మార్పు సహజం..

కాలం మార్పు చెంది మనల్ని మారుస్తుంది..
దానికి అనుగుణంగా మనుషులు మారుతున్నారు
అవసరానికి తగ్గట్టుగా సంబంధాల శైలీ మారుతుంది!
నేనూ నెమ్మదిగా నేర్చుకోవాలనుకుంటున్నాను..
అవసరానికి తగ్గట్టు అవలంభించే ఆచారాలను
అంతలో అలవాటు కాని మనసు నన్ను కాదని
అర్థాలు వెతికే అసూయను నా నుండి వెలివేస్తుంది!
స్వలాభం లోకం తీరుతెన్నులనే మార్చేసింది..
ఎలా ఉన్నారని పలుకరించబోతే, అవసరమాంది
అలసిన తనువుని స్వయంగా మోయాలి తప్పదు
ఎందుకంటే ఊపిరి ఉంటే వేరొకరు భుజం పై మొయ్యరు!
సేద తీరాలని మది కోరికలన్నింటినీ కట్టిపడేసింది..
అది చూసి లోకం జీవితంలో ఎదిగాను అనుకుంటుంది
అయినా ఎవరి విఫలయత్నాలు ఎవరికీ అక్కర్లేదు
విజయం వరిస్తే పడ్డ ప్రయాస ప్రయత్నం గూర్చి పలుకరు
ఓడితే మాత్రం మూగవారి చర్చ సైతం శిఖరాన్ని చేరుతుంది!

78 comments:

  1. కాలం ఎంత మారినా కొందరు అంటే మనం ఎంత మారాలి అనుకున్నా మారలేము. అందుకే మారే ప్రయ్తనం చేయకపోవడమే ఉత్తమం. మీరు వ్యక్త పరచిన శైలి అద్భుతం. చిత్రం కూడా చక్కగా నప్పింది. అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. మారకుండా అలాగే ఉండిపోమంటే ఎలాగండి :-)thank you.

      Delete
  2. మనషుల మనసులు కాలానుగుణంగా మారుతు ఉంటాయి కాని మానవత్వమనే తాయిలం మనిషిలో ఉన్నంత కాలం ఔనత్యానికి కొదవ ఉండదు పద్మ గారు.

    కఠినాతి కఠినమైన జివితం చెప్పె నీతి ఏమిటంటే బ్రతికున్ననాళ్ళు ఆడిపోసుకునే వారు కాకతాళియమో యాదృచికమో హటాత్తుగా ఎవరైన కాలం చేస్తే మంచి మనిషిని కోల్పోయాం అంటారు.. బహుశ మనిషి బ్రతికున్నపుడే ఆ మాట అంటే ఆ పలకులకి విలువ ఉండేది కదా.. క్షమించాలి.. ఏదో భావప్రకటన కొలది ఈ ఉదాహరణ ఇచ్చాను..

    నిజమే కాలం మారుతోంది.. మనుషుల మనుగడ మానవత్వమే కొరవడుతోంది.. కొన్ని మార్పులు మంచికి దారితీస్తే మరికొన్ని మార్పులు వ్యథను మిగులుస్తున్నాయి..

    దైవిచ్ఛికం.. దైవాధినం..

    కొంత మంది మంచిని నలుగురికి పంచి సంతోషాన్ని మూటగట్టుకుంటారు..

    సర్వే జనాః సుఖినో భవంతు

    ~శ్రీ~
    వైకుంటవాస వైష్ణవిప్రియ

    ReplyDelete
    Replies
    1. ఎలా ఉన్నారని పలుకరించబోతే, అవసరమాంది..

      కాలం మారుతోందని హెచ్చరించే అతి సున్నితమైన వాక్యం మీ కలము నుండి..


