగా ఫ్రెండ్స్ కూడా కాదు . కేవలం పద్మార్పిత గారి స్నేహితులుగా , ఆవిడ బ్లాగులో ఒకరికొకరు
   కనబడతాము , కానీ మా మధ్య ఒక అవ్యక్తమైన , ఇదీ అని నిర్వచించలేని ఒక బంధం అభిమానం స్నేహం ఉన్నాయి . అది సాహిత్యం మీద ప్రేమో లేక పద్మార్పిత గారి మంచితనమో , మమ్మల్ని ఇక్కడ ఇలా కట్టి పడేసింది . ఎవరో ఇవాళ వచ్చి ఏదో కామెంట్ పెడితే , కేరీ అయ్యేవాళ్ళు ఎవ్వరూ ఇక్కడ లేరు . దాని వెనక మోటివ్ ఏమిటో అందరికీ క్షణం లో తెలిసిపోతుంది . ఇంద్రాణీ ముఖర్జీ నా ? మీకు తెలిసిన స్త్రీలు అంతా అలాంటి వారేనా ? హరిబాబు ? విమర్శించ దానికి కూడా ఒక విధానం ఉంటుంది . పద్మగారు ఎన్ని సంవత్సరాలుగా రచనా వ్యాసంగం లో ఉన్నారో , ఎన్నికవితలు రాసారో తెలుసా ? వాటిని చదివారా ? విజ్ఞత కోల్పోయి కామెంట్లు పెట్టె ఇలాంటి వాళ్ళని బ్లాగ్ మిత్రుల నుండి తొలగించండి పద్మ గారు . ప్లీజ్ .

   Delete
  6. Gadepalli Venkat..నేను మీ మాటలతో ఏకీభవిస్తున్నాను. పద్మార్పిత గత మూడేళ్ళుగా నాకు పరిచయం ఎప్పుడూ ఎవరినీ ధూషించడం పరుషంగా ఒక్క మాట అనడం కూడా నేను ఎరుగను. ఏదైనా ఇష్టంలేని విషయాలు చెప్పినా వద్దులెండి సార్ వదిలేయండని మాటమార్చి అందరితో సరదాగా నవ్వుతూ కలిసిపోయే సున్నిత మనస్కురాలు. వ్యంగ్యంగా వ్యాఖ్యలు వ్రాసిన వారికి సున్నితంగా నవ్వుతూ సమాధానం ఇచ్చిన సంధర్భాలు ఎన్నో ఉన్నాయి. వ్యక్తిగతంగా తెలియని వారి గురించి ఏవేవో ఊహించుకుని, చెప్పుడు మాటలు విని తప్పుగా మాట్లడ్డం విజ్ఞత అనిపించుకోదు.
   పద్మార్పిత బ్లాగ్ తెరచిన వెంటనే పాట మొదలుకుని ప్రతి పదం మనసుకి అహ్లాదాన్ని ఇచ్చాయి ఇప్పటి వరకు. అటువంటిది కొందరి కామెంట్స్ వలన కలుషితం కావడం విషాదకరం. ఈ బ్లాగ్ చూసి స్వాంతన పొందే మాలాంటి వారికి ఆమె రచల్ని దూరం చేయకండి. పాత బ్లాగ్ వాతావరణం తిరిగి నెలకుని అందరూ సంతోషంగా ఉండాలని కోరుతూ-హరినాధ్

   Delete
  7. @Gadepalli Venkat24 November, 2015
   ఇంద్రాణీ ముఖర్జీ నా ? మీకు తెలిసిన స్త్రీలు అంతా అలాంటి వారేనా ? హరిబాబు ? విమర్శించ దానికి కూడా ఒక విధానం ఉంటుంది

   haribabu:మీకు తెలుగు సరిగ్గా చదవడం అర్ధం చేసుకోవడం రాదా!నేను మొత్తం అందర్నీ ఇంద్రాణి ముఖర్జీ అని అన్నానా!

   శ్యామలీయం గానీ నేను గానీ కవితని తప్పు పటి విమర్శించలేదే!పాంచ_ఆలి అనే పదబంధం నిజంగానే దుష్ట సమాసమే,అందులో యేమైనా అనుమానమా?అయితే కవిత్వంలో తప్పులయినా ఎక్స్ప్రెషన్ బలంగా ఉండటం కోసం మహాకవులు కూడా చేస్తారు,అదీ చెప్పానె!

   -----------
   1.ఒక చిన్న తప్పు దొరిలిందో లేదో లగేత్తుకొచ్చి
   2.నిగూడంగా ఆటపట్టించి, చంకలు గుద్దుకోవడం వెర్రితనం
   3.ఇక్కడ విమర్శ కంటే తమ విజ్ఞాన ప్రదర్శన ... కుళ్ళు, ఇంకేవో జుగుప్సాకరమైన పదాలు నేను వాడదలుచుకోలేదు) కనిపిస్తున్నాయి

   -----------

   ఈ రకం భాష పద్మార్పిత అభిమానులుగా మీరేదో ఒకరికొకరు ప్రత్యక్షంగా యెలా ఉంటారో కూడా తెలియకపోయినా ఈ బ్లాగు కలుపుతుందనే గొప్ప స్థాయిని మెయింటెయిన్ చేస్తున్నాం అనే సున్నితత్వానికీ ఈ భాషకీ పొంతన ఉందా?


   Padmarpita fans23 November, 2015
   మితిమీరిన శృంగారం! (ఈ మాట అనే ముందు వెళ్లి భారతీయ గుళ్ళన్నీ ధ్వసం చేయండి. నెట్లో తిరగాడే బూతంతా మన గుళ్ళపై ఉంటుంది.) అంటే అర్థం తెలుసా మీకు

   haribabu:ఇది పూర్తిగా నీహారికకి సంబంధించిన ప్రస్తావన.ఆ అమాత అన్నది తనే,ఏ పోస్టులోనో నాకు గుర్తు లేదు.కానీ తన కామెంటు యొక్క బ్భావం మాత్రం అదే,మరీఎ ఇంతగా ప్రేమలూ మోహాలూ వ్యక్తం చెయ్యటం అవసరమా అనేటట్టు ఉంటుంది!

   Delete
  8. @ hari babu,
   ఇది మరీ బాగుంది.మీరు ప్రతిసారీ నన్ను వివాదంలోకి లాగుతారేంటీ ? నేను ఏ సందర్భంలో అన్నానో నాక్కూడా గుర్తులేదు కానీ పద్మార్పిత తనుకాదని దృవీకరించినారు కనుక మళ్ళీ తనే శ్వేత పద్మమని ఎలా అనుకుంటాను ?శృంగారం వ్రాయవద్దని నీహారిక అనడమా ? ఎ కా డా ?

   శ్యామలీయం గారు వ్రాస్తే పదిమంది కూడా తొంగిచూడరు, బ్లాగ్ హిట్లు,కమెంట్లు రావాలంటే మా తిప్పలు మేము పడాలి కదా ? మీరు శూర్పణఖ ఫాన్స్ మనోభావాలు దెబ్బతీస్తున్నారు

   Delete
  9. పద్మార్పిత ఏంటి? శ్వేతపద్మం ఏంటి? ఎవరు ఏంటో తెలియక, తికమక కామెంట్లతో ఇక్కట్లు పడుతూ అందర్నీ ఇబ్బంది పెట్టె కుల్లుబోతులూ... మీ లాంటి నక్కల కన్నా శూర్ఫనకలు వెయ్యి రెట్లు మిన్నా....

   Delete
  10. కుల్లు బోతు అని వ్రాయకూడదు.....కుళ్ళుబోతు అని వ్రాయాలి. శూర్పనక అని వ్రాయకూడదు శూర్పణఖ అని వ్రాయాలి. తెలుగు వ్రాయడం నేర్చుకో ....వ్రాస్తూ వ్రాస్తూ ఉంటే అదే అలవాటయిపోతుంది. నువ్వు కూడా తవికలు వ్రాయవచ్చు.

   Delete
 19. ఆహా నారదా ఇక్కడేదో రావణ కాష్టం మొదలయినట్టుంది ! రా దిగిరా దివినించి భువికి దిగిరా! ఘ్రుతం తీసుకురా !

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. భావాల్ని 'బావల్లా' చూసి... రాతల్లో వాడిని 'నరాల్లో వేడి లా చూసే వానర కిలాడీలకన్నా నారదులెవరున్నారు?? జిలేబీల వారికే ఎరుక...

   Delete
 20. కేవలం‌ భళీభళీ అనటానికే వ్యాఖ్యలు ఉంచాలని నాకు తెలియదు. ఏదో‌ పెద్దవాడిని ఐపోయాను కదా, ఈ‌కాలం వారి పోకడలు నాకు అంత బాగా తెలుస్తున్నట్లు లేదు. భళీ ఆంటూ ఉత్తుత్తి మాటలు చెప్పటం వలన ఎవరికీ ప్రయోజనం‌ ఉండదు. ఏ విషయాన్ని గురించి కాని ప్రశ్నించటం లేదా తర్కించటం అన్నది ఈ‌ కాలం వారికి రుచించటం లేదు. అటువంటప్పుడు నేను ప్రశ్నవేసి తెలుసుకొవాలని అనుకోవట‌ం‌ పొరపాటో‌ లేక అదేదో నా అమనస్సులోనే ఉంచకొనక సందేహాన్ని ప్రస్తావించటం పొరపాటో‌ తెలియటం లేదు. పద్మార్పితగారు నా సందేహానికి జవాబు చెప్పినప్పుడు కాని దానికి నేను ఇచ్చిన సమాధానంలో కాని ఎక్కడా ఏ పక్షంనుండి కాని అనుచితమైన మాటలు రాలేదు. కాని కొందరు ఈ విషయంలో యుధ్ధానికి దిగటం వలన ఇబ్బండి కలుగుతోంది. పద్మార్పితగారి అభిప్రాయం తప్ప నాకు ఇతరుల అభిప్రాయంతో‌ ఇక్కడ పనేమీ లేదు. కాని అనవసరంగా అన్యాయమైన మాటలు పడవలసిన అగత్యం కూడా ఏమీ లేదు కదా. అందుకే నిర్వేదం కలుగుతోంది.

