జ్ఞాపకాలు

 చెప్పుకోలేని బాధ ఏదో

చెవుల్లో కీచురాళ్ళలా దొలుస్తూ 

ఆలోచనలకు రెక్కలు మెలిచి...

ఒక్క రాత్రైనా ప్రశాంతంగా ఉండనీయవు!

 పదునెక్కిన ఆలోచనలు ముల్లుకర్రలై 

గాయపడ్డ మదినే మరల గాయం చేస్తూ

జ్ఞాపకాలు సలపరం పెడుతుంటే...

హృదయంలో పొంగు ఉప్పెనలు ఆగవు!

 కునుకుపట్టని కళ్ళు కమిలిపోయి

వేదన నరాల్లో కరెంటులా ప్రవహిస్తూ 

కాగినకన్నీరే తనువుని బొబ్బలెక్కిస్తే

గుంతలో పాతిన గుర్తులేం ఊపిరి పోయవు!

30 comments:

 1. గుండె గొంతుకలో కొట్లాడు తోంది :)

  ఆఖరి వాక్యం లో ఏమన్నా టైపో ఉందాండీ ?

  జిలేబి

  ReplyDelete
 2. గాయపడ్డ మదినే మరల గాయం చేస్తూ
  జ్ఞాపకాలు సలపరం పెడుతుంటే...ఆర్ద్రతాక్షరాలు

  ReplyDelete
 3. అంత చెప్పుకోలేని బాధలేముంటాయబ్బా ? నేను అన్నీ చెప్పేస్తానని బాధపడేవాళ్ళనే చూసాను కానీ బాధనెపుడూ చూడలేదు.మనుష్యులు తీర్చుకోలేని సమస్యలు దేవుడు కూడా తీర్చలేడు. ఈ ఫోటో అచ్చంగా నాలాగే ఉంది.

  ReplyDelete
  Replies
  1. ఔను,ముక్కూ చెవులూ కోయించుకోని ముందరి శూర్పణఖలా:-)

   Delete
 4. అయ్యబాబోయ్ ఇంతలా సలపరం పెట్టే బాధలు ఎవ్వరికీ వద్దు :-(

  ReplyDelete
 5. ఎవరి బాధలు వాళ్ళకున్నాయి . ఏం కామెంట్లు రాయాలో తెలీక మేమూ చచ్చేంత బాధపడుతున్నాము . అక్కడ పిలిస్తే ఇక్కడ పలికి మా మీఠీ మీఠీ ఫ్రెండ్ బాధ పెడితే , నాలో అసూయ కలిగేలా చక్కగా కామెంట్ రాసిన ఫోటోలో ఆవిడ మరింత బాధ పెడుతుంటే , చాన్నాళ్ళకి దర్శనమిచ్చిన మిత్రుడు ఆవిడతో కయ్యమాడి ఇంకా బాధపెడుతున్నాడు . ఇన్నిబాధల్లో ఆ పిక్ ఒక్కటే , కాస్త ఊరట నిచ్చేలా భలే సౌమ్యంగా మనోహరంగా స్వాంతన కలిగించేలా ఉంది .

  ReplyDelete
 6. ఒక్క రాత్రైనా ప్రశాంతంగా ఉండనీయవు! హృదయంలో పొంగు ఉప్పెనలు ఆగవు! గుంతలో పాతిన గుర్తులేం ఊపిరి పోయవు!ఇంతటి వ్యధని ఎలా ఎలా ఎలా???

  ReplyDelete
 7. కునుకుపట్టని కళ్ళు కమిలిపోయి
  వేదన నరాల్లో కరెంటులా ప్రవహిస్తూ, స్వఛ్ఛమైన తెలుగు పదాల్లో కరెంట్ అని ఆంగ్ల పదము వాడం నచ్చలేదు పద్మగారు. చిత్రము చూడ ముచ్చటగా ఉన్నది

  ReplyDelete
 8. చాలిక ' జ్ఞాపకాలు ' _ వికచాబ్జముఖీ ! తమ వేదనామనో
  జ్ఞాల రతీవిలాపముల జల్లు _ కడుంగడు నెక్కుడయ్యె _ మో
  హాలు తలంచు చోటు , విరహాలు స్మరించుచు చొక్కుచోటు కా
  దే లలితాంగి ! యిద్ది _ బహు తెంపరిదానవు తెల్గు ప్రేయసీ !

  ReplyDelete
 9. కవితలో కొత్త దారి అన్నమాట... భేష్ .... అయినా ఏనుగు నడుస్తుంటే కుక్కలరుస్తాయి .... ఏనుగు బాధ ఏనుగుదైతే కుక్కల బాధ కుక్కలదీనూ.. అది వర్ణనాతీతం లేమ్మా అర్పితా ... ఏటంటావు

  ReplyDelete
  Replies
  1. భలే చెప్పారండీ ! Thanks !మీకు కాబట్టి జంతువుల బాధలు అర్ధం అవుతున్నాయి.దేవతల బాధలు మనుష్యులకు,జంతువులకు అర్ధం కాక వచ్చే బాధలివి !

   Delete
 10. యువ అని మణిరత్నం ఒక సినిమా తీశాడు . సాదా సీదా కధే అయినా ... ఒక సంఘటనని బేస్ చేసుకుని , ఫ్లాష్ బ్యాక్ ల లోకి వెళుతూ మూడు వెర్షన్లలో సాగుతుంది ట్రీట్ మెంట్ . ఒకటి సూర్య చెప్పే కధ , రెండోది మాధవన్ చెప్పే కధ , మూడోది మణిరత్నం చెప్పే కధ . ఒకే కధ , అవే సీన్లు , డైలాగులు కానీ మూడు వెర్షన్లు . ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు చెప్తూ పోతారు . ఆ కధ నుండి నేను గ్రహించిన నీతి ఏమనగా ..... ప్రతీకధకీ మూడు పార్శ్వాలు ఉంటాయి . మీరు చెప్పింది , వారుచెప్పేది మూడోది వాస్తవము . అందుకే వన్ సైడుగా వినేసి , నేను బాధపడదలుచుకోలేదు .

