వచ్చి వెళ్ళిపోకు..

ఇదిగో వచ్చి అంతలోనే వెళ్ళిపోతాను అనకు
వసంతకాలం వచ్చి క్షణాలేగా అవుతున్నాయి  
గాలి పరిమళం మారి మది పులకరించబోయె
ఊపిరి ఉల్లాసమెక్కి మత్తుకళ్ళే అరమోడ్పాయె 
నేనేం చెప్పనైనా లేదు నువ్వేం విననైనాలేదు  
అంతలోనే సద్దుమణగనీయక చల్లగా జారిపోకు!

తారలింకా నీతో ఊసులాడనేలేదు వెళతాననకు
వస్తున్న చంద్రుడేమో నిన్నుచూసి చిన్నబోయి
మన్మధుడ్ని కోప్పడగా ఓరగా రతి నిన్నుగాంచె 
వలపురాగిణులు వయ్యారంగా నిన్ను చుంబించె
నేనది చూసి ఈర్ష్యపడి కౌగిట్లో కట్టిపడేయనేలేదు   
అంతలోనే చలించి మతి మారెనని మాయమవకు!

తీరని దాహం తీర్చక అలజడికి ఆస్కారమివ్వకు
మనసులు రెండూ ముడిపడి పరిభ్రమిస్తున్నాయి
ప్రణయమేను పరిపక్వతతో నాట్యమాడ పురివిప్పె
అదిచూసి నింగి నేలను రమ్మని రాయబారమంపె
రసికత రంగులు ఇంకా పూర్తిగా పులుముకోలేదు     
అంతలోనే అలిగి ఆగలేక వంకలు వెతికి వెళ్ళిపోకు!

26 comments:

  1. రసరమ్యం శృంగారకావ్యం.

    ReplyDelete
  2. బొమ్మ కవిత ఒకదాన్నొకటి పోటీ పడుతుంటే దేన్నని పొగడగలం.
    సూపర్ డూపర్ అదిరిందని మాస్ స్టైల్ లో కేకో కేక.

    ReplyDelete
  3. శృంగారాన్ని మేళవించి కవితను అందించిన తీరు కొంచెం ఆశ్చర్యాన్ని అహ్లాదం అందించింది.

    ReplyDelete
  4. మీకు శివరాత్రి జాగరణలో పుట్టిన ఆలోచలు అమోఘం.
    శృంగారం కలగలిపిన సున్నిత పదాల ప్రయోగం బాగుంది.
    చిత్రం గూర్చి ఏమీ వ్రాయలేక చూసిందే చూస్తున్నాను.

    ReplyDelete
  5. ekadipodu...he is not krishna :)

    ReplyDelete
  6. so beautiful romantic pic didi.

    ReplyDelete
  7. *ఏమి తపస్సు చేసావు
    ఏ అక్షరసుమాలతో అర్చన చేసావు
    బీజాక్షరాలు పొందిన కాళిదాసుకి
    కావలసిన ప్రియ శిష్యురాలివా?
    మణిమాణిక్యాలు అనుకుని
    తెలుగు నిఘంటువుని నీలో దాచితివా?
    ఏయే మస్తిష్క పొరల్లో
    భావాలను బంధించి ఉంచినావో గానీ
    వ్రాసిన ప్రతి అక్షరం మనసులో పదిలం*

    ReplyDelete
  8. Padma simply amazing picture and awesome post.

    ReplyDelete
  9. ఒక దీపం వెయ్యి జ్యోతులు వెలిగించినా
    దాని కాంతి ఏమాత్రం తగ్గదు అన్నట్లు..
    మీ భావాలకు అక్షర రూపం ఇచ్చేకొద్దీ
    పదాల్లో పవర్ పెరుగుతుందే
    అంతే కాని తరగడం లేదు.అద్భుతః

    ReplyDelete
  10. కాలమానములో కలిగే మనోవేదనను సైతం అక్షరాలలో మేళవించి..వాటికి తగ్గట్టుగా మృదుభావాలు కలగల్పి మీ శైలిలో రసరమ్యకావ్యాన్ని రచించినారు పద్మ గారు.

    ఏ బంధంలోనైనా అపుడపుడు కలవరపాటు సహజం. అలా కలవరపాటుతో కలిగే యెడబాటు సైతం ఆ బంధం తాలుకు విశిష్టతను చెప్పకనే చెబుతాయి. ఒక్కొక్కసారి కన్నిరు సైతం మనసులో వేదనను కరిగిస్తుంది. కడిగిన ముత్యం ధవళాన్ని విరాజిల్లినట్టు అమవాస్య సైతం పౌర్ణమి కై వేచి చూడటానికే అని తెలిజెబుతాయి పద్మ గారు.

    ReplyDelete
    Replies
    1. Sometimes Life resembles a Network of Intertwined Railway Tracks: They look messy at the First Glance, but have their Clear-cut Paths hidden in them.

