వెజిటేరియన్స్ ఓన్లీ :-)

పరిగెల పులుసంటే పిచ్చ పసందని
పిత్తపరిగెల కోసం బెస్తపల్లెకు పోయొస్తే
నీ పరువముండగ పరిగలెందుకన్నాడు!

బొమ్మిడాయల వేపుడంటే భలేమోజని
బొంగరంలా బజారంతా గాలమేసి గాలిస్తే
నీముందు బోడి బొమ్మిడాయిలెంతన్నాడు!

బొచ్చెచేపలో ముల్లెక్కువుంటాయని
కారుచవకగా ఇస్తానన్నా కాదనివస్తే
నీ రెండు మీనాక్షి చూపులే చాలన్నాడు!

సందువా చేపను చేపగా వండాలని
సన్నని సందులన్నీ వెతికి నేనట్టుకొస్తే
నా నడుముసన్నలలో ఒదిగిపోతానన్నాడు!

వాలగ/జెల్ల చేపకైతే వంక పెట్టబోడని
పెద్దజెల్లని జామురేతిరి జాగ్రత్తగా జేరేస్తే
జెల్లంటూ జామంత నీవు జారిపోకన్నాడు! 

వంజరం వండి వయ్యారంగా వడ్డించాలని
వద్దని వారించినా వినకుండా వండి వడ్డిస్తే
నా వజ్రాలగనివంటూ గట్టిగా వాటేసుకున్నాడు!
నా రంగూన్ రాజాని నీచువాసనైనా నాన్ వెజ్ తో
నీటుగా మురిపించి మైమరపించాలని అనుకుంటే
కలువభామ చెంతనుండ జలపుష్పాలే వద్దన్నాడు!

67 comments:

  1. ఊహూ, నాకెక్కడా వెజిటేరియన్ కనిపించలా!!! అబ్బో, చాలా రకాల జలపుష్పాలే ఉన్నాయి. మొత్తానికి అదర:, అద్భుత:

    ReplyDelete
    Replies
    1. జలపుష్పాల జోలికే పోలేదంటేడంటే అది వెజిటేరియన్ కాదాండి!!!:-)

      Delete
  2. కలువ బాలా?...'కమల' కోమలా?...:-)...ఏమిటో!...ఒక్కటైనా ఎప్పుదిఅనా తిన్తేగా రుచి తెలిసేది???ప్చ్....సరదాగా ఉంది పద్మ గారూ!...@శ్రీ

    ReplyDelete
    Replies
    1. ప్రేమని కోరేవారు.....రుచులు కోరరంట:-)

      Delete
  3. కేక! విజిల్స్ పద్మ గారు :D

    ReplyDelete
    Replies
    1. నేను విజిలేస్తుంటే మీలా సౌండ్ రాకుండా గాలొస్తుందండి:-)

      Delete
  4. I am pure vegetarian Bengolee:)ఇలా నోరూరిస్తే ఎలాగండి.

    ReplyDelete
  5. వెజిటేరియన్స్ ఓన్లీ అన్నారని చూద్దామని వస్తే కోతలరాయుని చూపించారే :)

    ReplyDelete
    Replies
    1. కోరిన కోమలి కోసం నాన్ వెజ్ వద్దన్నవాడిని కోతలరాయుడంటే పచ్చి వెజిటేబుల్స్ అన్నీ తినేస్తాడంట:-)

      Delete
  6. ఇంకా కొన్ని మిగిలిపోయినట్లున్నాయి, మరోమారు చేసిపెడతారా?

    ReplyDelete
    Replies
    1. భలే కనిపెట్టాసారే:-)

      Delete
  7. hahaha.. very nice..

    ReplyDelete
  8. మన దేశంలో శాఖాహారుల వర్ణాలు
    ౧. చేప మాంసం కానీ గుడ్డు మాంసం కాదు అనేవారు
    ౨. చేప మరియు గుడ్డు మాంసం కాదు అనేవారు
    ౩. చేప గుడ్డు మాంసం అనేవారు
    ౪. వండినవి శాఖాహారం కాదు అనేవారు.

    ఇంతకీ మీరు ఏ కోవలోకి చెందిన శాఖాహారులకు మాత్రమో తెలుపలేదు

    ReplyDelete
    Replies
    1. పాలవాసన గిట్టక....దాన్ని కూడా మాంసాహారం కోవలోకి చేర్చిన దాన్ని:-)
      Welcome to my blog.

      Delete
  9. బాగుంది...గుడ్ ఫర్ హెల్త్ :-)

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పారంటే...అది ఖచ్చితంగా హెల్త్ టిప్:-)

      Delete
  10. 2013 మొదటి పోస్ట్ లో వెజిటేరియన్ అని చెప్పి నాన్ వెజ్ మత్తెక్కించారు:)

    ReplyDelete
    Replies
    1. మీనాల మత్తులో మమ్మల్ని మరువకండి:-)

      Delete
  11. వెజిటేరియన్స్ కూడా లోట్టలేసేలా, మా లాంటి రసికులు(కోతల రాయులు) గర్వపడేలా ఉంది మీ కవిత.