  ReplyDelete
 21. ఇక్కడి వ్యాఖ్యాతలకు మనవి : ఏదైనా ఒక పోస్టు వ్రాసినపుడు ఆ పోస్టును స్వయంగా ప్రచురించుకుంటున్నపుడు సదరు పోస్టులోని మంచిచెడ్డలు ప్రశంసించడం/విమర్శించటం విజ్ఞులు చేయవలసిన పని. విమర్శ ఎవరు చేసినా ఆహ్వానించవలసిందే! విమర్శ చేయకూడదు అని మీరు భావిస్తున్న పరిస్థితిలో అగ్రిగ్రేటర్ నుండి తొలగడమే మీకు శ్రేయస్కరం !

  ReplyDelete
 22. అందరూ అభిమానులుగానే అభినందిస్తున్నారు , అభిమానులు గానే విమర్శిస్తున్నారు , తందానాతానా , భళాభళీ అంటేనే అభిమానమున్నట్టు కాదు . ఎంతో అభిమానం ఉంటేనే ,మరెంతో స్పందన వస్తేనే ఇక్కడ ఒక కామెంట్ పడుతుంది . అవునా ? కాదా ? ప్రతి కామెంటూ రచయిత్రికి స్ఫూర్తి , ఆనందం , ఉత్సాహం , విజ్ఞానం కలగజేసేవే అనుకుంటే మనలో మనకీ భేదాభిప్రాయాలు ఉండవు . ఈ విమర్శల పుణ్యమా అని నాకు తెలియని కొత్త విషయాలు ఎన్నో తెలిశాయి . పద్మార్పిత గారికి రిజిస్టర్డ్ ఫ్యాన్సే కాకుండా , అన్ రిజిస్టర్డ్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో కూడా తెలిసింది . అయినా, పైకి గులాబీ పువ్వులా కనబడుతూ , వాడి వాడి ముళ్ళతోటి ఆవిడ మన మగవాళ్ళని ఏకి పారేసింది . మగజాతిని తూర్పార పట్టింది . అది ఒక్కళ్ళు కూడా పట్టించుకోవడంలేదు , సరి కదా మనలో మనం కొట్టుకుచస్తున్నాము . మగవాడికి మగవాడే శత్రువు , రెండు షర్టులు ఒక తీగ మీద ఆరవు ..... అన్న సామెతలు నిజమేనేమో ..... అయ్యో ! అయ్యో !

  ReplyDelete
 23. శ్వేతపద్మమైనా పదిమంది ముందు అర్ధనగ్నంగా నిలబడి ఎన్ని నీతివ్యాఖ్యలు వ్రాసినా పతివ్రత కాదు అనుకున్నా కాలేదు!!

  ReplyDelete
  Replies
  1. ఓహో! ఇలా నగ్నంగా కామెంట్లు రాస్తే అవుతారన్నమాట!
   శ్రీరాముడు లాంటి గుణవంతుడు సౌమ్యుడు ఏక ...పత్ని...వ్రతుడు మాకక్కరలేదు :)) అనువాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట... భేష్!! ఎంతటి పతివ్రతా శిరోమనులు అయిన మొగుడి బట్టబుర్రపై వెంట్రుకలు మొలిపించలేరన్నది సత్యం!!
   మీ అక్కసును ఇలాగైన వెళ్లగక్కారు... పద్మార్పితగారిపై ఎందుకంత కుళ్ళు మీకు ??

   Delete
  2. కోపం వచ్చినపుడే మనిషి అసలు ప్రవృత్తి ఏమిటనేది బయటపడుతుంది. మనిషి ప్రవృత్తి బయటపెట్టడమే ఇక్కడ నేను చేసేపని. సీతలాగా సహనవంతులెవరూ లేరిక్కడ ! శ్యామలీయం గారు చెప్పకపోతే మాకు కొన్నివిషయాలు తెలిసేవే కావు. శ్వేతపద్మం మొగుడితో తలపడితే అపుడు తెలుస్తుంది నీ బుర్రలో ఎంతుందో ? శ్వేతపద్మం అంటే పద్మార్పితే అని భ్రమలో బ్రతుకుతున్నావా ? బ్లాగు కాబట్టి బ్రతికిపోయావు బయట ఎక్కడైనా ఇలా మాట్లాడావంటే ఎముకలు మిగలవు. కొప్పున్న ప్రతిదీ పతివ్రత కాదు.

   Delete
  3. * శ్యామలీయం గారు చెప్పకపోతే మాకు కొన్నివిషయాలు తెలిసేవే కావు.... // ఓహో... మీరందరూ ఒకే జాతి పక్షులు కదా! ఒకే గూటికి చేరతారు మరి!
   * శ్వేతపద్మం మొగుడితో తలపడితే అపుడు తెలుస్తుంది నీ బుర్రలో ఎంతుందో ?// ఓహో... మీరు శ్వేతపద్మం మొగుడితో తలబడ్డారన్నమాట....
   * శ్వేతపద్మం అంటే పద్మార్పితే అని భ్రమలో బ్రతుకుతున్నావా ? // మీ వెర్రికి అర్థం అసలు ఉందా??
   * బ్లాగు కాబట్టి బ్రతికిపోయావు బయట ఎక్కడైనా ఇలా మాట్లాడావంటే ఎముకలు మిగలవు // మీరు బయట ఇలా మాట్లాడితే బుర్ర మిగలదు అని చెబుదాం అనుకున్నా. కానీ బుర్ర లేని వాళ్లకి చెప్పలేను కదా. సారీ..
   * కొప్పున్న ప్రతిదీ పతివ్రత కాదు /// అందరి కొప్పుల గురించి కాదు గానీ, మీ కొప్పు గురించి చెప్పండి . అవునో కాదో.

   నోటికెలా పడితే అలా వ్యక్తిగతంగా మాట్లాడితే సరిపోదు. ఇక్కడ రాసిన అక్షరాల గురించి మాట్లాడితే బావుంటుంది. లేకపోతే లేకపోతే తంబూరా తీగలు తెగిపోతాయి మేడం....

   Delete
  4. వెధవ వాగుడు కట్టిపెట్టి నేను వ్రాసిన వ్యాఖ్యల్లో తప్పు ఏమిటో చెప్పి మాట్లాడు, కందకులేని కత్తిపీటకు ఎందుకని పద్మార్పితకు లేని అభ్యంతరం నీకు ఎందుకు ? నేను తప్పు వ్రాస్తే తను చెప్పాలి తను వ్రాసిందే నేను వ్రాసాను.
   శ్వేతపద్మాన్ని,నేను పతివ్రతను కాను అనుకున్నా కాలేను!! ఇదే ఆమె వ్రాసింది. దీనినే నేను తిరిగివ్రాసాను దీనిలో తప్పేమిటి ? శృతి లేని తంబుర ఉన్నా ఒకటే ఊడినా ఒకటే !

   Delete
  5. పతివ్రత అంటే అర్ధం ఏమిటి ? సరి అయిన నిర్వచనం చెపితే పతివ్రత అవునో కాదో తేల్చుకోవచ్చు. మూడేళ్ళుగా పద్మార్పిత కవితలు గూగుల్ ప్లస్ లో షేర్ చేస్తున్నాను.ఆవిడ ఫోటోలే నా ప్రొఫిల్ పిక్ గా పెట్టాను. సతీష్ కొత్తూరి గారు నా గూగుల్ ప్లస్ లో పద్మార్పిత కవిత చూసి ఈ బ్లాగులోకి వచ్చారు. అనవసరంగా ఎవరినీ నేను ఏమీ అనలేదు. నేను వ్రాసిన దానిలో తప్పేమిటో చెప్పితీరాలి. మీ ఇష్టం వచ్చినట్లు మీరు వ్రాస్తే మీరు వ్రాసిన అడ్డమైన వ్రాతలూ చూస్తూ ఊరుకునేది లేదు.తన బ్లాగులో ప్రచురితమయే ప్రతి వ్యాఖ్యకీ సదరు బ్లాగర్ బాధ్యత వహించాలి. ఆగ్రిగ్రేటర్ లో మీ ఐ పీ అడ్రెస్ నమోదయి ఉంటుంది.మీరు బాధ్యతారాహిత్యంగా వ్రాయడం వల్ల జరగరానిది ఏదైనా జరిగితే మీరు తప్పించుకునే వీలు లేదు.మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా అవమానం చెందవలసిన పరిస్థితి రావచ్చు. బావలు అని వ్రాసిందీ మీరే....అసందర్భంగా వ్రాసిందీ మీరే,పతివ్రతలతో పోల్చుకున్నదీ మీరే, మగమహారాజులమన్నదీ మీరే,శూర్పణఖలన్నదీ మీరే,వాత్సాయణుడన్నదీ మీరే,శృంగారం అన్నదీ మీరే,బూతు అన్నదీ మీరే, అనాల్సినవన్నీ అనేసాం కదా భావాలతో సరసం చేద్దామంటే కుదరదు.మీరు వ్రాసినవాటికి మీరు కట్టుబడి తీరాలి.అనవసరమైన కమెంట్స్ డెలిట్ చేయండి.విజ్ఞులెవరో,వినమ్రత ఏపాటిదో చూస్తాను.

