మారిన ధ్యేయం!


నేనొక మైనపు ముద్దలా కరుగుతుంటే
పాచిన పనికిరాని పిండి పదార్థమంటూ
కాలానికి వేలాడకట్టి చోద్యంలా చూపితే
అసంతృప్తి ఆమ్లాన్ని మింగలేక కక్కలేక
తడికంటి దర్పణాల్ని శాశ్వితంగా మూయక
తటస్తీకరణ శక్తికావాలని కోరడం అవివేకం!


కాలాన్ని కోస్తూ ఒలికిపడుతున్న జ్ఞాపకాలు
గుండెను డోలకంలా అటుఇటు కదుపుతుంటే
ముసురు పట్టిన మస్తిష్కంలో నిండిన వేదన
విరహంతో తగువులాడి వలపునే లేపనమడుగ
కఠినమైన కారుణ్యానికి దారితెన్నులు కానరాక
ఒంటరి కుంచె వర్ణంలేని చిత్రం గీయడం విచిత్రం!


విధి వచనమెరుగనట్లు వక్రశైలిలో వివరమడుగ
సాంద్రత లోపించిన సద్గుణమే అద్దమై మెరవాలని
నిర్లిప్తత నిరాశలని శత్రువులుగా ఎంచి తూలనాడి
చిట్లిన గాయాలతో రోధిస్తున్న ఆశల్ని గుప్పిటనిడి
సొమ్మసిల్లిన ఆశయ మోమిట స్థైర్యం కుమ్మరించి
తడిసిన మైనాన్ని స్ఫటికంగా మార్చడమే ధ్యేయం!

64 comments:

  1. మానవత్వమనే చమురు ఉన్ననాళ్ళు నమ్మకమనే దీపం కొండెక్కదు.. కాలమనే ఊయలలో ఊరేగే క్షణాలన్ని ఆవిరి కాకుండా జ్ఞాపకాలై మిగిలేను మది మందిరానా..
    ఆశ అడియాశల ఆటలో ఆశ నెగ్గినా స్పష్టత తనంతట తానే తెలిపేను..
    జ్ఞాపకాలన్ని ఒక్కొక్కటిగా జాలువారుతుంటే మనసే మురిసేను..

    వామ్మో పద్మగారు.. మీ ఈ కవితలో ఎమోషన్ కట్టలు తెంచుకుంది.. ఔనా.. అక్షరం పెగలటం లేదు సుమి..

    ఆద్యంతం ఆలోచనాత్మకం..

    మనిషిలో జ్ఞాపకాలను మైనం తో పోల్చి చెప్పటం మీకే సాధ్యమయ్యిందనడంలో అతిశ్యోక్తి లేదనే చెప్తాన్నేను..

    ~శ్రీ~

    ReplyDelete
    Replies
    1. అనితరసాధ్య అక్షరశైలి:

      మైనపు ముద్ద,
      పిండి పదార్థం మనసుకి నిర్వచన
      ఒంటరి కుంచె,
      వర్ణంలేని చిత్రం భావాలకి నిర్వచన

      Delete
    2. శ్రీధర్ గారూ...బాగుంది మీరు రాసింది
      నన్ను మరీ అంతలా పొగడమాకండి...అసలే లావైపోతున్నాను :-)

      Delete
  2. మీకు అభినందన మాల కవితకు చిత్రానికి.

    ReplyDelete
  3. ఎప్పటిలాగే కవితను అలరించారు.
    చిత్రం చాలా బాగుంది మాడం.

    ReplyDelete
  4. Most beautiful narration with pic.

    ReplyDelete
  5. పదాల గారడితో కవిత మొదటి నుండి చివరి వరకూ చక్కగా వ్రాసి నీకు నువ్వు మేటి అనిపించుకున్నావు శభాష్ పద్మ.

    ReplyDelete
    Replies
    1. అమ్మో...ఏవిటండి గారడీ చేసాను అంటున్నారు :-)

      Delete
  6. మైనం నుంచి స్పటికానికి భౌతికంగా రూపాంతరం చెందడం అనేది ఒక రసాయనిక చర్య ( అది సాధ్యం అయినా/అవకపోయినా). నిజానికి పరిపక్వత చెందిన మనిషి కాలాతీతంగా మనిషితనానికి లోబడి మార్పు చెందడం అనేది వొక మానసిక చర్య. దానికి అగాదమంత అంతర్మధనం జరగాలి. విచక్షణ, విజ్ఞానం, తర్కం మాత్రమె ఉంటే సరిపోదు. ఆత్మస్థైర్యం అనే బలమైన ఆయుధం కావాలి. అది మీ కవితలో..కాదు కాదు మీలో వంద శాతం ఉంది. హ్యాట్సాఫ్ మేడం....

