కలువ(పద్మ) వ్రాసిన కవిత...

గుణింతముతో కలువ(పద్మ) వ్రాసిందొక కవితను..

కాస్తంత మీ సమయాన్ని వెచ్చించి చదవమంటాను..

కించిత్ దయ ఎదుటివారిపై చూపమంటాను..

కీర్తి ప్రతిష్ఠలకై ప్రాకులాడడం ఏలంటాను..

కుబేరుడేల కుచేలుడిలా ఉండమంటాను..

కూడబెట్టినవి ఏవీ మనవెంట రావని అంటాను..

కృత్రిమమైన ప్రేమాభిమానాలు వలదంటాను..

కౄరత్వాన్ని మించిన పాపమేదీ లేదంటాను..

కెంపులు, కాసులు మనకెందుకని అంటాను..

కేటుగాళ్ళతో సహవాసమే మనకి వద్దని అంటాను..

కైలాసగిరికి మార్గము మంచితనమేనంటాను..

కొద్దో గొప్పో మంచిపేరుంటే అదే చాలనుకుంటాను..

కోటి విద్యల కూడులో కొంతైనా పరులకి పెట్టాలంటాను..

కౌసల్య సుప్రజా రామలకి కొంత సమయం కేటాయించమంటాను..

కంటికి కునుకు పడ్డాక పరుపైనా కటికనేలైనా ఒకటేనంటాను..

కః తో ఏదైనా ఒక మంచి మాటని సెలవీయండని అంటాను.!!!!

29 comments:

 1. " కలువ " గారు !
  " కౌ " ని మరచి పోయారు. కౌశల్యాన్ని చూపండి మరి !
  బాగుంది ... అభినందనలు!

  ReplyDelete
 2. బహు బాగు

  ReplyDelete
 3. కలువా
  కవనం
  కమనీయం.

  ReplyDelete
 4. బాగుందండి కొత్త ప్రయోగం..

  ReplyDelete
 5. అబ్బో.... కవిత కేకో...కేక!

  ReplyDelete
 6. పద్మ గారు,
  భలే రాశారండీ...విన్నూత్న ప్రయోగం...

  కౌసల్యాన్ని చూపటంలో కలువకి కలువే సాటి అంటాను.

  ReplyDelete
 7. పద్మా గారు,
  సరి రారు మీకు ఎవరు గుడ్
  All The Best Frnd
  Mirchy Varma

  ReplyDelete
 8. పద్మార్పిత గారూ,
  మీ ప్రయోగం బాగుంది. పెద్ద బాలశిక్షలో ప్రచురిస్తే బాగుంటుందేమో!

  ReplyDelete
 9. chala bagundhi.... Please check my blog also http://sarwaforyou.blogspot.com I think u will like this.

  ReplyDelete
 10. ఆచార్య గారు.....సరిచూసి "కౌ" పెట్టేలోపే మీ కంటపడింది(నెట్ డిస్కనెక్ట్ అవడం వలన).
  మీ అభిమానానికి కృతజ్ఞతలు.

  ReplyDelete
 11. పద్మ గారు, వినూత్న ప్రయోగం చాలా బాగుంది.. ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలు ఇంకా చేసి మాపై వదలమని వేడుకుంటున్న..ఆలకిస్తున్నారా నా అభ్యర్ధన??

  ReplyDelete
 12. సహృదయముతో స్పందించిన ప్రతి ఒక్కరికి పద్మ అర్పిస్తుంది నమస్సుమాంజలి.....

  ReplyDelete
 13. katti kaanna padunuga vundi mee kavitha...,
  all the best

  ReplyDelete
 14. పద్మా!

  మంచి ప్రయోగం. ఇన్ని పదాలు మీకెలా వచ్చాయి చెప్మా?

  మళ్లీ మళ్ళీ చదివాను మీ కవితని. చాలా బాగుంది కలువ భామా.

  ReplyDelete
 15. Srujanagaaru karakTugaa ceppaaru.

  beautiful experiment

  bollojubaba

  ReplyDelete
 16. కమనీయం గా ఉంది ...
  కాదని ఎవరు అనగలరు ...
  అమ్మో నాకు మీ బ్లాగ్ చూడగానే కవితలొచ్చేస్తున్నాయి :)

  ReplyDelete
 17. పద్మ గారు మీరు ప్రేమ పల్లకి దిగి "క"లువల కొలనులో విహరిస్తున్నారా? బాగుందండి.

  ReplyDelete
 18. పద్మార్పిత గారూ,కొత్త ప్రయోగం చాలా బాగుందండి.

  ReplyDelete
 19. hmm nice. but sometimes the magic of the letters takes away the beauty of the outcome. but here the result is different.

  the picture is nice.

  ReplyDelete
 20. BTW u may like it...

  http://booksandgalfriends.blogspot.com/2009/07/dhanaraj-manmadha-motorcycle-diaries.html

  ReplyDelete
 21. క చ ట త ప లతో కూడా ఒక టపా రాయగలరా కలువార్పిత గారు?

  ReplyDelete
 22. మల్లెమాల తలకట్టు
  సొగసు పలుకు దీర్గాలు

  ఇలాంటి ప్రయత్నం చేయరూ ....

  ReplyDelete