ఓ వెర్రి మనసా...


ఓ వెర్రి నా మనసా...కన్నీరంటే మోజాయె
ప్రేమను రుచి చూపి కొత్తజీవితాన్ని ఇవ్వకు!


వనం వసంతతో నిండి...పూలు నవ్వుతుంటే
కోయిలలు పరవశంతో పాడ నెమళ్ళు నర్తించ
మౌనం రోధనకు వేణుగానాన్ని వినిపించకు!!


మెల్లమెల్లగా మబ్బులే ఆకాశాన్న సన్నగిల్లగా
దాహం తీరక విరబూయని మొగ్గ ముడుచుకుని
జాలిగా నా ఒళ్ళోన రాలి నాకు జతకూడి ఏడువ
సదా నాకు తోడున్న చీకట్లను తరిమాలనుకోకు!


ఇదే జీవితం... ఏడుపులోనే నవ్వడం నాకు ప్రియం
కొద్దిసేపు ఉండిపోయే చంద్రుని వెలుగుని ఇవ్వకు!!

32 comments:

  1. వేదనావేదన
    ఆశాడియాశ
    వర్ణనాతితం
    భావగర్భితం
    సున్నితం
    అచంచలం
    ఔను ఏడుపులో వేదనే కరిగి కన్నీరవని
    నవ్వేరాకా పన్నీరైనా ఆవిరవని
    జీవితం భావాలకే అందని ఒక వింత
    దిగులు తప్పా నవ్వులే కానరాదంట
    ఏమో ఏమో

    ReplyDelete
    Replies
    1. అర్థం అవలేదు :(

      Delete
    2. జీవిత సారమిదని సంక్షిప్తంగా చెప్పాలనుకున్నా ఆకాంక్ష గారు.. అక్షరాలు తడబడ్డాయి.. అందుకే అర్దం అవలేదు మీకు..

      నేను కామెంట్ చేసి తిరిగి చూసినపుడు నాకూ అర్థం కాలేదు.. మరల రాశా.. భావం పెడదోవ పడితే మొదటికే మోసమని కామెంట్ డిలీట్ చేశాను.. ఆ డిలీటేడ్ కామెంట్ థ్రెడ్ అదే.. :(

      ఈ మధ్య అంత గజిబిజి గందరగోళమే..
      ప్రతి అక్షర భావం అగ్ని గోళమే.. ప్చ్..

      Delete
    3. జీవితానా వేదన చెందితే కలిగేది ఆవేదనే కదా
      ..ఆవేదన ఎదురైతే ఆశలే అడియాశలైతే.. పదాలకే అందని భావం వర్ణనాతితం..
      వర్ణించలేని భావాలు మనసులో మిగిలేవేళ భావగర్భితం.. భావాతిరేకమైన వేళ కలతతో మనసు ఆయేను సున్నితం.. అనాలోచిత మనసు సదా చంచలం..

      ఇదండి ఆ పదాల కూర్పు ఆకాంక్ష గారు

      Delete
  2. "Divinity is enriched in all of the Humans, only the thing one need to persuade themselves, is how one can channelise this power into something which can bring harmony, peace, spirituality and prosperity to the mankind. With all these in streamline, the humanity prospers. When Humanity dwells equally with Divinity, we tend to find God."

    ~ নরেন্দ্র নাথ দত্তা


    "God is an Integral part of the Universe. Clean thoughts and deeds are the ways in which we can visualize him, within and among ourselves."

    ~!~ 12 January National Youth Day ~!~

    ReplyDelete
  3. ఆవేదన
    అభ్యర్ధన :)

    ReplyDelete
  4. One more dard bharee dastan ☺

    ReplyDelete
  5. వెర్రి మనసు-విచిత్ర చేష్టలు
    వద్దంటే వినదు-పొమ్మంటే పోదు

    ReplyDelete
  6. కొద్దిసేపు ఉండిపోయే చంద్రుని వెలుగు different

    ReplyDelete
  7. కన్నీటినే కౌగలించుకుంటాను అంటే ఎలా పద్మార్పిత నవరసాలు రుచిచూడలి, వాటి సారాంశం వివరించాలి

    ReplyDelete
  8. manasu cheppinatlu manam vinali mansu vinadu

    ReplyDelete
  9. జర మార్చి రాయి అర్పితమ్మో

    ReplyDelete
    Replies
    1. గిట్ల ముచ్చటబెడితే జనవరి ఫిబ్రవరి మార్చి రాస్తారేమో జనని గారో.. ఔ మల్ల.. జరా నవ్వుకోనికి రాసినా.. పరేశాని గాకుండ్రి

