జీవనతరంగాలు

                            జీవన కవితాసాగరంలో
                            ఎన్నెన్నో భావాటుపోట్లు
                            ఎగసిపడే కెరటావేశాలు
                            వాటిలో కొన్ని ముత్యాలు
                            లోతే తెలియని అగాధాలు...

                            అలలై పడిలేచే ప్రయత్నంలో
                            నదిపాయలా పారే వయసుకి
                            నిర్ధిష్ట రూపమివ్వాలనుకుంటూ
                            వేసే పసితనపు కుప్పిగెంతులు
                            పెరగాలని వ్యర్థమైన నత్తగుల్లలు...

                            నీటిపై నీరెండలాంటి యుక్తవయసులో
                            ప్రేమవలకందని అందమైన ఆల్చిప్పను
                            భవసాగరం ఈదుతున్నాననే  భ్రాంతితో
                            సుడిగుండాలలో మునిగితేలి తిరుగుతూ
                            తీరంచేరాలని ప్రయాసపడుతున్న కెరటాలు!

15 comments:

  1. Abba Madam gaaru...aatu potlu...agadhalu...emi levandi. ee bhavavesa kavita sagaramlo meeru master
    aipoyaru. meeru maalanti valla andariki teach cheyyali...hope so smiling...

    First tym, i got first chance to write first comment...feeling so happy first tym 4 comment...

    ReplyDelete
  2. జీవితమూ సాగరంలా లోతైనదే. పైకే కెరటాలు. లోపల అగాధాలే.
    కవిత బాగుంది. పెయింటింగ్ బ్లూ కలర్ ఎక్కువగా వాడితే ఇంకా బాగుండేది అనిపించింది, బాగుంది.

    ReplyDelete
  3. ముందు అర్థంకాలేదు, 3వసారి చదువుతుంటే మొత్తం జీవిత సారాన్ని కవితాసాగరంతో అందంగా పోల్చారని అర్థమైందండి. చిత్రానికి, మీ పదవిన్యాసానికి క్లాప్స్:)

    ReplyDelete
  4. మీ కవితలో అంతరంగంలోని అగాథాల లోతులను తడుముతూ జీవన యానంలోని ఆటు పోట్లను ఆవిష్కరించిన విధం ఓ ఆబ్ స్ట్రాక్ట్ చిత్రంలా అలా కనులకందని అంతర్చూపు అవసరమైన పద చిత్రాలుగా రూపొందాయి పద్మగారూ...
    హృదయపూర్వక అభినందనలు...

    ReplyDelete
  5. Love the painting and its expression! coloring was fab.. that made her look like muthyam inside a shell.. and also part of the keratam..
    poetry matched well.. but loved the painting more.. couldnt take my eyes out of it.. :)
    And if it is painted by u.. I think u should protect it by watermarking..

    ReplyDelete
  6. ఎంతో బాగుంది అంది పద్మ గారు.. :)

    ReplyDelete
  7. ఇంతలోతైన భావం అవసరమా పద్మార్పితా....హాయిగా నవ్వేసుకోక:-) పిక్ మాత్రం అదిరింది.

    ReplyDelete
  8. పద్మార్పిత గారు, ఇదిగో; ఇలా రాసే కదా మా మనసు దోచేసింది. అందుకే నేను మీ ఫ్యాన్ :-)

    ReplyDelete
  9. wow simple ga chala bagundi.... img super....

    ReplyDelete
  10. మీరు ఇలా రాసేస్తుంటే ఏం కామెంట్స్ రాయాలో తెలీక బిత్తరచూపులు చూడాల్సివస్తుంది:-)

    ReplyDelete
  11. చిత్రంతో కట్టిపడేసారు.
    అలా చూస్తూండాలనిపిస్తుంది.

    ReplyDelete
  12. మమ్మల్ని మీ జీవన కవితా సాగరం లో భాగస్తులను చేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  13. Thanks a lot to one and all for encouraging me with your precious comments and suggestions.

    ReplyDelete