ప్రణయ ప్రకృతి

మేఘాలతో మెరుపులే ఊసులాడెనేమో 
చినుకులే ధారగా కురిసి చిందులేసెనే..

వలపు వాయిద్యాలై రాగాలు ఆలపించగా 

పులకరింతలే పురివిప్పి నాట్యమాడెనే..

మచ్చటించిన మాటలతో ఎదకొలనే తడవ

ఎత్తు నుండి పల్లానికి పరవశం పారెనే..  

మురిసే నీటిముత్యాలే మోముకి సొగసులద్ద

అలలై ఎగసే ఆనందం పెదవులపై తేలెనే..

ప్రసరించే కిరణపు కాంతిలో కళ్ళు మెరవ 

మైమరచి తనువే ఇంద్రధనస్సుగా వంగెనే..

ప్రకృతల్లిన పచ్చని పందిట్లో ప్రేమకు పెళ్ళవగా

నేల మట్టివాసనలతో కమ్మని విందు చేసెనే..

ఊరటించిన కొమ్మరెమ్మలు కోటిదీవెనలు ఇచ్చి

పువ్వులనే అక్షింతలుగా చల్లుతూ దీవించెనే..

23 comments:

  1. ప్రకృతి పులకరించి పరవసించేంత బాగారాశారు

    మీ కలం అతిసుందరం.

    ReplyDelete
  2. "Personalization of Nature" is the Precise Description of Your Poem Padma Gaaru..

    With its lush greenery, and flowing rivers, it is a beauty in itself. The scents of flowers, the Myriad Hues of the Sky at various points of time, brings in a positive energy.

    The mesmerizing Waterfalls that are both a feast to Eyes and Ears, the Sunshine, Moon-lit Night and Cycle of seasons which the nature accomplishes brings in vibrant and vivid ambience that is peerless.

    ~Sri~

    ReplyDelete
    Replies
    1. kunikuniko kannaayi kannayi keni kaayi kanajuj rees karla.. panan yaadi baap kannaayi thoi under chuchaarepar thaalo thaalo rees kareni.. kasan kechi under reesemaa sadaai laad racha.. ghadeek rees karla.. ghadeek undena ramaadla.. ethini jaapaa yaadi an baapen kaayi rewnu..

      konni konni saarlu teliyakundaane okariki okaripai kopam raavachu.. kaani talli dandrulu vaari pillala patla chupinche kopam lo entho aapyaayata vuntundhii.. konsepu kopaginchukuntaaru.. konsepu vaallathone chakkagaa aadukuntaaru.. inthakante talli dandrulaku em kaavaali..

      at times, some get into a feud or quarrel without any particular reason whatsoever, but at times, the parents get angry upon their children, even it has more affection filled in it.. sometimes they get angry.. sometimes they play with them.. what else will the parents require other than this..

      kabhi kabhi anjaane hi sahi ek doosre ke beech ek ghussa aur aapas mein jhagdaa panap uttha hai.. balki.. kabhi kabhi apne bachon par mata pita ko bhi katai roop se thoda bahut naaraazgi ke kaaran tang ho utthe hein.. par us naaraazgi mein bhi ek apnaapan hota hai.. kabhi kabhi ghussa kar liya karte hain.. to kabhi kabhi unhi se mann bahlaapaate hain.. aakhirkaar isse jyaada aur kyaa chaahte hoti hai harek maata-pitha ko..

      Delete
  3. lovely lines
    beautiful painting
    but you are lazy :)

    ReplyDelete
  4. ప్రకృతి కురిపించిన ప్రణయానికి పద్మార్పిత అక్షరరూపం అద్భుతం.
    మీ పదకుసుమాలకు మేము పరవశం.

    ReplyDelete
  5. ప్రేమతో కాదు మీ పదాలతో పకృతిని మురిపింపజేసారు...కుడోస్ పద్మార్పితా

    ReplyDelete
  6. పరవశంతో ప్రకృతి చిరుజల్లులుగా కురిసింది మేడంగారు
    ప్రేమభావం పల్లంవైపుకి జారి ఆకాశాన్ని
    ఎగిరివెళ్ళి తాకినట్లు ఉన్నాయి మీరు వ్రాసిన కవితాక్షరాలు
    అందుకోండి అభినందనలు.

    ReplyDelete
  7. మీరు ఎప్పుడూ అద్భుతమైన కవితలు రాస్తారు.

    ReplyDelete
  8. once again you proved padmarpita-fantastic lyrics

    ReplyDelete
  9. ప్రేమజల్లుతో మనసు పులకరించింది
    బొమ్మలు పెట్టడంలో మీకు సరిలేరు
    నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను

    ReplyDelete
  10. మీ అక్షరాలతో మంచు బులెట్స్ వేసారు

    ReplyDelete
  11. ఈమధ్యకాలం లైఫ్ బిజీ అయిపోయింది
    మనసు ఊరటగుంది పద్మా కవితతో..

    ReplyDelete
  12. పువ్వులనే అక్షింతలుగా చల్లుతూ love it

    ReplyDelete
  13. ప్రకృతిని పదజాలంలో బంధించి తీరు మనసుకి నచ్చించి, ఆశిస్సులు-హరినాధ్

    ReplyDelete
  14. ఎత్తు నుండి పల్లానికి పరవశం బావుంది.

    ReplyDelete
  15. పక్షులు
    ప్రకృతి
    పుడమి
    పద్మార్పిత
    పులకరించె
    హా హా హా

    ReplyDelete
  16. మసక వెన్నెల పుల్కరింతలు
    వాన జల్లు గిలిగింతలు
    కారుమబ్బుల వెనుక దాగిన చంద్రుడు
    నిన్ను చూసిన వాడి చూపులు..
    ..
    ..
    మయూరి నర్తనలో వయ్యారాలు
    నీ సుగసుల ముందు దిగదుడుపు
    ప్రకృతితో కరిగి కదిలే నీ పదాలు
    మనసుని మురిపించె సవ్వడులు..

    ReplyDelete
  17. బాగుంది మేడంజీ

    ReplyDelete
  18. గిలిగింతలు పెట్టింది :)

    ReplyDelete
  19. ప్రకృతి ఆమె అందాల్ని పెంచి ప్రేమ పుట్టించి కదా!

    ReplyDelete
  20. తానే మారెనా లేక నన్నే మార్చెనా?
    ఏమైనారు పద్మార్పితజీ మీ పోస్ట్లు కరువైనాయి
    ఏల ఎందువలనా? యెల్లరూ కుశలమేనా?

    ReplyDelete
  21. అందరికీ పద్మార్పిత అభివందనములు _/\_

    ReplyDelete