      ఈ సరదా కవిత ఋతుపవనాలపై ఈ కవితలో భావపు పర్యవసానాలు తెలియజెస్తాయని అనుకుంటు.. కాస్త భయానకంగా అనిపించ వచ్చు కాని నవ్వులు కూడా ఉన్నాయందులో గమనించండి పద్మగారు:

      మశకాల అలికిడికి నిదుర భగ్నమయ్యింది
      ఏవో భావోద్వేగాలు ఇలా అలుముకోగా
      ఉలికిపడి లేచాను తత్తరపాటుగా బెదురుగా
      ఎక్కడో ఒక వేణుగానం వెనువెంటే అందియల ఝల్లు
      గుండె వేగం పుంజుకుంది.. ఆ లయలో లీనమౌతు
      నిశిరాతిరి వెన్నెల కరువయ్యి కాస్త అమవస కారు చీకటాయే
      అంతలోనే ఉరుములు పెళపెళమంటు గర్జించి చినుకులాయే
      ఆ చినుకు తడిలో భారంగా పాదం కదుపుతు
      కన్నీళ్ళను ఆ అశనిపాతపు మెఱుపుకు కానుకిస్తు
      కదిలా..ఓ నదిలా.. నిలువెల్ల తడుస్తు రేయిలో
      గాలి భీకరమాయే కొండకోన వంత పాడే వేళలో
      చలి చివ్వుకుమంటుంటే గొంతు తడి ఆరిపోయే
      మారు మాటరాకా మూగబోయే కీచురాళ్ళ శబ్దానికి

      14 జూన్ 2016 00:20

      Delete
    2. మూగవారి చర్చ శిఖరాన్ని తాకుతుంది:

      కొంత మందికి అమాయకులుగా కనిపిస్తే చాలు.. వారిని ఏ రకంగా మభ్య పెట్టాలి.. వారు సంతోషంగా ఉంటే ఈర్శ్య అసూయ తారా స్థాయికి చేరుకుంటాయి.. అటువంటివారు వారి దాష్టికానికి బానిసలుగా మారి ఇటు వారి జీవితంలోను వారి చుట్టు ఉన్న వారి జీవితంలో మనఃశాంతి అనేది మిగలకుండా చేస్తారు.. అటువంటివారి పై జాలిపడాలో ఆ ఆలోచనలను రేకేత్తించే వారి మానసిక అపరిపక్వతపై నిందలు వేయాలో అర్దం కాదు పద్మ గారు.

      సంఘంలో సమాజంలో ఇటువంటివారు మార్పును తిరస్కరించటమే గాక ఎదుటివారి మనోభావాలను దెబ్బ తీస్తుంటారు తస్మాత్ జాగ్రత అని చెప్పారని విశ్లేషించాను..

      నిజంగా అలాంటి వారు నూటికి ఇరవై మంది ఉంటారనటంలో సందేహం లేదనిపిస్తుంది. ఏ మార్పైనా సహేతుకంగా ఉంటే ఆ మార్పు ఇతరులను కష్ట పెట్టనంత వరకు ఆదర్శం శిరోధార్యం అన్యథ శిరోభారం..

      Delete
    3. ఈ కవితలో భావం వలన ఒకటికి మించి వ్యాఖ్యాలు నమోదు చేశాను.. తప్పులేమైన ఉంటే మన్నించండి పద్మగారు.. ఎదుటివారు ఎవరైన సరే బాగుండాలని కోరుకూనే వారిలో ఒక్కడిని.. !

      Delete
    4. Sridhar Bukya well written-Harinath

      Delete
    5. Thank you Harinath Sir.

      Delete
    6. మీ మాతృభాష తెలుగు కాకపోయినా చక్కగా ఏర్చి కూర్చి రాస్తారు. మీ ఎంతో అభిమానంతో సమయాన్ని బ్లాగ్ కోసం కేటాయిస్తున్నందుకు ధన్యవాలండి. ఇంతకు మించి ఏం రాయగలను చెప్పండి. :-)

      Delete
  3. ఊపిరి ఉంటే వేరొకరు భుజం పై మొయ్యరు..నిజమే కదా చనిపోతే శవాన్ని భుజాలపై మోసుకుని వెళతారు. భావాన్ని పండించారు.

    ReplyDelete
    Replies
    1. మెచ్చిన మీకు ధన్యవాదాలండి నందుగారు.

