ఏకమైనాము..

పలుకరించే పదిమందిలో నేనూ ఒకదాన్నై పలుకరిస్తే
పస ఉండదని పరిపరివిధముల యోచించి ప్రియా అన
ఉదయభానుని తొలికిరణంలా నిన్ను నేను చుట్టేసానని

వేల నక్షత్రాలు నిశిరాత్రి నందు నీ పక్కన చేరి నిదురిస్తే
ఈర్ష్య పడిన నా వయసు పిల్లగాలిలా వీచి నిన్ను తాక
నీ మనసంతా కోటికాంతుల వెన్నెలవెలుగు నింపేసానని

ఎన్నెన్నో వర్ణాలు ఏవేవో భావాలను కుంచెగా మార్చి గీస్తే
ఆగనన్న ప్రతి భావంలో నేనే వివిధ భంగిమల్లో అగుపించ    
వరించిన వలపు వశం తప్పి అతిసౌందర్య రూపం నాదని

సమస్యల సాగరాన్న నిన్ను ఆటుపోట్ల అలలు ఆవహిస్తే
గాబరాపడ్డ నా మనసు నిన్ను చేరి నేను తోడున్నానన
నీ జీవితపు నావను తీరానికి చేర్చే తెరచాపను నేనేనని

నీ సర్వస్వం నేనని చెప్పలేని నీ నిస్సహాయతని ప్రేమిస్తే
నువ్వు నాకు గులామువై చేయకు సలామని నేను అన
నా ప్రతిబింబమై నన్నంటి నాలోన నిన్ను ఐక్యం చేసావు!

22 comments:

  1. క్షేమమే అంటూ పోస్ట్ పెట్టి తెలిపినారు.

    ReplyDelete
  2. అన్నీ ప్రత్యేకతలు
    సొంతం కావాలనుకుంటే
    ప్రేమభావం
    నమ్మకం ముఖ్యం..
    అవి ఉన్నప్పుడు
    ఏకమై ఆనందం..

    ReplyDelete
  3. జీవితమే ఆటుపోట్ల సంద్రం
    దుఃఖానికి కృంగమాకు
    సంతోషానికి పొంగమాకు
    సుఖదుఃఖాలే జివితపు తక్కెట
    ఆడంబరమెందులకు ఆత్మీయత తోడుంటే
    జీవితం లిమిటెడ్ వర్షన్.. లెట్ హ్యాపినెస్ బీ అన్లిమిటెడ్
    మరల మరల రాని వసంతం.. మన జీవిత గమనం

    కవిత చిత్రం రెండు బాగున్నాయి పద్మ గారు

    ReplyDelete
  4. ప్రేమ తన్మయత్వంలో ప్రేమికులు ఊగి అదే భావనలో మమ్మల్ని ఊయల ఊపినట్లుంది మీ కవితాచిత్రము.

    ReplyDelete
  5. రమ్యం
    సుమధురం
    ప్రేమ కవిత్వం

    ReplyDelete
  6. అసలు విడిపోయింది ఎప్పుడు? :-)

    ReplyDelete
  7. చివరి పంక్తులు మనసుని తాకే విధంగా వ్రాసావు.
    చిత్రము నమ్మినట్లుంది.

    ReplyDelete
  8. ఓహ్..ఏమైనారని విచార పడితి
    ఇదా సంగతి..ప్రేమలో మునిగినారా..హా హా హా

    ReplyDelete
  9. వలపు అంతా కూర్చి పేర్చినట్లుంది మీ కవిత

    ReplyDelete
  10. ప్రేమలో అంతం అదేనేమో అర్పిత.

    ReplyDelete
  11. వరించిన వలపు వశం తప్పి
    ఎవరికి ఎలా సాధ్యం కాస్తా వివరించండి

    ReplyDelete
  12. పలుకరించే పదిమందిలో నేనూ ఒకదాన్నై పలుకరిస్తే పస ఉండదని స్పెషల్ కోసం ప్రాకులాడి ప్రేమలో మునిగిపోయె. మొత్తానికి ఏకమై కవితను సుఖాంతం చేసారు.Ha :)

    ReplyDelete
  13. పద్మార్పితం అంటే ఇదేమరి

    ReplyDelete
  14. వేల నక్షత్రాలు నిశిరాత్రి నందు నీ పక్కన చేరి నిదురిస్తే ఈర్ష్య పడిన నా వయసు పిల్లగాలిలా వీచి నిన్ను తాక, నక్ష్త్రాలకి అంత ధైర్యమా చెప్పండి...:) ప్రేమభరితం మీ కవిత.

    ReplyDelete
  15. Lovely pair
    Padma hope everything okay.

    ReplyDelete
  16. ప్రేమ ఎల్లప్పుడు మధురమే మీ కవితల్లో

    ReplyDelete
  17. విరిసిన మనసున..
    మురిసిన బాసలు..!

    ReplyDelete
  18. ఎన్నెన్నో వర్ణాలు ఏవేవో భావాలను కుంచెగా మార్చి గీస్తే
    ఆగనన్న ప్రతి భావంలో నేనే వివిధ భంగిమల్లో అగుపించ..అంతటా మీరే మీరు

    ReplyDelete
  19. విడిగా రిప్లైస్ కోరుతూ ఆదరించే మీకు విడివిడిగా సమాధానం ఇవ్వలేక పోతున్నందుకు మన్నించాలి-పద్మార్పిత_/\_ అందరికీ నమస్కారములు


    ReplyDelete