మాతృ శోకం..

నా భారతమాత రోజూ రోధిస్తూనే ఉంటుంది
సాత్వి సీతమ్మ రోజూ అంగట్లో అమ్ముడౌతూ
కుంతీ మాత మాతృత్వం మనోవేదనపడుతూ
రాధ భక్తి భాగవతాన్ని బేరీజు వేసి నవ్వుతూ
మనుషుల మానవత్వం మంటగలిస్తే చూస్తూ..

నా దేశం శిరస్సు దినదినం వాల్చేస్తూ ఉంది
యువత నిస్తేజమై విదేశాలకు వలస వెళుతూ
నీరుగారిన నిరుద్యోగులు సోమరులై తిరుగుతూ
అవిటిదైన పేదరికం దాహం తీర్చని కుంటుతూ
అగుపడ దిక్కుతోచని అభివృధ్ధి నింగిని చూస్తూ..

నా మాతృభూమి తనలోని మనల్ని ప్రశ్నిస్తుంది
మనం కలగన్న స్వాతంత్ర్యం ఇదా అనడుగుతూ
భగత్ సింగ్ ఇది కోరెనా ఉరితాడుకి వేలాడుతూ
సుభాష్ చంద్రబోస్ చెప్పెనా ఎటో మాయమౌతూ
లేక బాపూజీ నేర్పెనా హేరామని ప్రాణం విడుస్తూ..

65 comments:


 1. పద్మార్పిత యింత నిర్వేదము లోనికి జారుకున్నదేమిటి !

  ఔరా!

  జిలేబి

  ReplyDelete
 2. రోజులు మారాయి అంటున్నారు లోకులు..
  కాని లోకులు మారాయి అంటున్నాయి రోజులు..

  కాలం మారిందని గుర్తిస్తున్నారు కొందరు..
  అందరు మారిపోయారని గమనించినవారు ఎందరు..

  ఏమిలేని అంగారక గ్రహ నివాసం భవిష్యతంటు ఆనందమా..
  అన్నపూర్ణ భూమాతను కాలుష్య కొరల్లో నెడుతు పరిహాసమా..

  తప్పును సరిదిద్దుకోలేమా..
  భూమండలాన్ని కాపాడుకోలేమా..

  పక్కింటి పులిసిపోయిన కూరలెందుకు..
  ఇంటి వంట రుచులకు విసుగెందుకు..

  స్వార్థంతో ఒంటరిగా బ్రతకటం కంటే..
  సమాజంలో కలసి ఉండటమే బ్రతుకంటే..

  వందే మాతరం నా భారతావనికి..
  పాదాభివందనం నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి..

  ~శ్రీ~
  గోదావరి కృష్ణవేణి సస్యశ్యామల భారతావని
  సంస్కారం మమకారం మాతృత్వానికి అలంకారం
  నడవడిక సహృద్యత పితృత్వానికి బాద్యత

  వేదన ముప్పావు కలగలపి రచించినా.. చేదు నిజాలే వర్ణించారు పద్మగారు.. ఇవి చేదు అని తెలిసిన విజ్ఞులకి.. ఆవి సమాజానికి చెడు అని తెలిసేదెపుడు అని మీరు ప్రశ్నించిన తీరు శ్లాఘనీయం..

  ReplyDelete
  Replies
  1. ఒక్క మాట:
   మీరు ఎంచుకున్న థీమ్ బాగుంది.. కాని పిక్
   అమ్మకు అక్షర నీరాజనం భళా.. కాని చిత్రం

   మన్నిస్తారని భావిస్తు

   Delete
  2. శ్రీధర్ నీకు చిత్రం ఎందుకు నచ్చలేదో తెలియదు.
   కానీ పద్మార్పిత వ్రాసిన దానికి నూరుపాళ్ళు నప్పిన చిత్రం ఇది అనిపిస్తుంది. ఆమె పెట్టే చిత్రాలకు ఇది కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ కవిత సారాంశం మొత్తం అదులో ప్రతిబింబిస్తుంది పరికించి చూడు మరోమారు.
   తప్పుగా చెప్పాను అనుకోవద్దు. విత్ బ్లెసింగ్స్-హరినాధ్

   Delete
  3. హరినాథ్ సర్..
   నేను పద్మ గారు ఎంచుకున్న చిత్రము బాగోలేదని చెప్పలేదు. భిన్నంగా ఉందనే అభిప్రాయం వచ్చేలా భిన్నంగా వ్రాశాను..

