అక్షరస్వరలయ

అచ్చతెలుగు వారు సైతం ఆంగ్లాక్షరాలని అందలం ఎక్కిస్తుంటే
అలిగిన 56 తెలుగు అక్షరాలు బోరుమనలేక గొల్లుమన్నాయి
అమ్మలాంటి కమ్మదనం ఉన్న అక్షరాలు మాటల్లో అన్నాయి..
ఆంగ్లములోని A B C D లకేం ఆడుతూ పాడుతూ పలికేస్తారు
అక్షరాభ్యాసం నాడు అచ్చులు దిద్దించడానికి ఆలోచిస్తున్నారు!

అ నుండి అం అః అచ్చుల్ని అని చూడు ఆప్యాయత అనిపించేను
క, ఖ, గ, ఘ కంఠస్తం పడితే ఉదరభాగపు కండరాలే కదలాడేను
చ, ఛ, జ, ఝ లని పలికితే ఛాతీ భాగమే కదిలి రొమ్ము విరిచేను
ట, ఠ, డ, ఢ లు ఉచ్ఛరించి చూడు స్వరపేటిక కదిలి ఆడిపాడేను
ప, ఫ, బ, భ లను పసందుగా పలికితే పెదాలు కలిసి తేనెలూరేను
తనువంతా తడిమేటి తెలుగులోని తీపి ఆంగ్లభాషకి ఏదీ అనడిగితే
ఆల్ఫాబెట్స్ అన్నీ ఏకమై తెలుగు అక్షరాల్ని ఆహా అని కీర్తించాయి!

27 comments:

  1. అక్షరాల్లోనే కాదు చిత్రంలోను తెలుగుదనం ఉట్టిపడుతుంది.
    భవ్యం మీ భాషాభిమానం.

    ReplyDelete
  2. Wonderfull lines regarding telugu language.

    ReplyDelete
  3. అదిరిందమ్మో అర్పితా..అదిరింది:)

    ReplyDelete
  4. తెలుగు భాషలోని తీయదనం అధ్భుతంగా చెప్పారు

    ReplyDelete
  5. హతవిధి.. భాషా పయనం ఎటో మరెటో.. అక్షరాలన్ని శరాలై ఘాతమైనా తేనేలోలుకు తేలుగు వెలిగేను కదా..
    పద్మగారు.. తెలుగులోనే రాసేస్తున్నాను లక్షణంగా.. ఇహా కోపోద్రికమై ఉట్టి ఎక్క వద్దని చెప్పండి కవితాక్షర ఇంగ్లీషావళికి..


    అర్దం కాలేదు కదా.. మరో మారు చూడండి..

    తెలవారటానికి కావాలి వెలుగు..
    మరో ఆరు గంటలు మిగులు..
    గంట గంటకి ఠంగ్ ఠంగ్ మని చప్పుడేలా..
    కనుకే కునుకు తీస్తా ఇగా మస్తుగా..

    కూణ్ కన్నా కుఁ రచకో కేని మాలమ్ ఛేని..
    కసన్ కతో కూఁ చీ కేన్ బోలాయే వాళో కత్త ఛ

    ReplyDelete
  6. తెలుగు రాదంటే అక్షరాలు తూటాలుగా మారతాయేమో

    ReplyDelete
  7. అసలు అర్థం కాదిది.. సరదాగా రాస్తున్నా.. పద్మగారికి క్షమాపణలతో..

    అక్ష రస్వ రలయ: అక్ష: కన్ను రస్వ: హ్రస్వ దీర్ఘాలలో ఒకటి రలయ: రాలేనా.. (గ్రావిటికి అట్రాక్ట్ అయ్యి కిందికి వచ్చేది.. (రావటం కుదరదా అని కాదు))

    కన్నులనుండి తెలిసి తెలియనంత చినుకులు జారేనా..

    శీర్షిక అసలు అర్థం: అక్షరం పలికే స్వరగతి లయగతుల తీరు తెన్ను

    ~శ్రీ~

    ReplyDelete
  8. భాషా కుణ్సి వతోయి సేమా ఏక్కజ్ తీరేర్ అర్దం ఆవచ.. అచ్చుల్ హల్లుల్.. హ్రస్వ దీర్ఘాల్ సే కత్రా రతోయి కవితా ఎర్ భావం కన్నాయి తేడా జాయేని..!

