ప్రేమ పయనం...


ఒక ద్వీపంలో ప్రేమ, సంతోషం, విషాదం, ఐశ్వర్యం, జ్ఞానం,అందం, సమయం, మిగిలిన వాటితో కలసి జీవిస్తుండేవి. ఓ రోజు ఆ ద్వీపం మునిగి పోబోతుందని తెలిసి అన్నీ ఎవరి దారిన అవి వేరొక చోటికి పయనమైనాయి.
ప్రేమ
తనకి ఎవరైనా సహాయము చెస్తారేమో అని ఆశగా కనబడిన వారిని అడుగుతూ, ఆ దారిన ఎంతో హంగు ఆర్భాటాలతో వెళుతున్న ఐశ్వర్యాన్ని అర్ధించింది. ఐశ్వర్యం ఎంతో దర్పంతో నా నావంతా బంగారం, ధనంతో నిండి వుంది నీకు చోటు లేదని చెప్పి వెళ్ళిపోయింది.
అటువైపుగా అందం వేరొక నావలో వెళుతూ నీవు నా పడవలో ఎక్కి ,దాన్ని తడిపేసి అంతా పాడుచేస్తావు అని ప్రేమ అడిగినదానికి ఒయ్యారాలు పోతూ సమాధానం చెప్పి చల్లగా జారుకుంది.
ప్రేమ విషాదాన్ని నీతోపాటు నన్ను తీసుకుని వెళ్ళవా అని అడిగితే..."ఓ ప్రేమా నేనే బాధలో వున్నాను నిన్ను ఏమి భరించను, నన్ను ఒంటరిగా వదిలివేయవా" అని చెప్పి వేడుకుంది.
సంతోషం
ఆనందంగా కేరింతలు కొడుతూ, ప్రేమ తనని పిలిస్తున్న విషయాన్ని కూడా వినిపించుకోలేదు.
ప్రేమ నిరాశతో ఏమి చేయాలో తోచక ఆలోచిస్తుంటే , ఒక గంభీరమైన గొంతు వినిపించింది.."ప్రేమా నాతో రా, నిన్ను నేను తీసుకుని వెళతాను....." అన్న మాటలకి ప్రేమ ఆనందం తో ఆ పెద్దరికాన్ని పేరు కూడా అడగకుండా వెళ్ళి నావలో కూర్చుండిపోయింది. ప్రేమని సురక్షిత ప్రాంతానికి చేర్చి ఆ పెద్దరికం తన దారిన తను వెళ్ళిపోయింది.

ప్రేమ తనకి సహాయపడింది ఎవరని
జ్ఞానాన్ని అడిగితే...."నిన్ను సురక్షిత ప్రాంతానికి తీసుకుని వచ్చి చేర్చింది సమయం" అన్న సమాధానాన్ని విని, సమయమా నాకు ఎందుకు సహాయపడింది!!! అని ఆశ్చర్యపోయింది ప్రేమ. జ్ఞానం నవ్వి " పిచ్చిదానా ఎందుకంటే సమయం మాత్రమే ప్రేమ ఎంత అవసరమో అర్థం చేసుకుంటుంది కనుక" అని చెప్పింది.

25 comments:

  1. బాగుంది.మీకుటుంబానికి మహశివరాత్రి శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. " ఎందుకంటే సమయం మాత్రమే ప్రేమ ఎంత అవసరమో అర్థం చేసుకుంటుంది"
    Wonderful post!!!

    ReplyDelete
  3. పద్మర్పితగారు ,,చక్కని స్టొరీ అండి,.ప్రపంచంలో దీనికీ మించిన గొప్ప ఆస్తి వేరెక్కడా లేదు అనేవారిలో నేను ముందుంటాను.నైస్.

    ReplyDelete
  4. ఆ సమయం నిజంగా సరైన సమయంలో వస్తే సంతోషం కూడా వస్తుంది పిలవని పేరంటానికి. అదే చే జారి పోయాక వస్తే విషాదమే వస్తుంది కాపురానికి.

    Good One

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. చాలా చాలా బాగుంది. Keep the good work going!!!

    ReplyDelete
  7. మీ కవితలు, వాటి లో ని భావాలు బాగున్నాయి......భావానికి తగినట్టున్న ఫోటో లు చాలా బాగున్నాయి..

