అప్పగింతలు


నే పొందని ప్రేమను త్యాగమంటు వంచించాను
ఈ వేదన అనుభవించిన నన్ను మోసగత్తన్నా
నన్ను నేను కోల్పోయి క్షమించుకుందామన్నా
ఇదంతా అతడికి తెలుపలేని నిస్సహాయురాలను
నీవతడి జీవితంలోకి అడుగిడి ఆనందాన్నిపంచు
నాప్రేమ మాధుర్యమేతప్ప తీపెరుగడు గమనించు
వానజల్లులో ఒంటరిగా తడవనీయక చేయందించు
మంచుకురిసేవేళ మౌనంగుంటే వేడికౌగిట బంధించు
చీటికి మాటికి చిరాకు పడినా చిరునవ్వుతో ఛేధించు
కోపంతో అరిస్తే మౌనందాల్చి పెద్దమనసుతో క్షమించు
నన్నుతలచి నిన్ను మరిస్తే నుదుటముద్దిడి లాలించు
పసిపిల్లాడి మనస్తత్వం కరిగిపోయేలా కరుణ చూపించు
నన్నుమరిచి నిన్ను ప్రేమించేలా మురిపించిమరపించు
జంటకూడిన తరుణంలో నాప్రేమని కూడా జతచేసందించు

( ప్రేమ ఫలించని పడతి తన ప్రియుడ్ని వేరొకరికి అప్పగిస్తూ చేసిన అప్పగింతలు)

45 comments:

  1. ఎదుటివారి ప్రేమనికూడా మీరు అందంగా చెప్పగలరని తెలిసింది.

    ReplyDelete
    Replies
    1. ఎవరిదైనా ప్రేమ ప్రేమేకదండి...

      Delete
  2. నాప్రేమ మాధుర్యమేతప్ప తీపెరుగడు గమనించు
    నన్నుతలచి నిన్ను మరిస్తే నుదుటముద్దిడి లాలించు
    జంటకూడిన తరుణంలో నాప్రేమని కూడా జతచేసందించు

    ఇంత సున్నితమైన హృదయ స్పందనలను కవిత్వీకరించడం మీకే సాధ్యం ప్రేమార్పిత గారూ..

    ReplyDelete
    Replies
    1. నా పదకేళి మీకు నచ్చినందుకు ధన్యవాదాలు వర్మగారు.

      Delete
  3. చెల్లాచెదురైన కలలను సైతం ఏర్చి కూర్చి ఇన్నేళ్ళు కూడగట్టిన ప్రేమను ప్రేమలేని /ప్రేమ తెలియని మనిషికి పంచి
    ప్రతి గుండె సవ్వడి లో వినిపించే లయగతులు నీవేనని తెలిసి కరుడుగట్టిన నీ హృదయ పాషాణం కరగకున్న వలచి
    తెలిసి తెలిసి నా అమాయకత్వాన్ని నువ్వు తూలనాడిన భరించాను భూమిలా ఓర్పు నేర్పు తో నిన్నే నేనేని తలచి
    ఇక ఈ "అప్పగింత" తో నిన్ను నాకు దూరం చెయ్యాలని కాదు నా మనసులో ఉన్న నీ ప్రేమను తేరిపార పరికించి

    నా మనసు కోవెలలో నిన్ను పూజించా, వరమియ్యక ఇలా నా మనసుని ఎల్లవేళలా నీ మాటలతో గాయపరిచి
    వెళ్తే వెళ్ళేవు నా మనసు నుండి కాని ఎదురు చూసే కళ్ళల్లో కన్నీరు తుడవగా రాలేలని నా మాటను వక్రీకరించి
    మిగిలావు నువ్వు ఇక నా మనసు మందిరాన ఓ తీపి గురుతుగా మనమేలే ఈ అమూల్య ప్రేమపు రాగ విపంచి

    ఏదో నాకు తెలిసిన పదజాలం తో అల్లిన ఓ కావ్యవల, ఇందోలో భావం చిక్కిందో లేక వ్యర్థ ప్రేలాపన అయ్యిందో మీరే తేల్చాలి
    మీ కవిత ను పోల్చితే ఇది అంత విలువైనది ఎం కాదులెండి పద్మార్పిత గారు. మరొక్కమారు మీ సృజన కు ప్రణవిల్లుతు

    మీ నేస్తం
    భుక్య శ్రీధర్

    ReplyDelete
    Replies
    1. మీ పదజాల వేటలో కావ్యవలకి చిక్కిన పదాలు బహుపసందుగా ఉన్నాయండి. థ్యాంక్యూ...

