ఇలాగైతే ఎలా?

చెలికాని మది చెరకు కన్నా తియ్యనంటే
చీల్చితినడం కన్నా చేదే నయమన్నది!

చెలీ నీకు నేను గొడుగునౌతానంటే
జడివాన జల్లులో తడవడం ఇష్టమన్నది!

అతని మనసున బంధీవై ఉండమంటే
విశాల ప్రపంచంలో విహంగాన్ని నేనన్నది!

ఆమె వేసిన అడుగుని పెదవి తాకిమట్టంటుకుంటే
ముద్దాడబోయిన పెదవులను మట్టివాసనన్నది!

రంగుల కుంచెతో జీవితాన్ని రంగరిస్తానంటే
తెలుపు తప్ప తనకి వేరేది తెలుపవద్దన్నది!

రాగరంజమై తనలో లీనమై పోదామనుకుంటే
కర్ణభేరికి అన్నీ కన్నాలే వున్నాయన్నది!

ప్రతిదానికి ఇలా ఏదో ఒక వంక పెడుతుంటే
అతనిలోని ప్రేమ ఆమెకు ఎలా తెలిసేది!

20 comments:

  1. బావుందండి...
    ఈమధ్యన మీరు ఎక్కువగా వైరాగ్యంతో కూడినట్టు రాస్తున్నారు (నాకు మాత్రమే ఇలా అనిపిస్తుందా ?) ఏదైనా కారణముందా...

    ReplyDelete
  2. అలాంటిది ఏమీ లేదండి....
    భావాలకి వైరాగ్యమా చెప్పండి:)

    ReplyDelete
  3. చక్కటి భాష. ఎంతో బాగుందండి.

    ReplyDelete
  4. చాలా బాగా వ్రాశారు. ఫీల్ బావుంది. మీ బొమ్మల సెలెక్షన్ అద్భుతం.

    ReplyDelete
  5. "చెలీ నీకు నేను గొడుగునౌతానంటే
    జడివాన జల్లులో తడవడం ఇష్టమన్నది!"

    నాకీ లైన్స్ బాగా నచ్చాయండి. మీకీ బొమ్మలు ఎలా దొరుకుతాయండీ? భలే ఉంటాయి.

    ReplyDelete
  6. ఇలాగైతే అతనిలోని ప్రేమ ఆమెకు ఎప్పటికీ తెలీదు...కాబట్టి అతను వేరే పార్టీ చూసుకోవటం బెటర్..:)

    ఎప్పటిలాగే బాగా రాసారు..భావ సారూప్యత బొత్తిగా కొరవడిన జంటలనే మీరు ప్రేమికులుగా తీసుకుంటారు మీ కవితల్లో..ఎందుకలా?

    ReplyDelete
  7. పద్మార్పిత గారు!
    చాలా నచ్చింది. నాకు మాత్రం పాజిటివ్ గానే ఉందనిపించింది.

    చెలీ నీకు నేను గొడుగునౌతానంటే జడివాన జల్లులో తడవడం ఇష్టమన్నది!
    అతని మనసున బంధీవై ఉండమంటేవిశాల ప్రపంచంలో విహంగాన్ని నేనన్నది!

    ఈ లైన్లు నాకు బాగా నచ్చాయి.

    ReplyDelete
  8. చాలా బాగుంది...

    ReplyDelete
  9. Hi Please visit:

    http://kanushi.blogspot.com/2010/07/blog-post_20.html

    Some words might be confusing. I tried to give better version: a boy expressing in a way a girl understands inspired from your "ilagaite ela".

    ReplyDelete
  10. బాగా రాసారు.

    ReplyDelete
  11. చెలీ నీకు నేను గొడుగునౌతానంటే
    జడివాన జల్లులో తడవడం ఇష్టమన్నది!"

    ఆ అమ్మాయి ఎవరో అచ్చం నాకులా ఎడ్డెం అంటే తెడ్డెం అంటుందేమో :)

    ReplyDelete
  12. పద్మార్పితగారి ప్రేమభావం మరొక్కసారి తొంగిచూసిందిగా కవితలో:)

    ReplyDelete
  13. Anonymous23 July, 2010

    బావుంది...పాపం అబ్బాయి,ఆ ఆమ్మాయి కోసం చాలా కష్టపడుతున్నట్లున్నాడు ఈ కవిత లో :-)

    ReplyDelete
  14. This comment has been removed by the author.

    ReplyDelete
  15. బాగుంది ... ఎవరండీ ఆ అమ్మాయి ఇట్లా అంటుందా మరీ

    ReplyDelete
  16. ఇలాగైతే ఎలా పద్మార్పిత గారూ.. చాలా రాసేసి ఉంటారు అని బ్లాగ్ తెరిస్తే చాలా కొద్ది కవితలు మాత్రమె కనిపించాయి.. అన్నట్టు బ్లాగులు గురించి రాసిన టపాలో నా బ్లాగునీ తలచుకున్నారు కదూ.. ధన్యవాదాలు. రాయడం కొనసాగించండి మరి..

    ReplyDelete
  17. హెల్లొ నా పేరు సుధీర్ , మీ బ్లాగు ని చూసాను....కవిత లు ఇంకా అన్ని చదవలేదండి... కానీ నాకు చాలా నచ్చేసిందండి మీ బ్లాగు...
    నీను కవిత్వమ్ రాయలేకపోయినా నేను ఎక్కడొ పత్రిక లో చదివినది మీ బ్లాగు లో వుంచుతున్నా ... :)

    "నా వెనుక ఎంతోమంది ... ఏం లాబం... అంతా గోతులు తవ్వెవారె...
    ..... ఐనా గోతులు తవ్వేది వెనుకే గా....నేను ముందుకు సాగిపొతా.... "

    నాకు చాలా నచ్చిన ఈ 2 లైన్లు మీ కోం మీకు నచ్చుతాయని ఆసిస్తూ.... సుధీర్

    ReplyDelete
  18. చెలీ నీకు నేను గొడుగునౌతానంటే
    జడివాన జల్లులో తడవడం ఇష్టమన్నది!
    నాక్కూడా ఈ లైన్లు బాగా నచ్చాయండీ! :-)

    ReplyDelete
  19. ఎంతో బాగుందండి

    ReplyDelete