      Delete
    2. అల్లకల్లోలమైన మనసులో ఆలోచనల తరంగాలు
      నిన్నటి పలకరింపుల అవశేషాలనే తడిమే నయనాలు
      ఉద్విఘ్నతకు లోనై లోలోపలే మౌనంగా రోదించే మది
      మాటైనా మీరలేదు ఏనాడు మనసాయేను జ్ఞాపకాల గది
      మౌనం నీవు దాల్చగా నే పలకరిస్తే నాదా తప్పు
      మౌనం నేను దాల్చితే అలిగానని అనేవు మరి ఏది ఒప్పు
      అందరి కన్నా అర్థం చేసుకునే మనసు నీదని అన్నావు
      ఒక్కసారైనా నిన్ను కనులారా చూడాలని అన్నావు
      నేను ఆనాడు శబరి-రాములను మనలో చూశాను
      నేను ఆనాడు యశోద-కృష్ణులను మనలో చూశాను
      మానవ రూపం దాల్చిన దేవకన్య నీవు సందేహం లేదు
      కల కాని కల ఇది నిజమైన నిజం ఇది సంశయం లేదు
      మాట ఇచ్చి మరిచిపోయే కుసంస్కారిని కాను
      నిరాడంబరతకు సహజమైన చిరునామ తాను

      డిస్క్లైమర్: దిస్ పొయేటిక్ కమెంట్ హ్యాజ్ నథింగ్ టు డూ విథ్ ది పోయేటిక్ కంపోజిషన్ ఆఫ్ పద్మ గారు. దిస్ ఇజ్ ఏ స్టాండ్ అలోన్ పోయేటిక్ కమెంట్.

      మే టూ థౌజండ్ ఫోర్టీన్-ఫెబ్రుఅరి టూ థౌజండ్ సెవెంటీన్ యాండ్ స్టిల్ కౌంటింగ్..!

      Delete
  11. నేనది చూసి ఈర్ష్యపడి కౌగిట్లో కట్టిపడేయనేలేదు..ఇది ఎలా సాధ్యం? కోపం ఉగ్రరూపం దాల్చి కొట్టిపడేయడం కరెక్ట్ అనుకుంటాను :) హ హ హా

    ReplyDelete
  12. మనోభావాలు శిఖరాగ్ర అంచులని తాకినప్పుడు కలిగే భావంలా అతి మధురం మీ కవిత. చిత్రం మరిత ముచ్చటగా ఉంది. కుడోస్.

    ReplyDelete
  13. ఎదురుగా ఇష్టమైనవి అన్నీ పెట్టి తినమంటే ఏం తినగలం చెప్పండి....అలా ఉంది మీ పోస్ట్ అండ్ పెయింటింగ్.

    ReplyDelete
  14. మనసులు రెండూ ముడిపడి పరిభ్రమిస్తున్నాయి
    ప్రణయమేను పరిపక్వతతో నాట్యమాడ పురివిప్పె
    అదిచూసి నింగి నేలను రమ్మని రాయబారమంపె
    రసికత రంగులు ఇంకా పూర్తిగా పులుముకోలేదు, ఇన్ని భావాల నడుమ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాము.

    ReplyDelete
  15. నన్ను వదలి నీవు పోలేవులే -అది నిజములే
    పూవు లేక తావి నిలువలేదులే-లేదులే అని పాట పాడక ఇదేమిటి వచ్చి వెళ్లిపోకు రాకు అని లేనిపోనివి గుర్తు చేస్తారు. :)

    ReplyDelete
  16. అపూర్వ అక్షరాల సంగమ అనురాగ మేళవింపు.

    ReplyDelete
  17. విడిచి పెట్టి వెళ్ళిపోయే మాటే లేదు తూటాలు ఎన్ని గుచ్చుకున్నా ప్రాణం పోయేవరకు.

    ReplyDelete
  18. వెళ్ళాలి అనుకుంటే కూడా వెళ్ళనిచ్చేలా లేవు వయ్యారి వంపుసొంపులు వలపు మాటలు. ఇక ఏం వెళతాడు ఆమెతోటిదే మకాం అహ అహ్హ్ :)

    ReplyDelete
  19. No way to go...awesome pic.

    ReplyDelete
  20. ఇంతలా మురిపిస్తూ మైమర్పిస్తుంటే...వెళ్ళడం ఎవరి తరం 😜

    ReplyDelete
  21. Abhi na jaao chhod kar
    ke dil abhi bhara nahi
    abhi abhi to aayi ho
    bahaar banke chaayi ho
    dil mehak ne do
    aap ke kavitaon se..

    ReplyDelete
  22. ప్రతి ఒక్కరి స్పందనకు వందనసుమమాల.

    ReplyDelete
  23. ఇది సూపర్ కట్టిపడేసినారు

    ReplyDelete