అ'సంతృప్తి

నా పయనం మరియు గమ్యం నీవైనప్పుడు
నీవు లేకుండా జీవించమనడం న్యాయమా?

నా ఒంటరితనం నిలదీసి ప్రశ్నిస్తున్నప్పుడు

నీవే సమస్తమని నా అసమర్ధతకి తెలుపనా?

నా అభిరుచుల ఆశలపందిరై నీవున్నప్పుడు

నిన్ను ఆశించరాదని ఆంక్షలు పెడితే ఎలా?

నా తనువూ ఆత్మా నావే అనుకున్నప్పుడు

నాలో నేను లేనేలేనని అంటే అది అబద్ధమా?

నా రక్షణకవచంగా నీ ఉనికి ఉంటున్నప్పుడు

నీ నా శరీరవాంఛలు చేస్తున్నవి పెద్ద నేరమా?

నా తృష్ణకు సంప్రాప్తి మన సంగమమైనప్పుడు

నేను ఇక్కడ నీవక్కడ ఉండడమే జీవితమా? 

71 comments:

  1. ప్రశ్నలు కలవరం పెడుతుంటే ఏమని జవాబు ఇవ్వమంటారు...అద్భుతంగా వ్రాసారు మది భావాలను.

    ReplyDelete
    Replies
    1. ఆస్వాధించండి..
      కలవర పడకండి..

      Delete
  2. మనసు పడుతున్న వేదనతో తనువు అంతా తడిసి చిత్రం మరిన్ని ప్రశ్నలు అడిగిస్తుంది.
    ఇంతకూ మీరు ఏమైనారు?
    మాకు కవితలకు మధ్య ఏల ఈ ఎడబాటు?

    ReplyDelete
    Replies
    1. మీరేనా ఎడబాటు అంటున్నది :)

      Delete
  3. మా మనసుని తృప్తిపరిచే ప్రయత్నంలో మేము విఫలమై అదే జీవితం అనుకుని బ్రతికేస్తూ సంతృప్తిగా ఉన్నామని మమ్మల్ని మేము మభ్యపెట్టుకుంటున్నాం. ఇలా ఉండనీయండి పద్మార్పిత.

    ReplyDelete
    Replies
    1. మహీగారు కాస్త వేదాంతం పాళ్ళు ఎక్కువైనాయి సుమా ;)

      Delete
  4. అద్భుతంగా వ్రాసారు..

    ReplyDelete
    Replies
    1. మీ కమెంట్ మరింత ప్రేరణ.thank you.

      Delete
  5. నా తృష్ణకు సంప్రాప్తి మన సంగమమైనప్పుడు
    నేను ఇక్కడ నీవక్కడ ఉండడమే జీవితమా?
    చివరి రెండు లైన్లతో మొత్తం మనసుని మెలిపెట్టినారు. అభినందనలు

    ReplyDelete
    Replies
    1. మనసుని సరిచేసుకుంటే హాయిగా నవ్వేయొచ్చునేమో...ha ha :)

      Delete
  6. కరిగే కలని ఏమని అభివర్ణించేది..
    జ్ఞాపకాల లోగిలి అననా మానని గాయమననా..

    కడలి కెరటాన్ని ఏమని అభివర్ణించేది..
    దగ్గరైన దూరమననా దూరమైన దగ్గరననా..

    నిలువున తొలిచిన గాయాన్ని ఏమని అభివర్ణించేది..
    రక్తమొడుతున్న దేహమననా కొట్టుమిట్టాడుతున్న ఊపిరననా..

    ReplyDelete
    Replies
    1. మనసుని తాకాయి మీ భావాలు.

      Delete
  7. నా గుండె పిండేసినాయి ప్రశ్నలు
    గిసోంటి కవితల్ రాసి మనసు మెలిపెడ్తివి పదమ్మో

    ReplyDelete
    Replies
    1. నన్ను పసాయించకుండ్రీ :)

      Delete
  8. "అ" తొలగించండి అంతా "సంతృప్తి" మిగులు.

    ReplyDelete
    Replies
    1. "అ" తొలగించడం అంత సులభమా.

      Delete
  9. స్త్రీ మనోభావాలు ఇంతందంగా ఉంటాయా అనిపిస్తాయి మీ కవితలు చదువుతుంటే. సుకుమారం సున్నితత్వంతో కూడి చెప్పవలసిన విషయ్మ సూటిగా వ్రాస్తారు. జైహో పద్మార్పితా.