      Delete
  4. సేద తీరాలని మది కోరికలన్నింటినీ కట్టిపడేసింది..
    అది చూసి లోకం జీవితంలో ఎదిగాను అనుకుంటుంది,లోకం ఎప్పుడూ మన గురించి తప్పుగానే అనుకుంటుంది అని చెబుతున్నారా పద్మార్పిత

    ReplyDelete
    Replies
    1. ఒప్పుని ప్రశంసించకపోయినా తప్పుని మాత్రం ఖచ్చితంగా ఎత్తి చూపుతుంది అని నా భావం :-)

      Delete
  5. big namaste to your realistic poetry padmaji

    ReplyDelete
  6. నేనూ నెమ్మదిగా నేర్చుకోవాలనుకుంటున్నాను..అనవసర ప్రయత్నం అని చెప్పకనే చెప్పి కళ్ళు తెరిపించినారు. పెయింటింగ్ కనులను కట్టిపడేసింది.

    ReplyDelete
    Replies
    1. ప్రయ్త్నించనిదే ఏదీ సాధ్యంకాదు, అలాంటప్పుడు వద్దు అని ఎందుకు అంటాను చెప్పండి :-)

      Delete
  7. శ్రీధర్ బాగుంది మీరు వ్రాసిన వ్యాఖ్యలు.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యు నయనిగారు.. బహుకాల దర్శనం.. బాగున్నారా..?

      Delete
  8. మనిషిగా ముందు మనం మారి లోకాన్ని మార్చే ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. మరో ఆలోచనాపరమైన పోస్టు.

    ReplyDelete
    Replies
    1. మారాలి అనుకుంటాము, కాని అందరికీ అది సాధ్య పడదేమోనండి :-)

      Delete
  9. మార్పుకు అనుగుణంగా సాగుతూ సాహాసం చేయాలి ☺

    ReplyDelete
    Replies
    1. అంటే మార్పు సాహసం వంటిది అంటారా ;-)

      Delete
  10. నేటికాలం తీరుతెన్నులకి దర్పణం నీ కవిత. అయ్యో పాపం అని అన్నామంటే అంటుకుపోతారేమోనన్న భయంతో మనిషి నేడు బ్రతుకుతున్నారు. అవసరాలకి అనుగుణంతో ఆచారవ్యవహారాలు మారిపోతున్నాయి అని చక్కగా వ్రాశావు. అభినందనలు ఆశ్శిస్సులు-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. నిజమే గతకాలం అనుభవాలసారం మీరు రాసినవి. ధన్యవాదాలండి _/\_

      Delete
  11. మార్పు సహజం ఎలా అవుతుందండి
    మనిషి మారాలి అనుకుంటే మారవచ్చు వద్దనుకుంటే ఉండిపోవచ్చు...
    అవునంటారా కాదంటారా

    ReplyDelete
    Replies
    1. అమృతగారు..
      మీ కామెంట్ చూశాకా నాకు ఈ పాట గుర్తుకు వచ్చింది:


      వేషము మార్చెనూ హొయి
      భాషను మార్చెనూ హొయి
      మోసము నేర్చెనూ అసలు తానే మారెనూ
      అయినా మనిషి మారలేదూ
      ఆతని మమత తీరలేదు
      మనిషి మారలేదూ
      ఆతని మమత తీరలేదు

      క్రూరమృగమ్ముల కోరలు తీసెను
      ఘోరారణ్యములాక్రమించెను
      కౄరమృగమ్ముల కోరలు తీసెను
      ఘోరారణ్యములాక్రమించెను
      హిమాలయముపై జెండా పాతెను
      హిమాలయముపై జెండా పాతెను
      ఆకాశంలొ షికారు చేసెను
      అయినా మనిషి మారలేదూ
      ఆతని కాంక్ష తీరలేదు

      పిడికిలి మించని హృదయములో
      కడలిని మించిన ఆశలు దాచెను
      పిడికిలి మించని హృదయములో
      కడలిని మించిన ఆశలు దాచెను
      వేదికలెక్కెను వాదము చేసెను
      వేదికలెక్కెను వాదము చేసెను
      త్యాగమె మేలని బోధలు చేసెను
      ఐనా మనిషి మారలేదూ
      ఆతని బాధ తీరలేదు
      వేషము మార్చెను
      భాషను మార్చెను
      మోసము నేర్చెను
      తలలే మార్చెను
      ఐనా మనిషి మారలేదూ
      ఆతని మమత తీరలేదు

      Delete
    2. చాలా మంచి పాటను గుర్తుచేశారు .త్యాంక్యూ అండి

      Delete
    3. వెల్కం అమృతవల్లి గారు..

