ఏదీ ఏకంకాదు..

ఈ రంగులు మారే లోకంలో
ఏ రెండు రంగులు ఒకటికావు
ఒకదానికోసం మరొకటి మారదు.

అనునిత్యం సాగే సృష్టిలయలో
ఏ ఇరువురి రాతలు ఏకంకావు
ఒకరి గీతను ఇంకొకరు మార్చలేరు.

ఈ స్వార్ధపు అనిశ్చల జగతిలో
ఏ జతల భావాలు అతికిసాగవు
ఒకరి భావాలతో వేరొకరికి పనిలేదు.

అనురాగ ఆత్మీయతల లోగిలిలో
ఏ జంట మనసులు ఒకటికావు
ఒకరికి బదులుగా వేరొకరు చావరు.

ఈ అనంత జీవన పయనంలో
ఏ బాంధవ్యబంధాలు శాశ్వతంకావు
ఒంటరితనానికి ఎవరూ జతకూడలేదు.

41 comments:

  1. అవును ఇది మాయాలోకం!
    మాయను అర్ధం చేసుకోలేక బంధాల చట్రం లో కూరుకుపోతాము
    విదదీయలేని బంధం అంటూ,ఒక్కరే చేస్తే అనంత లోకాలకి ప్రయాణం
    తోడుగా ఉన్న జాబిలమ్మకు అంతులేని శాపం!

    ReplyDelete
    Replies
    1. శాపవిమోచనమును సెలవీయండి మరి:-)

      Delete
  2. నిజమే...కానీ ఏమిటీ వైరాగ్యం?

    ReplyDelete
    Replies
    1. వైరాగ్యం కూడా అప్పుడప్పుడు ఆరోగ్యం:-)

      Delete
  3. అప్పుడప్పుడు ఇలాంటి పోస్టులతో మా కళ్ళు తెరిపిస్తారు...అభినందనలు పద్మార్పిత గారూ..

    ReplyDelete
    Replies
    1. కళ్ళుతెరిపిస్తున్నానో లేక కళ్ళకు గంతలు కట్టుకుంటున్నానో
      అనిపిస్తుందండి ఒకోసారి...ఎందుకు ఏమిటి అని అడకండి!!!
      ఇలాంటి అంతులేని భావాలఝరే ఈ .....పద్మార్పిత:-)
      ధన్యవాధాలండి.

      Delete
    2. మా కళ్ళ గంతలు విప్పే మీ అనంత భావవాహినికి జయహో అండీ..

      Delete
    3. వర్మ గారు మీ బ్లాగు లో కామెంట్ వ్రాద్దామంటే అనుమతించటం లేదు.అందుకని ఇక్కడ వ్రాస్తున్నాను.పద్మార్పిత గారు ఏమనుకోకండి.
      ఆ జడత్వాన్ని మీ భావ ప్రకంపనలతో ,మీ కవితా ఝరితో ,వదలగొట్ట గలరు లెండి.చక్కని కవిత .మీ కవిత మే 1 న విజయవాడ లో విడుదల చేసిన పుస్తకం లో చూసాను.ఇంతకు ముందు ఒకసారి మీ బ్లాగు లో వ్యాఖ్య వ్రాసాను.ఈ మధ్య గమనించలేదు.నిన్న వ్యాఖ్య వ్రాద్దామంటే మీ బ్లాగులో అనుమతించలేదు software.సరిచూడగలరు వీలుచూసుకుని అన్ని చదువుతాను.మీకు అభినందనలు.నా బ్లాగుకు మీకు ఆహ్వానం.

      Delete
    4. రవిగారూ ధన్యవాదాలు.. అలాంటి సాంకేతిక పరిజ్నానమేదీ నాకు లేదండీ..అయినా అందరూ వ్రాస్తున్నారు. మరి ఎందుకిలా జరిగిందో..

      Delete
  4. హుమ్...అంతా ఉట్టుట్టిదే అంటారా? మరెందుకీ తాపత్రయాలు చివరిదాకా...అన్నీ నెరవేరని ఆశలేనా?
    వండర్‌ఫుల్ కవిత...

    ReplyDelete
    Replies
    1. అంతేనేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు...ధన్యవాధాలండి.

      Delete
  5. బొమ్మ మీదేనా ఈసారన్నా? మీ స్టైల్ చూడాలని, కానీ మీరు పెట్టే బొమ్మల్లో ఏదీ మీదో, ఏది కాదో తెలియటమే లేదు. ఇది మీరేసిందే అని...అవునా?