    ఏ బొమ్మను చూసినా ఒక ప్రత్యేకత సంతరించుకుని కనులకు ఇంపు కలిగిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనలు స్పూర్తిదాయకం...థ్యాంక్యూ.

      Delete
  10. నా తనువూ ఆత్మా నావే అనుకున్నప్పుడు
    నాలో నేను లేనేలేనని అంటే అది అబద్ధమా?
    అసలు ఇటువంటి డౌవుట్లు మీకు ఎందుకు వస్తాయో వివరించండి. మీరు ఏది వ్రాసినా అది ఏకగ్రీవంగా ఆమోదయోగ్యం అయినప్పుడు ఇది న్యాయమా?

    ReplyDelete
    Replies
    1. తనువు ఆత్మ శ్వాసల సంపూర్ణ సంగమమే జీవితమన్నది. ఆనందానికి అవధులు లేవు కాని కల్పించుకుంటాడు మనిషి. అవహేళన దరికి చేరకూడదు కాని తెలిసి మరీ చేరువవుతాడు జీవీ. రంగులన్ని కలగల్పిన ఆకాశమే ఇదీ కాని వినీలానికే ప్రాధాన్యం. రంగురంగుల పువ్వుల తోట ఇది కాని మట్టిరంగు మాత్రమే కానవస్తది.
      ప్రకృతి ధర్మమిది మానవ జన్మ ఇది. మరల మరల రానిది. మరల మరల రానిది.

      Delete
    2. అవును మీరు వ్రాసింది బాగుంది శ్రీధర్.

      Delete
    3. థ్యాంక్యూ నాథురామ్ గారు ఫర్ ది అప్రైజల్

      Delete
    4. ఆమోదించాను అంటూనే డౌట్ ఎందుకు అని ప్రశ్నించారుగా నయని ;)

      Delete
    5. తనువు ఆత్మ శ్వాసల సంపూర్ణ సంగమమే జీవితమని భలే చెప్పారు శ్రీధర్ బుక్యాగారు.

      Delete
  11. మల్లెల సుగ౦ధ౦లాంటి భావాలు
    పసిపాప చిరునవ్వులాంటి ఉద్వేగాలు
    సుస్వర స౦గీత ఝరిలా కవితలు
    ప్రణవనాద౦లా వినిపి౦చే వాక్యాలు
    రసరంగులు మేళవించిన చిత్రాలు
    రమ్యం మధురం అహ్లాదభరిత కావ్యాలు
    అందుకో అర్పిత అభినందనలు..

    ReplyDelete
    Replies
    1. మీ చిట్టికవితలు సుమధుర ఉత్తేజ వాక్యల మాలలు. నెనర్లు మీకు.

      Delete
  12. నాలో నేను లేనేలేను..super

    ReplyDelete
  13. మనిషి బాధపడితే ముఖంలో కనబడుతుంది
    మనసు బాధపడితే కవిత రూపలో వస్తుంది
    కరెక్టు అనిపిస్తుంది మీ కవితలు చదువుతే..

    ReplyDelete
    Replies
    1. తప్పులూ ఉంటాయి తరచిచూసి సరిచేయండి. థ్యాంక్యూ

      Delete
  14. Excellent lyrics
    Awesome picture

    ReplyDelete
  15. మానవుడు బ్రతికినంత కాలం అసంతృప్తితోనే బ్రతుకుతాడు అందుకే ఇన్ని బాధలు. ఉన్నదాంతో తృప్తి పడమని చెబితే వేదాంతం అంటాడు అందుకే ఇన్ని వ్యధలు. నేను కమెంట్ వ్రాయడమైతే చేసాను నాకు అసంతృప్తి అన్నింటా ఏమి చేసేది?

    ReplyDelete
    Replies
    1. మనకి ఏది మంచి అనిపిస్తే అది చేయడమే.ఎదుటివారు ఏదిచేసినా ముందు తప్పులు వెతకడానికే చూస్తారు ఇది నా అనుభవం.

      Delete
  16. నా తృష్ణకు సంప్రాప్తి మన సంగమమైనప్పుడు నేను ఇక్కడ నీవక్కడ ఉండడమే జీవితమా? మీకే సాధ్యం ఇలా ప్రశ్నించడం.

    ReplyDelete
  17. Poetry in questionable way in different and heart touching. Keep on rocking padma.

    ReplyDelete
  18. మరోసారి అందమైన భావం పలికింది మీ కవితలో.

    ReplyDelete
  19. ఇద్దరి మనసులు ఒకటైనప్పుడు
    ఇక వ్యధలు ఎందుకు?
    వేరు వేరన్న బాధ ఎందుకు?