      Delete
    4. నాకు ఇష్టం ఈ పాట.

      Delete
    5. ఆపాత మధురాలు ఎపుడు ఎవర్ గ్రీన్ మధు సర్..
      ఇప్పటి ఈ-కాలం లో ఇటువంటి పాటలు చాలా అరుదు.. ఎవరో అన్నట్టు సన్నాయి మేళాలు సుప్రభాతాలన్ని ఆన్ లైన్ ఐపోయాయి.. చేదు నిజం కాని జీర్ణించుకోక తప్పదు. ధన్యవాదాలు

      Delete
    6. అమృతగారు అవును సహజమే మార్పు.
      ఆ మార్పు మనకి నచ్చినా నచ్చ్కపోయినా మారడం మాత్రం ఖచ్చితం కదా :-)
      Sridharji భలే మంచి పాటను అందించారు.

      Delete
    7. అక్షరాలతో రాతలేకాదు పాటలూ వ్రాసి అలరింపజేస్తున్నారు. కొనసాగించండి.

      Delete
    8. మంచి పాటను.. మంచి మాటను.. మంచి స్నేహాన్ని.. అమూల్యమైన బంధాన్ని కడదాకా ఎవరు మరువలేరు ఆకాంక్ష గారు..

      కన్నులు పలికే భాష కలలైతే
      పెదవులు పలికే భాష నవ్వవును

      కలత చెందితే ఆ కన్నులే పలికే భాష కు
      మాటైన మూగదై మౌనమే మిగలదా..

      నేను రెండు పాటలు మూడు ఫిక్షన్ కథలు మాత్రమే వ్రాసాను ఆకాంక్ష గాలు..

      అమృతగారి వ్యాఖ్యను చూసినపుడు టక్కుమని గుర్తుకొచ్చింది గుండమ్మ.. ఆమే కథలో ని పాటే అది.. అలనాటి ఆపాత మధురం.. ఈ నాడు పలికేనా మరి అలాంటి సుస్వర సరాగం..

      Delete
  12. ఎవరెట్లా మారినా పోయం అదిరింది.
    బొమ్మ ఇంకా మస్తు బాగుంది

    ReplyDelete
    Replies
    1. వామ్మో మీరు గిట్లంటేనే జర భయమేస్తది. :-)

      Delete
  13. అధ్భుతంగా రాసిన మీకు అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ యోహంథ్

      Delete
  14. అలవాటు కాని మనసు నన్ను కాదని
    అర్థాలు వెతికే అసూయను నా నుండి వెలివేస్తుంది!ఇదే నీ ప్రత్యేకత అందుకే అందరి మనసులు దోచేస్తుంటావు.

    ReplyDelete
    Replies
    1. ప్రత్యేకతని మీరు అంటున్నారు
      కొందరు పొగరు, మరి కొందరు పైత్యమంటున్నారు :-)

      Delete
  15. మీ అందమైన అక్షరాలు
    మీ భావాలకు, చిత్రాలకు సలాం
    GREAT POEM

    ReplyDelete
  16. తనువుని స్వయంగా మోయాలి ఊపిరి ఉంటే వేరొకరు భుజం పై మొయ్యరు..నిజమే బ్రతికి ఉన్నప్పుడు పట్టించుకోనివారు పిండదానాలు బాగా చేస్తారు. చక్కని కవితను అందించారు!

    ReplyDelete
    Replies
    1. అంతే కదండి...బ్రతికి ఉన్నప్పుడు భుజాలపై ఎవరూ మోయరని అలా :-)thank you.