   Delete
  6. వెధవ వాగుడు కట్టిపెట్టి నేను వ్రాసిన వ్యాఖ్యల్లో తప్పు ఏమిటో చెప్పి మాట్లాడు,

   // అలాగే మేడం గారు..... //

   కందకులేని కత్తిపీటకు ఎందుకని పద్మార్పితకు లేని అభ్యంతరం నీకు ఎందుకు? నేను తప్పు వ్రాస్తే తను చెప్పాలి. // మధ్యలో దురద మిస్ అయినట్లుంది. కానీ మీ కామెంటుతో ఆ భావాన్ని సరి చేసారు. ఎందుకో ఏమో? ఒకసారి యోచించుడి!!!///

   తను వ్రాసిందే నేను వ్రాసాను.
   శ్వేతపద్మాన్ని,నేను పతివ్రతను కాను అనుకున్నా కాలేను!! ఇదే ఆమె వ్రాసింది. దీనినే నేను తిరిగివ్రాసాను దీనిలో తప్పేమిటి ? శృతి లేని తంబుర ఉన్నా ఒకటే ఊడినా ఒకటే !
   // అతిరథ సతీమణులతో పోటీపడి గెలవలేను
   ఎప్పటికీ రంగులు అంటుకోని శ్వేతపద్మాన్ని,
   నేను పతివ్రతను కాను అనుకున్నా కాలేను!!
   *******************************
   శ్వేతపద్మమైనా పదిమంది ముందు అర్ధనగ్నంగా నిలబడి ఎన్ని నీతివ్యాఖ్యలు వ్రాసినా పతివ్రత కాదు అనుకున్నా కాలేదు!!
   తిరగేసి రాసారా??? మళ్ళీ ఒకసారి చదువుకోండి. లేకపోతే చిన్న పిల్లలకి ఈ వాక్యం ఇచ్చి తిరగేసి రాయమని చెప్పి సరి చూసుకోండి......////


   అనవసరంగా ఎవరినీ నేను ఏమీ అనలేదు.
   // నీహారిక23 November, 2015::: శ్వేతపద్మమైనా పదిమంది ముందు అర్ధనగ్నంగా నిలబడి ఎన్ని నీతివ్యాఖ్యలు వ్రాసినా పతివ్రత కాదు అనుకున్నా కాలేదు!! // **** ఆహా ఎంత అమాయకత్వం??!! మరి ఇది అవసరం మేరకే అన్నారా?? రాతల్లోని భావాల గురించి మాట్లాడకుండా ఇలా వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడారో ఒకసారి విశ్లేషణ చేస్కొండి.

   తన బ్లాగులో ప్రచురితమయే ప్రతి వ్యాఖ్యకీ సదరు బ్లాగర్ బాధ్యత వహించాలి.
   // ఈ మాటలు సుప్రీం కోర్టు జడ్జి గారు చెప్పారా కొంపదీసి... ఇదేమైనా రాజ్యాంగం లో రాసుందా? లేకపోతె పురాణపుంగవులు చెప్పారా? మేడం?
   బ్లాగర్ కి తీరికలేకో.. టెక్నాలజీ లేకో ... ఇష్టం లేకో.. జ్ఞాపకాల కోసం దాయడంకోసమో ....కామెంట్లని అల్లాగే పెట్టుకుంటారు. దీనికి ఎవరి పర్మీషణ్ అక్కర్లేదు. చూద్దాం! పద్మర్పిత గారు ఎం చేస్తారో...//

   ఆగ్రిగ్రేటర్ లో మీ ఐ పీ అడ్రెస్ నమోదయి ఉంటుంది. // నాదగ్గర కూడా నమోదుతాయి... అయితే ఏంటి మేడంగారూ ఇప్పుడు... //

   మీరు బాధ్యతారాహిత్యంగా వ్రాయడం వల్ల జరగరానిది ఏదైనా జరిగితే మీరు తప్పించుకునే వీలు లేదు.మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా అవమానం చెందవలసిన పరిస్థితి రావచ్చు.
   // ఓహో... ఇలా బెదిరింపుల బ్లాక్ మెయిల్ ఆ... హవ్వ హవ్వ... ఇక్కడెవరూ నోట్లో లాలీపాప్ లు పెట్టుకుని లేరు మేడం గారూ... అటులనే కానిమ్ము... అయినప్పటికీ ఇక్కడ అడ్డమైన రాతలు ఎవరూ రాయలేదు. అడ్డగోలుగా కామెంట్లు పెడుతున్నది మీరే...
   మీకో విషయం తెలుసునో లేదో .....
   “The Supreme Court declared Section 66A of Information Technology Act as unconstitutional and struck it down. The court said such a law hit at the root of liberty and freedom of expression, two cardinal pillars of democracy"
   24 మార్చి 2015 న భారతదేశం యొక్క సుప్రీం కోర్ట్ (SC) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టం, 2000లోని సెక్షన్ 66A ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి దానిని కొట్టివేసింది. అసలు ఈ సెక్షన్ ఏంటో తెలుసా... ఈ సెక్షన్ ఆన్లైన్ లో అభ్యంతరకరమైన విషయాలను పోస్ట్ చేసే వారిని అరెస్టు చేసేలా మరియు మూడు సంవత్సరాల జైలు శిక్షను విధించేలా చట్ట అమలు సంస్థలను ప్రోత్సహిస్తుంది.
   ఇది సెక్షన్ 66A ను విరుద్ధమని ప్రకటించింది. '' కాబట్టి వర్చువల్ వ్యాఖ్యలు వోలటైల్. అలా అని మీలా ఇక్కడ నేను దురుసుగా రాయలేదు వ్యక్తిగతంగా కించపరచలేదు. ఇక్కడ మీకన్నా అసభ్యంగా ఎవరూ వ్యాఖ్యలు చేయలేదని గుర్తించండి సబల గారూ... మీరు వాగ్యుద్ధానికి దిగితే నేను ఎందాకైనా వస్తాను. అన్నిటికీ సంసిద్ధం.!!

   బావలు అని వ్రాసిందీ మీరే....అసందర్భంగా వ్రాసిందీ మీరే,పతివ్రతలతో పోల్చుకున్నదీ మీరే, మగమహారాజులమన్నదీ మీరే,శూర్పణఖలన్నదీ మీరే,వాత్సాయణుడన్నదీ మీరే,శృంగారం అన్నదీ మీరే,బూతు అన్నదీ మీరే,
   // ఎవరు అన్నారు? అసలు మీకేమైనా అర్థం అవుతోందా?? ఓహ్... పద్మార్పిత గారు అన్నారా?? ఎక్కడ ? ఏమిటి? ఎందుకు? ఎక్కడ చూసారు? ప్చ్... ఏంటో మీ వ్యాఖలు... అసలు మీకైనా అర్థం అవుతున్నాయా?? అయ్యో రామా.......... అయినా పైన వ్రాసిన ప్రతి పదం పురాణాల్లో ప్రబంధాల్లో కోకొల్లలు... మీకు కోపం వస్తే పురాణాలని ప్రబంధాలను కాల్చేయండి భేషుగ్గా....

   అనాల్సినవన్నీ అనేసాం కదా భావాలతో సరసం చేద్దామంటే కుదరదు.మీరు వ్రాసినవాటికి మీరు కట్టుబడి తీరాలి. అనవసరమైన కమెంట్స్ డెలిట్ చేయండి.
   /// అనాల్సినవన్నీ సూటిగా అనేశాను.. నా వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నాను. మరి డిలిట్ చేయడం ఎందుకు ? నాకర్థం కాని ప్రశ్న.!!! //

   విజ్ఞులెవరో,వినమ్రత ఏపాటిదో చూస్తాను. // అలాగే చూస్తూ ఉండండి.. //

   త్యాంక్యు ఫర్ ఎంటర్టైనింగ్........

   Delete
  7. ఏమి ఈ కాల వైచిత్రము !

   నీహారిక కామెంటుకి రిటార్టు ఇచ్చు వారు ఈ బ్లాగు లోకమున గలరా !

   ఔరా ! నీహారిక గారి కామెంటు పటిమ తగ్గిపోవుచున్నదా !

   జిలేబి

   Delete
  8. ఇంత తీరిక చేసుకుని ఇంత పెద్ద కమెంట్ వ్రాసావు కానీ నా తప్పు ఏమిటో ఒక్క చిన్న ముక్క వ్రాయలేదు. నీకో చాలెంజ్ ... నా తప్పు ఏమిటో మీసమున్న మొగాడిని, మీసం లేని ఆడదానిని ఒక్కరిని పిలిచి పబ్లిక్ గా పది మంది ముందు నన్ను నిలబెట్టి ప్రశ్నిస్తే బ్లాగ్ వ్రాయడమే కాదు కమెంట్స్ వ్రాయడం కూడా మానేస్తా...అంతే కాదు పద్మార్పితని క్షమార్పణ కూడా అడుగుతా ! నన్ను చాలెంజ్ చేసే మగాడే నాకు తగలలేదు. నువ్వు రెడీ అంటున్నావు కదా ...మాట మీద నిలబడతావా ?
   నేను పుట్టిందే ఎంటర్టైన్ చేయడానికి !

