తపన ఎందుకో!?

ధనంతో అన్నీ కొనగలం అనుకున్నప్పుడు
శ్వాసని సాంతం కొనలేక పోవడం ఏమిటో!!
కొనలేనప్పుడు ధనం పై డాబూ దర్పమేలనో
వట్టి చేతుల్తో వెళ్ళే మనకీ ప్రాకులాటెందుకో!?

అందమైన యవ్వనమే ఆకర్షణ అయినప్పుడు
చివరికి జీవితం అస్తిపంజరం అవ్వడం ఏమిటో!!
వంగి కృంగిపోయే దేహానికి సింగారం ఎందుకనో
మనసు స్వఛ్ఛంగా ఉంచక మూయడమెందుకో!?

భగవంతుడు అందరిలో ఉన్నాడని తెలిసినప్పుడు
నిస్వార్థంగా ఎదుటివారికి సేవ చేయం అదేమిటో!!
పూజలుచేసి దీపధూపాలతో పుణ్యాన్ని కోరనేలనో
ఆకలనని విగ్రహానికి తీర్థనైవేద్యం పెట్టడమెందుకో!?

అదృష్టం హస్తరేఖల్లో నుదుటిరాతల్లో ఉన్నప్పుడు
నిముషాల్లో మారిపోయే జీవితవిన్యాసాలు ఏమిటో!!
శ్రమని నమ్ముకోక సులువైన మార్గం వెతకడమేలనో
వెలుగూచీకటి ఒకదాని వెంట ఒకటైన చింతెందుకో!?  

91 comments:

  1. Meaningful questionnaire
    Awesome Painting.
    How are you Padmarpita?
    Why delay in Posting?

    ReplyDelete
    Replies
    1. Thank you, Iam little busy Janardhansaab.

      Delete
  2. కుశలమా నేస్తం? చిత్రం అధ్భుతం, ప్రశ్నాక్షరాలు ఆలోచించవలసిన విధంగా అల్లిన నీ నైపుణ్యం అభినందనీయం.

    ReplyDelete
    Replies

    1. కుశలమే...నా ప్రశ్నాక్షరాలని మెచ్చిన మీకు ధన్యవాదాలు.

      Delete
  3. గిట్ల మాయమై మమ్మల్ని పరేషాచేస్తివి
    గిప్పుడు ప్రశ్నల్తో మరింత పరేషాన్ కమ్మంటే ఎట్లమ్మో
    మొత్తానికి మస్తుగ రాస్తివి పద్మార్పితమ్మో..

    ReplyDelete
    Replies
    1. నేనే పరేషాన్ ఉంటి పనిలో ఇంక మిమ్మల్ని ఏం చేస్తా... :-)

      Delete
  4. భగవంతుడు అందరిలో ఉన్నాడని తెలిసినప్పుడు
    నిస్వార్థంగా ఎదుటివారికి సేవ చేయం అదేమిటో!!
    పూజలుచేసి దీపధూపాలతో పుణ్యాన్ని కోరనేలనో?? ప్రతి మనిషిలో స్వార్ధం అన్నీ తమకు దక్కాలి అనేది కారణం.

    ReplyDelete
    Replies
    1. బాగా చెప్పారు పాషాగారు
      స్వార్థమే మూలం అని. థ్యాంక్యూ.

      Delete
  5. చిత్రం కనువిందు
    కవిత్వం ఆలోచనాజనికం
    అక్షరాలు ఆచరించి అవలంబిద్దాం☺

    ReplyDelete
    Replies
    1. అమ్మో అన్నీ ఇలా పాజిటీవ్ అయితే కష్టమేమో :-)

      Delete
  6. కొన్ని భావాలు అక్షర సత్యాలై భాసిల్లుతాయి
    కొన్ని భావాలు అక్షర సరాలై దూసుకుపోతాయి
    కొన్ని భావాలు కరిగని ప్రశ్నల సరాలు
    కొన్ని భావాలు తెలిపేను జీవిత గమకాలు

    చావనేది తథ్యమని తెలిసినా బ్రతుకుపై ఆశ ఉన్నట్టే
    కరిగిన కాలానికి కానరాని కాలానికి వర్తమానమున్నట్టే
    స్వార్థాన్ని వీడనాడి మానవత్వాన్ని పుణికిపుచ్చుకుంటే
    సమాధానాలన్ని వాటికవే మనోదర్పణానా ప్రస్ఫూటమైనట్టే

    బాగున్నారా పద్మ గారు.. బహుకాల దర్శనం..