   ఐతే కాస్త భిన్నంగా కమెంట్ వ్రాసినందుకు ముందు జాగ్రత చర్యగా మనవి కూడా వ్రాశాను సర్.. చిత్రం నుండే కవిత భావం ఆలోచన తీరు వస్తుంది గనుక.. సారం దానంటదే ప్రస్ఫూటమౌతు ఉంది సర్ కాబట్టి మరో మారు తిలకించనవసరం లేదు..
   ఎదుటి వారు విమర్శించినా అందులోని నిజాలను మాత్రమే పరిగణలో తీస్కుంటే అందరికి మంచిదని నా అత్యంత సన్నిహితురాలైన నా ప్రాణ స్నేహితురాలి మాటను నేను ఎప్పుడు గౌరవిస్తాను. కాబట్టి మీరు చెప్పిన దానిలో ఎటువంటి తప్పు లేదు.
   ధన్యవాదాలు హరినాథ్ సర్..!

   Delete
  4. Good Sridhar...thank you.

   https://goo.gl/fBXaom

   ఈ పోస్ట్కు కమెంట్ పెట్టడం అక్కడ కుదరక ఇక్కడ వ్రాస్తున్నాను.

   ఇంత చక్కని భావుకత్వం ఉన్న నీవు ఎన్నో ఏళ్ళుగా వ్రాస్తూ ఈ మధ్య బ్లాగ్లో వ్రాయడం తగ్గించినట్లు అనిపిస్తుంది. వ్రాస్తూ ఉండు-హరినాధ్.

   Delete
  5. హరినాథ్ సర్.. నమస్తే.. నా బ్లాగ్ ను సందర్శించినందుకు కృతజ్ఞతలు.. అప్పుడప్పుడు వీలునప్పుడు లేదా మనసులో ఆలోచనలు మెదిలినపుడు బ్లాగ్ లో వ్రాస్తు ఉంటాను సర్..!

   సదా సర్వదా మీలాంటి పెద్దల ఆశిస్సులు కోరుతు..!!

   Thank You Sir, for your kind words.
   Always Obliged and Humbled for the Blessings.

   ~శ్రీ~
   హరిరామాచ్యుతగోవిందమాధవమురారిమధుసూదనకేశవమురళిధారిరాధికమనోహరలక్ష్మీవల్లభనందనందన

   Delete
 3. మీలో ఇంత మహోన్నత అభ్యుదయ భావాలు ఉన్నట్లు ఇప్పుడు తెలిసింది. భరతమాత శోకం చిత్రం అధ్భుతం..హ్యాట్సాఫ్ అర్పితగారు.

  ReplyDelete
 4. భరతమాతకు వందనములు.

  ReplyDelete
 5. కవిత చదివిన తరువాత..
  ఏం వ్రాయాలన్నా
  అక్షరాలు వేడెక్కి పోతున్నాయి
  టైప్ చేయ పూనుకో
  వేళ్ళు వణుకుతున్నాయి
  ప్రశ్నల్లో ఆవేశం ఆవేదన ఉన్నాయి


  -----


  -----

  ReplyDelete
 6. మీలో భరతమాత కనిపిస్తున్నారు

  ReplyDelete
 7. మీ కలానికి ప్రేమ దేశభక్తి రెండూ ఉన్నాయని ఋజువు చేసారు. అభినందనలు.

  ReplyDelete
 8. Powerful
  Patriotic
  Poem-P3

  ReplyDelete
 9. మనుషుల మానవత్వం మంటగలిస్తే చూస్తూ..విచారకరం

  ReplyDelete
 10. దేశప్రగతి ఒక్కరి చేతిలో లేదు ఇలా అయితే దేశం అభివృధ్ధి ఎలా మాడంజీ.

  ReplyDelete
 11. రాబోయే కాలం పురోగతి అన్ని రంగాల్లో అనుకుని ఆశతో కొనసాగడం తప్ప వేరొక దారిలేదు.
  మీ కలం నుంచి ప్రేమ కవితలకు భిన్నంగా వ్రాసారు. ఈ మార్పు హర్షనీయం అర్పితగారు.

