ఓ పుష్పమా!!

పుష్పమా!! నీవింత సుకుమారమా!
తుమ్మెద వాలితేనే త్రుళ్ళిపడేంత భయమా!
గాలికి కూడా ఊగిసలాడే అంత బేల తనమా!!!

ఇలలోని రంగులన్నీ నీకే సొంతమమ్మా!
భగవంతునికి మాకు మధ్య వారధివమ్మా!
ప్రేమను తెలిపే ఒక సాధనం నీవమ్మ!!!

నీ సువాసనలన్నీ మేము దోచుకుంటాము!
జ్ఞాపకాల గుత్తులుగా నిన్ను దాచేసుకుంటాము!
నిన్ను చూసే నవ్వడం మేము నేర్చుకున్నాము!!!


నీవు మౌనంగానే ఊసులాడగలవేమో!
చలికి ముడుచుకుని చెమ్మగిల్లుతావేమో!
తెల్లవారితే మరల నీవెట్లు విరబూయగలవో ఏమో!!!

18 comments:

 1. బాగుందండి పుష్పవిలాసం..

  ReplyDelete
 2. భాగుంది.

  ఇవేనా పూలు చేసేది? నెచ్చెలికి మన ఊసులు చెబుతాయి... మనకెన్నో కబుర్లు చెబుతాయి, మన మౌనాన్ని వింటాయి.

  వాటినలా చూస్తే మనకెన్నో ఊసులు చెబుతాయి కూడా.

  గమ్మత్తుగా వ్రాశారు ఈ కవిత.

  ReplyDelete
 3. బాగా రాసారు .. మరి రుద్రార్పిత అవుతా అని అన్నారు అదెప్పుడుమరి :)

  ReplyDelete
 4. This comment has been removed by the author.

  ReplyDelete
 5. రుద్రార్పితని మరచిపోయి కాసేపు పుష్పార్పిత అయ్యారు లెండి పద్మ గారు....అంతేనా పుష్పార్పిత గారు :)..

  ReplyDelete
 6. కలువల పుష్పగుచ్చమా ? బాగుందండి.

  ReplyDelete
 7. పద్మార్పిత గారూ,
  చక్కగా వుంది. ఈ కవితలో ఎలాంటి బాధాఛాయలు లేకుండా మధురంగా వుంది.

  ReplyDelete
 8. మురళీ గారు, గీతాచార్యగారు ధన్యవాదాలు!

  ఆత్రేయగారు అడిగారని ఆవేశానికి అక్షర రూపమిద్దామని ఆలోచిస్తుంటే ఆయసం తప్ప అంగుళం కూడా ముందుకి కదలడం లేదు నేస్తం!

  కిషన్ రెడ్డిగారూ మీరు కూడ నన్ను రౌద్రం మీద వ్రాయమనడం భావ్యమా!

  భాస్కర రామిరెడ్డిగారు....పుష్పం పై మీకింత అభిమానమా! ధన్యవాదాలు నేస్తమా!!!

  సిరాకిపుత్రగారు కృతజ్ఞతలు..మీరన్నమాట(వ్యాఖ్య)
  నాకు అందినట్టుంది ఒక పువ్వుల మూట!!!

  ReplyDelete
 9. పద్మార్పితగారు.. ఈసారి పూలబాణాలు వేసారన్నమాట!
  ఏదైనా మీకే చెల్లునండి...

  ReplyDelete
 10. Hi it is nice flower fragnance.... Please check my new post...
  http://sarwaforyou.blogspot.com

  ReplyDelete
 11. బాగా రాసారండి. బేసిగ్గా కవితలనే పదార్థం నా బుర్రకి కిలోమీటరు ఎత్తునుండి వెళ్ళిపోతాయి....మీ బ్లాగులోని చాలా పద్మాలు కూడా అలాగే వెళ్ళిపోయాయి...అయినా మీరు పెట్టే images కోసం చూస్తాను.
  ఈసారి బొమ్మా(ఇవి కూడా మీరే వేస్తారా ..?), కవితా( ఎందుకో మరి ఈసారి కొంచెం అర్థమైంది) రెండూ బావున్నయ్.

  ReplyDelete
 12. పద్మార్పితగారూ భలే రాశాఏ. అభినందనలు.

  ReplyDelete
 13. ఎప్పటిలాగానే బాగున్నది అని కాక ఏమి రాయను అని ఆలోచన....

  ReplyDelete
 14. Anonymous17 July, 2009

  పద్మార్పితగారు,చాలా బాగుంది..

  ReplyDelete
 15. చెప్పలేని భావమేదో నీవైపు తరుముతున్నది,
  వినని మనసేమో నీ స్నేహం విడువనన్నది

  ReplyDelete
 16. సృజనగారి, సర్వగారికి, నాగార్జునగారికి, వైష్టవిగారికి, యొహంథ్ గారికి, తృష్ణగారికి, హనుగారికి ధన్యవాదాలండి..

  ReplyDelete
 17. Very smooth expression. Sensitive as well as sensible.

  ReplyDelete
 18. పుష్ప సౌరభం గుభాళిస్తోంది మీ కవితలో ...

  ReplyDelete