ఎలా చెప్పేది!ఏమి చెప్పను...ఎలాగ చెప్పను
నీకు నాకు ఉన్న బంధం ఏమిటంటే
ఇదేనంటూ ఏవేవి చూపించను!?
గుండెలయ గీతానివి...జీవన సంగీతానివి
కాంతి పుంజానివి...తాజాగాలి తెమ్మరవని
నా ఉత్తేజ ఉల్లాస ఉత్ప్రేరకాలు నువ్వేనని
చెప్పే సాక్ష్యాలు ఎక్కడ నుంచి తీసుకురాను!
నా సంబరాల నాంది నీవని నిరూపించలేని నేను
ప్రేమకి ప్రతిబింబమైనావని..ఎలా నమ్మించను!?
కళ్ళ నిండా నీవే...కలలలో నీవేనని
నా శ్వాసలో...నా నిరీక్షణ నిట్టూర్పు నీవేనని
రేయిపగలు ప్రతిపదం నీవే నిండి ఉన్నావని   
నా ఆలోచనల్లో అంతరాత్మలో అంతర్లీనమైనావని
చెప్పగలనే కానీ ఏ విధంగా రూపాన్ని ఇవ్వను!?
అందుకే ఎందుకు ఎలా ఏమిటంటే చెప్పలేను..

21 comments:

 1. మాటల్లో చెప్పలేనిది
  చేష్టల్లో చేసి చూపవచ్చు
  చిత్రం అతిసుందరము..

  ReplyDelete
 2. మౌనం దాల్చిన మదిలో ఎన్నో భావగర్బిత ఆలోచనలు
  మాటరాక మూగబోయి కనులలో కానవచ్చేనా భాష్పాలు
  ఋజువు చేయగా లేవసలు ఆనవాలు
  పదాలైనా కవితలా ఇమిడితేగా అసలు

  మనసు చాలా విచిత్రం.. భావోద్వేగాల కలగాపులగం
  బాగుంది మీ కవితాక్షరి పద్మగారు.. చాలా చక్కగా మనసుని ఆవిష్కృతం చేశారు.

  ~శ్రీ~

  ReplyDelete
  Replies
  1. మాటరాకా మూగబోయిన వాసంతమా.. మరలి రా.. కోయిల ఏదురుచుస్తోంది..నీవు లేక పలుకలేనంటున్నది..! చీకటి తెరలా అలుముకున్న నీలి మేఘమా.. తరలి రా.. చాతకం ఏదురుచుస్తోంది.. నీవు లేక నీటిబొట్టు ముట్టుకోనంటున్నది..!


   ~శ్రీ~

   Delete
  2. if the one whom we admire most, leave us in solitude, the heartache is unbearable..

   ~sri~

   ఇన్ని రకాల ఆలోచనలు కూడా మీ కవిత ద్వారా చెప్పుకొవచ్చు పద్మ గారు..

   అంటారు కదా.. సంతోషాన్ని పంచుకునే వారు లోకం లో చాలా మంది ఉంటారని కాని బాధను పంచుకుని ధైర్యాన్ని కూడబెట్టేవారు ఈ కలియుగానా కరువైపోయారు..

   సంతోషానికి వర్షన్ మీ కవితైతే బాధకు తార్కాణం ఈ మూడు ప్రయోగాత్మక కమెంట్లు పద్మ గారు..
   20140517-20160705 ←

   ज़ख्म तो होना ही था किसी न किसी एक दिन
   मगर न कभी सोचा कि इतना गहरा घाव होगा
   चारों तरफ़ सन्नाटा छाया है आवाज़ का नाम नहीं
   समझ न पाये तो सात सौ अस्सी दिन कुछ कम नहीं

   © 2014-2016

   ~श्री~
   रामान्जनेयम् प्रणमाम्यहम्

   Delete
  3. رمضان مبارک
   شریدر
   ٠٧ جولائی ٢٠١٦

   Delete
 3. మౌనాన్ని అర్ధం చేసుకుంటారు ఏంచెప్పకుండానే ప్రేమికులు అంటారు ☺

  ReplyDelete
 4. చెప్పవలసింది అంతా చెప్పి ఏం తెలియనట్లు అడగడం స్టైల్ బాగుంది .

  ReplyDelete
 5. సర్వం అని చెప్పినాక ఇక చెప్పడానికి ఏం మిగిలిఉంది :-)

  ReplyDelete
 6. ఉత్తేజ ఉల్లాస ఉత్ప్రేరకాలు నువ్వేనని..super

  ReplyDelete
 7. కష్టం----చెప్పకుంటే ఢుషుం

  ReplyDelete
 8. బాగారాసారు.

  ReplyDelete
 9. ంతా చెప్పారు అదే వ్రాసినారు ఇంక చెప్పడానికి ఏమి మిగిలింది

  ReplyDelete
 10. చెప్పడానికి మిగిలింది ఏంటి చెప్మా:-)

  ReplyDelete
 11. చెప్పకనే చెప్పిన ప్రేమ పర్వం.

  ReplyDelete
 12. ఏమని కమెంట్ వ్రాసేది?

  ReplyDelete
 13. చెప్పకూడదు అనుకోని పొరపాటుగా అన్నీ ఇక్కడ చెప్పేసారుగా ...... గుడ్ పోయెమ్ డియర్ అర్పితా...

  ReplyDelete
 14. _/\_అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు_/\_

  ReplyDelete