  ReplyDelete
 12. దేశం అభివృద్ధి చెందాలి అంటే రక్తాన్ని పీల్చుకుని త్రాగాలి అనుకునే రాజకీయ నాయకులు ఉన్నప్పుడు దేశప్రజలు అనారోగ్యంతో కుస్తీలు పడుతూ దౌర్జన్యంతో చేతులు కలిపి స్వార్థపరులై ఎవరికి వారు బ్రతికేస్తుంటే...భరతమాత బోరున విలపించక ఏం చేస్తుంది.
  ఇక ముందుకాలం ఇంకెన్ని ఘోరాలు చూడాలో ఎన్ని ఏరుల కన్నీరు కార్చాలో పాపం.
  ప్రస్తుత దేశ పరిస్థితిని అద్దంలో చూపించినట్లుంది కవిత- హరినాధ్

  ReplyDelete
  Replies
  1. నవసమాజ నిర్మాణం ఏ ఒకరి చేతిలోనో.. ఏ రాజకీయ నాయకుని చేతిలోనో లేదు.. ఆ బాధ్యత సమస్త భారత ప్రజానికానికే ఉందన్నది అక్షర సత్యం..

   నా ఒక్కడి వల్ల దేశం బాగుపడుతుందా అంటే కాకపోవచ్చు.. కాని.. నేను నా చుట్టు పక్కల వారు గమనించేలా సమాజంలో మార్పు తేవాలి అంటే ఒక పది శాతం మంచివైపు అడుగులేసినట్లు.. అలా పది మంది కలసికట్టుగా ముందుకు సాగితే.. నూరూ శాతం సమాజం.. తద్వారా రాష్ట్రం.. ఏతద్వారా దేశం బాగుపడుతుంది..

   ఇది నా సమాలోచన కలిగిన అభిప్రాయం మాత్రమే.. నేను ఓటు వేసిన వాడే వచ్చి చేస్తాడంటే.. ప్రతి ఐదేళ్ళకి ప్రభుత్వమే మారిపోయే పరిస్థితి.. కాని సమాజం.. రాష్ట్రం.. దేశం పరిస్థితి మెరుగు పడాలంటే అది ప్రజలతోనే సాధ్యమౌతుంది.. మరి రాజకీయ నాయకులు అని అడుగుతున్నారా.. వారు అభివృద్ధికి తోడ్పాటు అందించ గలగాలి.. నవసమాజ నిర్మాణానికి బ్లూ ప్రింట్ వేయాలి.. అపుడే ఈ విద్వేశాలు.. అరాచకాలు.. అవినీతి సమసిపోయి.. దైవ చింతన.. ఆధ్యాత్మికత.. అలవరుచుకుని ముక్కోటి దేవుళ్ళు అవతరించిన ఈ భారతావని ఖ్యాతి ఖండంతరాలు దాటి మారుమ్రోగుతు ఉంటుంది.. జై హింద్..!

   Delete
 13. Iam Indian
  Great India
  :)kabhi hasna :( kabhi ronaa

  ReplyDelete
 14. desa paristhiti gurinchi bagaa rasaaru.
  bomma chaalaa bavundhi.
  inkaa ilaanti chitraalu kavitalu mee nundi ravaalani korukuntoo

  ReplyDelete
 15. మీ భావాలను చిత్రాలను అర్థం చేసుకోవడం కత్తి మీద సాము :)

  ReplyDelete
 16. why suddenly this much patriotism in your poetry madam.
  it sounds so different.
  i didn't expected this from you.

  ReplyDelete
 17. మీలో ఇన్ని అభ్యుదయ భావాలు ఉండడం అబ్బురం ఆశ్చర్యం పద్మార్పితా
  మీరు సునాయశంగా కవితలు రాసేస్తారు వ్యాఖ్యానించడానికి వాక్యాలు లేక దొరక్క నాలాంటివారు సతమతమౌతున్నారు. ఇది వాస్తవం.హా హా హా. మాహాద్భుతంగా రాసారు కవితను దానికి అనువైన చిత్రాన్ని జతచేసారు. అభినందనలు మీకు.