    ~శ్రీ~

    ReplyDelete
    Replies
    1. లెస్స వాక్యాలు :-)

      Delete
    2. ధన్యోస్మి ఆకాంక్ష గారు

      Delete
    3. Belated Friendship Day Wishes to you Padma Gaaru..

      "Friends are Faithful, Relentless, Inspiring, Enthralling, Noble, Decent."

      Delete
    4. శ్రీధర్ గారు మీరు ప్రత్యేక శ్రధ్ధతో అందరికీ జవాబులు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తప్ప ఇంకే చెప్పాలో తెలియడంలేదు మిత్రమా...వందనాలు.

      Delete
    5. వీలును బట్టి జవాబులీడుతున్నాను పద్మ గారు..!

      Delete
  7. ప్రశ్నలో సమాధానం దాగుందని మీకు తెలుసు అయినా అడిగి మమ్మల్ని చైతన్యం చేయాలి అనుకున్న తీరు నచ్చింది.

    ReplyDelete
    Replies
    1. నాకు నేను చైతన్యమై మారితే చాలును కదాండి నందినీగారు. థ్యాంక్యూ.

      Delete
  8. Excellent painting. Lesson in Poetic way.

    ReplyDelete
  9. తపన ఎందుకు అంటే మనం మనుషులం, అవి మన సహజ గుణాలు అందుకే.

    ReplyDelete
    Replies
    1. అలా అనుకుంటే ఏం రాయలేను నా భావం.:-)

      Delete

  10. అదృష్టం హస్తరేఖల్లో నుదుటిరాతల్లో ఉన్నప్పుడు
    నిముషాల్లో మారిపోయే జీవితవిన్యాసాలు ఏమిటో
    చిక్కుముడి వీడితే బాగుంటుంది.

    ReplyDelete
    Replies
    1. అది తెలియకేగా ఇలా మీతో పంచుకున్నది లిపిగారు.

      Delete
  11. ఇన్నాళ్ళూ ఏమైనారు.
    మీ కవితలు లేక బోర్ కొట్టింది. ఆఫీసులో అనుకున్నాం మీగురించి.

    ReplyDelete
    Replies
    1. కాస్త పని వత్తిడండి...థ్యాంక్యూ.

      Delete
  12. ఆలస్యమైతే ఎందుకో అనుకున్నాను...మమ్ములను ఆలోచింప చేయడానికే అని చదివితే అర్థమైంది. చిత్రం కడురమ్యం అర్పిత.

    ReplyDelete
    Replies
    1. అమ్మో అంతలా ఎగేయకండి...నేను మిమ్మల్ని ప్రశ్నించడమా. :-)

      Delete
  13. అధ్భుతం కవితాచిత్రం.

    ReplyDelete
  14. అన్నీ మనసొంతం అనుకుని విర్రవీగడమే తప్ప ఏవీ మనతో రావని తేలికైన ప్రశ్నల రూపంలో జీవితాన్ని భోధించారు. చిత్రం చాలా బాగుంది మాడంజీ.

    ReplyDelete
  15. Excellent painting.
    Why mam no reply from U

    ReplyDelete
  16. అదృష్టం హస్తరేఖల్లో నుదుటిరాతల్లో ఉన్నప్పుడు
    నిముషాల్లో మారిపోయే జీవితవిన్యాసాలు వింతలు విచిత్రాలు.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ...ఈ వింతలు విఢ్యూరాల మధ్య పయనం ఎన్నాళ్ళో? :-)

      Delete
  17. మనిషి తత్వం తెలిసిన మగువవు నీవు తపన ఎందుకని ప్రశ్నిస్తుంది నీవేనా అడగాలి అనుకుని అంతలోనే కాదు అందరినీ ఆలోచించమని ఇలా వ్రాసావు అనుకుంటున్నాను అవునా పద్మార్పితా? దీవెనలతో-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. హరినాధ్ గారు ఏం తెలియని నన్ను అన్నీ తెలుసు అనడం అన్యాయమండి. మీ అభిమాన ఆశిస్సులకు ధన్యవాదాలు.