      Delete
  17. ఈమాటు బొమ్మలే నా మొదటి మార్కులు, కవిత నచ్చలేదని కాదండి వేదాంతంతో విషాదంగా అనిపించి జీవిస్తున్నది చాలు కాసేపు కవితల్లో అయినా నవ్వుకుంటే బాగుంటుందని :-)

    ReplyDelete
    Replies
    1. :-) బొమ్మకి మార్కులు వేసి, నన్ను నవ్వమంతే ఎలా చెప్పండి :-)

      Delete
  18. విజయం వరిస్తే పడ్డ ప్రయాస ప్రయత్నం గూర్చి పలుకరు
    ఓడితే మాత్రం మూగవారి చర్చ సైతం శిఖరాన్ని చేరుతుంది
    నిజం ఓడితే అందరికీ లోకువే. పెయింట్ చాలా బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. ఇది నాకు అనుభవమేనండి.థ్యాంక్యూ.

      Delete
  19. ఏమైనా ఆశలు తీరలేదా...

    ReplyDelete
    Replies
    1. తీరనివే ఆశలు అంటే కదా మహీ...

      Delete
  20. ఇది చదివి ఆశలు లేకుండా బ్రతకు అనరు కదూ ☺

    ReplyDelete
    Replies
    1. ఆశలు లేకుండా బ్రతకమని అనలేను ఎందుకంటే నాకు బోలెడన్ని ఆశలు :-)

      Delete
  21. Replies
    1. thanks you. try to read & understand the poem Payal :-)

      Delete
  22. No sad poems.
    Lets enjoy the life.

    ReplyDelete
    Replies
    1. Yes you can enjoy life :-)
      don't take anything to heart.

      Delete
  23. మరిన్ని బలమై పదాలతూటాలు గుచ్చారు గుండెల్లోకి.

    ReplyDelete
    Replies
    1. తూటాలు మీవేనా లేక...

      Delete
  24. పద్మార్పిత గారు యేది చెప్పినా ఒక అత్యున్నత శిఖరం నేలకు ఒదిగి మంచులా పారి దేశాదేశాల్ని పావనం చేసినట్లుగా ఉంటుంది. ఎంతటి ఆలోచినాత్మక కవిత ఇది.... సలాం! మేడం....

    ReplyDelete
    Replies
    1. మీరు మరీ ఇంతలా పొగిడితే కరిపోతానండోయ్...అసలే మంచిశిఖరాన్ని అన్నారు :-) ధన్యోస్మి.

      Delete
  25. http://padmarpitafans.blogspot.in/2016/06/blog-post.html

    ReplyDelete
    Replies
    1. Thank you very much for publishing.

      Hari Raamaachyuta Govinda
      Sri Radha Krishna Mukunda

      ~!~ Sri ~!~

      Delete
    2. thanks to both of you. _/\_

      Delete
  26. ..
    అవసరానికి తగ్గట్టు అవలంభించే ఆచారాలను...నీ మార్క్ కవిత్వం చక్కని చిత్రం.

    ReplyDelete
    Replies
    1. ఆచారాలు కూడా అనుగుణంగా మార్చేస్తున్నారని అలా :-) thank you.

      Delete
  27. ప్రతీ పంక్తీ జీవితానికి దగ్గరగా ఉన్నాయి.
    చిత్రము చూడ ముచ్చట.Congrats Padmarpita

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ నందిని

      Delete
  28. మరోసారి గుర్తు చేస్తున్నాము మేడంజీ
    మార్పు సహజం అని రాసి రాసి రాయిలా మారిపోకండి.

    ReplyDelete
    Replies
    1. హెచ్చరికలా ఉంది :-) థ్యాంక్యూ

      Delete
  29. ఇంతకీ మార్పు మనసుకో మనిషికో లేక మర్మమేం తెలియని కాలానిదో చెప్పలేదమ్మో :-)

    ReplyDelete
    Replies
    1. మర్మం తెలిసి తెలియని కాలానికి ఎదురేగే మనిషిలోని మచ్చలేని మనసుకని నేను అనుకుంటున్నా ఆకాంక్ష గారు..

      నాకు తెలుసు మీ మనసు ఇపుడే సీన్ మెదులుతుందో..

      "అతడు" లో హాస్యబ్రహ్మ పద్మశ్రీ డా. బ్రహ్మానందం గారే కదా.. అలా ఐతే నవ్వును ఆపుకోకండి

      ~శ్రీ~

      Delete
    2. కాలం క్రమేపి మనిషిని మారేలా చేస్తుంది అనుకుంటున్నాను :-)

      Delete