నన్ను మరువకు

మధుర జ్ఞాపకాలనే హృదయ పల్లకీలో ఊరేగించి
మనసంతా నిన్నే నింపుకున్న నన్ను మరువకు!

కొంత కాలానికి నీవు వేరొకరి గుండెలో కొలువైనా
నా గుండె సవ్వడై కొట్టుకుంటావు ఇది మరువకు!

ప్రకృతి అందాల పూలపానుపుపై నీవు పవళించినా
పరిమళమంతా నాశ్వాసలో దాగుంటుంది మరువకు!

యవ్వనం జోరులో పరువపు మత్తులో బంధీవైనా
విషాదపు ఎండలో నీ భాస్వామినౌతాను మరువకు!

పరిస్థితులు తారుమారై గతులుమారి మనం వేరైనా
కంట్లో ఉన్న నీ ప్రతిరూపాన్ని ప్రేమిస్తాను మరువకు! 

32 comments:

 1. Bhool na jaane O jaane jaana
  Barso ki yaadein O kasmein
  Adhoora hoon main bin tere O sanam
  Phir chale aana O jaana...
  Bhool ne ki baat na karna O sanam

  ReplyDelete
 2. పరిస్థితులు తారుమారై గతులుమారి మనం వేరైనా, కంట్లో ఉన్న నీ ప్రతిరూపాన్ని ప్రేమిస్తాను మరువకు..మనసుని మరల కరిగించారు

  ReplyDelete
 3. కదలికల కాలమిది జ్ఞాపకాలుగా ప్రతి ఘడియ మలుపు తిరిగే వేళ
  ఆశ నిరాశల కలగాపులగపు సానిహిత్యమిది అడియాశ బెట్టు చేసే వేళ
  నవ్వుల పూదోటలో చెమరింతల చినుకులు కురిసే కారు మేఘాలు ఆవరించే వేళ

  మరువకు ఏ ఘడియ నిలిచి ఉండదని
  బాధ కూడా కాలక్రమేణ అణగారి పోతుందని
  ఘడియలన్ని జ్ఞాపకాలుగా రూపాంతరం చెందుతాయని


  హై స్పిరిటెడ్ పోయేమ్ పద్మ గారు..

  వెన్ టైమ్ కెన్ మేక్ మొమెంట్స్ ఇన్డెలిబల్
  వెన్ టైమ్ కెన్ మేక్ హ్యాపెన్ ది అన్ఎక్స్పెక్టెడ్
  వెన్ టైమ్ కెన్ మేక్ యాంబియెన్స్ సో పీస్ఫుల్
  దెన్ టైమ్ కెన్ ఆల్సో హీల్ ఏ బ్రోకెన్ హార్ట్
  దెన్ టైమ్ కెన్ ఆల్సో సూథ్ ఏ టర్బులెంట్ మైండ్
  దెన్ టైమ్ కెన్ ఆల్సో రివైవ్ ఏ డిస్టర్బ్డ్ సోల్

  థంబ్స్ అప్ యాండ్ కుడోస్ పద్మ గారు

  ~శ్రీ~
  శిర్డివాసాయ సాయినాథాయ

  ReplyDelete
  Replies
  1. oooixviiiivxiiixivxxiiooo
   మనసు లోతున కానరాని గాయాలు
   తీరాలు వేరైనా సాగే జీవిత ప్రయాణాలు
   చెమరిన కనుల నడుమన జ్ఞాపకాలు
   oooixviiiivxiiixivxxiiooo

   Delete
  2. నవనీత ప్రియుడు..
   బృందావన విహారి..
   రాధిక మానస నివాసుడు..
   కేశవ ముకుంద మురారి..
   అచ్యుతానంతుని జన్మాష్టమి నాట మీకు శుభాకాంక్షల్ తెలియజేస్తున్నాను పద్మ గారు

   Delete

 4. మరువకు మరువకు మావా!
  పరువపు పడుచును నలిగితి పానుపు మీదన్
  పరిమళ మంతా పరచుకొ
  ని,రాధనము గోరుచుంటిని, సఖిన్ రమ్మా !

  చీర్స్
  జిలేబి

  ReplyDelete
 5. ఇదేమిటో కోరుకున్నవారు మరచిపోవడం బాధాకరం అలా జరుగదు అసలుసిసలైన ప్రేమ సక్యత ఉంటే. ఏమో మరచినా మరల జ్ఞప్తికి తెచ్చుకుని వలచును అనుకుంటాను.ఏమంటారు?

  ReplyDelete
 6. మనసులో నిండి ఉన్నవారు మనిషితో పాటు ఉంటారు ఇంక మరచిపోవడం ఎలా జరుగుతుంది మాడం పద్మార్పితాజీ

  ReplyDelete
 7. నిర్దయగా నువ్వు విడిచి వెళ్ళినా...
  నీ జ్ఞాపకాలు మాత్రం నను అనుక్షణం కాచుకొనే వున్నాయి..!
  నా ఆఖరి శ్వాస వరకు అవి తోడుగా,నీడగా
  ఉంటామని బాస చేసాయి.
  నేను గాడంగా విశ్వసిస్తున్నాను..
  ఎందుకంటే వాటికి నీ హృదయం లేదు ..
  ఉన్నదంతా నాపై ఎల్లలు లేని ప్రేమ మాత్రమే..!