      Delete
  18. పెయింటింగ్ చాలా బాగుంది కవిత్వం ఇంకా బాగుంది ఆది శంకరాచార్యులు పునరపి జననం పునరపి మరణం అన్నట్లు వైరాగ్యం ..... కానీ చిత్రానికి కవిత్వానికీ ఎమీ పొంతన లేదే

    ReplyDelete
    Replies

    1. రమణ వామరాజు గారు

      పద్మార్పిత చిత్రాన్ని చూడ్డానికి మని కొందరు, కవితని చదవటానికి కొందరు వస్తారు :)

      జిలేబి

      Delete
    2. మనిషిలో మలినం లేని మానవత్వమే ఆంతరంగిక అందం అది ప్రస్ఫూటమై నిత్యం అలరారుతుందని కాబోలు పద్మ గారు ఆ చిత్రాన్ని పొందుపరిచారనుకుంటా రమణ వామరాజు గారు..

      Delete
    3. Ramana vamarajugariki వందనం_/\_
      ఒక స్త్రీ తన మనోభావాలని వ్యక్తం చేస్తున్నట్లు అని ఆ చిత్రం పెట్టాను. పొంతన కూర్చలేకపోయాను...అయ్యో, అయినా అన్నింటికీ మ్యాచ్ చేయడం కష్టం కదాండి. మీ అమూల్యమైన అభిప్రాయానికి మరోసారి ధన్యవాదాలండి.

      Delete
    4. జిలేబి జీ....ఎవరికి నచ్చింది వారు చూస్తారు చదువుతారు. ఎవరినీ మన భావాలతో నిర్దేశించలేమని నేను అనుకుంటాను. థ్యాంక్యూ మీ స్పందనలకు.

      Delete
  19. పూజలుచేసి దీపధూపాలతో పుణ్యాన్ని కోరనేలనో
    ఆకలనని విగ్రహానికి తీర్థనైవేద్యం పెట్టడమెందుకో!?
    మీ ప్రశ్నకు ఈ మెసేజ్ సరిపోతుంది అనుకుంటాను హా హా :)
    రాత్రి దేవుడు కల్లోకొచ్చి వాయించి పారేసాడు.
    "ఒక్కసారి మిమ్మల్ని పుట్టించిన పాపానికి ఎందుకురా రోజూ నన్ను ఇలా వేపుకుని, పీక్కొని తింటున్నారు? పడుకోనివ్వరు. ప్రశాంతంగా ఉండనివ్వరు. బాధ భరించలేక కొండలెక్కి కూర్చుంటే అక్కడికీ తోసుకుంటూ వస్తారు. ఏదో వింటున్నా కదా అని వందేసి వెయ్యేసి పిలిచిన పేర్లతోనే మళ్ళీ మళ్ళీ పిలుస్తూ, చేసిన పూజలు, భజనలే చేస్తూ, ఉన్నవీ లేనివీ కలిపి పొగుడుతూ ఎందుకురా ఇలా ఊదర కొడతారు. కనీసం ఆ పేర్లలో ఏదైనా వెరైటీ ఉందా అంటే అదీ లేదు. ఇటు తిప్పి అటు తిప్పి మా అందరికీ అవే పేర్లు... ఆవు కథ లాగా.
    ఒక్కరో ఇద్దరో అంటే పర్లేదు... కానీ ఏడు కోట్లమందిని ఎలా చూసుకుని చచ్చేది. మీ హారతులకి చూడండి మొత్తం స్వర్గం మసి, జిగురు పట్టి ఎలా నల్లగా తయారైందో. తొండాలేవో తోకలేవో తెలీక కన్ఫ్యూజ్ అయి చస్తున్నాం.
    మీకన్నా మిగతా జంతువులు ఎంత నయమో చూడండి. ఇవ్వేవీ చెయ్యకుండానే వాటి బ్రతుకేదో అవి బ్రతుకుతున్నాయి హాయిగా, నా సహాయం ఏ మాత్రం అడక్కుండా. మీ సుఖాలకంటే ఓకే... కానీ ప్రతీ చిన్న కష్టానికీ నన్నే బాధ్యుడ్ని చేస్తారు. తొక్కలో ప్రతీ దానికీ నన్నే సొల్యూషన్ చూపించమంటారు. నీకు రోగమొస్తే నేనేం చేస్తాన్రా? నీ పరీక్ష నువ్వు పాస్ కావడానికి నాకు కొబ్బరికాయ ఎందుకురా? ఆ బొట్లేంటీ... వేషాలేంటీ... గొడవేంటి? ఏం... మీకు మీరు సహాయం చేసుకోలేరా. అంత చేతగాని వాళ్ళా? అంత డిపెండెన్సీ ఏంట్రా నా బొంద. మీ అక్రమ సంపాదనలో నాకు కమీషన్ ఏంట్రా చండాలంగా...
    ఆకలితో ఉన్నవాడికి తిండి పెట్టరు కానీ నాకు మాత్రం ముడుపులు, బంగారం, వజ్రాలు, కిరీటాలు, రథాలు." ఇంకా ఏవేవో అన్నాడు కానీ గుర్తులేదు.