  ReplyDelete
  Replies
  1. You are too intelligent venkat garu !

   మా రాక్షస గురు శుక్రాచార్య గారి బేచ్ లో చేరతారా ?
   http://sukracharyatherakshasguru.blogspot.in

   Delete
  2. మణిరత్నం కూడా మా బ్యాచే ....రావణ్ తీసారు చూసారా ? రావణుడివైపు నుండి చూస్తే అతనిదీ కరెక్టే అనిపిస్తుంది.స్త్రీ అయినా పురుషుడు అయినా కంఫర్ట్ జోన్ లోకి వెళితే తెచ్చిపెట్టుకునే బాధలు ఎక్కువ !

   Delete
  3. నీహారిక గారు , నేను మిమ్మల్ని ఉద్దేశించి చెప్పలేదండి బాబు , మేడం గారి వేదన బాధ వన్ సైడేడ్గా విని బాధపడుతూ కూర్చోను అన్నాను , ఎవరైనా తనవైపు నుండే వాదనని బలంగా నిర్మించుకుంటారు కదా అని నాఅభిప్రాయం . అంతే సుమా . అన్నన్నా! మీలాంటి మాటకారితో డీ కొడతానా ?

   Delete
  4. This comment has been removed by the author.

   Delete
 11. జ్ఞాపకాలు ఎప్పుడు మధురమే
  అవి వేదనలు అయినా సంతోషాలు అయినా.
  బొమ్మ చాలా బాగుంది.

  ReplyDelete
 12. జ్ఞాపకాలు సలపరం పెడుతుంటే...
  హృదయంలో పొంగు ఉప్పెనలు ఆగవు!
  బాధ పెట్టేవే బాగా గుర్తు ఉండిపోతాయి

  ReplyDelete
 13. బాధలో కూడా భావాలని పలికించడం అందరికీ సాధ్యం కాదు.,

  ReplyDelete
 14. సీ..బా..సీ
  పీ..బా..పీ
  ఔనౌనౌ.. కంట కన్నీరు రాలుతోందని మాత్రమే గమనించే వారు ఈ లోకానా శ్యానా మంది ఉండారు.. ఆ రాలే కన్నీటి బొట్టు చాటున రేగిన మౌనమనే తూఫాను వలన కరిగిన నీటి మేఘం చినుకే కన్నీరు ఔనేమో..

  ~శ్రీ~

  ReplyDelete
 15. కునుకుపట్టని కళ్ళు కమిలిపోయి****అయ్యో :(

  ReplyDelete
  Replies
  1. నిజమే సుమండి.. కొన్ని కొన్ని వేళలా నిజం అనిపిస్తుంది ఈ మాట

   Delete
 16. ప్రతి మనిషికీ జ్ఞాపకాలు రెండు రకాలుగా ఉంటాయి . కొన్నేమో తీపిగుర్తులై కలకాలం తలుచుకున్నప్పుడల్లా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. రెండో రకం కురుపులై మనస్సులోంచి వెళ్ళిపోకుండా ఉండి పోతాయి. ఏమైనా జీవితాన్ని బొమ్మ బొరుసూ అనుకుంటూ గడిపేయడం విచిత్రం కదా!

  ReplyDelete
 17. జ్ఞాపకాల నీడల్లో మనల్ని మనం అప్పుడప్పుడూ చూసుకోవడం జరుగుతుంది. అవి చిత్రవిచిత్రాలే

  ReplyDelete
 18. బాగున్నాయి జ్ఞాపకాలు.

  ReplyDelete
 19. ఎంత చెప్పుకోని బాధలైనా మీ రాతల్లో అందగానే అనిపిస్తాయి అదేమి వింతనో ఏమో :-)

  ReplyDelete
 20. నిశ్శభ్ద రాత్రికి దిష్టి తగలకుండా కీచురాళ్ళు చేసే శబ్దం చీకటికి కమనీయంగా అనిపిస్తుందేమో కానీ వేదనలో కూరుకొని శూన్య హృదయం తో విలపించేవారికి అది ప్రశాంతతను దూరం చేస్తుంది. నిజానికి వేదన నిండిన హృదయాలతో రాతిరంతా జాగారం చేసి సావాసం చేసేవి కీచురాల్లె పాపం. వేదన ఉన్నప్పుడు వాటి సహచర్యం మనకి కానరాదు. నిజం. ఇలా బాధలో పరయకాయ ప్రవేశం చేసి వేదన పండించడం ఒక ఎత్తైతే పంథా మార్చి కొత్త నిర్మాణం లో మీ భావాలను వ్యక్తీకరించడం మరో ఎత్తు. పదునైన వేదనా ఖడ్గాలు మీ కవితా సుమాలు. సలాం!!

  ReplyDelete
 21. నా ఆలోచనలకి రూపమిస్తున్న అక్షరాలని ఆదరిస్తున్న అందరికీ
  అభివందనములు_/\_

  ReplyDelete
 22. కునుకుపట్టని కళ్ళు కమిలిపోయి
  వేదన నరాల్లో కరెంటులా ప్రవహిస్తూ... ఇంత వేదనా

  ReplyDelete