  ReplyDelete
 18. ఎవరి ప్రోద్భలమో ప్రణయ పంక్తులను దేశభక్తి దిశగా మళ్ళించారు మీరు..Tanha

  ReplyDelete
 19. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది
  నేరస్తుల్ని షూట్ యెట్ సైట్ కాల్చాలి

  ReplyDelete
 20. నీ కవితలు మరో మలుపు తిరిగి మరింత ఆలోచింప చేస్తున్నాయి.
  ఇలాగే ఉన్నతంగా ఎదగాలని నా కోరిక.

  ReplyDelete
 21. భరతమాత భావాలు ఇంత లోతు ఉన్నాయా? :(

  ReplyDelete
 22. పద్మార్పితా ఇది నిజమేనా?
  మీరు ప్రేమలో మునిగి తేలుతుంటారు అనుకుంటే,
  దేశమాత పై ఇంత చక్కటి కవిత వ్రాసి అందించడం అబ్బురం ఆనందం
  బొమ్మ కూడా భిన్నంగా చాల చక్కగా నప్పింది.

  ReplyDelete
 23. సాత్వి సీతమ్మ రోజూ అంగట్లో అమ్ముడౌతూ
  కుంతీ మాత మాతృత్వం మనోవేదనపడుతూ
  రాధ భక్తి భాగవతాన్ని బేరీజు వేసి నవ్వుతూ
  స్త్రీమూర్తి ఆవేనకు చక్కటి ప్రతిరూపం...
  కవిత మొత్తంగా దేశమాత ఆవేదనను వెలిబుచ్చినట్లుంది.

  ReplyDelete
 24. మీలొ మరో కోణాన్ని బాగా చిత్రీకరించారు కవితలో.

  ReplyDelete
 25. తెలుసుకోవలసిన విషయం ఇంకా ఉంది.

  ReplyDelete
 26. rang bharse aap ki jeevan
  happy holi didi...

  ReplyDelete
 27. వాడి వేడి దేశభక్తి కవిత.

  ReplyDelete
 28. On 11.03.2017 (Saturday) at about 08:00, I was walking towards my home and was about 1.5 km from it. Within a short while, I sensed a vehicle approaching me from behind, as a safety measure, I kept myself towards extreme left, somewhere around 6 m distance from a nearby barbed fence. I was about to step forward, but I could not do so, suddenly my body was in the air, I could feel my feet getting dragged on the road. I put forward my right hand and started to stabilize, but was in vain, I was pushed into the fencing and then the Renault Pulse car came to a halt. I was Alive and I was shell-shocked, but then I came to my senses and found that my right thumb was slightly pierced with the barbed fence, due to drag, my jeans got muddy, I got bruises and cut on the left leg, people from nearby surrounded me, they helped me stand-up, as I was unable to do so, the person who was in the car told that she was learning to drive the car and confused brake with the accelerator and had hit me, which include Scratched Left Elbow, Superficial Sprained Backbone, Muscle Spasms, Bruised Right Hand Thumb, Badly Hit Left Thigh and Slightly Lacerated Calf. After 15 minutes, I got back Home, and then went for a first-aid where they prescribed medicines as treatment: Tetanus Toxoid 2ml Intra Muscular Injection, Bactriban Powder for the wounds, Diclofenac Gel for the muscular cramp and backpain.
  Wounds were cleaned up using Iodine Tincture and got patch bandage dressing on the wounds for faster healing. They advised a seventy-two hour bedrest and asked to review on wednesday evening. By that time, if the condition did not improve, they suggested me X-Ray scanning of Backbone. As of now, I can neither fully bend down, nor fully stand up and walk steadily, but I can use my both hands, although pain still exist in both the arms, and legs. But I am thankful to Venkata Narasimha for saving my life in just an instant of time, orelse, at the worst, 11 March 2017 would have been the last day of my life. I am hopeful that by Thursday or Friday, I will become Normal.

  ReplyDelete
  Replies
  1. శీఘ్రమేవ ఆరోగ్యప్రాప్తిరస్తు
   Wish u speedy recovery. May GOD bless you

   Delete
  2. Thank you Sir, for the Blessings.
   Hope I will recover very soon.

   Once Again Thank you for the Concern Sir.

   Delete
  3. sorry to hear the disturbing news dear sridhar.
   thankfully you are safe. hope everything gets
   in order for your speedy recovery. take care
   dear friend.

