వేడి వలపుసెగ..


వేడితాపం ఏలనో నన్ను ఇంతగా వలచె..
వద్దు వద్దంటున్నా వెంటపడి వేధించసాగె
వేడిసెగ తాకగానే ఒళ్ళంతా కమిలిపోయె
చెమటపట్టి తనువు మొత్తం తడిసిపోయె
తాపం తాళలేనంటూ మేని నగ్నమాయె
విప్పిన వస్త్రాలు ఉతుక్కుటుండగానే ఆరె
జలకమాడి దుస్తులు వేసుకోగానే తడిసె!

వేడి వలపుసెగ వద్దుపొమ్మన్నా వరించె..
దాహమే తీరలేదన్న గొంతు ఎండిపోయె
అరుణకాంతి తాళక అధరాలు ఆరిపోయె
విరబోసుకున్న కురులు అలిగి కొప్పాయె
రవికిరణం క్రీగంట చూడ రవిక రంగుమారె
సరసమే కంపరంపెడుతూ రుసరుసలాడె
సంధిసేయ వచ్చిన చంద్రుడే చల్లగా జారె!

24 comments:

  1. విసవే కిడికితా ఖ్యవ్యా యేటాకటుఇ.. శ్రీ కృష్ణ పరమాత్మ..!

    ReplyDelete
    Replies
    1. మీక్కూడా వేడిసెగ తగిలెనా శ్రీధర్ గారు. తిరగేసి వ్రాస్తున్నారు :-)

      Delete
  2. దిక్కుమాలిన వేడి వద్దు వద్దు అంటుంటే వెంట పడుతుంది-అయ్యో పాపం

    ReplyDelete
  3. పద్మార్పితగారు వేడి సెగలు చల్లారే మార్గం సూచించండి. చిత్రం మరింత వేడి ఎక్కిస్తుంది.

    ReplyDelete
  4. మిమ్మల్ని మాత్రమే కాదండోయ్ వేడిసెగ వలచింది నేను కూడా భాధితురాలినే... చిలిపిగా వలపు చిచ్చు రగిలించారు కాదు కాదు వర్ణించారు.

    ReplyDelete
  5. ఈ తాపం తట్టుకోవడం బహుకష్టం సుమ్మీ

    ReplyDelete
  6. నిజంగా ఇదంతా వేడి వలపు సెగేనా లేక ఆ వంకన మీరు చెప్పవలసిన విషయాలు ఈవిధంగా చేరవేసారా? క్లారిటీ ఇవ్వండి మేడం అంటే క్లాస్ పీకుతారేమో అందుకని అడక్కుండా "SIMPLY SUPERB" అని చల్లాగా జారుకుంటా...అన్నట్లు చెప్పడం మరిచాను చిత్రంలో మొత్తం భావాన్ని కాచివడకట్టారు. కుడోస్

    ReplyDelete
    Replies
    1. అడగకూడదేమోనని అడగలేదంటూనే అడగాల్సింది అడగకనే అడిగేసినట్టున్నారు ఆకాంక్షగారు..!

      Delete
  7. ఎండ తాకిడికి ఏ తుపాకీ తూటు సరిపోదు.

    ReplyDelete
  8. వేడిగా వాడిగా ఉంది కవిత చిత్రం

    ReplyDelete
  9. వేడి వలపుసెగ వద్దుపొమ్మన్నా వరించె
    దాహమే తీరలేదన్న గొంతు ఎండిపోయె
    అరుణకాంతి తాళక అధరాలు ఆరిపోయె
    వేడిగాలి బాగా సోకింది, నయం వడదెబ్బ తగల్లేదు :)

    ReplyDelete
  10. sunstroke tagilindi. take care

    ReplyDelete
  11. వలపు వేడితో సరిగంగ స్నానం చేసినట్లుంది. చిత్రంతో పూర్తిగా తడిసి ముద్దైపోయాం.

    ReplyDelete
  12. రవికిరణం క్రీగంట చూడ రవిక రంగుమారె,నాసిరకం బట్టల తీరు అంతేనండి

    ReplyDelete
  13. వేడి కూడా యమ హాయిగా ఉంది మీ కవితలో

    ReplyDelete
  14. వేడి వలపుసెగ వద్దుపొమ్మన్నా వరించె..వరంగల్ లోనూ అంతే :-)

    ReplyDelete
  15. వాహ్ ఏమి చెప్పినారు

    ReplyDelete
  16. హాట్ హాట్గా చెప్పినా నిజమే చెప్పారు

    ReplyDelete
  17. హాట్ అంటూ ఇలా నాజూకు నడుము చూపి కూల్ గా ఉన్న మాకు హాట్ అనిపించేట్లు చెమటలు పట్టించకండి...

    ReplyDelete
  18. అందరి స్పందనలకూ అభివందనములు._/\_

    ReplyDelete
  19. వేడి తాపం చల్లబడేనా..హా హా హా

    ReplyDelete