    ReplyDelete
    Replies
    1. చూసార! పేరు రాసి ఉంటే ఇలా మీతో మరోమారు అడిగించుకోలేను కదా!:-)
      నేను పెయింట్ చేసిందే.....ఒరిగినల్ అంత గొప్పగా కాదులెండి (నవ్వుకోకండి)
      కాపీరైటర్ కి స్టైల్ ఏంటండి...గమనిస్తే మీ స్టైల్ అందులో ఉన్నట్లుంది నాకు:-)

      Delete
    2. అడగ్గా అడగ్గా ఇన్నాళ్ళకి మీ బొమ్మ అని చెప్పారు, చాలా బాగుంది. కాపీ అయితే సంతకం పెట్టకూడదని ఎక్కడా లేదు, సంతకం, డేట్ రెండూ వెయ్యటం అలవాటు చేసుకోండి, లేదంటే కొంత కాలం తర్వాత unknown artist paintings గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. పెయింటింగ్ పై "పద్మార్పిత" అన్న పేరు రాసి చూడండి, మరింత గొప్పతనం వస్తుంది. ఆర్టిస్ట్ అంటే లేనిదే సృష్టించాలని ఎక్కడా రూల్ లేదు, చాలా మంది అచ్చు గుద్దినట్టు ఇంకొకరిది వెయ్యటమూ ఆర్ట్ ఏ నా అనీ వాదిస్తారు, కానీ అందులో నైపుణ్యం ఉందని గ్రహించలేరు, చూసి కాపీ కొట్టటం అంత సులభం అయితే ఈ భూమిపై ప్రతివారూ ఆర్టిస్ట్ లు అయ్యేవారు ;)
      మా స్టైల్ కూడా ఇమిడ్చేశారా అందులో ;)
      Superb!

      Delete
    3. ఇది ఇక్కడ చర్చించడం ఎంతవరకూ సమంజసమో నాకు తెలీదు కానీ....మీరు రాసింది చదివాక నాకు మీతో పంచుకోవాలనిపించిన ఒక గత సంఘటనని గుర్తుచేసుకుంటున్నానిలా......
      అప్పట్లో విరివిగా పెయింటింగ్స్ చూసి కాన్వస్ మీద, చార్ట్స్ పైన, చివరికి కాగితం కనిపించి కంటికింపుగా అనిపించింది కాపీ చేసేదాన్ని. బేసిగ్గా నేను సైన్స్ స్టూడెంట్ ని కావడంతో అలా అది ఆనందంతో కూడిన అలవాటుగామారి చాలా మంది రికార్డ్స్ లో డ్రాయింగ్స్ నేను వేసేదాన్ని. 2 రోజులకి ఒక అనాటమీ రికార్డ్ పూర్తిచేసిచ్చేదాన్ని అంటే మీరునమ్మరేమో. ఇప్పటికీ నా ఫ్రెండ్స్ అంతా కలిసినప్పుడు మేము నీవు వేసిన డ్రాయింగ్స్ దాచుకున్నాము అంటే ఎంతో హాపీగా అనిపిస్తుంది. ఇది చాలదాండి!
      ఇంక మీరు ప్రస్తుతించిన విషయానికి వస్తే.....ఒకసారి నేను వేసిన(కాపీ) పెయింటింగ్స్ ని చిన్ని ఎగ్జిబిషన్ లా పెట్టి నాకు తెలిసిన ఒక ప్రముఖ చిత్రకారున్ని పిలిస్తే ఆయన పెయింటింగ్స్ చూసి చాలా బాగా కాపీ కొట్టావు కానీ వాళ్ళన్నే తొలగించాలని చూడకు అన్నారు. ఇది నా జీవితంలో నేను సొంతగా వేసిన పెయింటింగ్స్ కూడా పేరు రాసుకోవడానికి ఆలోచించేలా చేసింది. మీరు నా చిత్రాల్లో అది గమనించే ఉంటారు ఒక పాతిక చిత్రాలు నా సొంతవే అయినా నేను ఎక్కడా పేరు రాయను. ఎందుకో అలా నాలో ఆ భావం పోలేదు.
      నిజానికి నేను అప్పుడు నిలువెత్తు కాన్వాస్ పై రవివర్మగారు వేసిన చిత్రాన్ని చాలా బాగావేసాను (అనుకున్నా) అని ఆయనగారిని మించిపోయావని (అత్యాశే అనుకోండి) మెచ్చుకుంటారని అనుకుంటే ఇలా అనడమే కాకుండా ఒక నవలని మనం పేర్లు మార్చి కొద్దిగా అటుదిటు రాసి కాపీ చేసి నీదే ఆ రచన అంటే ఒప్పుకుంటావా అని వక్కాణించారు, అంత గొప్పవ్యక్తి అలా అన్నారంటే అది నిజమేకదా.....
      అయినా బ్లాగ్ లో నా భావాలతో నా చిత్రాలని మీ అందరితో పంచుకుంటున్నాను కదండీ, మీ ప్రశంసలు, ఆత్మీయ స్పందనలు చాలండి ఇంక పేరుదేముంది మీ మనసుల్లో ముద్రించబడ్డాక!
      మన్నించాలి....మరో విధంగా అనుకోకండేం:-)

