అపరిచితులం అవుదాం...

మన ఈ పరిచయమేదో మనకు అచ్చిరాలేదు 
పద ఇద్దరం అపరిచితులం అయిపోయి మరల 
మంచిముహూర్తం చూసుకుని పరిచయమౌదాం!

నీ నుండి నేను నా నుంచి నీవు ఏమీ ఆశించక
తప్పొప్పులు ఎంచక ఇద్దరి చూపులు కలబడేలా
ఒకరినొకరు ఆకర్షించే కిటుకులేవో కనుక్కుందాం!
   
ఎడబాటు ఎదకొట్టుకోవడం పలుకలేదని అలగడం
ప్రేమలో హెచ్చుతగ్గులని తగవులాడుకోని జతలా 
మదిగోడలపై నీ నా పేర్లు పచ్చబొట్టు రాయిద్దాం!

అహపు అడ్డుగోడ తొలగించి క్షమని పందిరిగా అల్లి
పాత వలపుని నరికి తిరిగి పరిచయం పెంచుకుని
బాధల్ని ప్రక్కనెట్టి బలమైన బంధాన్ని ముడివేద్దాం! 

గాయమవని కొత్తమనసులు రెండూ పొట్లం విప్పి
ఒకరంటే ఒకరికి ఇష్టం ఆసక్తి పెరిగి పోటీ పడేలా
నాటి తప్పటడుగుల్ని మార్చి సప్తపదిగా నడుద్దాం!


40 comments:



  1. ఇక్కడ కూడా ముహూర్త ప్రాబల్యమేనా :) హతోస్మి :)


    జిలేబి

    ReplyDelete
  2. మరోసారి కమిట్ అయ్యి మరిన్ని తిప్పలు ఎందుకూ అంట?
    ఏక్ నిరంజన్ సోలో లైఫ్ బెటర్ కదా హ హా హా హా అహ

    ReplyDelete
  3. అహపు అడ్డు గోడ తొలగాలంటే మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే !


    ReplyDelete
  4. నాటి తప్పటడుగులు సరిచేసుకోవడం సాధ్యమా పద్మార్పితగారు?

    ReplyDelete
  5. అక్కా ఈ మీ భావం
    పెళ్ళి చేసుకుని విడాకులు తీసుకున్న దంపతులు మరల పెళ్లి చేసుకున్నట్లు అనిపిస్తుంది.
    మోహన్ గారి పెయింటింగ్ అమేజింగ్.....

    ReplyDelete
  6. గాయం కాని మనసులు ఉండవు
    ఏదో విధంగా అందరూ గాయపడతారు
    ఏమొలెండి మీ అంత అనుభవం లేదు
    చిత్రం మాత్రం సూపర్.

    ReplyDelete
  7. beautiful pic & lovely touching lyrics.

    ReplyDelete
  8. ఒక్కసారి అపరిచితులమై

    మనం ఇన్నాళ్ళూ వాదించుకున్నా

    ఇక పై నా కోసం నీవూ

    నీకోసం నేనూ జీవించేద్దాం!

    అన్నీ చిరాకులూ మరిచిపోయి

    మళ్ళీ ప్రేమలోపడదాం!

    జీవిత సాగరాన్ని ఈదుతూ

    నీ చేతులు నేనూ నా చేతులు నీవూ

    పట్టుకుని జీవితం సాగిద్దాం!

    ReplyDelete
  9. అపరిచితులుగా విడివడి ఒకరికి ఒకరము ఏమీ కానట్లు ప్రేమసాగరములో ఈదుతూ ఈ జీవనయానాన్ని మరోసారి అలసట తెలియని విధంగా అనుభవించడం మీరు చెప్పిన విధంగా ఎప్పటికీ సాధ్యపడదు కదండీ!

    ReplyDelete
  10. అద్భుతంగా మలచినారు

    ReplyDelete
  11. పదండి
    కటీఫ్ కటీఫ్ కటీఫ్
    రండి..
    దోస్త్ దోస్త్ దోస్త్
    హ అహా హా

    ReplyDelete
  12. అహపు అడ్డుగోడ తొలగించి
    క్షమని పందిరిగా అల్లి-Super

    ReplyDelete
  13. గాయమై విడిపోయిన మనసులు మరల క్రొత్త రూపం దాల్చి వికశించునా???

    ReplyDelete
  14. బంధాల్లో బందీ అయ్యాక... ఈ అపరిచిత వైపరీత్యం ఏలనో...

    ReplyDelete
  15. జరగని వాటిపై ఎక్కువగా స్పందించడం అనవసరమే అనిపిస్తోంది.

    ReplyDelete
  16. పరిచితులు అపరిచితులు అవుతారా...మీ భవల్లోనే సాధ్యం.

    ReplyDelete
  17. పరిచితులు చేసే గాయాల కన్నా అపరిచితులు వదిలే జ్ఞాపకాలే ఎంతో నయం. ఒక్కోసారి అవే పదిలం మధురం అనిపిస్తాయి అప్పుడప్పుడు అపరిచితులు సుపరిచితులుగా మారే ఆస్కారం కూడాలేకపోలేదు.

    ReplyDelete
  18. ఎడబాటులో ఎదలు కొట్టుకోవడం కామన్
    మీరు కొంచెం డిఫరెంట్ థింక్ చెయండి మ్యాడం

    ReplyDelete
  19. పరిచయాలు అపరిచితం అవ్వడం కష్టం
    అదే మన వ్యక్తిత్వం మంచిది అయితే అపరిచితులు కూడా పరిచయం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతారు. ఇక ప్రేం విషయానికి వస్తే ఒకసారి అభిమానం ప్రేమ అనేది ఏర్పడిన తరువాత చాలా కష్టం అది త్రుంచుకోవడము తరిగిపోవడము కూడా...