    ReplyDelete
    Replies
    1. గుడ్ గాడ్....అందరి కలల్లోకి వచ్చి చెబుతే బాగుండును కొందరైనా మారతారు :-)

      Delete
    2. నాథురాం గారు.. సరదాగా వ్రాస్తున్నాను ఏమనుకోమాకండి:

      మీ చాంతాడంత వ్యాఖ్యలో "అహా నా పెళ్ళంట" లో అరగుండు గోవిందం గారు కాసేపు.. "వివాహ భోజనంబు" లో మహాప్రభో అంటు దర్శనమిచ్చే కవి గారు.. సోమ మంగళ బుధ.. అంటు రాజబాబుగారి పాట.. హారతి గైకొనుమా అంటు స్వర్ణకమలంలో "సాక్షి" రంగారావుగారి పాట్లు.. ఉన్నది కాస్తా ఊడింది అంటు రమణరెడ్డి గారు.. లాస్ట్ లైన్ వచ్చేసరికి.. "మన వీరో ఓ కాకా హోటల్ కు వెళ్తాడు.. వెళ్ళి ఏమున్నాయని అడుగుతాడు అపుడు సర్వర్ దోశ ఇడ్లి ఊతప్పం కాఫి వడా ఉన్నాయంటాడు.. దోశ తెమ్మంటాడు.. అపుడు నెయ్యేసి కాల్చాలా.. కిరస్నాయిలేసి కాల్చాలా అసలు కాల్చాలా వద్దా" అనట్టు కాస్త వ్యంగ్యం.. కాస్త సమాలోచన దృష్టి తో మీరు వ్రాసారని అనుకుంటున్నా..! ఔనా సర్..!!

      Delete
    3. కనులకెదురుగా కనిపించే ప్రతి మనిషిలోగల మానవత్వపు ఛాయల్లో దేవుడు తిష్ఠ వేసుకుని ఉంటే ఎదుటివారి పలకరింపులకి సమాధానమివ్వని ఈ రోజుల్లో.. కలనైనా ఆహ్వానం పలికి నిశ్చల మనసుతో ఆరాధిస్తే అదే శ్రీరామరక్ష కాదంటారా ఆకాంక్ష గారు..

      తచ్చు అప్పులు ఉండవచ్చు టూకిటుఅ రుతారుమా కావచ్చు హను రియతో మన కాఁయి కేలేస్మత్ ఆకాంక్ష గారు..

      ~శ్రీ~
      హరి ఓం నారాయణ

      Delete


    4. నాథూరాం నాని గారు సూపర్ :)

      జిలేబి

      Delete
    5. Forwarded msg posted :)hahahaa

      Delete
    6. Whatever it is Nathuram Ji.. That comment gave multiple ways to think in the direction of the link of humanity versus divinity.

      Thank you

      Delete
    7. Excellent Question Awesome Answer Nathuramgaroo

      Delete
    8. nathooramji...super message forward chesaru. thank you.

      Delete
  20. వంగి కృంగిపోయే దేహానికి సింగారం ఎందుకనో
    మనసు స్వఛ్ఛంగా ఉంచక మూయడమెందుకో..అలాగని అలంకరించుకోకపోతే ఎవరు చూస్తారు చెప్పండి. మీరు చెప్పినట్లు మూసిన మనసుని శుద్దిచేసి చూపినా చూడరు. మనం ప్రశ్నించుకోవడం మామూలే మరల మన దారి మందే సుమా..కాదంటారా అర్పితగారు :-)

    ReplyDelete
    Replies
    1. ఒక్కోసారి దారి కఠినమైనా ప్రయాణించక తప్పదు

      జీవితం కూడా ఇంచుమించు ఇలాంటిదే కదా ఆకాంక్ష గారు..!

