చివరికి మిగిలేది..

నా స్థితిగతులు తెలుసుకునేం ప్రయోజనం
నీ ఆస్తిపాస్తులు అన్నీ వేరెవరికోగా సొంతం
నా మానసికస్థితి బాగోలేక నేను ఏమైతేనేం
నీవు ఉండాలి ఆయువారోగ్యాలతో కలకాలం
నన్ను బాధపెట్టిన నీకే సంతోషం అర్పితం..
నా రాక తెలిసి భద్రతకై నీవారిని పిలుచుకో
నీ అమాయకత్వాన్ని చూసి నువ్వే నవ్వుకో
నేనెప్పటికీ సింహాన్నే నువ్వు ఇది తెలుసుకో
నన్ను అడ్డుకోడానికి కుక్కల్ని పిలిచావెందుకో
నీ మూర్ఖత్వానికివే నా జోహార్లు అందుకో..
పునాదుల గురించి మాట్లాడుకుందామా నేడు
బలంగా కట్టిన భవనాలతో పనిలేదు ఇప్పుడు
ఇరుగుపొరుగు అనుకుంటూనే ఉంటారెప్పుడు
డబ్బుందని గర్వపడాల్సిన అవసరంలేదిప్పుడు
అన్నీ తెలిసేసరికి వింటావు చావుచప్పుడు..

8 comments:

  1. మానసిక ప్రశాంతత అది బంధం తోనే
    ధనం కేవలం జీవితానికి ఆలంబన
    ఆయువు అంతంత మాత్రమే
    చావు సమీపించాక ఆరడుగుల స్థలం

    రెప్ప పాటు కాలం నవ్వులందులోనే
    హాస్య రసం తో పాటు వైవిద్యం

    ReplyDelete
  2. ఎవరిపైనో అంత కోపం మీకు?

    ReplyDelete
  3. Solo panic song lyrics are good to read.

    ReplyDelete
  4. వేదన పట్టుదల కలగలిసిన కవిత.

    ReplyDelete
  5. https://www.facebook.com/groups/kavisangamam/permalink/8679453732107302/

    ReplyDelete