    ReplyDelete
    Replies
    1. ఓహో.....అస్వాధించారన్నమాట :-)

      Delete
  12. Sorry Nenu Fishes tinanu :/
    Nenu veg. tintanu ;)

    anduke no comment...!!!!


    (apudapudu Chicken tintuntanule :D :p)

    ReplyDelete
    Replies
    1. అయితే మీరు ప్యూర్ వెజ్ అన్నట్లే:-)

      Delete
  13. ఈసారి నా నెలరాజుకి ఇవ్వన్నీ చేసిపెడతాను....ఏ ఊసుచెప్పినా మీతో పంచుకుంటానుగా:-)

    ReplyDelete
    Replies
    1. మీ నెలరాజు ఊసులే చెబుతాడో లేక మీ ఊసులేవింటాడో వేచి చూస్తాం:-)

      Delete
    2. నేనూరుకుంటానేటి...:-)

      Delete
    3. ఇలాగే అంటారు..అలా ఐస్ అయిపోతారు:-)

      Delete
  14. wow super padma:-)) chaala chaal bagundi.. chaapallO inni rakaalu untaayani naaku teliyadandi... ee new year lo chaala saradaagundi. image ni chusaake kavita raasara? Qte:-))

    ReplyDelete
    Replies
    1. మీకు తెలియని విషయం తెలియజెప్పానని ఆనందంగా ఉందండి:-) ఇలాగే మీ అందరితో ఈ ఏడాది సరదాగా సాగాలని కోరుకుంటున్నాను. అవునండి బొమ్మ చూసి కవితరాసాను:-)

      Delete
  15. Replies
    1. vegetarian tho non veg chadivinchaanugaa:-)

      Delete
  16. ఏ రసాన్నైనా అవలీలగా పలికించే మీ కలం కుంచెలకు సాటిలేదు పద్మార్పిత గారూ. కొత్త సం. మొదటి పోస్ట్ అదిరింది.. అభినందనలతో....

    ReplyDelete
    Replies
    1. అన్ని రసాల్ని ఆస్వాదించిన మీ నుండి అందుకున్న ఈ అభినందనలు ఆనందంతో పాటు రాయాలన్న ప్రోత్సాహాన్ని కూడా అందించిందండి. థ్యాంక్యూ.

      Delete
  17. అన్ని చేపలు కలిపి భలే వండారండీ! కాక్‌ టెయిల్‌లా!!

    ReplyDelete
    Replies
    1. కాక్ టెయిల్ టేస్ట్ నచ్చినందుకు నెనర్లండి.

      Delete
  18. అందం ముందన్నమెందుకనుకున్నాడేమో ?!
    పెళ్ళయినప్పటినుండి రాజా వారు అసలు భొంచేసినట్లు కనపడ్డం లేదే.

    ReplyDelete
    Replies
    1. భోంచేయకుండా అందాన్నేం అస్వాధిస్తాడండి!
      అన్నీ తెలిసిన మీరు ఇలా అనడమేంటి:-)

      Delete
  19. కవిత వ్రాసారా లేక పాట వ్రాసారా? ఫాట అయితే సిరివెన్నెల గారు ఎప్పుడో వ్రాసారుగా? ;)
    "కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య" చిత్రం : ధర్మక్షేత్రం

    ReplyDelete
    Replies
    1. పాటలు వ్రాసేంత పాండిత్యం మాకెక్కడిది చెప్పండి...
      ఏదో అక్కడో చేప ఇక్కడో చేపట్టుకొచ్చి ఇలా మీతో:-)

      Delete
  20. అబ్బాబ్బా , ఏం చెప్పారండి. బొచ్చులు, సందువాలు , పిత్త పరిగేలు, బొమ్మిడాయలు, వంజరం, ఇవన్ని చదువుతుంటే ఛీ వెధవ జీవితం అని అనిపిస్తుంది, అర్జెంటు గా ఇంటికెళ్ళి వండిన్చుకుని తినాలనిపిస్తుంది.
    నెత్తల్లు , రొయ్యలు, పీతలు ఇవి కూడా కలిపి ఇంకో మంచి కవిత రాయండి.బెంగాలీలు, ఒరిస్సా వాళ్ళు చేపల రుచి తెలుసుకుని అది లేకపోతే జీవితం వ్యర్ధం అనుకుని, దాన్ని వెజిటేరియన్ ని చేసేసారు.
    పాపం మన వాళ్ళే ఇంకా ఆలోచిస్తున్నారు.మీ కవిత లో కథానాయకుడికి చేపల కన్నా కథానాయిక మీద ఇష్టమేక్కువ అనుకుంట. అతను ఇప్పటి దాకా మంచి చేపల పులుసు రుచి ఎలా ఉంటుందో చూడలేదనుకుంట, చుస్తే కనుక చేపలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. నేనైతే అదే చేస్తాను. చేపల పులుసు ఎదురుగా పెట్టుకుని , వేరే దిక్కులు చూడటం ఏంటో హ్మ్ .......