    ReplyDelete
  8. chaalaa baagundi padmaa.. nice one

    ReplyDelete
  9. చాలా బాగా రాశారు. ఫోటోల మీద మీరు చూపించే శ్రద్ధ అమోఘం.. చాలా చక్కని ఫోటోలు సెలెక్ట్ చేస్తున్నారు..

    ReplyDelete
  10. నా బ్లాగ్ కి విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలని తెలియజేసిన ప్రతి ఒక్కరికి ఈ పద్మ అర్పిస్తుంది ధన్యవాదాలు....

    ReplyDelete
  11. Good one. Yes..Time is precious... Love is even precious.

    ReplyDelete
  12. ప్రేమపై మీ అభిప్రాయమది, మీదృష్టికి వచ్చినట్లు లేదు,అదేద్వీపంలో ’సేవాభావం’కూడా జీవిస్తోంది.ఎవరు ఆదుకున్నా ఆదుకోక పోయినా ప్రేమను భిజాలపై చివరివరకు మోసుకుపోయేది అదే.మానవాలికి రక్ష.
    -సుబ్బారెడ్డి

    ReplyDelete
  13. సుబ్బారెడ్డి గారు మీరు అన్నది నిజమేనండి సమయం సహాయ పడకపోతే సేవయే ప్రేమని మోసుకుని వెళ్ళేదేమో కదా!!!

    ReplyDelete
  14. ఇంటరెస్టింగా ఉంది. ఇలాంటిదే ఏదో మెయిల్ ఫార్వర్డ్ లో చదివిన గుర్తు. ఇదేదో పెద్ద విమర్శ కాదు గానీ మీ ద్వీపంలో గుమికూడిన వాటన్నిటిలోనూ సమయం ఒక్కటే odd man out గమనించారా? :)

    ReplyDelete
  15. మీకు చాలా ఓపిక౦డీ బాబూ! మీ బ్లాగులో అ౦త అర్ధవ౦త౦గా ఒక్కో పదానికి ఒక్కో ర౦గు ఇవ్వడమే కాక ప్రతి కవితకి ఓ ఉపమాన౦లాగా మీ ఫోటోలు ఇ౦కా అదిరాయి కద౦డీ. మీ సృజన మీ ఈఒక్క బ్లాగులోనే కాద౦డోయ్, మీ ప్రతి అక్షర౦లో బ్లాగులోని ప్రతి అణువులో చూపి౦చేసారు. మీ టేస్టులు చూస్తు౦టే ఇ౦క మీరు మీ ఇల్లు ఎలా సద్దుకు౦టారో చూడాలి అనిపి౦చి౦ద౦టే నమ్మాలి మరి!

    ReplyDelete
  16. Hello పద్మర్పితగారు,,,chala bagundhi me story...

    ReplyDelete
  17. చాలా బాగుంది.

    ReplyDelete
  18. సమయం odd man out కాబట్టే సహాయం చేసిందేమో కదండి!!! కొత్తపాళీగారు....
    thank Q...

    ReplyDelete
  19. ఆనంద్ గారు...thanx for ur compliment sir.
    ఒక్కనిముషం...good going keep it up... మహేష్ గారు..బహుకాల దర్శనం మా బ్లాగ్ కి..ధన్యవాదాలు!!

    ReplyDelete
  20. సమయమునకు లేవు స్వపర భేదమ్ములు -
    సమయమునకు కలుగు సమత, మమత!
    సమయమునకు లొంగు సర్వేశ్వరుండైన!!
    సమయ ఘనత నెరుగు జ్ఞాని మీరు!

    పద్మార్పిత గారూ! అభినందనలు!!!

    - డా.ఆచార్య ఫణీంద్ర

    ReplyDelete
  21. సమయమునకు లేవు స్వపర భేదమ్ములు -
    సమయమునకు కలుగు సమత, మమత!
    సమయమునకు లొంగు సర్వేశ్వరుండైన!!
    సమయ ఘనత నెరుగు జ్ఞాని మీరు!

    పద్మార్పిత గారూ! అభినందనలు!!!

    - డా.ఆచార్య ఫణీంద్ర

    ReplyDelete
  22. అంతటి జ్ఞానిని కాను నేను ఆచార్య ఫణీంద్రగారు......
    మీ అభినందనలే నా కలానికి పుట్టిస్తున్నాయి హుషారు.....
    Thanks a lot aswinisri garu....

    ReplyDelete
  23. very nice padma arpita garu

    ReplyDelete