   Delete
  9. ఇక్కడ ఈ బ్లాగులో వ్రాసిన వ్రాతలన్నీ బయటప్రపంచానికి తెలియాలి. పద్మార్పితని మీలో ఎంతమంది చూసి ఉంటారు ? ఇంత గొప్ప కవయిత్రిని బయటప్రపంచానికి పరిచయం కలుగజేసే మహద్భాగ్యం నాకే కలుగుతుంది. నా మది శ్వేతపద్మమై ఆనందభైరవి రాగం పాడుతోంది. మీకు ముందస్తు ధన్యవాదాలు !

   Delete
 24. ఎవరా నారదులవారు ? ఏమా కధ?
  పద్మార్పితవారు మీ సమాధానం ఏమి
  సతీష్ కొత్తూరిగారి అభిప్రాయము తెలియలేదు:-)
  ఇంక కవిత గురించి ఏం రాసిన ఏకి పడేసేస్తారు.
  బాగుంది అంటే అభిమాన అంటారు బాలేదు అంటే అభిమాన్ని కదంటారు.
  ఎవరు ఏమన్నా....పద్మార్పిత ఒక సెన్సేషనల్ హా హా హ :-)

  ReplyDelete
  Replies
  1. అన్నారూ ! ! అంతమాటా అనేశారూ ! ! పోన్లెండమ్మా .... మేమంతా నారదులం ! ! మీరొక్కరే " అభి "మాని ! ! సరేనా ? ఖుష్ ? :P

   Delete
  2. This comment has been removed by the author.

   Delete
  3. నారాయణ నారాయణ..ఆకాంక్షగారు.. మాణిమాణి కతోయి కూణి సామళ్రేకోని.. సేన రీసావ్గీ.. సే కట్టాళో ఖాగే..అత్రాజ్ అజ్జి కాఁయి ఛేని.. హరిరామగోవింద..

   Delete
 25. పద్మార్పితగారికి అర్థం అయ్యిందో లేదో తెలియదు బట్ యాతావాత తేలింది ఏంటంటే వందసార్లు బాగారాసినా పొగిడేవారు బట్రాజులు, అభిమానం వెర్రి మొగ్గలు వేసిన వాళ్ళు. అదే ఎప్పుడూ మెచ్చుకోకపోయినా/ మెచ్చుకోవలసిన అవసరం ఉందాని ప్రశ్నించి, వ్రాసుకున్న భావాల్లో బావలని/తప్పుల్ని వెతికి సరిచేస్తున్నాము అని చెప్పే తెలుగు "భాషా ప్రవీణులు" టైటిల్ పరంగా చెప్పాలంటే విమర్శించిన వారు తెలుగుభాషలో పతివ్రత ప్రవీణులు. వీరు అందరు వీరాభిమానులు.
  తెలియ విషయాలు వ్రాస్తున్న/ శ్యామలీయంగారి వివరణ సత్ విమర్శగా తీసుకుని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకు మునుపు ఎన్నో ఉపయుక్తమైన విషయాలు చెప్పిన సంధర్భాలు ఉన్నాయి. అలా కాదని వ్యంగ్యంగా విమర్శించడమే ధ్యేయంగా/హక్కు అనుకుని కమెంట్స్ వ్రాసి ఆనందం పొందేవారిని వారి విజ్ఞతకే వదిలివేయడం ఉత్తమం.

  ReplyDelete
 26. కేవలం తనదైన భావాలను వెలిబుచ్చుతూ, అవి కవితలో, కాదో అన్న అనుమానం తనకే ఉన్నట్లు ఖచ్చితంగా చాలా సందర్భాల్లో నిజాయితీ గా చెప్పుకున్న 'పద్మార్పిత'గారి వ్యక్తిగత బ్లాగ్ లో యిలా అందరూ తలో ధోరణి లో వారి వారి అజ్ఞానాన్ని, అవివేకతను వాళ్ళకే తెలియకుండా ప్రదర్శించే స్పందనదారులకు ఒక విన్నపం - దయజేసి ఎవరినీ ఇబ్బంది పెట్టకండి. వారి మనసుల్ని మన అసందర్భపు స్పందనలతో 'పద్మార్పిత'గారిని వారి మానాన వారిని వదిలేయడమే మనందరి విజ్ఞత. ఈరోజుల్లో ఎంతోమందికి బ్లాగ్ లో, ప్రత్యేకమైన వేదికల్లో నిర్వహణ చేసుకోవడం పరిపాటే. మనందరి పోస్ట్ లూ కూడా యిటువంటి దుమారం రేపడానికి చాలా ఆస్కారం ఉంది. నా విన్నపం ఏమిటంటే, ఎవరు రాసినా, ఏమి రాసినా - అందులో తప్పక ప్రతిభ ఉండబట్టే యిటువంటి వేదికలు అందిస్తున్న ధోరణులు సానుకూల వాతావరణానికి దోహదపడుతున్నాయి. దయజేసి, ఈ విమర్శనా రణరంగాన్ని కొనసాగించకండి; సహృదయంతో సాహిత్యాన్ని అర్థం చేసుకుంటూ, ఆధ్యయనం చేసుకుంటూ, సదాలోచనలకు సార్ధకమైన ఆచరణలు దారితీస్తే, అందరికీ మంచిదే. అదే కావాలి కూడా. శుభం. కొంపెల్ల శర్మ.

  ReplyDelete
  Replies
  1. శర్మ గారు మీరు కరెక్టుగా చెప్పారు. మీతో నేను ఏకీభవిస్తున్నాను. తెలుగు వినిపించని కనిపించని ఈరోజుల్లో కవిత రాయాలన్న ఆలోచనే చాలా గొప్ప. ఎవరెన్ని కామెంట్లు చేసినా ఆమె ఎవరితోనూ వాదనకు దిగకపోడం ఆమె సంస్కారం. భాషా పండితులకు తప్పులు పంటి కింద రాళ్ళే. కాని... ఇలా బహిరంగంగా కాకుండా వ్యక్తిగతంగా చెప్తే బాగుంటుందనేది నా అభిప్రాయం.

   Delete
 27. అందరికీ దణ్ణం _/\_

  ReplyDelete
 28. పద్మార్పిత అభిమానులకు,
  ఇక్కడెవరూ పద్మార్పిత గారిని అవమానించ లేదు.ఆమె కవిత్వంలో దుస్సహమైన తప్పులున్నాయని క్రూరంగా విమర్శించ లేదు.

  కేవలం అర్ధవివరణ,అదీ పద్మార్పిత గారికి కూఅడా యేమీ ఇబ్బంది అనిపించని విధంగా చాలా సభ్యతాయుతంగా స్పందిస్తే దానికే మీరు ఆవేశపడిపోయి "ఒక చిన్న తప్పు దొరిలిందో లేదో లగేత్తుకొచ్చి","నిగూడంగా ఆటపట్టించి, చంకలు గుద్దుకోవడం","తమ విజ్ఞాన ప్రదర్శన ... కుళ్ళు, ఇంకేవో" లాంటి పదాలు వాడి స్పందిస్తూ యెదటివార్ని నిష్కారణంగా విమర్శించారు.

  నేను చెప్పిన హితవు "వినదగు నెవ్వరు చెప్పిన" అనే పెద్దల మాట మీద లక్ష్యం ఉంచి ఎదటివారు చేస్తున్న విమర్శ నిజమైనదా కాదా అని ఆలోచించుకోవడానికి కొంచెమైనా సమయం తీసుకోవాలి,అలా వినే లక్షణం లేకపోవడం వల్ల్లనే నేను పైన ఉదహరించిన వాళ్ళు అలా తయారవుతున్నార్రు అని మాత్రమే!

  దానికి కూడా పెడర్ధాలు తీశారు.నా బ్లాగులో నాకూ చాలా విమర్శలు వస్తున్నాయిmవాదనలూ జరుగుతున్నాయి.వాటికి ఎవరూ అతీతులు కారు.నాలో తప్పు ఉందనిపించినప్పుడు వొప్పుకుంటూనే ఉన్నాను,పద్మార్పిత గారి బ్లాగు తప్ప ఇంకేదీ చదవరనుకుంటాను - మీకు తెలిసే అవకాశం లేదు!

  ఇక్కడ ఎవరికీ ఎవరూ వ్యక్తిగతంగా తెలియరు,తెలియాల్సిన అవసరం కూడా లేదు.మన పోష్టుల్లోనూ వ్యాఖ్యల్లోనూ మనం వాడే భాషని మాత్రమే మనం శాసించగలం,ఆ ఆత్మనిగ్రహం నాకుంది!

  ఇంకా వాదన పొడిగించే ఉద్దేశం లేదు,ఎవరి సంస్కారం వారిది - స్వస్తి?!

  ReplyDelete
  Replies
  1. డియర్ హరిబాబు గారూ..... నాకు అందరి బ్లాగులూ చదివే ఓపిక గానీ, సమయం గానీ లేదండి. నిజం చెప్పాలంటే నేను ఈ బ్లాగ్ తప్ప ఏదీ చూడను. మీ సహ్రుతయతకు ధన్యవాదాలు. మనస్సు నొప్పించినందుకు క్షమించగలరు. మీకు నాకు ఏ పర్సనల్ విభేదాలు లేవు. ధన్యోస్మి!! శెలవ్....

   Delete
 29. రచ్చ రంబోలా భళా :-) :-)

  ReplyDelete
 30. జ్ఞానం లేనిది భావం యెలా పుడుతుంది?
  మాకు భావమే చాలు,దోషాలు ఉన్నా ఫరవాలేదు అంటే లల్లల్లా లిల్లిల్లీ అన్నా కూడా కవిత్వమే అవుతుంది,మరి?