  ReplyDelete
 8. మర్చిపోవద్దు మారిపోవద్దు
  దూరంగా వెళ్ళిపోవద్దు
  నీవు మాత్రమే నా ప్రేమ
  తెలుసుకో ఇది ప్రియతమా
  నువ్వే నా ఆశ, ఓదార్పు
  నువ్వే సర్వం నా లోకం
  నేను నీకోసం నువ్వు నాకోసం..!

  ReplyDelete
 9. ఎంత ఘాటు ప్రేమయో
  గుండెల్లో కంట్లో కొలువు తీర్చారు

  ReplyDelete
 10. మీ కవిత చదివి నేను రాసానండోయ్ FBలో..
  ...:)
  ... :)
  గట్టితనంలేని దారంతో అల్లిన వలపు
  తెగిపోతే ముడులువేసి అతికించు..
  అంతే కానీ కూడలిలో వదిలి దూరమై
  అంధకారంలో ముంచి మరచిపోవద్దు
  నమ్మించి మోసంచేసి శిక్షించవద్దు
  సాగే నావను నట్టేట్లో ముంచేయవద్దు..
  మరచి మరింత దగ్గరై ప్రేమను బ్రతికించు!

  ReplyDelete
 11. మరచిపోతే ఇకపై ప్రేమించుకునే వారికి ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది కదా పద్మగారు...ఆలోచించండి!

  ReplyDelete
 12. ఎక్కడ వున్నా
  ఏమిచేస్తున్న..మీ చిత్రాలు కవితలు వెన్నంటి ఉంటాయి
  మరచిపోవడం ఏమిటి ఏదో విధం గుర్తుకొస్తుంటాయి
  శ్వాస వున్నవరకు తలపుల్లో ఉంటారు నేస్తమా..

  ReplyDelete
 13. గుర్తించుకున్న గుర్తులు జ్ఞాపకాలై ఎప్పుడూ మరచిపోని రూపాలుగా గుండెల్లో నిక్షిప్తమైతే మరచిపోతారు మక్కువ చూపినవారు అనే గుబులు ఎందుకు. నిశ్చింతగా ఉండవచ్చు ప్రేమిస్తూ ప్రేమను పొందుతూ.

  ReplyDelete


 14. నిర్దయ గా నన్ను విడువ
  నర్దన ! పూర్వస్మృతులిట నను తాకెనుగా!
  వర్దా! నీ యూసుల తో
  పర్దా లై యార్ద్రమయ్యె పద్మార్పితమై !

  జిలేబి

  ReplyDelete
 15. బాగుంది పద్మ

  ReplyDelete
 16. ప్రేమ ఎన్ని మధుర జ్ఞాపకాలు ఇస్తుందో
  ఎడబాటు రెట్టింపు వేదనలు మిగులుస్తుంది

  ReplyDelete
 17. కష్టం వచ్చినప్పుడు మన అనుకున్న వారు తప్పక తలచుకుంటారు మాడం డోంట్ వర్రీ.

  ReplyDelete
 18. వలచిన వారిని మరచిపోవడం అసాధ్యం
  అందులో మీ కవితానాయకి మహా గడుసుది
  అంత ధైర్యం అతగాడికి ఎక్కడిది..హ హహా

  ReplyDelete
 19. భావవ్యక్తీకరణ ఏదో కొరవడింది.

  ReplyDelete
  Replies
  1. భావ వ్యక్తికరణ లో ఏదో కొరవడింది
   మాటల ధాటికి మనసు ముక్కలయ్యింది
   వ్యాకులత చేరి నవ్వే చెల్లాచెదురయ్యింది
   హా.. అన్ని కలగలసి తునాతునకలయ్యింది

   మీ కవిత కు సాగదీత.. విషాద ఛాయలో అనుకరిస్తే ఇలా ఉంటుందేమో నందిని గారు

   Delete
 20. మరచిపో మనస్తత్వం మాదికాదు
  మరువనిచ్చే పదజాలం మీది కాదు
  అంతా మిధ్య మేడం.
  మధ్యలో వచ్చిన భావాలు మధ్యలోనే పోతాయి.

  ReplyDelete
 21. మరపు అసాధ్యం

  ReplyDelete
 22. మరువపు మొలక పరీమళ
  సరితావుల కవిత సౌరు చదువ మరుతుమా ?
  మరు మల్లెల భావనలను
  మరిచి మరీ మనగలుగుట మాతర మగునా ?

  ReplyDelete
 23. నిజంగా వలచి మనసుకు మరచిపోవడం రాదుగాక రాదు...

  ReplyDelete
 24. మరువం మరువలేము ఊపిరి ఉన్నంత వరకు... touching the heart.

  ReplyDelete
 25. స్పూర్తిదాయక వ్యాఖ్యలకు
  అందరికీ నమస్సుమాంజలులు
  ప్రేమతో.....మీ పద్మార్పిత!

  ReplyDelete
 26. ముడివేసుకున్న మనసు మాటున
  మరిచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు
  నిరీక్షణలో కరిగిన ఎదురుచూపులు
  నెరవేరక కాలి బూడిదైన కలలు

  ReplyDelete
 27. మరచిపో తగునా అని మురిపంతో అడిగారు :)

  ReplyDelete
 28. మనసు పొంగిన ప్రేమ
  రాల్చిన కన్నీటి చుక్కలు
  నేర్చుకున్న జీవిత పాఠాలు
  అనునయించిన విజయ సత్యాలు
  అనుభవించిన ఆనంద ఐశ్వర్యాలు
  నిట్టూర్చిన అపహాస్యపు క్షణాలు
  అన్నీ గుర్తుకొస్తున్నాయి.

  ReplyDelete