ఇద్దరం

ఇద్దరం సంభాషణ అంటూ మొదలెడితే...
మధ్యలో మౌనం మరికొంత మధురగానం!

ఇద్దరం మాటలేలంటూ మైమరచిపోబోతే...
కొంత బిడియం మరికొంత తీయనిసరాగం!

ఇద్దరం తెలియని బంధమై పెనవేసుకోబోతే...
చిన్నిగాయాల హింస మరికొంత మీమాంస!

ఇద్దరం గిల్లికజ్జాలతో గొడవపడి అలకబూనితే...
కొంత ఇష్టం మరికొంత అలవికానేదో అయిష్టం!

ఇద్దరం వేరుకాలేక రాతిరి కౌగిలిలో ఏకమైతే...
అంతా పవిత్రత మరికొంత చెప్పలేని నిశ్చింత!

ఇద్దరం పగటిపూట పనిలోపడి విడిపడిబోతే...
కొంత అనురాగం మరికొంత తప్పని అసహనం!

21 comments:

  1. EK MAIN EK AUR EK THU..

    ReplyDelete
  2. ఇద్దరం కాని మాటల్లోనే
    ఒక్కరం అనేది మనసు చెప్పె వేదం
    కాలం అనే తక్కెడ లో సరి సమానమై
    తూగే సుమధుర అద్వితీయ అద్వైతం*
    అనురాగం మేళవించగా పూచిన పుష్పరాజం
    మౌనంతోనే మాటలల్లే మౌనరాగాలాపన ద్వంద్వం

    * అద్వితీయ: అ+ద్వితీయ: That which has no peer (Peerless), which can never be duplicated. उदाहरण: जो ममता माता और पिता उनके बच्चों को देते हैं वह अद्वितीय होता है।

    అద్వైతం: అ+ద్వ+ఇతి: That is not a double entity, but one and single entity even though they seem to be two entities physically.
    उदाहरण: एक बच्चे को अपने माता और पिता कभी भी अलग नहीं दिखते वे दोनो ही अद्वैत होते हैं।

    మరికొంత తొందరపాటు.. మరికొంత తత్తరపాటు.. మరికొంత ఊరట.. మరికొంత బాసట..
    మరికొంత తన్మయత్వం.. కలగలిపి సాఫిగా సాగే జీవనయానం..

    మీ కవిత పదాలు ఎప్పుడు ఆలోచింపజేస్తాయి పద్మ గారు

    26042016 06:30 IST

    ~శ్రీ~

    ReplyDelete
  3. ఇద్దరం వేరుకాలేక రాతిరి కౌగిలిలో ఏకమైతే...
    అంతా పవిత్రత మరికొంత చెప్పలేని నిశ్చింత!అధ్భుతం

    ReplyDelete
  4. ఇద్దరి కలయిక కేక...

    ReplyDelete
  5. మీ నుంచి మరిన్ని ఇలాంటి మధురమైన కవితలు కోరుకుంటున్నాము.

    ReplyDelete
  6. ప్రేమించడంలో కొంత ఆనందం మరికొంత అశాంతి

    ReplyDelete
  7. ఛా..చాల్లే ఇంకెక్కడ ఇద్దరూ అన్నిటిలో ఒకటైతేను.
    అందమైన ఆవిష్కరణ

    ReplyDelete
  8. Simply Superb Expression

    ReplyDelete
  9. లాభనష్టాలు తులాభారం వేసి ఇద్దరూ నిర్ణయానికి రండి. అప్పుడు ఇద్దరూ ఇద్దరైనా ఒకటే :-)

    ReplyDelete
  10. తెలియని బంధమై పెనవేసుకోబోతే...
    చిన్నిగాయాల హింస మరికొంత మీమాంస!
    అందమైన అనుభూతి కలిగించారు.

    ReplyDelete
  11. నాణెం బొమ్మా బొరుసులా ప్రేమ రెండు వైపులా చూపారు.

    ReplyDelete
  12. అంతా పవిత్రత మరికొంత చెప్పలేని నిశ్చింత
    కొంత అనురాగం మరికొంత తప్పని అసహనం
    మీ సొంతం

    ReplyDelete

  13. చిన్నిగాయాల హింస మరికొంత మీమాంస!
    కొంత ఇష్టం మరికొంత అలవికానేదో అయిష్టం!
    అంతా పవిత్రత మరికొంత చెప్పలేని నిశ్చింత!
    ద్వంధ ప్రవర్తన చక్కగా చెప్పారు.

    ReplyDelete
  14. మీ కవితలు దేనికి అదే ప్రత్యేకం.
    చిత్రం ఎంపిక ఎప్పటిలాగే కనువిందు

    ReplyDelete
  15. ఇద్దరు ఒక్కటయ్యే వేళ...అంటూ సాంగ్ ఏదో సింగుతారు అనుకుంటే ఏంటండి కొంచెం ఇష్టం కొంచెం కష్టం టైపులో చెప్పారు :-)

    ReplyDelete
  16. చిన్నిగాయాల హింస మరికొంత మీమాంస..చాలా రోజులకి మళ్ళీ విన్నాను మీమాంస అనే పదం. బాగుంది జీ

    ReplyDelete
  17. మరో రసరమ్య కావ్యం

    ReplyDelete
  18. ప్రేమలో ఇద్దరూ ఎంజాయ్

    ReplyDelete
  19. ఇద్దరం వేరుకాలేక రాతిరి కౌగిలిలో ఏకమైతే...
    అంతా పవిత్రత మరికొంత చెప్పలేని నిశ్చింత! అధ్భుతః

    ReplyDelete
  20. VERY VERY NICE LINES DEEDI

    ReplyDelete