    ReplyDelete
    Replies
    1. మనసనే పల్లకి చంచలమైనది గనుక
      మనః నిగ్రహం అనితరసాధ్యము గనుక

      చంచల మనః తు అచంచల దేహే ప్రతిబంధిత్వమితి జీవనం.

      Delete
    2. కాల్ పరమ్ తాతి యాన్ వాతే కిదే కేలేన్ సవార్ పరమ్ సదాయి హనుజ్ రియ కేలేస్మత్ కన్నాయి. కాలమేతిని మోటో ఈ జగత్తేమా కూణీ ఛేని. కసన్ కేచి ఉందాళో సిఁయాళో వర్సాళో ఇందున సదాయి కాలమజ్ మారస్నాక ఉజ్జి ఠాల్ మనక్యా అపణ్ కత్రాక్.
      తార్ ఢీన్ కాఁయి రచకో ఓతీజ్ ధాప్ జాస్తో సేర్ దలేమా రేజాయేచి. హాయి కరతో వేవాళో వనజు రేని. జేతి కేన కన్నా వేణుకో ఓన జన్నా వేజాయేద. ఆచ్చో వతో సేన ఆచ్చో వేణు. ఖరాప్ వతో ఓన ఒత్తేతి భూల్ జావతోజ్ ఆఁగ జాయేర్ వ. కత్రాకతోయి ఈ మనక్యార్ జన్మ సేన ఎక్కజ్ వణా ఆవ. ఫరన్ చావుణు కతోయి ఆయేని. బంచన్ ర జత్రా దాడ్ తార్ చుట్టు ఛ జేన సేన హఁసాడనతోయి కాఁయి వేని పణన్ కేని సపనే మా సదాయి ఖరాప్ కేలేర్ ఛేని. ఈజ్ సంతృప్తి సేన.

      తాత్పర్యం: నిన్న మొన్న నీతో బాగా మాటలాడిన వారు సైతం రేపు ఎల్లుండు మాటలాడక పోవచ్చు. కాలం కంటే పెద్దది ఏది లేదు ఈ జగత్తులో. ఎందుకంటే వేసవికాలం శితాకాలం వర్షాకాలం ఇలా ఇవి కూడా కాలంతో పాటే మార్పు చెందుతుంటే మనషులం మనమెంత.

      నీ దగ్గర ఉన్న దానితో సరిపెట్టుకుని మసలుకుంటే ప్రతి మదిలో చిరకాలం జ్ఞాపకమై మిగిలి ఉంటావు. బాధ పడుతు ఉంటే జరగాల్సినదేది జరగకుండ మానదు. అందుకే దేనిని ఎప్పుడు అవ్వాలో దానిని అప్పుడే అవ్వనివ్వు. మంచి జరిగితే అందరికి మంచిదే. చెడు జరిగితే దానిని మరిచిపోయి ముందుకు కొనసాగాలి.
      ఎంతైనా మానవ జన్మ అరుదైనది. మరల కావాలనుకుంటే రానిది. బ్రతికి ఉన్ననాళ్ళు నీ చుట్టు ఉన్న జనంలో ఆనందం నింపకున్నా పర్వాలేదు కాని కలలోనైనా ఎవరి చెడును కోరుకోవద్దు. ఇదే సంతృప్తి అందరికి.

      పద్మ గారు.. నా మాతృభాషను బ్రాహ్మి లిపిలో వ్రాశాను. దానికి గల తాత్పర్యం బ్రాహ్మి లిపి తెలుగులో. జీవికి నిజమైన సంతృప్తి అనేది పది శాతం మాత్రమే ఉంటుంది. చాలా వరకు బాధలు అసహనాలు కుళ్ళు కుతంత్రాలు దగా కపట మోసాలు ఇవే మనిషి మనసుని లోలోపలే దహించి వేస్తుంటాయి. కనుకనే అసంతృప్తి పాళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. పుట్టినపుడు మనం మనతో పాటు తెచ్చుకునే విలువైన వస్తువు ఆ జీవాత్మ ఒక్కటే.

      Delete
    3. మార్పు సహజం అనివార్యం కాలాలతోపాటు మనుషులు మారుతుంటారు తప్పదు శ్రీధర్ గారు.

      Delete
    4. మనసు కలిస్తే సరిపోదు మరిన్ని కావాలనుకుంటుంది...ఆశకు అంతం లేదు కదా రాగిణిగారు.