      Delete
  10. దాహం తీరక విరబూయని మొగ్గ ముడుచుకుని
    జాలిగా నా ఒళ్ళోన రాలి నాకు జతకూడి touchings words

    ReplyDelete
  11. కన్నీరంటే మోజాయె...అందుకేనా వేదనలో వేడుకలో నవ్వుతారు

    ReplyDelete
  12. మకరసంక్రాంతి శుభాకాంక్షలు

    ReplyDelete
  13. ఓ వెర్రి మనసా... ఎన్ని కునుకుపాట్లు, ఎన్నెన్ని వెన్నెల దెబ్బలు, ఇంకెన్ని కలువల సంకెళ్ళు !!! ప్రేమలో కన్నీళ్లు, మౌనంలో రోదనలు, జీవితంలో చీకట్లు... ఇవన్నీ ఓ సహృదయానికి మెచ్చి విధి బహూకరించే ఆభరణాలు... ఎక్కడ మనస్సు అందాన్ని సంతరించుకుంటుందో అక్కడ ఆ అందానికి మించిన వెర్రి మనసును ఆవరించి వేదన ఆవహించేలా చేస్తుంది. కవితలో ఆర్ద్రత దానికి తగ్గ చిత్రం చాలా బావుంది మేడం. సలాం!!

    ReplyDelete
  14. చిత్రంలో అమ్మడు చలికి వణుకుతున్నట్లు ఉంది... భోగిమంటలు వేయమంటే ఇలా ఏడుపుగొట్టు కవితలు రాస్తున్నారా??? మీరు మారరా ?? అర్పితా........

    ReplyDelete
  15. మారమని అంటే మారిపోవడం అందరికీ సాధ్యమా అందులోనూ పద్మార్పితగారికి..హా హా హా

    ReplyDelete
  16. పద్మార్పితగారు మిమ్మల్ని నేను మారమని అననుగాక అనను మాడం మీ మనసు మీ ఇష్టం :-)

    ReplyDelete
    Replies
    1. మారమని తెలిసి మారము చేసే మనసుకి మారుమాట మెదలక మారిపోయే మరునిమిషానా మాటలే మూగబోయి మౌనముగా మారేనేమో.. ఏమంటారు ఆకాంక్ష గారు

      Delete
  17. వనం వసంతతో నిండి...పూలు నవ్వుతుంటే
    phool khile gulshan gulshan

    ReplyDelete
    Replies
    1. వసంతమున విరితోటలో విహరిస్తే వర్ణాల విహారి..
      విరవిగా విరబూస్తాయి వేవేల వర్ణాల విరులు..

      Delete
  18. अर्ज किया है
    अक्षर अक्सर रहा करते हैं खोये खोये से
    अक्षर अक्सर रहा करते हैं खोये खोये से

    कैसी मिठास है पता नहीं भावुकता में
    कैसी मिठास है पता नहीं भावुकता में
    कि
    प्रतिपद को बना देती है एक सुन्दर शायरी
    प्रतिपद को बना देती है एक सुन्दर शायरी
    और
    हर पल को पलकों में बना देती है लम्हा
    हर पल को पलकों में बना देती है लम्हा

    ReplyDelete
  19. అందరి అత్మీయతకు అభివందనములు _/\_

    ReplyDelete

  20. Happy Flag Day 2016 Quotes is one of the biggest football event. This year this tournament is titles as Happy Flag Day 2016 Images . This year it is going to be played in Centenario. We have provided every detail about Happy Fathers Day 2016 Quotes on our website. Please visit our site to show your support for football.

    You can find a grat wesbite about Copa America 2016 TV Schedule and Copa America TV Schedule .

    This website is about Euro 2016 and Euro 2016 Fixtures .

    You can also find information about Belmont Stakes 2016 .

    ReplyDelete


  21. Grab the festival eid al adha 2016 dates and eid al adha details for free of cost on our website. grandparents day 2016 will be celebrated in most of countries. It is also known as happy grandparents day 2016 . Apart from this labor day weekend 2016 is also coming next month. You can chek details of labor day 2016

    Get the unique Premier League Fixture 2016 and Premier League Fixture 2017 for free of cost. You can also search it by keywords like Premier League Table, Premier League Table 2016 and Premier League Table 2017 done. Share it by using Premier League Standings , Premier League Standings 2016 and Premier League Standings 2017 , Feel free to get the us open tennis 2016 info, latest Premier League Fixture info.

    We have also shared with you Premier League Fixtures as well as Premier League Table Apart from that you can find out the us open 2016 winners and Rio Olympics 2016 Schedule ,

    ReplyDelete