అస్థిరం

జీవకణాలెన్నో వేగంగా యోనిలోనికి ప్రవేశిస్తేనేగా
క్షణంలో కణము గర్భంలోకి వెళ్ళి పిండమైపోయి
మొండెంలేని మొలతో లోన ఊపిరిపోసుకోవాలని
ఇరవైనాలుగు గంటలు అండాన్నిపట్టుకుని వ్రేలాడి
బ్రతికితే జీవంపోసుకుని లేకుంటే ముక్కలైపోతావు!

అలా కొట్టుమిట్టాడి పోరాటంచేసి బయటపడ్డావుగా
కాళ్ళుచేతులు నోరుకళ్ళు రూపం దాల్చుకున్నాయి
అవయవాలు అనుకూలించగా మోహం పెంచుకుని 
దేహానికి కొవ్వుపట్టగానే లేని మోజులకై వెంపర్లాడి
ఇప్పుడిక ఇష్టమొచ్చినట్లు ఎన్నైనా మాట్లాడేస్తావు!

నీమాట దేహమైనా వినేది అందం ఉన్నంతవరకేగా
ముడతలుపడితే అవయవాలన్నీ మొరాయిస్తాయి
దేహమే కాదు నీదనుకున్నదేదీ కూడా నీది కాదని
తెలిసీ ఆశగా హంగార్భాటాలతో అన్నిటికై ప్రాకులాడి
చివరికేమో ఎక్కడికో హఠాత్తుగా మాయమైపోతావు!

ఆమె...'నీ'భయం

 అప్పుడు వారు ఆమెను అత్యాచారం చేయలేదు
ఆమె పేగులతో ఆడుకుని పైత్యం తీర్చుకున్నారు
ఢిల్లీ బస్సులో రేప్ చేసి త్రోసివేసినా భయపడొద్దని
"నిర్భయ" అని నామకరణం చేసి నిద్రపుచ్చారు!
బాలికల బలత్కారాలెన్ని జరిగినా పట్టించుకోలేదు
అరకొరకగా న్యాయమంటూ అరిచారు నోరున్నవారు
అరవలేక అలసిన అమాయక పసిపిల్ల పెద్దవాళ్ళని
నిర్భందించి లేచిన అంగాన్ని ఆడించి నిద్రపోయారు!
కొవ్వు కరిగినా ఆమెను ఊపిరి పీల్చుకోనీయలేదు
ఒక్కడి దూలతో తృప్తి పడక గుంపుగా పైనపడ్డారు
అమానుషంగా అనుభవించిన తరువాతైనా అబలని
నిశ్చింతగా వదిలేయక కాల్చి నిద్రపొమ్మంటున్నారు!
ఇప్పుడూ జరుగుతున్నాయి ఎన్నో లెక్కతేలడంలేదు
పెంపకం తప్పనీ కాదు మగతనమదని చర్చిస్తున్నారు
చలించినవారు వ్యాఖ్యాలతో అలంకరించేసి తెల్లపేజీలని
"నిర్భయ3" లేదా 4-5-6 చట్టాలని నిద్రపోతున్నారు!
కొవ్వొత్తంటించే ఏ స్త్రీ ఎగిరే మొడ్డనెందుకు కాల్చలేదు
ఆడతనం అమ్మతనమని ఆమెను అణగమంటున్నారు
బలవంతం చేసేవాడి బుల్లిని కోసే బిల్లుని ప్రవేశపెట్టలేని
                                                                           ఏ ప్రతినిధులు ఆమెను నిర్భయంతో నిద్రపొమ్మనలేరు!