    ReplyDelete
    Replies
    1. మీరు వ్రాసిన చివరి వాక్యాల ఆధారంగా నేను కమెంట్ పెట్టానండి.

      Delete
    2. ఈ కవితలోని పదాలు చదువుతున్న ప్రతీసారి వివిధ విధాల్లో అనిపిస్తుంది. కవిత గురించి మితముగా ముత్యాలాంటి మాటలు వ్రాసినారు.

      Delete
    3. fans garu...చాన్నాళ్ళకి మీ రాక...నమస్కారములు _/\_
      అంటే మారలేను రూపాంతరం చెందడం రసాయనిక చర్యలు కష్టం అంటారా :-)

      Delete
  7. మైనాన్ని స్ఫటికంగా మార్చే బిజినెస్ ఎప్పుడు మొదలెట్టారు అర్పితమ్మో.... 😱😱

    ReplyDelete
    Replies
    1. ఉద్యోగంతో అసలు తీరిక లేక బాధపడుతుంటే ఇంక బిజినెస్ ఏం మొదలుపెట్టను చెప్పండి. :-)

      Delete
  8. గుండెను డోలకంలా అటుఇటు కదుపుతుంటే
    ముసురు పట్టిన మస్తిష్కంలో నిండిన వేదన
    విరహంతో తగువులాడి వలపునే లేపనమడుగ
    అస్సలు మీకు ఇలాంటి హృదయాన్ని ద్రవింపజేసే ఆలోచనలు భావాలు ఎలా వస్తాయి? చక్కటి విన్నూతన శైలి కవిత. అభినందనలు.

    ReplyDelete
  9. మెత్తగా ఉన్న మైనం గట్టిగా రాయిలా మారడం అంత సులభంగా అయ్యే ప్రక్రియ కాదు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకోవలసి వస్తుంది. అందులోనూ స్పటికం అంటున్నారు ఆలోచించుకోవలసిందే ఒకటికి వందమార్లు ☺

    ReplyDelete
    Replies
    1. ఇలా భయపెట్టకండి ఆలోచించుకోమంటూ...:-)

      Delete
  10. మీరిలా మారి మారి చివరికి ఏమైపోతారోనని కడుచింతతో ఉండ చిత్రము ఊరటనిచ్చి ఉత్సాహ పరిచింది :)

    ReplyDelete
    Replies
    1. చిన్న చిన్న మాటలకే చింతపడ్డం ఒక ఎత్తు...
      చిత్రాన్ని చూసి చెలించడం గమ్మత్తు మహీగారు :-)

      Delete

  11. మైనపు ముద్దలా కరిగి యింత చిక్కిపోయారా :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మీ అందరి అభిమానం ఎక్కువై లావైపోతుంటే చిక్కడమా చెప్పండి :-)

      Delete
  12. Don't change padma.
    Your attitude itself impressed us and its rocking my dear.

    ReplyDelete
  13. కాలాన్ని కోస్తూ ఒలికిపడుతున్న జ్ఞాపకాలు...తీపిగుర్తులు

    ReplyDelete
    Replies
    1. తీపి చేదుల కలగలుపు :-)

      Delete
  14. తడికంటి దర్పణాల్ని శాశ్వితంగా మూయక
    తటస్తీకరణ శక్తికావాలని కోరడం అవివేకం..ఏమిటి అర్పితగారు? ఇలాంటి నిరుత్సాహ పలుకులు మొదట పలికి చివరికి మారతాను అనడం బాగోలేదు. అయినా మైనంలాంటిఒవారు మీరు కారనే నా అభిప్రాయం. మేటి వ్జ్రంగా మారిపొండి:-)

    ReplyDelete
    Replies
    1. తడికన్నుల దర్పణానా ప్రతిబింబించే ప్రతిరూపాలే జ్ఞాపకాలు.. ఆ జ్ఞాపకాల ఒరవడిని తట్టుకుని నిలవగలగటానికి మనసుని గట్టిపరుచుకోవటానికి సరిపడా శక్తి సామర్ధ్యాలు కాలానుగుణంగా మారుతాయనుకుంటాం కాని ఆ పాత జ్ఞాపకాలే ప్రతి కన్నీటిబొట్టులో ప్రస్ఫూటమౌతాయి కనుక అవివేకమనే పదప్రయోగం చేసుంటారు పద్మగారు..