      Delete
  4. అప్పగింతంటేనే బాధాకరం, ఇది మరీ దుస్సహం! వద్దు వద్దు! భరించలేను.

    ReplyDelete
    Replies
    1. కష్టేఫలేగారిని ఇలా కష్టపెట్టడం భాధాకరం...వద్దు వద్దంటూ మన్నించేద్దురు :-)

      Delete
  5. నాప్రేమ మాధుర్యమేతప్ప తీపెరుగడు గమనించు
    జంటకూడిన తరుణంలో నాప్రేమని కూడా జతచేసందించు

    చాలా బాగుంది ! చాలా బాగుంది !

    ReplyDelete
  6. great heart. wonderful feeling.

    ReplyDelete
  7. Mohan gari art ki maatalu nerparaa andi??
    chalaa bagundi andi..

    ReplyDelete
    Replies
    1. Already Mohan gaaru parati painting tho boledanni maatalu palikistaaru.:-) thank you ramya

      Delete
  8. పద్మా ,

    ఇలాంటి పరిస్థితి ఎవరికీ కలుగకూడదని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను . ఒక చిన్న సవరణ " వేడికౌగిట బంధించు " కంటే బిగి " కౌగిట బంధించు " అందంగా వుంటుంది . మరీ ఇన్నాళ్ళు అమితంగా ప్రేమించి , అలా అంత దగ్గరవాళ్ళకి అప్పజెప్పవలసి రావటం అత్యంత బాధాకరమైన దృశ్యమేనని మోహన్ గారు వేసిన చిత్రం చెప్తున్నది . ఈ చిత్రాన్ని చూస్తుంటె నువ్వు గుర్తుకొస్తున్నావెందుకో , నిజానికి నిన్ను నేనింతవరకు చూడలేదు సుమా ! ఒకమారు నీ సహజ చిత్రం వీలుంటే , చూపించాలనిపిస్తే చూపించు .

    ReplyDelete
    Replies
    1. శర్మగారు ముందస్తూ......మీ అభిమానానికి ప్రణామములు.
      ఇంత అందమైన చిత్రాన్ని చూస్తే నేను గుర్తొచ్చానంటే తప్పక నేను అందగత్తెనే:-)
      చూద్దురుగాని కొంతకాలమాగండి....."మురిపించే మువ్వలసడి మనోహరంగా ఉంటుందట"

      Delete
  9. భాధాకరమైన భావనలో కూడా ప్రేమను సున్నితంగా జోడించి చెప్పడంలో అందెవేసిన చేయని మరోమారు నిరూపించారు.

    ReplyDelete
    Replies
    1. తెలుగమ్మాయిగారు తెగ పొగిడేస్తున్నారు ;-)

      Delete
  10. ఇన్ని అందమైన భావాలని అవలంబించమని వేడుకుంటూ చెప్పలేనంటూనే చెయ్యమని చెప్పే ప్రతిచేష్టలోను అతడు ఈమె ప్రేమని ఆదరణని చూస్తాడే కాని ఆమెనేం చూస్తాడండి. ఒకవేళ మీలా తెలివైన ప్రేమికుడైతే ఏమైనా అప్పగింతలుచేసిన ఆమెవెంటనే ఆరునూరైనా కలకాలం ఉండి కడతేరిపోతాడు :)

    ReplyDelete
    Replies
    1. అంతేనంటారా అనానిమస్ గారు :-)

      Delete
  11. It's very painful.....n is that possible....to share???
    May be ...if we live this LIFE ....just for him....as one cannot make him a MEMORY till they breathe...

    Chaduvutoo unnaa...comment pettadaaniki...chetakaalaa...chadivina prateesaaree....mee pratee kavitalonoo kotta bhaavaalu....Ur writings r amazing...

    ReplyDelete
    Replies
    1. Thanks a lot for your comment. Dont search for words to write comment,Gap between words also showering love on my poetry :-)

      Delete
  12. పద్మా ఈ కాలంలో అప్పగించేవాళ్ళులేరు అంతలా సహనంగా భరించి భర్తను మార్చుకునేవాళ్ళులేరు. ఒకరుకాకపోతే ఇంకొకరు అనే ధోరణిలో సాగుతుంది లోకం. ఇంక కవితా పరంగా చూస్తే నీ భావల ఒరవడికి ప్రేమ ఎప్పుడో దాసోహమైపోయింది. ఇంక నేంచెప్పను, వ్రాయను చాలాబాగుంది అనడంతప్ప :)

    ReplyDelete
    Replies
    1. అప్పగించేవాళ్ళు ఎలాగోలేరు....అలా ఉండేవారిని ఇలా అప్పుడప్పుడూ అక్షరాల్లో అయినా గుర్తుచేసుకుంటే ఆనందంగా ఉంటుందని :-) థ్యాంక్యూ సృజనగారు.

