వ్రాతలు........

మొన్నీమధ్య నేను నా స్నేహితురాలు కలసి జలవిహార్ కి వెళ్ళాము. మధ్యాహ్నం భోజనం చేసి అక్కడ ఇసుకలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, ఇద్దరి మధ్య వాదోపవాదాలు పెరిగి కోపంలో తను అనుకోకుండా నా మీద చేయి చేసుకుంది. వెంటనే క్షమించమని చెప్పి బయలుదేరదామంది. నేను సరే ఒక్కనిముషం అని చెప్పి అక్కడ ఇసుకలో నా స్నేహితురాలు నన్ను ఈరోజు చెంపదెబ్బ వేసింది అని వ్రాసి అక్కడి నుండి బయలుదేరాము. మనసులో తను చేయి చేసుకుంది అన్న భాధలో ఏదో ఆలోచిస్తున్న నాకు ప్రక్కన వేగంగా వస్తున్న ఆటోని చూసుకోలేదు. నా స్నేహితురాలు వెంటనే నన్ను లాగివుండకపోతే, నేను ఇప్పుడు బ్లాగ్ లో ఈ కధ వ్రాసేదాన్ని కాదేమో!!
మనసు బాగోలేదని కొద్దిసేపు నెక్లెస్స్ రోడ్ ప్రక్కన వున్న పార్క్ లో కూర్చొని వెళ్ళదామని అక్కడ ఏమైనా బల్లలు ఖాళీగా వున్నాఏమో అని చూస్తే ఎక్కడా దొరకక ఒక చదునైన బండ కనబడితే దానిమీద చతికిలబడ్డాము. తను నన్ను క్షమించమని మరీ మరీ ప్రాధేయ పడింది. నేను తనని ఆ విషయము మరచిపొమ్మని మనం ఎప్పటికి మంచి స్నేహితులమేనని చెప్పి నా హాండ్ బ్యాగ్ లో నుండి నెయిల్ కట్టర్ కి వున్న షార్పర్ తో బండమీద నా స్నేహితురాలు ఈరోజు నా ప్రాణాలు కాపాడింది అని చెక్కాను. దాన్ని చూసి తను ఏమిటి ఇంత కష్టపడి రాస్తున్నావు అని అడిగింది. ఏమిలేదు నీవు చేసిన మేలు నేను మరచిపోకూడదని గాలికి, వర్షానికి కొట్టుకుని పోవద్దని రాతిమీద వ్రాసాను. నేను కొద్దిసేపటి క్రితము ఇసుకలో వ్రాసిన విషయం ఇప్పటికి క్షమ అనే గాలికి కొట్టుకుని పోయివుంటుంది కదా! ఇంక వెళ్ళదామా అన్న మాటలకి తనుకూడా ఎంతో అభిమానంతో చేయిచాచి లేచింది, ఇంక వెళదాం పద అంటూ.....
"ఒక విషయం జరగడానికి క్షణాలు చాలు...
అర్థం చేసుకోవడానికి నిముషాలు చాలు...

ఆచరించడానికి గంటలు చాలు...

మరచిపోవడానికి జీవిత కాలం చాలు..."
ఇది ఇక్కడ ఎంతవరకు వర్తిస్తుందో తెలియదు కాని నాకు ఒక స్నేహితురాలు పంపిన SMS గుర్తుకు వచ్చింది .

4 comments:

  1. మీరు క్షమించి మరిచి పోయి , హాయిగా పని చూసుకుంటున్నరు... కానీ మీ స్నేహితురాలు జీవితంలో ఈ సంఘటన మర్చిపోదు ఇక.

    ReplyDelete
  2. చాలా మంచి విషయాన్ని చక్కగా చెప్పారు పద్మ..చిన్న చిన్న విషయాలకు కోపం క్షణికం అయితే పర్వాలేదు శాశ్వతం అయితే చాల కష్టం

    ReplyDelete
  3. Thanks for comments B.R.Reddy garu, Neastam & Murali garu...

    ReplyDelete