      Delete
    2. ఆకాంక్ష గారు...అవునంటారా కాదంతారా అని నన్నే ప్రశ్నిస్తే ఏం చెప్పను చెప్పండి. అటు ఇటు కాకుండా తలాడించడం తప్ప.

      Delete
  21. ఊపిరిని కొనడం ఎవరి తరం కాదు. మంచి కవిత మేడం

    ReplyDelete
  22. ఏమిటో...ఏలనో...ఎందుకో...తెలిస్తే దేవుళ్లము అయిపోతామేమో... 😇

    ReplyDelete
    Replies
    1. నేను ఇలా అయితేనే మీ అందరి బుర్రలు తినొచ్చు వినోద్ జీ...:-)

      Delete
  23. ప్రశ్నల పరమార్థం తెలుసుకునే లోపున జీవితం అంతమైపోవును. మీ భావఝరి మరో మెట్టు ఎక్కినట్లుంది.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ జీ...

      Delete
  24. answer sheet ready chesara madam.

    ReplyDelete
  25. Very nice poetry with photo.

    ReplyDelete
  26. వంగి కృంగిపోయే దేహానికి సింగారం ఎందుకనో
    మనసు స్వఛ్ఛంగా ఉంచక మూయడమెందుకో!?
    ఎందుకో మీరే చెప్పాలి మరొక కవితలో...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు, మీరు ఒక చాన్స్ తీసుకోవచ్చుగా రాగిణిగారు. :-)

      Delete
  27. ఏ తపన తాపత్రయం లేకపోతే సన్యాసిగా మారి తపస్సు చేసుకోక సంసారం ఎందుకు? మనిషి అన్నాక ఇలాంటివి తప్పవు పద్మ :-)

    ReplyDelete
    Replies
    1. అయితే సన్యాసినిగా మారిపొమ్మంటారా :-(

      Delete
    2. సృజన గారు.. ఏదైనా కొత్త వస్తువును గిఫ్ట్ గా ఇచ్చినపుడు దానిని అటకెక్కిస్తే.. ఏం లాభం చెప్పండి.. జీవితం కూడా ఆ భగవంతుడిచ్చిన బహుమానమే కదా.. అందుకే దానిలో కూడా అప్పుడప్పుడు నవ్వులు కన్నీళ్ళు సహజమే.. ఏదో ఒక రోజునా దేహం విడిచీ ఆత్మ కాలం చేస్తుంది.. దానిని ఆపటం ఎవరి తరం కాదుగదా.. జీవితం ఏడిపిస్తోందని చేతులెత్తేస్తే ఎలా చెప్పండి..

      సరదాగానే రాశాను.. ఎమనుకోమాకండి సృజన గారు..! మీ సృజనాత్మకత కు అభివందనాలు..

      Delete
  28. మీ బ్లాగ్ బాగుంది పద్మగారు.
    Very nice poetry.

    ReplyDelete
    Replies
    1. Thank You Hanumath Sir, For Resharing My Favourite Deity.

      Sunikethana Ramachandra Ikshwakukulatilaka Dharanidhara Harikeshava Aadipurusha Radhakrishnaaya Namaami Devam.

      Delete
    2. welcome to my blog.
      thanks for compliment.

      Delete
    3. మీ రిప్లైకి ధన్యవాదము.

      Delete
  29. డబ్బుకి విలువనిచ్చే ఆధునిక కాలంలో కుటుంబ వ్యవస్థలు విఛ్ఛిన్నం అవుతున్నా స్నేహబంధం మాత్రం ఇంకా పటిష్టంగా ఉంది సంతోషం.
    స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు పద్మ..

    ReplyDelete
    Replies
    1. స్నేహం: సఖ్యతకు నైతికతకు హితము చేకూర్చే అహంకారమెరుగని బంధం స్నేహం.

      నేను విశ్వసించే బంధాలు మూడు:

      అమ్మనాన్నల ఆప్యాయతతో కూడిన కుటుంబ బంధం..
      దైవత్వానికి మానవత్వానికి గల సత్సంబంధం..
      మనిషి అస్తిత్వానికి ఉనికికి పరోపకారాన్ని నిఃస్వార్థ మనసుతో ఔనత్యాన్ని చాటి చెబుతు వెలసిల్లే స్నేహబంధం..

