ప్రేమా! దూరం దూరం...

నా హృదయ వీణను మీట ప్రయత్నిస్తే
నాలో ఊహలకు ఊసులు నేర్పితే
మనసుకి కళ్ళెం వేస్తాను
ప్రేమకి నే దూరం అంటాను.

నాలోని కోరికలు ఎగసి పడితే
అవి తీరం చేరని కెరటాలని తెలిస్తే
వేదనైనా పర్వాలేదు భరిస్తాను
నా మనసుని నేనే వసపరచుకుంటాను.

నా మనసు నా మాట వినను అంటే
మౌనంగా అది రేయింబగలు రోధిస్తే
గాయమైన మనసుతో దూరమౌతాను
పగిలిన మనసుని పదే పదే అతికిస్తాను.

నాలో సహనం నన్ను ప్రశ్నిస్తే
కన్నీటి జలపాతం బీటలుగా మారితే
మనసుని రాయి చేసుకుంటాను
జీవితమా! నీతో నాకు పనిలేదంటాను.

25 comments:

  1. > ప్రేమా! దూరం దూరం...
    ఆ మొదట దాన్ని గురించి ఆలోచిద్దామంటే వెంటనే రెండోవి, మూడోవి గుర్తుకువస్తాయి :-)

    ReplyDelete
  2. ముమ్మాటికి నిజమే రాసారు :-) .బాగుంది .

    ReplyDelete
  3. Anonymous26 June, 2010

    chala bagundi... :)

    ReplyDelete
  4. Anonymous26 June, 2010

    "నా మనసు నా మాట వినను అంటే
    మౌనంగా అది రేయింబగలు రోధిస్తే
    గాయమైన మనసుతో దూరమౌతాను
    పగిలిన మనసుని పదే పదే అతికిస్తాను"

    Dear padmarpita,
    these lines are Fabulous :-))

    ReplyDelete
  5. బావుంది...

    ReplyDelete
  6. ఎలా వుందని చెప్పమంటారు !
    బాగుందనా ?భారం గ వుందనా ?
    చాల లోతైన అందమైన భావాలూ ....!
    నిజం గ చాల అద్భుతం గ వుంది .

    ReplyDelete
  7. http://www.teamviewer.com/download/

    ReplyDelete
  8. పగిలిన మనసుని పదే పదే అతికించి రాయిగా మార్చగలిగినా చివరికది కరిగి ప్రేమ చెంతకే చేరుతుందని నాకనిపిస్తుంది. చక్కగా ఆలొచింపచేసేలా వ్రాసారు. కవితలతొపాటు చిత్రాలు కూడా బాగున్నాయి - సుర్యప్రకాష్ (ప్రకాశమానం)

    ReplyDelete
  9. chala baga rasaru... బాగుంది. అద్భుతం

    ReplyDelete
  10. ప్రేమ లేని జీవితమా !!!!!!!1 ......
    ..... అబ్బో ఊహించుకుంటేనే బయమవుతుంది.......
    మీ బ్లాగ్ పై మీకు ప్రేమ లేదా......????????
    మీరు రాసిన తీరు బావుంది..

    ReplyDelete
  11. ప్రతి స్పందనకు....వందనము!

    ReplyDelete
  12. ఆలస్యంగా వచ్చి ఆస్వాదించాను.

    ReplyDelete
  13. మీ బ్లాగ్ చాలా బావుందండీ. అందమైన భావాలు. వాటికి తగ్గ images.

    ReplyDelete
  14. చాలా చాలా చాలా చాలా బాగుంది.

    ఇలా రొటీన్ గా కాకుండా కొత్త పదాలేమైనా వుంటే బాగుండునండీ చెప్పేందుకు(అదే అర్ధం వచ్చేట్టుగానే సుమా)..

    ReplyDelete
  15. This comment has been removed by the author.

    ReplyDelete
  16. ప్రేమ నుండి ఎంత దూరం ఎన్నాళ్ళని పారిపోతారు?

    ReplyDelete
  17. మీరే దూరం దూరం అంటే ఎలాగండి పద్మార్పితగారు??????

    ReplyDelete
  18. చాలా దగ్గరగా ఉండి దూరం అని..అన్నట్టనిపించింది..

    "కన్నీటి జలపాతం బీటలుగా మారితే" ఈ లైన్ నాకు అర్ధం కాలేదు (కనక్ట్ చేసుకులేక పోయాను..) ..

    ReplyDelete
  19. good one, rhythmic to read

    ReplyDelete
  20. Anonymous14 July, 2010

    roedhistea kaadu padmagaaru,roedistea kadaa:) !anyway achutappeagaa parleadulenDi!

    ReplyDelete
  21. I thought you are different from other padmarpita blog coz of change in profile pic.

    ReplyDelete