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగ్ కు సుస్వాగతమండి.
      ఔనండి రంగూన్ రాజా కూసింత భోజనప్రియుడైతే బాగుండేది.
      ఆవురావురుమంటూ ఇంటిపట్టునే ఉండేవాడు:-)ప్చ్.....ఏంచేద్దాం!

      Delete
  21. నాకు ఒక డౌట్, అసలు మీరు పద్మా లేక పద్మనభుడా? ఆడవారిని వారికే తెలీనంత అందంగానూ.. మగవారికి మాత్రమే సాధ్యమని నమ్మె (నా లాంటి వారు) వర్ణనను, మాంసాహారులకు వండేవారికి మాత్రమే తెలిసె నామాలు (మీరు శాఖాహారుల అనుకుంటా)... ఇవన్నీ ఎలా సాధ్యం? గ్రాంధిక, సామజిక పదాలతో రకరకాలుగా బలే ఆడుకుంటారే ... కానియండి. perfect & Good one, hope to see the same flavors rest of the year.

    ReplyDelete
    Replies
    1. అమ్మో..... ఈ అడకత్తెరలో పోకచెక్కలాంటి డౌట్ మీకూ వచ్చిందా:-) అయితే మీరు నా పాత పోస్ట్ ల కమెంట్లకి రిప్లై చదవక తప్పదులెండి. ఈ శిక్షకు నన్ను తిట్టుకోకండి:-)

      Delete
  22. కవిత్వంతో కడుపు నింపే మీరు ఇలా నా వెజ్ తో కవ్విస్తే ఎలా:-)

    ReplyDelete
    Replies
    1. ఏదోలెండి.....రాక రాక వస్తున్న రాజాకి అలా:-)

      Delete
  23. ఏరి కోరి నేను కొరమీను పట్టి తెచ్చి
    ఉప్పు కారం కూరి ఎర్రంగ కాలిస్తే
    నీ కవురులే చాలు ఇక కూరేలనన్నాడు!

    మీ కవిత చదివాకా సరదాగా వ్రాయాలనిపించింది. చాలా బాగా వ్రాశారు
    పద్మాంజలి గారు.

    ReplyDelete
    Replies
    1. భలే బాగుందిగా...చిట్టి సరదా కవితతో కవ్వించారుగా:-)
      Thank You.

      Delete
  24. సూపర్ పద్మగారు... చదువుతుంటేనే నోరూరిపోతోంది.... :)

    అసలు ఇంత బాగా ఎలా రాయగలుగుతారు మీరు... సో స్వీట్.....

    ReplyDelete
    Replies
    1. మరింకేం......ఆరగించండి:-)
      అంతా మీ అభిమానమేనండి!

      Delete
  25. అక్కోలక్కా.. అందుకే బావ నీ వెంట పడ్డాడా...
    పుల్లా బెల్లమేసి వఱగా బొమ్మిడాల పులుసు రుసి సూపిత్తాలే అప్పుడేటంతాడో సూత్తా...

    ReplyDelete
    Replies
    1. ఓలమ్మో ఓలమ్మో.....ఇలా పోటీకొస్తే ఎలాగమ్మో:-)

      Delete
  26. ఫర్లేదు ఏది ఎంచుకోవాలో తెలిసిన సరసుడే...
    కొద్దికి ఆశపడితే మహత్తు ముందుగానే జారిపోయేదని గ్రహించాడే

    పూర్ణప్రజ్ఞాభారతి
    pragnabharathy.blogspot.in

    ReplyDelete
    Replies
    1. Welcome & thanks for visiting my blog. రంగూన్ రాజానా మజాకా:-)

      Delete
  27. మంచి నాన్ వెజ్ పోస్ట్ తో ఓపెనింగ్ ఇచ్చారుగా:)

    ReplyDelete
    Replies
    1. అయితే మీకూ నచ్చిందన్న మాటేగా:-) థ్యాంక్యూ

      Delete
  28. kavitha lo chepadam ye na, vanta chesi piliche udesham leda padma garu??
    last time 100 blog follows get together apudu maadi poendi ani escape iyaru..
    ee sari opukonu andi..
    ;)

    ReplyDelete
    Replies
    1. Chala baga vandarandi Kaluvabhamama vundaga jalapushpalu ndukani ...nice

      Delete
  29. పరువంతో పులుసు..
    వయ్యారంతో వేపుడు..
    యవ్వనంతో ఇగురు..
    ఇవన్నీ వడ్డిస్తే ఇక ఆగేదెట్టా పద్మా జీ😊

    ReplyDelete