జవాబు లేని

నేను అలిగినానని నీవు కూడా అలిగితే
అలక అలిగి మటుమాయం అయిపోయె

నీవు నాతో లేవని నేను దూరం జరిగితే
ఎడబాటు ఎందుకో ఎర్రి ముఖమేసి ఎగిరె

నా చిన్నమాటల్లో లేని అర్థాలు నీవెతికితే  
అర్థానికే నీ మనసు అర్థమవక ఆశ్చర్యపడె

నాలో దుఃఖాన్ని చూసిన నీ కళ్ళు నీరిడితే  
దుఃఖానికే ఈర్ష్యపుట్టి ఎక్కడికో ఉడాయించె

నీ అహం నాలో దాగిన అహాన్ని రెచ్చగొడితే
దయకే తిక్కరేగి నీ నాలోని క్షమని తిట్టిపోసె

నా మౌనం చూసి నీవు మూతి ముడవబోతే
మౌనమే మంత్రమేదో వేసినట్లు మాట్లాడసాగె

నీవు జీవితానికి నిర్వచనం ఇదాని నన్నడిగితే
జీవితమే సందిగ్ధ సలపరమని చల్లగా జారుకునె

38 comments:

  1. చాలా రోజులకి వ్రాశారు
    వేసవి శెలవు తీసుకున్నారు
    అడిగితే జవాబు ఇవ్వరు

    ReplyDelete
    Replies
    1. మరీ జవాబు ఇవ్వను అని నిష్టూరమా :-)

      Delete
  2. జీవితాన్ని కెవ్వున అరిపించారు.

    ReplyDelete
    Replies
    1. లేదండీ నేనే అరిచినట్లున్నాను :-)

      Delete
  3. జవాబు లేని జీవితానికి ఏం వ్రాయడం అని మైండ్ పిచ్చిదాయె ☺

    ReplyDelete
    Replies
    1. మహీ పిచ్చి మాకు ఎక్కించారు మీ కమెంట్ తో

      Delete
  4. అర్థమై అర్థం కానట్లుంది.

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడు అర్థం విడమరచడం అవసరమా!?:-)

      Delete
  5. Goo picture with golden words.

    ReplyDelete
  6. కామెంట్ కట్టబెట్టాలంటే కన్నీళ్ళే కరిగి కాగితమే కానరాక కదలిపోయే..?
    సమాధానం సంధించబోతే సరిగాలేనని సక్కగా సెంటెన్స్ సైలెంటాయే..?
    రవ్వంతైనా రిప్లై రాయబోతే రాతలకి రంగుల రామచిలుక* రుసరుసలాడే..?


    *ప్రాసకోసం వాడవలసివచ్చింది పద్మ గారు..

    ~శ్రీ~
    శేషశయన శేశగిరివాస

    ReplyDelete
    Replies
    1. కన్నీళ్ళతో కమెంట్...అంత అవసరం ఉందంటారా :-)

      Delete
  7. నేను అలిగానని మీరు అలిగితే...ఇంతే సంగతులు అలమాకండి

    ReplyDelete
    Replies
    1. మనలో మనకి అలకలు ఎందుకులెండి :-)

      Delete
  8. అయ్యో మీరే తెలియదంటే ఎలాగండి పద్మగారు.

    ReplyDelete
    Replies
    1. అన్నీ నాకే తెలుసంటే బాగుండదేమో :-)

      Delete
  9. ాగా చెప్పారు జీవితం గురించి

    ReplyDelete
    Replies
    1. ఏదో తెలిసింది మీ ముందు ఇలా :-)

      Delete
  10. బాగుంది కానీ ఎక్కడో అసంతృప్తి.

    ReplyDelete
    Replies
    1. అసంతృప్తి ఎక్కడో తెలీదు :-)

      Delete
  11. నా చిన్నమాటల్లో లేని అర్థాలు నీవెతికితే
    అర్థానికే నీ మనసు అర్థమవక ఆశ్చర్యపడె, ఎంతో చిక్కని అర్థం చెప్పారు

    ReplyDelete
    Replies
    1. హమ్మయ్య...నచ్చిందా మీకు

      Delete
  12. అర్థం కాని జీవితం అవసరం అంటారా మరి మీరు

    ReplyDelete
    Replies
    1. అలాగని ఏం చేయగలం చెప్పండి ;-)

      Delete
  13. నీ అహం నాలో దాగిన అహాన్ని రెచ్చగొట్టనేల అందరిలో ఉన్నది ✓

    ReplyDelete
    Replies
    1. ఆ అహాన్ని అణగార్చుకుంటే పోలే :-)

      Delete
  14. చిత్రం బాగుంది
    కవిత అంతగా ననచ్చలేదు.

    ReplyDelete
    Replies
    1. ఈసారి నచ్చేలా రాస్తానులెండి :-)

      Delete
  15. పద్మ అసలు ఏంటో ఈమధ్య ఏం అర్థం అవ్వడంలేదు.

    ReplyDelete
    Replies
    1. సంధ్యగారూ లైఫ్ అర్థం కాలేదు అనకుండా నేనే అర్థంకాలేదు అంటే ఎలా చెప్పండి :-)

      Delete
  16. నాక్కూడా ఏమీ తెలియకుంది
    అంతా అయోమయం అంధకారం

    ReplyDelete
    Replies
    1. ఏమిటో ఇంత భారం :-)

      Delete
  17. ఇంత కఠోరంగా తెలియదు లేదు అని చెబితే తట్టుకోలేము.

    ReplyDelete
    Replies
    1. కఠోరమా...అదేంటండి.

      Delete
  18. ఏమి ప్రశ్నలో
    ఏం జవాబులో
    చిత్రం సుందరం

    ReplyDelete
    Replies
    1. నేను జవాబు లేదంటే మీరూ తెలియదంటూ సై అంటారా :-)

      Delete