      కాలానుగుణంగా మార్పు చెందే మైనముకంటే కాలాతీతమై నిలిచే స్ఫటిక (క్రిస్టల్) లా మార్పు చెంది జ్ఞాపకాలను సైతం దాచుకుని తటస్థంగా ఉండాలని బెరుకుగా మారరాదని పద్మగారి ఉవాచ అనుకుంటా.. ఔనా మ్యాడమ్..

      మీ కమెంట్ లో కమెంట్ ఇచ్చాను ఏమనుకోకండి అమృత గారు.. మనిషిలా జన్మపొంది మానవత్వమే మరిచి మనసులేని మరమనిషిలా మారిన సమాజానికి నిలువెత్తు నిదర్శనం ఈ కవితలోని భావం..

      నాకైతే ఇలా అనిపించింది మొత్తం కవితను పరికించినాకా..

      Delete
    2. మీరు వ్రాసింది మరో కోణం. Nice Sridhar

      Delete
    3. బాగుంది మీరు వ్రాసిన వివరణ. మీ వివరణతో పద్మార్పితగారు ఏకీభవిస్తారు అనుకుందాము.

      Delete
    4. జీవితాన్ని ఏ కోణం నుండి చూసినా.. అందులో మంచిని మాత్రం మరువకూడదు కదా మధు సర్..

      థ్యాంక్యూ సర్ ఫర్ ది కమెంట్.. ఐ యామ్ అబ్లైజ్డ్

      Delete
    5. మీ వ్యాఖ్యకు ధన్యోస్మి అమృతవల్లి గారు..

      జీవితం ఒక్కోసారి మంచులా చల్లగా అనిపించినా.. చలనాన్ని కోల్పోతుంది.. అపుడు మనసులోతున దాగి ఉన్న జ్ఞాపకాలే ఊరటనందిస్తాయని నేను నమ్ముతాను అమృత గారు..

      శ్రీరాధాకృష్ణార్పణమస్తు

      Delete
    6. మొదలే మారిపోతాను అంటే ఎందుకు ఏమిటి అని అడుగుతారని...అలా నిరుత్సాహంగా మొదలుపెడితే మీ బోటివారు ఉత్సాహ పరుస్తారన్న ధీమాలెండి ఆకాంక్షగారు.:-)

      Delete
  15. మీరు మారిపోతారు మరి మా సంగతి ఏమిటి?
    చాలా చక్కని కవిత మరియు చిత్రము.

    ReplyDelete
    Replies
    1. ఎవరి ప్రయత్నం వారిది కాదంటారా :-)

      Delete
  16. Art is the Pictorial Representation of Thoughts which blend into a gamut of colours, where each colour represent each emotion.

    Poetry is the Classical Representation of Thoughts in Words, which are blended with Emotions.

    ReplyDelete
  17. మీరు మంచి-చెడుల్లో పరకాయ ప్రవేశం చేసి పదాలు పొందు పరిచినట్లు తోస్తుంది కవిత ఒక్కోసారి ఒకో అర్థాన్ని ఇస్తుంది. ఇలాంటి మంచి కవితలు మరిన్ని మున్ముందు చదువుతాము అని ఆశపడుతున్నాము.

    ReplyDelete
    Replies
    1. కన్నీళ్ళు విలువైనవి మధు సర్.. ఆ కన్నీరే లేకపోతే మనసులో భావోద్వేగాలకు స్పందించే తీరు తెన్నులో మార్పు ఉండదనుకుంటాను..
      ఆ కన్నీళ్ళే మనసులో వ్యథను ప్రక్షాళనం గావించి తేలిక పరుస్తాయి.. ఉద్విగ్నత ఆర్ద్రత సమపాళ్ళలో ఉన్నపుడే వయోభేదం లేకుండా మనిషి ఎదుటి మనిషి మనసుని అర్దం చేసుకోగలడు. (నాకు ఇరవై తొమ్మిది ఇపుడు మధు సర్)

      Delete
    2. మీ అందరి స్ఫూర్తి అభిమానంతో తప్పక ప్రయత్నిస్తానండి_/\_

      Delete
  18. कभी कभी ज़िन्दगी में मायूसी छा जाती है
    कई बार बिन बताये आँसू झलक उठते हैं
    मुस्कान तो दूर कभी कभी बातें भी ढ़ीली पड जाती है
    अकसर मासूमियत का माहोल चारों ओर घेर लेता है
    ऐसे में
    एक अच्छा सच्चा दोस्त की मुलाकात ज़िन्दगी को बदल देती है एक नयी मोड दिलाती है।
    कभी कभी अपने अपनों में सन्नाटा छा जाता है
    कल की यादें उभर कर मन की आईने पर छा जाती है
    बीती पल बीती बातें न जाने मीठे लम्हे बन जाते हैं
    अचरज में फ़िर ओ सावन लौट आता है अपने साथ नई उमंग ले आता है।