   Delete
  4. thank you for your kind concern nmr sir. hopefully trying my level best to recover from the pain and ordeal. it is really a miracle to be alive from such a fatality. it's all almighty's grace and the blessings of my parents as well as good wishes of well-wishers like you all people.
   I hope, I may be back in proper and sound health in another week.. currently my fingers are working fine.. and hopefully I assume that I will get well very soon.

   thank you once again, sri sharma tatayya, sri shyamaleeyam tadigadapa sir and sri nagamalleswara rao bandi sir..!
   it is said that sometimes adversities reveal the humanity levels in the persons. I am grateful that via Padma madam's Blog, I have these many well-wishers and I owe all this to lord malayappa.

   good night sir

   Delete
  5. అయ్యో...ఇప్పుడే చూస్తున్నాను.
   ఆఫీస్ లో బిజీగా, ఆదివారం కూడా డ్యూటీ ఉంది అందుకే చూడలేకపోయాను.
   సారీ టు రీడ్ అబౌట్ దిస్ శ్రీధర్ గారు.
   మీరు త్వరగా కోలుకుని చైతన్యవంతంగా ఆయురారోగ్యాలతో ఉండాలిని కోరుకుంటాను.
   Take Rest and Get Well Soon My Friend.

   Delete
  6. పద్మగారు.. మీ అందరి ఆశిస్సులు.. ఆ భగవంతుని అభయము.. ఇవన్ని ఉండగా త్వరిత గతిన కోలుకోగలనని ఆశిస్తున్నాను!

   Thank You Padma Gaaru, and everyone for the moral support in the time of adversity.

   May Lord Malayappa's Blessings Be Showered Upon Everyone.

   Delete
  7. శ్యామల్ రావు గారు, నరసింహ రావుగారు, నాగమల్లేశ్వర రావుగారు, శర్మ గారు, పద్మార్పిత గారు.. మీ అందరి సహృద్యతకు పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

   ఇహ నా ఆరోగ్య విషయానికి వస్తే క్రమక్రమంగా మెఱుగు పడుతోంది. ఈ రోజు డాక్టర్ పరిశిలించి భయము మరేమి అక్కరలేదని భరోసా ఇచ్చారు.
   చికిత్సనందించిన డా. కే. ఎస్ వేంకటాచలం, డా. బీ. స్రవంతి, డా. బీ. హిమబిందు బృందానికి ధన్యవాదాలు.

   శ్యామల్ రావు గారు మీకొక మాట: ఎదుటివారి మనోభావాలను హేళన చేసి ఆనందించేవారి విజ్ఞత ఎటువంటిదో పెద్దలు పూజ్యులైన తమవంటి వారికి తెలియనిదా.. గతమనేది కదలిపోయిన నావ.. జ్ఞాపకాల తోవ.. నా క్షేమం కాంక్షించి పలకరించారు నాకు ఎంతో సంతోషాన్నిచ్చే విషయం అది. అందులోనే మానవత దృక్పథం అవగతం అవుతోంది. కనుక నిశ్చింతగా ఉండండి.

   జై శ్రీమన్నారాయణ
   15.03.2017 19:03

   Delete
  8. సహృదయులకు ఎప్పుడూ మంచి జరుగుతుంది
   కోలుకుని మరింత ఉత్సాహంతో ఉరకలు వేస్తారు

   Delete
  9. Thank you Aakaanksha gaaru for your concern..

   మీ అందరి ఆదరాభిమానాలకు పాత్రుణ్ణి.

   Delete
 29. Dear Sridhar Bukya,
  Sad to read this.
  Wish you a full and speedy recovery to normal health.
  I'm sure, the offending car driver is responsible for the medical and other expenses resulting from this accident. You need not let that driver escape from the responsibility. Just saying sorry is not sufficient!

  ReplyDelete
  Replies
  1. Thank you Sir, for the kind concern, and I hope that I may recover with the current medication very soon, so that I may not go for the x ray scanning.
   The car driver had called her son, and then took me to the nearest medical centre for first aid, after that they accompanied me to my home. In another half an hour, I saw the doctor for further treatment, he asked me another visit on this wednesday. I hope the current medication will be sufficient to set right my back pain as well as other injuries too.
   I thank god for saving my life from a near fatality,and saving me, the only son of my parents. Moreover, the accident site was 500m away from Venkateswara Swamy Temple.