  మాట్లాడే టప్పుడు "తారు రోడ్డు","సూపరు అందం" అంటాం గదా అని అన్ని చోట్లా,ముఖ్యంగా కవిత్వంలో
  ఎడాపెడా వాడేస్తే మీరు మెచ్చుకుని ఫ్యాన్సు అయ్యే స్థాయిలో పద్మార్పిత గారు కవిత్వం చెప్పగలరా?!

  ఇక్కడెవరూ పద్మార్పిత గారిని అవమానించ లేదు.ఆమె కవిత్వంలో దుస్సహమైన తప్పులున్నాయని క్రూరంగా విమర్శించ లేదు.

  కేవలం అర్ధవివరణ,అదీ పద్మార్పిత గారికి కూఅడా యేమీ ఇబ్బంది అనిపించని విధంగా చాలా సభ్యతాయుతంగా
  స్పందిస్తే దానికే మీరు ఆవేశపడిపోయి .......యెదటివార్ని నిష్కారణంగా విమర్శించారు.

  పెడర్ధాలు తీశారు.

  పద్మార్పిత గారి బ్లాగు తప్ప ఇంకేదీ చదవరనుకుంటాను - మీకు తెలిసే అవకాశం లేదు!
  మిత్రులారా ! ఇవన్నీ వివిధ సందర్భాలలో ఒకరు పలికిన పలుకులే . తెలుగురాని వాళ్ళం ! భావ కవితలకీ , ప్రబంధ సాహిత్యానికీ మధ్య ఉన్నతేడా తెలియనివాళ్ళం . కనీసం ఎక్కడో ఒకచోట అయినా నిదానించి ఆగుతారేమో అని , సుతారంగా సర్దుతూ ఎదురుచూసిన ఆత్మనిగ్రహం లేని వాళ్ళం . వస్తాను , హరిబాబు , మీ బ్లాగుకి వస్తాను . విశ్వనాథవారి గద్యం , తిరుపతి వెంకట కవుల పద్యం , శ్రీనాథుని చాటువు , బమ్మెర పోతన భక్తీ , దేవులపల్లి ప్రకృతీ , గురజాడ గీతం , శ్రీరంగం ఎరుపూ ....ఏముందో మీ దగ్గిర ... చూస్తాను . వివాదం కోసం కాదు , మీ మాటలు చూశాను , మీరెవరో చూడ్డానికి వస్తాను . నేను సాహిత్యానికి దాసుడను , భావానికి భక్తుడను , వ్యక్తులకు కాదు . మంచితనానికి తలవంచే ఒక సామాన్య ఆంధ్రుడను .

  ReplyDelete
 31. పద్మార్పిత గారితో నాకు స్నేహం ఎలా కలిగిందో చెప్తాను . ఆవిడ నాకు ఫ్రెండ్ కాదు . నా ఫ్రెండ్ ఎవరో ఆవిడ కవిత మీద కామెంట్ రాస్తే , ఆ కవిత నా ఫేస్ బుక్ న్యూస్ ఫీడ్ లోకి వచ్చింది . ఆ కవిత నాకు గుర్తు లేదు కానీ , ఆ కామెంట్ కి ఆవిడ ... మీ స్పందనకు నా" నెనర్లు "అని రిప్లై ఇచ్చారు . నేను పండితుడిని కాను గానీ ,నాకు తెలిసి త్యాగరాజ స్వామి తరవాత నెనరు అన్న పదాన్ని పద్మార్పిత గారి దగ్గరే మళ్ళీ విన్నాను . నాలుగయిదు కీర్తనలలో త్యాగరాజ భాగవతార్ నెనరు అన్న మాట వాడారు . ఎందుకో చాలా ఆనందం వేసి ఆవిడ పాత కవితలు చదివాను , ఫ్రెండ్ అయ్యాను . అంతమాత్రం చేత ఆవిడ రాసే ప్రతి కవితా నాకు నచ్చిందనీ కాదు . నచ్చనివె ఎక్కువేమో . అంతెందుకు , ఈ కవిత నాకు నచ్చలేదు , నా ఫస్ట్ కామెంట్ చదివితే తెలుస్తుంది . నాకన్నా వయసులోనూ , జ్ఞానం లోను ఆవిడ పెద్దవారు అనుకుంటున్నాను . అయినా ఎన్నో సార్లు నిర్మొహమాటం గా విమర్శించాను , దానికి ఆవిడ చూపించే హుందాతనం నేనే సిగ్గు పడేలా అయ్యేది . ఆవిడ ఒక్కోసారి ఎంత కొంటెగా రాస్తారో , రిప్లై లు ఇస్తారో మీకు తెలియనిది కాదు . కాసేపు సరదాగా స్నేహం గా ఉంటె పోయేదానికి , ఇంత వాగ్యుధ్దాలేమిటో బాబోయ్ .

  ReplyDelete
 32. ఆహా ! ఆహా ! ఏమి ఈ కాల మహిమ ! వంద కామెంట్ల కి ముప్పై మూడే జస్ట్ తక్కువ ! త్వరిత గతిన సెంచురీ కామింట్లు రావాలి !


  జిలేబి

  ReplyDelete
 33. ఈ పోస్టు లో నేను , పద్మార్పిత ఫ్యాన్స్ , హరిబాబు గారు , నీహారిక గారు , శ్యామలీయం గారు పెట్టిన అన్ని కామెంట్స్ డిలిట్ చెయ్య వలసిందిగా పద్మార్పిత గారికి మనవి . భవిష్యత్తులో అందరూ సౌహార్ద్ర భరిత హృదయాలతో ఇక్కడే కలుసుకొందాం . సాహితీ ప్రేమికులుగా సదా స్నేహంగా ఉందాం .

  ReplyDelete
 34. This comment has been removed by the author.

  ReplyDelete
 35. Gadepalli Venkat24 November, 2015
  వస్తాను , హరిబాబు , మీ బ్లాగుకి వస్తాను . విశ్వనాథవారి గద్యం , తిరుపతి వెంకట కవుల పద్యం , శ్రీనాథుని చాటువు , బమ్మెర పోతన భక్తీ , దేవులపల్లి ప్రకృతీ , గురజాడ గీతం , శ్రీరంగం ఎరుపూ ....ఏముందో మీ దగ్గిర ... చూస్తాను . వివాదం కోసం కాదు , మీ మాటలు చూశాను , మీరెవరో చూడ్డానికి వస్తాను . నేను సాహిత్యానికి దాసుడను , భావానికి భక్తుడను , వ్యక్తులకు కాదు . మంచితనానికి తలవంచే ఒక సామాన్య ఆంధ్రుడను .

  haribabu:సంతోషం,తప్పకుండా రండి!
  మీకు నా హార్దిక ఆహ్వానం.నా బ్లాగులో మీరు అడిగిన అన్ని రకాల ప్రక్రియలూ ఉన్నాయి.
  1.వాళ్ళ పేర్లతో శకాలు ఉన్నయ్యంట,వాళ్ళు మాత్రం ఈ భూమ్మీద లేరంట!య్యో,యేందయా నీ చరిత్రా నువ్వూనూ? దగ్గిర విశ్వనాథవారి గద్యం ఉంది.
  2.శ్రీ రాఘవం!శ్రీ మాధవం!ఆశ్రిత జన మనోహరం!! దగ్గిర శ్రీనాథుని చాటువు,గురజాడ గీతం, పోతన భక్తీ ఉన్నాయి.
  3.శివ బాహుబలి అవంతికని రేప్ చేశాడా?చీ పాడు!అవంతిక కిదేం పోయేకాలం, కిమ్మనకుండా వూర్కుంది? దగ్గిర ప్రతిపద చమత్కారం నిండిన కవితాత్మక వచనం,అసభ్యత లేని శ్రంగార రసావిష్కరణ ఉన్నాయి!  P.S:నెనర్లు/నెనరు అనే మాటని సంగీత జగద్గురు శ్రీ ట్యాగరాజస్వామి తర్వాత పద్మార్పిత గారొక్కరే వాడారా?పద్మార్పిత గారంటే నాకేమయినా చిన్నచూపు ఉందని మీరనుకుంటున్నారా?నా అడ్మిన్ ఖాతాలో తప్పకుండా చదవాల్సిన బ్లాగుల్లో ఇది కూడా ఉంది.యాగ్రిగేటరు వరకూ వెళ్ళి వెతుక్కోనఖ్ఖర్లేకుండా రోజూ చూస్తూనే ఉంటాను!