    नींद में न जाने पता ही नहीं चला कब आधी रात हो गयी
    बातें जो करना था शायद सुनी अनसुनी हो गयी बदलाव में कभी अपनों को भूल मत जाना नज़रंदाज़ में कभी किसी को खो मत जाना ए ज़िन्दगी तू बावली नही नादान ही अच्छी लगती हो

    ज़िन्दगी के हरेक लम्हों को आपके ब्लाग के माध्यम से पुनरंकित कर रहा हूँ पद्मा जी।

    धन्यवाद

    ReplyDelete
  19. కన్నాయి తోయి తార్ లార్ కూణి ర జత్రా దాడ్ ఓర్ విలువ మాలమ్ వేని.. పణన్ కన్నా ఊ ఛేటి వేజావచకో జన్నా లపణ్ దలేమా హర్దే ఆవుకర.. జన్నాజ్ బంచన్ ర జత్రా దాడ్ యాన్ రేవ్ణు.. కూణ్ కన్నా కూఁరచకో కేని కేతాయేని కోనిక..!

    ReplyDelete
    Replies
    1. meaning:
      in our day-to-day life, we don't realise the importance of those who are present with us. but certainly their absence is felt when they are not around. so, be happy with all those who are around you. We do not know actually the fact of what tomorrow may bring.. hence be affirmative..!

      Delete
  20. ఒడ్డు ఒడిచేరే ఒద్దికగా
    కడలి కెరటాలకి కదలిక
    కలహాల కందని కన్నుల కెదుట
    కలవరింతలన్ని కాగితానా కావ్యమాయే క్షణానా
    భాషా భేదమెరుగని భావమొకటి బహుచక్కగా భాసిల్లే

    ReplyDelete
  21. కృష్ణవేణి పుష్కరారంభం 12 to 23 Aug 2016, మరియు వరమహాలక్ష్మీ వ్రతపూజ మహోత్సవారంభపు 12 Aug 2016 ముందస్తు శుభాకాంక్షలు మీకు పద్మగారు మరియు యావన్మంది బ్లాగ్ మిత్రులకు.. 11,12 Aug నాటి ప్రోఫైల్ పిక్ లో ఉన్నది.. వరమహాలక్ష్మీ అమ్మవారు

    ~శ్రీ~

    ReplyDelete
  22. మీరు మునుపు వాడిని కొత్త పదాలు ఇక్కడ చాలా ఉన్నాయి. చిక్కటి భాష కవితను వ్రాసారు.

    ReplyDelete
  23. పాచిపడిన పిండిపదార్థమని అంటే మాత్రం నువ్వు ఓకే అంటావా అభిమానులు అననివ్వరు అర్పితా...అయినా ఎందుకు నువ్వు మారడం నువ్వు మేలిమిబంగారు కొండవు. అసలే బంగారం ధర ఆకాశాన్ని అంటుకుంది. జాగ్రత్త, సరదాగా రాశాను. అధ్భుతమైన అక్షరమాలను అందించావు, అభినందనలు నీకు- హరినాధ్.

    ReplyDelete
    Replies
    1. హరినాధ్ గారు...మీరు కూడా ఆటపట్టిస్తున్నారు.
      ధన్యోస్మి సర్ _/\_

      Delete
  24. తడికంటి దర్పణాల్ని శాశ్వితంగా మూయక,,,,వద్దు వద్దు ఇటువంటి పదములు మీకు.

    ReplyDelete
  25. సాంద్రత లోపించిన సద్గుణమే అద్దమై మెరవాలని..వామ్మో ఇంత కష్టమైన భావాలు భారంగా మోయడము అవసరమా చెప్పండి.:-)

    ReplyDelete
    Replies
    1. అలా అడిగితే ఏం చెప్పను :-)

      Delete
  26. కృష్ణ పుష్కరాలకు సుస్వాగతం.
    వరలక్ష్మీదేవి కటాక్షసిధ్ధిరస్తు మీకు.

    ReplyDelete
  27. శ్రావణమాస వరలక్ష్మీ కటాక్షం మీకు కలగాలని కోరుకుంటున్నాను.
    కవిత చిత్రం ఎప్పటిలాగే బాగున్నాయండి.

    ReplyDelete
  28. Fantastic Picture.
    Poem tough to digest mam.

    ReplyDelete
  29. Facebook profile? will follow

    ReplyDelete