    ReplyDelete
  20. చాలా బాగుంది మీ ఊహ.
    మీ భావాలకు కొంచెం ఆర్ధ్రత ఎక్కువగానే కలబోసి రాసినట్లున్నారు. మనసు మడతల్లోతరచి చూసేకొద్దీ
    ఎన్ని రంగుల చిత్రాలో మీలో.

    ReplyDelete
  21. గొంతు దాటి రానీయకు
    గుండెలోని భావాలను
    గొంతులోనే త్రుంచేయి
    మనసులోని మాటలను
    కంటిలోనే ఇంకిపోనీయి
    కన్నీటి శోకాలను
    నవ్వు రాకపోయినా
    విరిసి నవ్వనీ పెదవులను
    వెలుగు లేనిదే
    నీడ కూడా రాదు నీతోను
    కాలం కలసిరానిదే
    అనుకున్నది జరుగదు...

    ReplyDelete
  22. భావసంఘర్షణ నుంచి ప్రేమ సంఘర్షణ దాకా... మీ అక్షరాలు పదిలం మేడం!!
    ఈ కవిత అద్భుతం!!

    ReplyDelete
  23. https://padmarpitafans.blogspot.in/2018/05/blog-post.html?m=1

    ReplyDelete
    Replies
    1. ఆరునెలలుగా అగుపించలేదు అభిమానసంఘం ప్రతినిధి అయ్యుండి మీరు ఈ విధంగా...అంతా కుశలమే కదా???

      Delete
  24. Anonymous22 May, 2018

    పీడా విరగడయ్యింది. మళ్ళీ కలవడం ఎందుకు చెప్పండి ? విడిపోవడములో ఉన్న అనందాన్ని పోగొట్టుకోవడానికా?

    ReplyDelete
  25. चलो एक बार फिरसे अजनबी बनजाये हमदोनो

    ReplyDelete
    Replies
    1. మావారు కూడా ఇలాగే అడిగారు కదా అని అపరిచితులమయిపోదాం అనేసుకుని ఒక సంవత్సరం దూరంగా ఉన్నాం.మళ్ళీ కొత్తగా పార్కులో మొక్కజొన్న కండెలు తింటూ ఊసులాడుకుని,సినిమాలు చూసుకుని టా టా బై బై చెప్పుకుని విడి విడిగా బ్రతకడం ఎంతబాగుందో చెప్పలేను. ఏ బాధ్యతా లేకుండా సోంబేరిలాగా(మీనింగ్ అడక్కండి) బ్రతకడం కూడా ఎంజాయ్ చేయాల్సిందే !

      Delete
    2. నిహారికగారు బాగా చెప్పారు.
      ఒకసారి ఒంటిరి జీవితానికి అలవాటు పడిన ప్రాణి బంధాల వంటి బంధిఖానాలో కూరుకుపోదు ఎగిరిపోవడానికే మొగ్గు చూపితుంది సుమా! పద్మార్పితగారు మీరు ఈ విషయమై ఆలోచించండి ధీర్ఘంగా హాన్.......

      Delete
    3. Anonymous23 May, 2018

      నీహారిక గారు,
      అద్బుతమైన పరధర్మము కన్నా, కాస్త చెత్తగా ఉండే స్వధర్మమే మిన్న అన్నారు. యాజిటీజుగా ఇలానే కాదనుకోండి. కొంచెం డీసెంటుగా, అధ్యాత్మికత మేళవించి. అంటే చెత్తపనైనా మన పని మనం చేసుకోవడమే మంచిది. అనవసర విషయాలలో తల దూర్చకుండా అన్నది. కొంత మంది తమ బరువు దించుకోవడానికి మనమీద లేనిపోని బాధ్యతలు పెడుతూ ఉంటారు. అంతేనా ఆ బాధ్యత మనదే అని మనల్ని దబాయించేస్తారు కూడా. అలాంటివాటికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి. ఇక్కడ పాయింటేమిటాంటే .. స్వధర్మాన్ని పాటించడం మాత్రమే కాదు, ఇతరులకు వారి ధర్మాన్ని వారే నిర్వర్తించాలని అది వేరే వారి నెత్తిమీద రుద్దకూడదని చెప్పడం అన్నమాట.

      Delete
  26. ఆగండి ఆగండి పద్మార్పితాజీ...ఆలోచించకుండా అపరిచితులం అయిపోదాం అని కమిట్ అయిపోతే ఆపై కష్టమేమో!

    ReplyDelete
  27. ఎంత మంది పరిచయస్తుల మధ్యన తచ్చాడుతున్నా..
    మనసుకి నచ్చిన వారు లేనప్పుడు అందరూ అపరిచితులే
    అభిమాన అక్షరపరిచయస్తులందరికీ అర్పిత అంజలిఘటిస్తున్నది!

    ReplyDelete

  28. బ్యూటిఫుల్

    ReplyDelete
  29. మీరు అందరికీ సుపరిచితులే
    మరచిపోదాం అనుకున్నా మరువనివ్వవు మీ పదబంధాలు.

    ReplyDelete
  30. సుమధుర రసవత్తరంగా అలరించారు భావాలని.

    ReplyDelete