అస్థిరం

జీవకణాలెన్నో వేగంగా యోనిలోనికి ప్రవేశిస్తేనేగా
క్షణంలో కణము గర్భంలోకి వెళ్ళి పిండమైపోయి
మొండెంలేని మొలతో లోన ఊపిరిపోసుకోవాలని
ఇరవైనాలుగు గంటలు అండాన్నిపట్టుకుని వ్రేలాడి
బ్రతికితే జీవంపోసుకుని లేకుంటే ముక్కలైపోతావు!

అలా కొట్టుమిట్టాడి పోరాటంచేసి బయటపడ్డావుగా
కాళ్ళుచేతులు నోరుకళ్ళు రూపం దాల్చుకున్నాయి
అవయవాలు అనుకూలించగా మోహం పెంచుకుని 
దేహానికి కొవ్వుపట్టగానే లేని మోజులకై వెంపర్లాడి
ఇప్పుడిక ఇష్టమొచ్చినట్లు ఎన్నైనా మాట్లాడేస్తావు!

నీమాట దేహమైనా వినేది అందం ఉన్నంతవరకేగా
ముడతలుపడితే అవయవాలన్నీ మొరాయిస్తాయి
దేహమే కాదు నీదనుకున్నదేదీ కూడా నీది కాదని
తెలిసీ ఆశగా హంగార్భాటాలతో అన్నిటికై ప్రాకులాడి
చివరికేమో ఎక్కడికో హఠాత్తుగా మాయమైపోతావు!

34 comments:

  1. భావాల్ని మారుమ్రోగించిన పద్మార్పితా సలాం నీకు.

    ReplyDelete
  2. అమోఘం మీ అక్షరసంపద.

    ReplyDelete
  3. మొదటి అయిదు పంక్తుల్లో
    మొత్తం చావుపుట్టుకలు వ్రాసి
    రెండవ అయిదు పంకుల్లో
    విలాస జీవితాన్ని చూపి
    మూడవ అయిదు పంక్తుల్లో
    వేదాంతాన్ని భోధించారు..

    ReplyDelete
  4. మాటల్లేవ్...అత్యద్భుతం మీ భావకవితలు వాటి అమరిక తీరు.

    ReplyDelete


  5. वाम्मो! पद्मार्पितये :) एमिटी निर्वेदं :)

    ReplyDelete
  6. క్షణంలో కణము గర్భంలోకి వెళ్ళి పిండమై..great lyrics

    ReplyDelete
  7. బలమైన భావజాలానికి నీరాజనాలు
    వేదన వేదాంతం సమపాళ్ళలో రంగరించారు

    ReplyDelete
  8. ఈ వార్షిక మేటి కవిత 🙏

    ReplyDelete
  9. మీరు వ్రాసే భావాలకు అనుభవాలు తోడై ఉంటాయి
    అందుకేనేమో ఈ పవరు వగరు ఏమంటారు?

    ReplyDelete
  10. "మొండెంలేని మొలతో లోన ఊపిరిపోసుకోవాలని ఇరవైనాలుగు గంటలు అండాన్నిపట్టుకుని వ్రేలాడి"
    ఈ వాక్యాలు కేవలం మగవారికే వర్తిస్తాయి కదండీ. అధ్భుతంగా వ్రాసారు.

    ReplyDelete
  11. dehamu manishi anubhandham anuragamu anni asaswitamu. telisi kuda ventapadatamu ade manishi naijamu.

    ReplyDelete
  12. Dynamic love Founder you are.

    ReplyDelete
  13. పుట్టుక బ్రతుకు చావులు కలగలిపిన జీవిత వేదాంతం మీ ఈ కవితాసారాంశం. జీవితం ఒక ఆలోచన అయితే దానిద్వారా మనం శాంతీ, ఆనందం పొందాలనీ, అన్ని కష్టాలనూ అడ్డుకునే రక్షకసాధనంగా ఉండాలనీ కోరుకుంటాం కానీ కుదరదు. దాన్ని ఏవిధమైన లక్ష్యసాధనకు ఉపయోగించుకోవటం కుదరదు. మనస్సు కాలరహితమైన దాన్ని రూపొందించలేదు, తన లక్ష్యం కోసం దాన్ని మలుచుకోలేదు. దాన్ని ఉపయోగించుకోలేదు. కాలరహితమైనది ఉన్నప్పుడే జీవితానికి అర్థం ఉంటుంది. లేకపోతే, జీవితం అంటే దుఃఖం, సంఘర్షణా, బాధా. ఆలోచన ఏ మానవసమస్యనీ పరిష్కరించలేదు - ఎందుకంటే ఆలోచనే సమస్య కనుక. జ్ఞానం అంతం కావటమే వివేకానికి ఆరంభం.

    ReplyDelete
  14. Amazing words in each line.

    ReplyDelete
  15. నీమాట దేహమైనా వినేది అందం ఉన్నంత వరకే idi correct

    ReplyDelete
  16. జీవిత పరమార్థం అంటే ఇదే అన్నంత ఖచ్చితం మీరు వ్రాసిన పంక్తులు.

    ReplyDelete
  17. వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట
    చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీ వెంట

    చేతిలో అమృతము ఉన్నంత సేపే అన్నదమ్ములంట
    ఆ ఘాధం బై పోయేనాడు ఎవరురారు వెంట

    పంచ భూతముల తోలు బొమ్మతో ప్రపంచమాయ నట
    అంతము వరకు కించిత్ ఆశ తో పెంచెను జగమంతా..

    ReplyDelete
  18. అనంతానంత క్షణముల కలయిక కాలం
    కాలగమనానికి సరిలేదేది ఏ నాటికి మాయని ఇంద్రజాలం
    ఊపిరి పోయటానికి ఉబలాటం
    ఊపిరి పోయేనాటికి గుబులాటం
    తెలిసి తెలియని జీవిత గమనం
    తెలిసే లోపే సాగించేను పయనం

    ReplyDelete
    Replies
    1. రెప్పపాటు కాలం భూత వర్తమాన భవిష్యం
      కనుదెరిస్తే జననం కనుమూస్తే మరణం
      గడిచిన జ్ఞాపకాలం తెలియని భవిష్యకాలం
      ఆ రెంటి నడుమ మనసుకే ఎందుకో కలకలం
      వర్తమానమే సిసలైన కాలం
      కుటుంబం ఎంతదైన చివరాఖరికి కాటిపై ఏకాకి గానే ప్రజ్వలనం

      ఓం నమో భగవతే వాసుదేవాయ

      Delete
  19. అక్షరపఠిమతో అలరిస్తారు
    వేదన అయినా వేదాంతం అయినా

    ReplyDelete
  20. మీకు కలిగే భావాలకు నా సలాం.

    ReplyDelete
  21. WISH YOU HAPPY NEW YEAR

    ReplyDelete
  22. inka 2020 ki welcome cheppaledu

    ReplyDelete
  23. Wish you happy new year

    ReplyDelete
  24. అందరి ఆదరాభిమానాలకు ఎప్పుడూ అభివందనార్పణలు

    ReplyDelete
  25. ఆశ్చర్యం

    ReplyDelete
  26. ఎన్నో మిస్ అయ్యాను.

    ReplyDelete
  27. వచనకవితలోవివేచనాత్మకత మనసునోదార్చేపలుకులు
    చీవరికిదాంతపుతలపులు

    ReplyDelete