   I Hope Everything will be fine.
   Once Again Thank You Sir for your Concern.

   If the Doctor Examines me again on Wednesday and tell that I need no further treatment, I shall visit the Venkateswara Temple to thank him.

   Sri Raaghava Ramachandra Parabrahmane Namah

   Delete
  2. I sparingly visit this blog. I came here to express my concern for Sridhar Bukya and wish him a speedy recovery. Hope none would view this visit as spamming. Thanks to all.

   Delete
  3. ఎవరైనా Spamming అనుకుంటారనే అనుమానం ఎందుకు వచ్చింది శ్యామలరావు గారు? శ్రీధర్ గారిని మీలాగే పరామర్శించిన వారు ఇతరులు కూడా ఉన్నారు కదా, మా స్పందనని కూడా అలాగే అనుకునే ప్రమాదం ఉందా ఏమిటనే ఆదుర్దాతో అడుగుతున్నాను, ఏమనుకోకండి 🤔.

   Delete
  4. విన్నకోట వారు, ప్రస్తుతం కొన్ని నెలలుగా ఊపిరాడని పరిస్థితిలో ఉంది నా ఉద్యోగజీవితం. అందుచేత నేను ప్రస్తుతకాలంలో బ్లాగులు చూస్తున్నదీ‌ తక్కువే బ్లాగులు వ్రాస్తున్నదీ తక్కువే. ఇక్కడి అందరి స్పందనలూ కూడా పూర్తిగా చూడనేలేదు. ఈ‌బ్లాగుకు సంబంధించి నా పూర్వానుభవాలు విచారకరాలే. మాలికలో వ్యాఖ్యను చూసిన పిదప, కేవలం శ్రీధర్ గారిని పరామర్శించటానికే ఇక్కడికి రావటం‌ జరిగింది. మరలా ఏమన్నా అవాంచనీయమైన వ్యాఖ్యలు ఇక్కడ నాపైన వెలువడినా నేను చూసి స్పందించేందుకు అవకాశాలు తక్కువ కాబట్టి పై విధంగా వివరణ ఇచ్చుకున్నాను కాని వేరే ఉద్దేశం ఏమీ లేదు.

   Delete
  5. ఫరవాలేదు శ్యామలరావు గారు, మీరు చెప్పింది understandable.

   Delete
 30. శ్రీధర్ బుక్యా గారు, ఇప్పుడే గమనించాను ప్రమాదం గురించి మీరిక్కడిచ్చిన సమాచారం.
  మన మానాన్న మనం వెడుతున్నా కూడా ఏదో ఒక వాహనం వచ్చి మన పై పడిపోవడం ఈ నాడు రోడ్ల మీద మామూలైపోయింది. చాలా మటుకు వాహనదారుల నిర్లక్ష్యం, ఇదొక దురదృష్టకర ధోరణిగా తయారయింది. గుడ్డిలో మెల్ల మీరు ప్రాణాపాయం నుండి బయటపడడం.
  ఫ్రాక్చర్లు ఏమీ జరగలేదని డాక్టర్లు నిర్ధారించారని ఆశిస్తాను. ఎక్స్-రే తియ్యాలంటే తీయించుకోండి, అది మీ మంచికే. టి.టి. ఇంజక్షన్ ఇచ్చినట్లున్నారుగా. అలాగే ఏంటీ-బయాటిక్ మందులు (అవసరమైతే), నెప్పి నివారణ మాత్రలు ఇచ్చారని తలుస్తాను. నేను డాక్టర్ కాను గానీ - వీపుకు దెబ్బ తగిలిందంటున్నారు కాబట్టి బాగా విశ్రాంతి తీసుకోండని, ముఖ్యంగా కొంతకాలం పాటు ఏ రకమైన బరువులు ఎత్తవద్దని నా సలహా (ఈ జాగ్రత్తలు మీ డాక్టర్ గారు చెబుతారులెండి). ఇలా అడిగినందుకు ఏమనుకోకండి గానీ - మీ వయసును బట్టి చూస్తే షుగర్ లేదనే ఆశిస్తాను; ఒకవేళ దురదృష్టవశాత్తూ ఉంటే గనక కంట్రోల్ లో ఉంచుకోవడం ఎంతైనా అవసరం.
  నేనూ రోడ్ ప్రమాద బాధితుడనే, కాబట్టి ఈ విషయంలో మీకు సీనియర్ని 🙂. కాకపోతే మీరు యువకులే గనక త్వరగా కోలుకుంటారు. All the best and speedy recovery 👍.