      Delete
    5. Srdhar Bukhya..ముందుగా మీ ఓపికకు నమస్సులు. ఎంతో సమయాన్ని కేటాయించి విశ్లేషణతో విశధీకరిస్తారు. థ్యాంక్యూ.

      Delete
    6. మార్పనేది సహేతుకంగా ఉంటే అందరికీ ఆమోదయొగ్యమే కదా ఆకాంక్షగారు.

      Delete
  20. నేను ఇక్కడ నీవక్కడ ఉండడమే జీవితమా ఇదేం ప్రశ్నండీ ఈలాంటి జీవితం అసలు ఎందుకు జీవించడం అనిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. ఇలాంటి జీవితాలు బోలెడు...ఇలా నిరుత్సాహపడితే ఎలా :)

      Delete
  21. తప్పొప్పులు తక్కెట్లొ తూనికతాళ్ళు కాదు నేరమా న్యాయమా అని తర్కించుకోవడానికి ప్రశ్నించడానికి. ఒకరికి కరెక్ట్ అనిపించింది వేరొకరికి తప్పుగా తోచవచ్చు. అందుకే ఎవరికి వారే తమని తాము ప్రశ్నించికుని మసలుకుంటే జీవితం సాపీగా సాగేను లేదనుకుంటే అన్ని అలజడులే.
    కవితాచిత్రం అసాంతం ఆలోచనాత్మకంగా సాగింది.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పింది సబబే...ఎవరి ఆలోచనలకి తగ్గట్టు వారి భావాలు కూడా. మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  22. నా తృష్ణకు సంప్రాప్తి సంగమమైనప్పుడు అసంతృపిది ఏంటి అంతా తృప్తి సంతోషమే. అందమైన భావకవిత దానికి తగ్గ చిత్రము.

    ReplyDelete
    Replies
    1. అలా తృప్తి పొందడం అందరికీ కుదరదేమో :)

      Delete
  23. మనం కుదురుగా ఉంటే అదీ తృప్తి పద్మగారు

    ReplyDelete
    Replies
    1. కుదరదుగా కుదుటపడ్డం.

      Delete
  24. అసంకల్పితంగా తెలియకనే మార్పులు ఎన్నో జరిగి ఇష్టంగానో అయిష్టంగానో ఎన్నో కోల్పోతూ ఉంటాము. ఆశల పగ్గాలకు చిక్కుకుని ఇంకా ఏవేవో కావాలి అనుకుంటూ ఉరుకులు పరుగులు అటువంటప్పుడు ప్రతి మనషి బ్రతుకు పయనంలో అసంతృప్తి తప్పదు. ఏమీ ఆశించక దక్కిన వాటిని ఆమోదిస్తే అంతా ఆనందమే. మంచి కవిత-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. మీరు అనుభవపూర్వకంగా వ్రాసిన వ్యాఖ్యలు ఆమోధిస్తే అసంతృప్తికి తావుండదు కాబోలు. థ్యాంక్సండీ.

      Delete
  25. కాలచక్రమే మనసుని సమాధాన పరుస్తుంది.అగాధమంత ఆశను నింపుకుని నమ్మకాన్ని పునాదిగా అల్లుకుంటే సరి జీవితమే తృప్తిగా సాగుతుంది.

    ReplyDelete
    Replies
    1. టైం కి వదిలేయమంటారా :)

      Delete
  26. నేను అసంతృప్తిని తెలియచేస్తున్నాను. :)

    ReplyDelete
    Replies
    1. షూట్ చేస్తారా ;)

      Delete
  27. అసంతృప్తి ఏమిటి కవితతో కేక పెట్టించారు.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ. కేక పెట్టకండి.:)

      Delete
  28. ఏంటి పద్మా ఈ మధ్య ఒకో పోస్ట్లో ఒకో రకంగా హడలు ఎక్కిస్తున్నావు? హ హ హా

    ReplyDelete
    Replies
    1. సంధ్యగారు...టైం తీసుకుని మరీ స్పందిస్తున్నారు. థ్యాంక్యూ. విష్ యు ఆల్ ద బెస్ట్.

      Delete
  29. నా రక్షణకవచంగా నీ ఉనికి..sooper

    ReplyDelete
  30. ఎవరికి వారే రక్షణకవచం వరికి వారే ఉనికి అవుతున్నాప్పుడు తృష్ణ తీరే మార్గం స్వయంగా వెతుక్కోవాలి అనుకుంటా నేటికాలం.

    ReplyDelete
    Replies
    1. ట్విస్ట్ పెట్టారు కమెంట్లో. :-)

      Delete