  ReplyDelete
 36. ఏంటో అంతా గందరగోళం. కవిత బాగుంది కమెంట్ రాయాలంటే భయంగా ఉంది ప్చ్

  ReplyDelete
 37. శీర్షాసనం వేశా ! ప్రాణాయామం చేశా !
  హట యోగం చేశా ! ఘోర తపస్సు చేశా !
  ప్రాధేయ పడ్డా .... సాగిల పడ్డా....
  ప్రియమార పిలిచా ... ప్రేమ మీర ఎదురుచూశా !
  అయినా ----------------------------
  ఓ కవితా ! ! ! ! ! ! ! ! ! ! ! ! రావేమే ? ? ? ?
  నిండు పున్నమి ఉంది ... పండు వెన్నెల ఉంది ..
  మల్లె పందిరి ఉంది .... పైరగాలీ ఉంది ..
  నీ కోసం మరువాన్ని తెచ్చా ! !
  మధుపాన్ని తెచ్చా ! !
  వసంతాన్ని తెచ్చా ! !
  పారిజాత పరిమళాలను తెచ్చా ! !
  ఓ కవితా ! ! ! ! ! ! నా ప్రియమైన కవితా ! ! ! ! ! !
  అయినా రావేమే ? ? ఎంతకూ రావేమే ? ?
  అదే .... ఆవిడ గారు పిలిస్తే మాత్రం ....
  ఝరివై సుడివై అలజడివై ఉద్ధృతివై ....
  వానల వరదల గోదారి వెల్లువలా .....
  ఎగిసి పడిన కెరటంలా ....
  గలగల సవ్వడిన బిరబిర లాడుతు....
  ఉరుకుల పరుగుల తరలి వస్తావు ! !
  నా పిలుపు మాత్రం నీకు వినిపించదు...
  నా గోడు నీ చెవికెక్కదు........
  ఓ కవితా ! ! ! ! సొంపైన భావ భరితా ! ! ! !
  ఆవిడ చేసిన పుణ్యమేమిటి ? ? నే చేసిన నేరమేమిటి ? ?
  ఓహో నువ్వూ ఆడదానివేనా ? ?
  ఎంత ఫీలింగులే మీకు ! !
  మా మొగవాళ్ళు అంటే నీకు కిట్టదా , లేక
  శ్రీ శ్రీ , కృష్ణ శాస్త్రి లు తప్ప ....
  నీకెవ్వరూ నచ్చరా ? ? ? ? ? ?
  ఓ కవితా ! ! ! ! ! నా ప్రియమైన కవితా ! ! ! !
  ఓ కవితా ! ! ! ! సొంపైన భావ భరితా ! ! ! !
  రావేమే ? ? రావేమే ? ? రావేమే ? ?

  ReplyDelete
  Replies
  1. ఇంత పొడవు కవిత వ్రాసి...ఇంకా రావేమే అంటారు ఏం!!!???

   Delete
 38. స్పటిక స్వచ్చత గల్గు భావనా పటిమతో
  అలరారు కవితల కొలువు మీది
  తెలుగు సంస్కృత పద తియ్యందనాలతో
  అలరారు కవితల కొలువు మీది
  చదివించు గుణమున్న చక్కని శైలితో
  అలరారు కవితల కొలువు మీది
  రమణీయ శృంగార రస మనోజ్ఞతలతో
  అలరారు కవితల కొలువు మీది

  చదువరుల మనోల్లాస సంజనిత చతుర
  శత సహస్రాది వ్యాఖ్యల జల్లు కురిసి
  యలరు బంగారు కవితల కొలువు మీది
  నిజము పద్మార్పితా ! కమనీయ కవిత !!

  ReplyDelete
  Replies
  1. యుద్దం తరువాత ప్రశాంతత...మీ కమెంట్ చదువుతుంటే.

   Delete
 39. అందమైన అక్షరము కపటమెరుగని హృదయము
  భాష పై మమకారము రచనలన్న అనురాగము
  మధురమయిన వాక్యము సొగసైన భావము
  ఎంతో నిరాడంబరము మంచితనమే ఆభరణము
  వినిపిచని రాగము కనిపించని నేస్తము
  సున్నితము సౌశీల్యము సహనము స్నేహము
  కొంటెదనాల చిత్రము మేటి శృంగార రస పోషణము
  ఒకనాడు ద్రాక్షాపాకము మరునాడే నారికేళ పాకము
  చాలా పురుష ద్వేషము స్త్రీ పక్షపాతము
  దయ్యాల ప్రపంచము ఆత్మలతో నెయ్యము
  దృఢమైన చిత్తము కడు మొండి తనము
  ఇదె నేను ఎరిగిన ఆమె నిజరూప దర్శనము
  పదుగురూ మెచ్చిన ఈ శ్వేత పద్మము .........

  ReplyDelete
 40. పద్మ గారూ ! వీరంతా మీరు ఎవరికో రిటార్ట్ ఇచ్చారని , జవాబు చెప్పారని
  అనుకుంటున్నారు . నాకు మాత్రం మీలో చాలా ఉదాశీనత , నిర్వేదం
  కనిపించాయి . రచయితలు భావం కోసం ఎన్నో రకాల పద ప్రయోగాలు
  చెయ్యడం , విమర్శల జడివానలు వెల్లువెత్తడం ఈనాటిదా ? చర్చ
  కొంచెం వాడిగా సాగిన మాట వాస్తవం . కానీ సున్నితమైన మనసున్న
  మీలాంటి పెద్దవారు కొంచెం గట్టి పడాలి . గతంలో చంద్రబోస్ రాసిన
  సినిమా పాట ఉదాహరణ చెప్పాను . ఇప్పుడు ఇంకో ఉదాహరణ చెబుతాను వినండి .
  ఒకసారి ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలవారు నిండు కొలువు తీరి ఉండగా ,
  అల్లసాని పెద్దన్న గారు కవిత్వం చెబుతూ , ఒక పద్యం లో " అమవస నిశి "
  అన్న పదాన్ని వాడారు . ఆ పద్యం ఇదుగో .......

  కలనాటి ధనము లక్కర
  గలనాటికి దాచ కమల గర్భుని వశమా
  నెల నడిమి నాటి వెన్నెల
  యలవడునే గాదె బోయె నమవస నిశికిన్.


  అమవస అనేదే ఒక వికృతి ( అమావాస్య ) , దానిని నిశి తో కలిపి ప్రయోగించడం
  నింద్యము , ఆక్షేపణీయం , నిషిద్ధం . అది అల్లసానివారు ఎరుగరా ? అయినా
  గమన సౌలభ్యం కోసం , ఛందస్సు కుదరడం కోసం , వేరే పదాన్ని వెతకలేక
  అలాగే వాడేశారు . సభికులెవ్వరూ కిమ్మనలేదు . నిశ్శబ్దం గా ఉన్నారు .
  ఇంతలో తెనాలి రామలింగ కవి లేచి , అల్లసానివారిని ఆక్షేపణ చేస్తూ ఈ విధంగా
  పద్యం చెప్పాడు .

  ఎమి తిని సెపితివి కపితము?
  బమ పడి వెరి పుచ్చ కాయ వడి తిని సెపితో
  ఉమెతకయను తిని సెపితో
  అమవస నిసి యనుచు నీవు అలసని పెదనా!


  భావము:- ఓ అల్లసాని పెద్దనా! అమావాశ్య నిశి అనుదానిని
  అమవస నిసి అని చెప్పితివి కదా? ఏమి తిని చెప్పితివి?
  భ్రమపడి వెఱ్ఱి పుచ్చకాయ తిని చెప్పితివా? ఉమ్మెత్తకాయ తిని చెప్పితివా?

  ఎంత వెటకారం ! అలసని పెదనా !అని సంబోధిస్తూ ...


  దీనికీ సభికులు నిశ్శబ్దం గానే ఉన్నారు .
  అల్లసాని వారు ఆ పదాన్ని మార్చలేదు . ఆ పద్యాన్నీ వెనక్కి తీసుకోలేదు .
  రెండు పద్యాలూ చరిత్రలో అలాగే నిలిచి పోయాయి .
  ఒక్కోసారి అల్లా జరుగుతూ ఉంటుంది . అంతే ! !

  ReplyDelete
 41. నేను చెప్పిందీ అదే!
  మీరు చెప్పిందీ అదే?

  అయినా యెందుకింత రభస జరిగింది?!
  చెప్పిన నాకూ అక్షింత లేల తగిలవలె!?

  బహుశ ఇక్కడ యే తీర్పు చెప్పినా
  పద్మార్పిత అభిమాన సంఘం వారే చెప్పాలి కాబోలు?
  అప్పుడే అది శంఖంలో పోసినట్టు తెర్ధసమం అవుతుందా!

  ReplyDelete
 42. మీరు ఆవిడ ఫ్యాన్ కాదని ఎవరన్నారు ? శ్రేయోభిలాషి కనుకే ఆవిడ అలా రాయాలి ఇలా రాయాలి బాగుండాలి పర్ఫెక్ట్ గా ఉండాలి అని కోరుకుంటున్నారు . నా సంగతి వేరే ! నేను మీలాగా ఆవిడ ఫ్యాన్ ని కాదు . అర్ధమైంది . మీ మనసులో పుట్టిన సందేహానికి సమాధానం ఇదిగో . ఆవిడ నా ఫ్యాన్ . అందుకే ఇక్కడకొచ్చి ఇంత శ్రమ తీసుకుని ఈ చర్చలో పాల్గొంటున్నాను . ఎవరి ఫ్యాన్స్ ని వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి కదా బ్రదర్ ! ఏమిటా ఫక్కుమన్న శబ్దం ? నాకసలే సౌండ్లు గిట్టవు . సైలెన్స్ .

  ReplyDelete
  Replies
  1. ఏదయితే అది అయింది, అయిందేదో మంచికే అయింది,అవబోయేదీ మంచికే అవుతుంది, మీ కవితలకి భయపడి పద్మార్పిత గారు ఫాం లోకి వచ్చేసారు కదా ? Good..Good..లేకపోతే అంతా నన్నాడిపోసుకునేవారు.

   Delete
 43. నన్నో సందేహం పీడిస్తోంది . వేరే పేరుతో ఉండడంవల్ల గుర్తుపట్టలేకపోతున్నాను , నీహారిక గారు .....వైజాగ్ ....గజల్స్ ..... కవిసంగమం గ్రూపులో...... తవ్వకాలు పేరుతో చిన్నప్పటి జ్ఞాపకాలని ఒక సిరీస్ లాగా .... అక్కా ! మీరేనా ?