  ReplyDelete
  Replies
  1. నమస్తే విన్నుకోట నరసింహ సర్.. మీరు చెప్పింది అక్షరాలా నిజం.. ఇంకో పావుగంటైతే ఇంటికి చేరుకుంటాననగా జరిగిన సంఘటన అది. నేనైతే ఆ ఇంపాక్ట్ కి కిడ్నిలు రప్చర్ అయ్యుంటాయా అని చాలా భయపడ్డాను. అదృష్టవశాత్తు అలాంటిదేమి జరగలేదు. కాని వెనకనుండి కారు ఢికొట్టడం వలన వీపుకి, చేతికి, కాలికి గాయాలతో బయటపడ్డాను. బుధవారం రివ్యు కి రమ్మన్నారు. అపటికి అంతా సర్దుకుంటే గనక అదే పదివేలు. టీ.టీ. ఇంజెక్షన్ తో పాటు వెన్నునొప్పికి జెల్, గాయాలకి డస్టింగ్ పౌడర్ ఇత్యాదులిచ్చారు సర్. కాకపోతే కాసేపు నిలబడి అనక కూర్చుంటే లేదా కాసేపు కుర్చోని అనక నిలబడితే మాత్రం నెప్పి భలేగా ఉంది. నా వయసు ముప్పై ఏళ్ళు సర్.. పైగా నాకు ఎలాంటి దురలవాటు లేదు.. మదుమేహం, అధిక రక్తపోటు లాంటివి లేవు.. ఇప్పటికైతే అంతా నార్మల్ అని డాక్టర్ గారి సలాహా. ఇలాగే వచ్చే బుధవారం కల్లా ఈ గాయాలు, వెన్నునెప్పి ఇవన్ని మానిపోతే స్థిరవారం నాడు వేంకటేశ్వరుని దర్శించుకుంటానని మొక్కుకున్నాను సర్.

   Thank You Sir, for the tips, advice and wishes. I am hoping a speedy recovery too. Looking forward to the Doctor's Advice Optimistically.

   జై అచ్యుతానంద
   13.03.2017
   05:22

   Delete
 31. శ్రీధర్ జీ
  శుభోదయం. నిన్నటికంటె ఈ రోజు బాగుంది కదూ! అదే కాలం చేసే చిత్రం. చిన్నవాడివి కదా! తొందరగానే మళ్ళీ పరుగులు పెడతావయ్యా! నడుము తగిలిన దెబ్బ మాత్రం అశ్రద్ధ చెయ్యద్దూ...భయంలేదు,భయంలేదు.

  భగవంతునిపై నమ్మకమే నడిపిస్తుంది. మీరు లేచేదాకా ఇలా పలకరిస్తే మీకు ఇబ్బందా?

  పద్మగారి బ్లాగ్ ని కబ్జా చేసేస్తున్నామా?

  ఆనంద వరద గోవింద

  ReplyDelete
  Replies
  1. 'అంతయూ మనమేలునకే' అనుకోమన్నారు. ఇదే మంచి తరుణం, భలే మంచి సమయం, ఒక బ్లాగ్ మొదలెట్టెయ్యరాదూ! :) ఈ మాటలు అక్కడే చెప్పుకోవచ్చూ! పద్మగారికి ఇబ్బందీ ఉండదు :)