      Delete
    4. Anonymous01 July, 2012

      పద్మార్పిత గారికి,
      చిన్ని ఆశ గారు చెప్పిన విషయం తో నేను ఏకీభవిస్తున్నాను. నేను స్ట్రాంగ్ గ చెప్పే సలహా ఏంటంటే మీరు కాపి చేసినా మీ పేరు వేసుకోవచ్చు. అంతే కాదు ఆ ఒరిజినల్ బొమ్మ కూడా పెడితే ఇంకా బాగుంటుంది. నేను ఎందుకు ఈ సలహా ఇస్తున్నానో చెప్తాను.
      మన తెలుగు సినిమాల్లో చాల మంది డైరెక్టర్స్, వేరే భాష ల నుండి కాపి కొడుతుంటారు. కొంత మంది exact గా కాపి కొడతారు. కొంతమంది మూలం తీసుకుని మనకి అనుగుణంగా మార్చుకుంటారు. కాని ఏ ఒక్కరు కూడా ఇది పలనా సినిమా నుండి తీసుకున్నాం అని చెప్పరు. చెప్తే వాళ్ళ గొప్పతనం ఎక్కడ తగ్గిపోతుందో అని. కాని అది నిజం కాదు. ఎప్పుడైనా ఆ ఒరిజినల్ చూసినప్పుడు కలిగే అసహ్యం ఉంటుంది చుడండి , వాళ్ళు పక్కన ఉంటె వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు. ఉదాహరనకి ఛత్రపతి సినిమా లో సంస్కృతం సాంగ్ కి వచ్చే మ్యూజిక్.
      కాని మీరు అలా కాదు , ఇది కాపి చేసాను అని చెప్తున్నారు. మూలం ఆల్రెడీ ఉంది అని చెప్తున్నారు. అటువంటప్పుడు ఎందుకు మొహమాట పడటం. ఆ ఒరిజినల్ కూడా పెట్టండి వీలయితే. లేకపోతె ఒక లైన్ రాయండి కింద. నిజం చెప్పాలంటే అది కూడా మీ ప్రతిభ కి సంబందిన్చిందే , మూలం కూడా ఉంటె ఇంకా బాగుంటుంది. ఇక్కడ విజ్ఞులు ఎవరైనా మీకు మంచి సలహాలు కూడా ఇవ్వగలరు. ఆ ఆర్టిస్ట్ గారు కూడా ఆదే చెప్పారు , చిన్న చిన్న మార్పులు చేసి నాది అని చెప్పుకోవడం తప్పే, కాని ఆ మార్పులు చేసి, అది ఎక్కడనుండి తీసుకున్నారో, అన్ని వివరాలు ఇస్తే తప్పు లేదని నా ఉద్దేశ్యం. మీ సొంతవే అయితే ఇంకా మంచిది. కాని మీ పేరు మాత్రం రాయండి. ఎందుకంటే మీ కష్టానికి మీకు తప్పని సరిగా గుర్తింపు ఉండాలి.
      ఇది నా సలహా మాత్రమే.
      :venkat