  ReplyDelete
 44. మీరు రాసే కవితలపై కాదు ఈ రభస అనుకుంటా... మొత్తానికి సెన్సేషనల్ పోస్ట్ :-)

  ReplyDelete
 45. హరిబాబు గారూ , ఇక్కడ ఉండేది ఫ్యాన్స్ , ఫ్యాన్స్ కాని వాళ్ళు అని కాదండి . ఇక్కడ ఉన్నది కూడా మీరన్నట్టు ఇద్దరే . కానీ , వాళ్ళ గురించి చెప్పేముందు ఒక్కమాట . 64 కళలున్నా , లలితమైనవి అయిదే , వాటిలో కూడా మొట్ట మొదటిది కవిత్వము . అవునా కాదా ? అంటే కవి లేదా రచయిత అన్నవాడు ఎంత గొప్పగా ఉన్నతం గా ఉండాలి ? అయితే దురదృష్టం , ఈమధ్య కాలం లో కవులు రెండు రకాలుగా ఉన్నారు . వారూ కవులే , వీరూ కవులే . మొదటి రకం కవులు సృష్టి కర్తలు , ఒరిజినల్స్ . వీరు గిరీశం , మధురవాణి , పూర్ణమ్మ , ఏకవీర , కోణంగి , చింతామణి , బిళ్వమంగళుడు లాంటి పాత్రలను సృష్టిస్తారు . మరోరకంగా చెప్పాలంటే అపరిచితుడు , చంద్రముఖి , ఠాగూర్ , మగధీర , పెళ్లి కాని ప్రసాదు , శంకరాభరణం శంకరశాస్త్రి , అరుంధతి , అంతులేనికధలో సరిత , ఇదికధకాదులో సుహాసిని లాంటి పాత్రలు ....... ఒక్కొక్కళ్ళని కాదు షేర్ ఖాన్ ఒంద మందినీ ఒకేసారి పంపించు , సిటీకి కమీషనర్లు వస్తారు పోతారు చంటిగాడు లోకల్ , నాకు ఇక్కడేమనిపిస్తే అది చెబుతాను ఇక్కడేం తోస్తే అది చేస్తాను , వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ ..... లాంటి డైలాగులు ఒరిజినల్ గా సృష్టించేవాళ్ళు అన్నమాట . వీళ్ళు తోటి రచయితలతో చాలా హుందాగా ఉంటారు , వీలుంటే ఒక మంచిమాట మాట్లాడతారు . లేకపోతే మౌనం గా ఉంటారు . ఇక రెండోరకం వారు . రాయగలరో సృష్టించ గలరో తెలీదు గానీ , మొదటి రకం రచయితలు సృష్టించిన వాటిని పేరడీ చేసి , వెకిలి కామెడీ చేసి హాస్య నటులతో అవే పాత్రలను నవ్వు పేరుతో నటింపచేసి పొట్ట పోసుకునేవాళ్ళు . పొట్ట కూటి కోసమైతే పరవాలేదు కానీ , వీరిలో కొందరు స్వయం గా సృష్టించే సత్తా , చేవ లేకనో మరే కారణమో గానీ , ఆ ఒరిజినల్ రైటర్స్ ని చూసి అసూయ చెందుతారు . సంగాత్ సంజాయతే కామః , కామా క్రోదోభి జాయతే , క్రోదాద్భ వతి సమ్మోహః సమ్మోహా స్మ్రుతి విభ్రమః స్మృతి భ్రంశా బుద్ది నాశొ బుధ్ధి నాశా వినశ్యతి .... అని గీతాకారుడు చెప్పిన విధం గా , ఆ మాత్సర్యం వారిని ఒక్కో మెట్టూ దింపి చివరికి అధమాధమ స్థితి కి చేర్చి .... నిష్కారణం గా వ్యక్తిగత ద్వేషం దూషణ పేరడీ కవిత్వం ఇలాంటివి మొదలు పెడతారు . రచయితలుగా అశుధ్ధ భక్షకులై విచక్షణ వీడి ఒరిజినల్ రైటర్స్ మీద అవాకులు చెవాకులు పేలుతూ ఆనందం పొందుతారు . వీరి పేరడీ కవిత్వం , దూషణ వల్ల ఒరిజినల్ రైటర్స్ కి కలిగే నష్టం ఏమీ లేదు . మీరా స్వయం గా ఒక భజన్ లో చెప్పు కుంది ... లోగ్ కహే మీరా బైజూ బావరీ ... అని . జనాలు మీరాని బైజూ బావరీ అన్నారుట . అంటే ఏమిటో మీకు తెలీనిది కాదు . ఎ సెన్స్ లెస్ అండ్ షేం లెస్ లునటిక్ హు సింగ్స్ అండ్ డాన్సెస్ ఎట్ ఎనీ టైం , ఎట్ ఎనీ ప్లేస్ , ఇన్ ఎనీ స్టేట్ . వాళ్ళు అన్నంత మాత్రాన మీరాబాయి బైజూ బావరీ అయిపోదు కదా ! మీరా ఎప్పటికీ మీరా నే ! ఇంద్రుడు ఏలే అమరావతి ఉన్న స్వర్గం , విశ్వామిత్ర స్వర్గం అని రెండు స్వర్గాలు ఉన్నట్టుగా ఈ రెండు కోవలకీ చెందిన రచయితలకి రెండు రకాల స్వర్గాలు ఉంటాయి . ఎవరి స్వర్గం లో వాళ్ళు ఉంటారు . మీరు పద్మార్పిత ఫ్యాన్స్ అని అనుకుంటున్నవాళ్ళు మీలాగ సృష్టి కర్తలయిన ఒరిజినల్ రైటర్స్ ని అభిమానించేవాళ్ళు అన్నమాట . మనది ఇంద్రుడు పరిపాలించే స్వర్గం మిత్రమా !

  ReplyDelete
  Replies
  1. గాడేపల్లి వెంకట్ గారు,

   చాలా బాగా విశ్లేషించారు ! సూపెర్ ; కీప్ ఇట్ అప్ !

   చీర్స్
   జిలేబి
   జస్ట్ సెవెన్ కామెంట్స్ టు టార్గెట్ సెంచురీ :)
   కీప్ ది సెన్సేషన్ గోయింగ్ ఆన్ !

   Delete
  2. ఇంద్రుడు ఏలే అమరావతి ఉన్న స్వర్గం , విశ్వామిత్ర స్వర్గం అని రెండు స్వర్గాలు ఉన్నట్టుగా ఈ రెండు కోవలకీ చెందిన రచయితలకి రెండు రకాల స్వర్గాలు ఉంటాయి . ఎవరి స్వర్గం లో వాళ్ళు ఉంటారు... వెల్ సెడ్ వెంకట్ జీ.

   Delete
 46. జూనియర్ :- సీ...... నియర్ ! సీ..... నియర్ ! సీనియర్ !
  ఇటు అటు కాని హృదయం తోటి ఎందుకు సార్ !
  ఈ చర్చలు మీకు ?
  అటు ఇటు మీరొక వారధి కట్టి
  బస్సులు నడపాలని తలచేరు !
  ఒడ్డున ఉండరు ! నదిలో దూకరు ......

  వెంకట్ :- ఏరా ! వనభోజనాల్లో ఆబగా మింగింది అరక్క బాగా పైత్యం ప్రకోపించినట్టుంది ! నువ్వూ పేరడీలు మొదలు పెట్టావ్ ?

  జూనియర్ :- అది కాదు సీనియర్ ! ఆ వీధీ ఈ వీధీ అంటూ అడ్డమైన వీధులూ తిరిగొచ్చాకా కొంచెం మీరు ఏదో ఆలోచనలో పడినట్టున్నారు ?

  వెంకట్ :- అవునురా ! ఈ రోజుల్లో పఠనాసక్తి , రాయాలనే అభిరుచి ఉన్న వాళ్ళెందరు ? చక్కనిశైలి ఉంది . ఒక్క ఆ అవలక్షణమే లేక పోతేనా ....

  జూనియర్ :- ఏదీ , ఆ వంకరబుద్ది మీరా , పుల్ల విరుపు హల్వాల గురించేనా మీరు మాట్లాడేది ?

  వెంకట్ :- తప్పు , రచయితల గురించి అలా మాట్లాడకు . నాకు నచ్చదు .

  జూనియర్ :- మై డియర్ సీనియర్ ! న నింబ వృక్షో మధుర త్వమేతి.... వేపచెట్టు ఎప్పటికీ మధుర ఫలాలనివ్వదు . సాక్షాత్తూ సరస్వతీ పుత్రుడయిన ఒక గొప్ప కళాకారుడు ఆ ఒక్క అవలక్షణం వల్లే ఏమయ్యాడో స్వాతికిరణం లో విశ్వనాథ్ గారు చెప్పలేదా ?

  వెంకట్ :- యద్భావం తద్భవతి ! సానుకూల దృక్పధంతో ఆలోచించు . నాకు ఎవ్వరి మీదా కోపం గానీ ద్వేషం గానీ లేవు . అందరూ మంచివారే !

  జూనియర్ :- నాలుగుసార్లు బావా బావా అన్న హల్వా బేబీ మాటలు వినేసరికి , గురువుగారు కాస్త మెత్త పడ్డట్టున్నారు . హు .. త్యాగయ్యా ! ఎంత వారలైనా .....

  వెంకట్ :- ఛ..ఛ.. ఏమిటా అప్రాచ్యపు మాటలు ? ఎవరైనా తెలియనితనంతోనే తప్పులు చేస్తారు గానీ , తెంపరితనంతో కాదు ...