    ReplyDelete
    Replies
    1. భాషా ఏదైనా అన్నిటిలో ఒకే రకంగా అర్దం వస్తుంది.. అచ్చులు హల్లులు.. హ్రస్వ దీర్ఘాలు ఎన్ని ఉన్నా కవిత యొక్క భావం తేడా అవ్వదు..!

      Delete
  9. అదే కదా మన తెలుగు భాషలో ఉన్న మాధుర్యం

    ReplyDelete
  10. తెలుగు భాష పై నీకు ఉన్న అభిమానమే నీ చేత ఇన్ని అధ్భుతమైన కవితలు వ్రాయించి మాకు అహ్లాదాన్ని ఇచ్చింది. అభినందనలు అర్పిత-హరినాథ్

    ReplyDelete
  11. అక్షరాలు ఉఛ్ఛరిస్తే తనువు కదలాడింది
    మీ కవిత హృదయాన్ని తాకింది పద్మగారు

    ReplyDelete
  12. తియతీయని తెలుగుభాష
    మన అందరి మాతృభాష

    ReplyDelete
  13. తెలుగు తల్లి అక్షర స్వర లయను వినిపించారు, అభినందనలు పద్మాజీ..

    ReplyDelete
  14. గళం విప్పిన అక్షరాలు
    పద్మార్పిత కలం వెంట జాలువారిన తేనెపలుకులు

    ReplyDelete
  15. తెలుగు భాష గురించి గొప్పగా చెప్పింది మీరే అప్పుడు ఇప్పుడు కూడా..

    ReplyDelete
  16. తేట తెలుగు

    ReplyDelete
  17. అచ్చులు
    హల్లులు
    అందంగా ఉన్నాయి మీ రాతల్లో

    ReplyDelete
  18. ఆల్ఫాబెట్స్ అన్నీ ఏకమై తెలుగు అక్షరాల్ని ఆహా అని కీర్తించాయి..ఆహా ఆహా

    ReplyDelete
  19. తెలుగు వెలుగులన్నమాట..

    ReplyDelete
  20. తెలుగు భాష ఔన్నత్యాన్ని, అక్షరాల్ల్లోని వ్యాయామాన్ని చక్కగా వివరించిన కవిత... తెలుగు తల్లికి అక్షరానీరాజనం ... అద్భుతం! బొమ్మలో కూడా తెలుగుదనం ఉట్టిపడుతోంది.. సలాం! మేడం....

    ReplyDelete


  21. తనువును తడిమేటి తెలుగు
    అనువుగ అమరగ జిలేబి ఆంగ్లము యేలన్
    చనువుగ అ ఆ ఇ ఈలను
    పుణికిన చెలువపు తెలుంగు పూచున్ గదవే :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  22. తెలుగు భాష అభిమానులకు, ఆరాధించే వారికీ, ఆశ్వాధకులకు అభివందనం._/\_
    అక్షరాప్యాయతలు అందించిన అందరికీ ధన్యవాదములు.

    ReplyDelete
    Replies
    1. తెలుగు భాష తేనేలొలుకనే నానుడి లా..
      అచ్చులతో అచ్చంగా పదాలకు గుణింతాల్లా..
      హల్లులలో దరిచేరే హంగుల్లా..
      ఆరాధనైనా భాషాభిమానమే ఎల్లలు దాటే..
      ఆస్వాదించే పలుకుల కన్నా భావం కలగలిపే కవితే మిన్నా..
      మాటలు రాని వేళా పాటగా కూర్చని వేళా..
      కథే కవితాయే.. కవితాక్షరి ఝరిలో..

      Delete
  23. అమ్మో అమ్మో తెలుగు అక్షరాలు అవయవాలు అన్నింటినీ ఊపితే మీ కవిత మా గుండెని కదిలించిందండోయ్..

    ReplyDelete
  24. నా పేరులోనే తెలుగు ఉందని గమనించారా మరి ;-)

    ReplyDelete