      Delete
    5. పద్మార్పిత గారూ, అయితే చాలా టాలెంట్ ఉందండీ మీలో, బోటనీ రికార్డ్స్ కి సైన్ పెట్టఖ్ఖర్లేదు, మేస్టారు బెత్తం తీస్తారు, అయినా ఫ్రెండ్స్ కనుక ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. కానీ పెయింటింగ్స్ కి తప్పదండీ, సైన్ పెట్టి తీరాలి. అదీ ఆర్టిస్ట్ ల అనాదిగా వస్తున్న ఆచారం ;)
      ఆ ప్రముఖ చిత్రకారుడెవరో "వాళ్ళనే తొలగించాలని చూడకు" అన్న మాటల్లో అసూయ గోచరిస్తుంది. కళల్లో అసూయ సహజమే, నేర్పిన గురువైనా శిష్యుడు తనని మించకూడదని కొన్ని మెళకువలు దాచిపెట్టే రంగం "కళ".
      ఆ మాటలేవీ పట్టించుకోకండి, ఆర్ట్ ఈజ్ ఆర్ట్, అంతే.
      వెంకట్ గారూ చెప్పారు కదా మీ బొమ్మ పక్కనె రిఫరెన్స్ ఒరిజినల్ కూడా పెట్టండి, లేదా ఆర్టిస్ట్ పెరు చెప్పండి.
      ఇమిటేట్ చెయ్యటం అందరివల్లా కాదండీ...
      ఎన్ని వేల మంది ఆంధ్ర దేశం లో "బాపు" గారిలా వెయ్యాలని ప్రయత్నించలేదూ...అలా ప్రయత్నిస్తూ తమకంటూ శైలి సృష్టించుకోలేదూ...
      ఇక ఆలశ్యం చెయ్యక మీ తరుపరి పెయింటింగ్ ఏదైనా మీ పేరు చూడాలని అడుగుతున్నాం, అంతే. ఇంకేం చెప్పకండి.

      Delete
    6. ఇంత వత్తిడి చేయాల్సిన అవసరమేమొచ్చిందండీ?
      ఎవరి భావాలకనుగుణంగా వారు వ్యక్తపరుచుకునే వేదిక బ్లాగు..
      యిలా పదే పదే చర్చను పొడిగించడం భావ్యం కాదు..

      Delete
    7. కెక్యూబ్ వర్మ గారూ,
      వత్తిడి తెచ్చే ప్రయత్నం కాదు, ఒక్కొకసారి కొందరు మన భావాలని దెబ్బతీస్తారు. ఎవరో ఏదో అన్నారని మన శైలి మార్చుకోవలసిన పనిలేదు. ఇది చర్చ కూడా కాదు, కేవలం ఒక రిక్వస్ట్ మాత్రమేనండీ! మా భావాలని రుద్దే ప్రయత్నం అంతకంటే కాదు. దీనిని ఇంతటితో ఆపేద్దాం.

      Delete
  6. పద్మార్పిత గారూ!
    మీరన్నది నిజమే కానీ...
    ఏదో వ్రాయాలనుకుంటున్నా గానీ...
    విరుద్ధ భావాల వ్యాఖ్య అయిపోతుందేమోనని భయం...
    చిత్రం అద్భుతం...చాలా బాగుంది...
    చిన్నిఆశ గారి సందేహం తీరిస్తే...నా సందేహం తీరినట్లే...:-)
    చిత్రం మీరే వేస్తే...మా కవితలు ముందు మీకే పంపించాలనిపిస్తుందేమో...చిత్రాల కోసం..:-)
    అబినందనలు మీకు...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. అదేదో రాయొచ్చుకదండీ.....సంకోచమేల??
      విరుద్ద భావాల ఒరవడి కాదా...జీవన హేల
      భయమేల, వ్యాఖ్యలకి ఆహ్వానం అందుకోండిలా.
      Always welcome to share your views please
      Thanks a lot...

      Delete
    2. పద్మ గారూ!
      చిత్రం మీరే వేశారన్నారు కదా!
      నిజంగా చాలా బాగుందండీ!
      ఇక పొతే వ్యాఖ్య వ్రాయడానికి
      google transliteration లో
      type చేయడం మొదలెడితే...
      ఓ కవిత అయి కూర్చుంది...(18 lines)
      ఇదేదో కవిత కి సమాధానం వ్రాద్దామంటే
      కవిత కంటే పెద్దదైపోయిందని ఆపేసాను...
      నా భావం వేరని కాదు...
      ఎపుడో నా బ్లాగ్ లో కవిత పెట్టేస్తా లెండి...:-)
      @శ్రీ

      Delete
    3. థ్యాంక్సండి!
      అంతకంటేనా!!! కవితకి కవితాప్రతిస్పందన భలే బాగుంటుంది కదా...
      ఇంక ఆలస్యం ఎందుకు? వేయికన్నులతో వీక్షించనా మీ బ్లాగ్ ని:-)

      Delete
  7. one of the best poems i read, entha goppaga raasarante ekkada okka chinna
    anavasaramaina padam lekunda. nijam ga ee kavitha tho meeru naku pratyka sthaanam lo kanipisthunnarandi, beautiful one, mee nunchi ilanti goppa kavithalni aasisthu, thank you.