  జూనియర్ :- తెలియక అడుగుతున్నాను , నెత్తిమీదకు అంత వయస్సొచ్చినా ఇంకా తెలియనితనం అంటారు ఏమిటి సీనియర్ ?

  వెంకట్ :- చూశావా , నువ్వే తెలియకఅడుగుతున్నాను అంటూ అడిగావు ! ఎంతటి ప్రజ్ఞావంతులనైనా నిప్పుని నివురు కప్పినట్టు , వారి గొప్పతనాన్ని ఆ దుర్గుణం మరుగున పరుస్తుంది . అది వదిలించుకుంటే , వాళ్ళు కూడా షోడశ కళలతో అలరారే శంకరుని మకుట భూషణాలు అవుతారు . షిరిడీ సాయిబాబాగారు ఒకరి గురించి చెడుగా మాట్లాడేవారి గురించి ఏమి చెప్పారో నీకు తెలుసు కదా ! ఇంకెప్పుడూ నాముందు ఎవ్వరి గురించీ చెడుగా మాట్లాడవద్దు . సరే , నేను చెప్పినట్టు చెప్పు ... సర్వే జనా స్సుఖినో భవంతు

  జూనియర్ :- ఒక సర్వే చేసి , వేరే సర్వే ఫలితాలు ప్రకటించే మీడియా జనాలు అంతా సుఖంగా ఉండాలి

  వెంకట్ :- లోకా స్సమస్తా స్సుఖినో భవంతు

  జూనియర్ :- ఈ లోకం ఆ లోకం , ఈ స్వర్గం ఆ స్వర్గం అని కాకుండా అంతా సుఖంగా ఉండాలి .

  వెంకట్ :- ఓం శాంతి శ్శాంతి శ్శాంతిహి .......

  ReplyDelete
  Replies
  1. గాడేపల్లి వారి పేరడీ సూపెర్ !

   ఇక్కడ వారు కామింటర్ల తో
   వడ్డింపు చేస్తున్నారు
   వారి జూనియర్ తో కలిసి
   ఫ్యాను క్లబ్ ని రక్షించుకోవడంకోసం
   కామెంటు కోసం వచ్చిన బాహిరీ కామెంటర్ల తో :)
   పోరాడుతున్నారు :)

   చీర్స్
   జిలేబి

   Delete

 47. జస్ట్ త్రీ కామెంట్స్ టు గొ ఫార్ సెంచురీ !:)

  జిలేబి

  ReplyDelete
 48. పట్టు వదలని విక్రమార్కుడు మర్రిచెట్టు పైనున్న యువకుడి శవాన్ని భుజముపై వేసుకుని బయలుదేరుటకు ఉద్యుక్తుడు కాగా , భేతాళుడు ఆతనిని నిలువరించి , " ఓ రాజా ! నీకు ఒక కధ చెప్పెదను . సావధానముగా వినుము . ఆధునిక కాలములో , శ్వేతవరాహకల్పమునందు జంబూ ద్వీపమునందుగల భరతవర్షమున , మేరుపర్వతమునకు దక్షిణ దిగ్భాగమున గోదావరీతీర ప్రదేశము నందు గాడేపల్లి వెంకట్ అనే ఒక బీద బ్రాహ్మణుడు నివసించుచుండెను . ఆతడు ఏ విధముగా బీదవాడో చెప్పెదను . ఆతనికి లలితకళలనిన ఎనలేని మక్కువ , ఆరాధన . పూర్వజన్మమునందు మహాపాపియగుటచే లక్ష్మీ కటాక్షమున్ననూ , శారదాకటాక్షము లేక " సుకవితా యద్యస్తి రాజ్యేన కిం ? ( చక్కటి కవిత్వముండిన ఎడల చాలును , రాజ్యమెందులకు ? " ) అని ఆతడు వగచుచూ సదా చింతాక్రాంతుడై ఉండెను . ఒకనాడు ఆతడు ఆకలి గొని , మధుర ఫలములకై అన్వేషించుచు కారడవులలో తిరుగుచుండెను . ఒకచోట నుండి మరొక చోటికి అచ్చట నుండి వేరొక చోటికి తిరిగి తిరిగి , ఫలములు కానక ఆకలితో డస్సి అలసిసొలసెను . ఇంతలో అనూహ్యముగా ఆతని ముందుకు ఒక దేవత ప్రత్యక్షమాయెను . ఆమె ఒక చేత పద్మమునూ , మరొకచేత అమృత భాండమ్మునూ ధరించియుండెను . ఆ దేవతా స్త్రీ మిక్కిలి వాత్సల్యముతో ఆతనికి దివ్య భోజన పదార్ధమును వడ్డించెను . ఆ వంటకము పేరు తామరాకు పై నీటి బొట్ల వంటి ఈ పరిచయాలు ఏలనో . అది మిక్కిలి రుచిగా యుండెను . వెనువెంటనే ఆతడు ఇంకా భోజనము కావలెనని కోరగా , ఆమె పడతి లోని పడుచుదనాన్ని చూస్తున్నారు అనెడి వంటకమును వడ్డించెను . ఆతడు ఆవురావురుమని కడుపార భుజించెను . ఆతని గుండె బరువెక్కెను , మనసు విషాదభరితమాయెను . కన్నులు ధారాపాతముగా వర్షించెను , ఎందులకో ఆతడు ఆశ్చర్యముగా వెక్కివెక్కి ఏడ్చెను . కొన్ని ఘడియల వరకు ఆతడు మామూలు మనిషి కాలేకపోయెను . అటు పిమ్మట రెండు మూడు దినముల కొకసారి ఆ దేవత ఆతనికి కనిపించి భోజనము పెట్టుచుండెను . కృతజ్ఞత గలవాడగుటచే క్రమక్రమముగా వెంకట్ ఆ దేవతకు అపరిమితముగా రుణగ్రస్తుడయ్యేను . మన్మధనామ సంవత్సరం కార్తీక మాసమునందు స్వల్పముగా వెంకట్ ఆ దేవత ఋణమును తీర్చుకొనెను "-------- భేతాళుడు ఇంత వరకే కధ చెప్పి " ఓ రాజా ! వందో కామెంటు వ్రాసే భాగ్యము వెంకట్ కు గలదా ? లేదా ? ఈ ప్రశ్నకు తెలిసీ సమాధానము చెప్పక పోయావో , నీ తల వేయి వ్రక్కలగును "' అని ప్రశ్నించెను . దానికి విక్రమార్కుడు చిరునవ్వు నవ్వి ఇట్లనెను '' ఖచ్చితముగా ఆ అవకాశము వెంకట్ కు లేదు . ఏలననగా , ఇక ఆతని గొంతు పాప ప్రభావము చేత మూగబోవును . సనాతన ధర్మము , దేవాలయము , దైవము , సంస్కృతీ సంప్రదాయాలను కించపరిచే విధముగా బుద్ది హీనులవలె దుర్గంధము వెదజల్లిన ఎయిర్ కండిషనర్లను ఉద్దేశ్య పూర్వకముగా విస్మరించి , పక్ష పాతమును ప్రదర్శించి , వెంకట్ పాపాత్ముడాయెను . వందో కామెంటు వ్రాసే అవకాశము ఆతనికి లేదు . ఆ భాగ్యము --- పైకి కాషాయము లోన కషాయము ధరించి , బహుపత్నీకుడి ఒకానొక పత్నియైన ఉసి .... రిక రిక రిక రిక సాధ్వికో , ఇరువది ఇరువది క్రికెట్టు ఆటలో సభికులను ఉత్సాహ పరచుటకై గంతులు వేయు '' చీర్ " గాళ్ జాంగ్రీ బేబీ ... బీబీబీ కో లేక వేరేవ్వరికైనా దక్కును " . సరియైన సమాధానము లభించిననూ , విక్రమార్కునికి మౌన భంగమగుట చేత , భేతాళుడు శవంతోసహా తిరిగి చెట్టెక్కెను .

  ReplyDelete
  Replies
  1. ఆహా ఏమి ఈ భేతాళ కథావెంకోగాధోపాక్యానము :) పాకము న పడ్డ జిలేబీయం లా ఉన్నది :)

   सुपर कहानी :)

   జిలేబి

   Delete
 49. నూటొక్క జిల్లాల్లో లేరండీ ఇట్లాంటి అమ్మాయి.....

  ReplyDelete

 50. న్యూ టక్కరి అమ్మాయి :)

  ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వంద కామింటులు :)


  జిలేబి

  ReplyDelete
 51. అతి మృదుతర సత్వ భాషణునికి ....
  అఖిలాండా .... నాథునికి
  సీతా ......
  పతికి హారతీరే సీతా ....
  పతికి హారతీరే .......

  బంగారురంగు భుజంగుని పైని చెలంగుచును మరకతాంగుడు మీరపు
  తెరంగున మెరయు తన అంగనతో పలుకంగ జూచి ఉప్పొంగుచు
  సీతా ...
  పతికి హారతీరే ......

  అక్కరతో నిరుప్రక్కల నిలిచి తళుక్కని మెరయగ చక్కని మోమున
  చుక్కల రాయని మక్కువతో సరి ముక్కెర కదలగ గ్రక్కున
  సీతా ......
  పతికి హారతీరే ......

  రాజ విభాకర రాజ ధరామర రాజ శుకాజ విరాజలు చూడగ
  రాజ మానమగు గాజుల ఘల్లన రాజిత శ్రీ త్యాగరాజ నుతునికి
  సీతా .....
  పతికి హారతీరే .....

  ReplyDelete