      సర్వే జనాః సుఖినో భవంతు..
      బిలేటేడ్ ఫ్రెండ్షిప్ డే విషెస్ టూ ఆల్ మై వెల్ విషర్స్

      Delete
    2. మరీ వేదాంతం మీకు సూట్ కాదు సంధ్యగారు...జాలీ టైపు మీ నేచర్ :-)

      Delete
  30. స్నేహమంటే...అని నిర్వచిస్తూ మీ నుండి ఒక కవితని ఎక్స్పెక్టెడ్ పద్మార్పితగారు, ఇలా నిరాశపరచడం ఏం బాలేదు. స్నేహాన్ని సరిగ్గా నిర్వచించడం సాధ్యం కాదు రాదు అని మాత్రం అనకండి. ఎన్ని అర్థాలు చెప్పినా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది, స్నేహానికి మించిన గొప్పది ఈ లోకంలో లేదు ఉండదు. అలాంటి స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకునే రోజే ఫ్రెండ్ షిప్ డే...
    స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మీకు

    ReplyDelete
    Replies
    1. సహి బాత్ ఫర్మాయి హై ఆప్నే సాహేబ్ పాషా జి.. ఆకాశానికి భూమికి.. సూర్యునికి చంద్రునికి.. సాగరానికి ఒడ్డుకి.. వర్షానికి చకోరిపక్షికి.. మానవత్వానికి దైవత్వానికి గల అరుదైన అనితరసాధ్యమై అపురూపమై శోభిల్లే బంధమే స్నేహమన్నది..

      Delete
    2. ఒక్కరోజు విషెస్స్ తో మైత్రిని ఎందుకు గుర్తు చేసుకోవడం...ఈ దినాలు ఎందుకు అని రెండేళ్ళ క్రితం పోస్ట్ రాసినప్పటి నుండి నేను ఈ ప్రత్యేక దినాలకి దూరం దూరం మన్నించాలి పాషాజీ.....రోజూ మనందరి మైత్రీ బాగుండాలని ఆశిద్దాం కోరుకుందాం పాషాజీ... థ్యాంక్యూ

      Delete
  31. మిత్రుల దినోత్సవం శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. గన్ ట్రిగ్గర్ కి గన్ రీకాయిల్ కి ఉన్న బంధమే స్నేహమని చెబుతారనుకున్నాను మీ శైలిలో..

      బిలేటెడ్ ఫ్రెండ్షిప్ డే విషెస్ మీకు

      Delete
  32. HAPPY FRIENDSHIP DAY MY FRIEND.

    ReplyDelete
  33. తక్కెట్లో తూకం వేసి కిలో రూపాయి వంద ప్రాణాలు తూగుతున్న లోకంలో బ్రతకాలన్న తపన అందరిదీ దానికోసమే బుస్తాబు అవ్వడం బేరసారాలు జరుపడం. మంచి కవితను దానికి మించిన చిత్రాన్ని అందించారు.

    ReplyDelete
    Replies
    1. ఉచ్వాస నిఃశ్వాసల సమ్మేళనమైన ఊపిరి ఊయలలో ఇటు అటు ఊగే తోలుబొమ్మలం..మనషులం మనం మనసున్న మనషులం
      ఆశ నిరాశల నడుమ ఊగిసలాడే మనసుగల దేవుని ప్రతిరూపాలం..మనషులం మనం మనసున్న మనషులం
      సంతోషం దుఃఖం సమపాళ్ళలో పంచుకోలేకా కన్నీటికి పన్నీటిని కలిపి ఆయువు పోసుకున్న తపన తాపత్రయాల మధ్య లోలకంలా కుదురుగాలేని మనసులో ఆలోచనల ఆనవాళ్ళం.. మనషులం మనం మనసున్న మనషులం.. జీవితమనే కొద్దిపాటి ప్రయాణంలో సారథులం యాత్రికులం.. స్నేహపు బంధాలని విడువని కొండెక్కని చిరుదివ్వెలం.. మనషులం మనం మనసున్న మనషులం

      అమృతవల్లి గారు మీ కమెంట్ చూశాకా నాకు తట్టిన కవిత ఇది.

      Delete
    2. అమృతగారు....మీరు అందనంత ఎత్తులో కమెంటారు. థ్యాంక్యూ.

      Delete