    ReplyDelete
    Replies
    1. Thanks for your compliments & comments.

      Delete
  8. bagundi.. ela vastay padma inni alochanalu... keep writing padma...

    ReplyDelete
  9. konni kaadananokovataaniki manasu oppukodu kadaa. padmgaaroo mee kavithalu koncham medaduku metha vestaayi. allochinchakundaa undalemu'

    ReplyDelete
    Replies
    1. kaadannaa aunannaa manasu maatavinadu kadaa. fathimagaaroo naa kavithalu medaduku methatho paatu manasuku ullaassaanni kuda ivvalanndi naa abhilasha. thanks for comments.

      Delete
  10. అక్షరాల్లో సత్యాన్ని అచ్చువేసారండి, అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానపు అభినందనలకు అభివందనం.

      Delete
  11. ఇలా ఒకటికాని వాటికోసం ఒంటరిపోరాటం సాగించాల్సిందే కదండి.
    బాగుంది మీ కవిత.

    ReplyDelete
    Replies
    1. ఓ....థ్యాంక్యూ అనికేత్

      Delete
  12. Padma garu....enno jeevitha satyalu cover chesarandi me kavithalo.....me kavitha chadavagane..naku e quotation gurthu vachindi...."We are born alone...we live alone....we die alone....Love and friendship gives us an illusion that we are not alone"..Chala bavundi me kavitha.....me blog lo pictures mere vestaru ani naku e madhye telisindi......Meru gr8 andi...Multi-talented......Me nundi chala nerchukovali...Nenu appudappudu bommalu geestanu....:)
    Meeku veelu unte na itara blogs ni kuda visit cheyandi :)

    http://poetrymyfeelings.blogspot.com

    http://artsycraftsywork.blogspot.com

    ReplyDelete
    Replies
    1. Valli garu....thanks for your compliments. I saw your other blog too very nice and so creative.

      Delete
  13. నాకు తెలిసి మరియు మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఏ ఇద్దరి భావాలు ఒకలా ఉండవండి.భార్యా భర్తలైనా!అంతే!ప్రేమించే సమయం లో కలిసినట్లనిపిస్తాయి.తరువాత మబ్బులు విడివడినట్లు వడివడిగా వడలి పోతాయి.ఎంత శాతం కలిసాయన్నదే చూడాలి.
    "ఈ అనంత జీవన పయనంలో
    ఏ బాంధవ్యబంధాలు శాశ్వతంకావు
    ఒంటరితనానికి ఎవరూ జతకూడలేదు."
    ఈ భావానికి నా స్పందన "ఇదే కదా మరణం ఇచ్చే సందేశం "అనే కవితలో వ్రాసాను .మీరు గమనించారా!
    ఒంటరితనం లో నుండి ఏకాంతం లోకి వస్తే మరింత ఆనందం వస్తుంది.
    మీ కవితల్లోని లోతైన భావాలపై మరింతగా వ్రాయలనిపిస్తుంది.వ్యాఖ్యల్లో కాకుండా వ్యాసం లాగా వ్రాస్తాను.
    మీ భావాలలోని గాఢత లోతయిన అర్థాలనిస్తుంది.మీకు అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. మీ విశ్లేషణాత్మక వ్యాఖ్యలకు వందనాలు.
      వ్రాయబోయే వ్యాసాలకై ఎదురుచూపులు.
      నా భావాల గాఢత నెరిగిన మీకు నెనర్లు.

      Delete
  14. భాధలని, బంధాలని, భాధ్యతలని కూడా సరళమైన భావాలలో చెప్పేనేర్పు, చిత్రాలలో చూపే ఓర్పు మీకే సొంతం పద్మార్పితగారు.

    ReplyDelete
  15. భలే, భలే ఆనందంగా ఉందండి మీ ప్రశంసతో:-) ధన్యవాదాలు.

    ReplyDelete