   Delete
  2. శర్మ తాతయ్యా.. నా బ్లాగ్ నేను ముప్పై నవంబర్ రెండువేల ఏడు సంవత్సరంలోనే మొదలుపెట్టాను సుమి. కాకపోతే ఏదో సెటింగ్ తేడా వచ్చి ఎవరి కమెంట్లు అక్కడ పబ్లిష్ కావటం లేదు. పై పెచ్చు నరసింహా సర్ అనట్లుగా బహుశ పద్మ గారిని ఇబ్బందికి గురి చేస్తున్నామేమోనన్న సంశయం.. కాని వారు నాకు కూడా పెద్దలు, సహృద్యులు గనుక వారు ఏమనుకోరనే అనుకుంటున్నా.. తీరిక వేళలో ఏమి పాలుపోనప్పుడు లేదా మనసు బాగోలేనపుడు నా బ్లాగ్ ను సందర్శించి ఆ భావాలను అక్షరాలుగా మలచి టపాలుగా పెట్టడం అప్పుడప్పుడు చేసుకోపచ్చని నాకనిపించి దాదాపు పదేళ్ళ క్రితమే బ్లాగ్ లోకానికి వచ్చాను.
   విన్నుకోట సర్.. దీ ఫ్యాక్ట్ ఇజ్ నాట్ రియల్లి ఇన్ దీ ఏజ్.. ఇట్ ఇజ్ బట్ ఇన్ దీ స్పిరిట్.. సో ఐయామ్ హోపింగ్ ఏ స్లో బట్ స్టెడి రికవరి టూ నార్మాలిటి. మీరు చెప్పినట్లుగానే ఓ నెలరోజుల దాకా బరువులెత్తనులేండి.

   "మందర పర్వతాన్ని తన డిప్పపై మోసిన కూర్మ స్వామి, అటు ఇటు ఊగిసలాడుతు క్షీరసాగరాన్ని చిలికిన ముక్కోటి దేవతలు, హాలాహలాన్నే సేవించిన నీలకంఠుడు స్ఫూర్తి సహనానికీ."

   గోవర్ధనోద్ధార గోవింద

   Delete
  3. నిన్నటికి నేటికి కాస్త బాగుంది సర్.. అయ్యో సర్.. ఇందాకా తొందరపాటులో మీరు రెండు కామెంట్లు పెట్టెసరికి నేను ఒకటి మీది మరోకటి నరసింహ గారిది అనుకుని పైన అలా వారిని కూడా ప్రస్తావించి సంబోధించటం జరిగింది. తామిరువురు ఏమి అనుకోరనె భావిస్తున్నాను. నాకు పూర్తిగా నయమైతే ఈ "మాతృ శోకం" కవితలో గల ఈ కమెంట్ లైన్ లోనే తెలియజేస్తాను.

   "సర్వే జనాః సుఖినోభవంతు. సర్వే సంతు నిరామయా"

   Delete
  4. Thank you to all those who inquired about my health condition. I am really obliged for the responses, advices and blessings received wishing me a speedy recovery. I hope I shall be fine within a week to 10 days from now.
   I extend my sense of gratitude to each and everyone who have commented in response to my comment. Especially I thank Padma gaaru for giving this chunk of data platform for discussion regarding the same. I assure that if it caused any inconvenience to you or anyone then I sincerely apologize the same.

   With due regards and with folded hands, this I reciprocate as gratitude.

   13.03.2017
   06:43

   Delete
  5. sarmaగారు ...పర్వాలేదండి, ఇక్కడైతేనేం...ఇబ్బంది, కబ్జా వంటి పదాలని ఇబ్బంది పెట్టకండి:)
   పలకరింపులు, పరామర్శలు, చర్చలు, అభిమానం, అప్యాయతా, సలహాలు, సవరింపులు వంటివి మీ బోటి పెద్దలందరి నుండి కోరుతూ....మనఃపూర్వక ఆహ్వానం! _/\_

   Delete
 32. గొప్ప పోస్ట్ పద్మగారు.

  ReplyDelete
 33. దేశం మొత్తం పరేషాన్ ఉన్నది ఏం చేద్దాం?

  ReplyDelete
 34. చాలా అర్థవంతంతో కూడిన ప్రశ్నలు
  ఆలోచించ వలసిన విషయం.

  ReplyDelete
 35. దేశాభిమానం పెరిగింది. జై భారత్ మాతాకీ

  ReplyDelete
 36. దేశం ఏడువైపో దీని పయనం
  దుఃఖంతో పాటు అన్నీ ప్రశ్నలే
  తిరిగిరాని యువత కోసం పడిగాపులు
  మానవత్వం మరల చిగురించేది ఎప్పుడో?

  ReplyDelete
 37. అందరి అభిమానాక్షరాలకు నమస్సుమాంజలులు._/\_

  ReplyDelete
 38. అమోఘభరితం
  మీ
  రాతలు
  కవితలు

  ReplyDelete