      Delete
  13. Dear Padma,
    Ee rachana edaina vastavaniki roopama? Leka, kevalam Ooha ke pratibimbama? Edainappatiki, chadivaka malli chadavalipistundi. Nidurinche manasuni lepi mardana chestunnatlunti. Idi poortiga artham kaavadaniki o pedda mansu, aa mansuku boledanta charitra avasaram. Asalu ee Padmarpitaye nijama, kalpana? Hats off!
    --------- Rajender

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగ్ కి విచ్చేసిన మీకు వందనాలు.
      కొన్ని వాస్తవాలకి రూపకల్పన చేసి రంగులద్ది అక్షరమాలగా రూపొందించడమే నేను చేసింది, చేస్తున్నది, చేయబోయేది. పెద్ద మనసుతోపాటు ఆస్వాధించే గుణముంటే...పువ్వుకి తావబ్బినట్లుంటుంది కదండి. చరిత్ర తెలుసుకోడానికేముంటుందండి :-)
      ఎంత సస్పెన్స్ అయినా ఇలా మరీ మనిషే లేడు అనడం, కలపన అంటూ కధలల్లేయడం ఏంటండి :-) మీ అభిమాన స్పందనకు నెనర్లు.

      Delete
  14. "వానజల్లులో ఒంటరిగా తడవనీయక చేయందించు" ఇలాంటి వాక్యాలు తడిని చేరుస్తాయికదా..గుండెల్లో!మీపదాల ఎంపిక కవిత్వానికే శోభ.అభినందనలు

    ReplyDelete
    Replies
    1. మీ ఈ అభినందన శోభోప్రేరిత వ్యాక్యలతో పాటు మీ అభిమానాన్ని కూడా సదా అభిలషిస్తూ...ధన్యవాదాలండి.

      Delete
  15. పద్మార్పిత ఊహల్లో కూడా ఇలాంటి భాధ ఎవరికీ వద్దు. నీ కవితలతో చదివేవారిని పూర్తిగా ఆ భావాల్లో వారే స్వయంగా అనుభూతిని పొందుతూ ఆనందానికి ఆనందం, ఆవేదన, ఆలోచనా కలిగించేలా చేస్తావు. చదువుతున్నంతసేపు ఇలా ఇంతలా ప్రేమించే వాళ్ళు మనకి దొరికి వారితో కొన్నిరోజులు బ్రతికినా చాలనిపిస్తుంది. నీభావామాలికలో విరిసిన మరో మల్లెపువ్విది-ఆసీర్వధిస్తు-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. హరినాధ్ గారు....మీ అంచెలంచెల అభిమాన ఆశీర్వచనాలకి అంజలి ఘటిస్తున్నానండి.

      Delete
  16. adbuthamni thappa em cheppagalanu...manasau porala nundi madinchi thechina bhvam la vundi mi kavitha.....

    ReplyDelete
  17. అప్పగింతలు కవిత చాలా బాగుంది. ఇలా అప్పగించేవాళ్ళు ఈ కాలంలో ఉన్నారంటే నమ్మడమే కస్టం. అది ఇంత కూల్ గా. సూపర్ మీ కవితకు జోహార్లు:-)) మీరు ఏదైనా ప్రేమగా చెప్పగలరు.:-))

    ReplyDelete
    Replies
    1. శృతి....ఉండే ఉంటారు ఎక్కడో ఒకచోట. అలా మరీ జోహార్లు అని ఎత్తేస్తే గాల్లో చేలిపోతున్న :-). థ్యాంక్యూ.

      Delete
  18. ఇలా చెప్పటం అసాద్యమే... కానీ ఆడ మనస్సుకు , మనో స్థిరానికి ఇది ఒక తార్కాణం. సున్నితమైన స్త్రీ మనస్సు, కేవలం ప్రేమనే కొరుకొనే ఓ త్యాగ మూర్తి చేయగలదు ఈ హిత బోధ. పద్మ గారూ, ప్రేమించే గుణమున్న ప్రతి ఒక్కరూ మరీ,మరీ చదవాలి అనిపించేది. చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ఎంతైనా ఆడమనసుకదా...అందుకే సున్నితత్వానికి మీరు చక్కగా ప్రతిస్పందించారు...మీరాజ్ గారు మీ అభిమాన స్పందనకి నెనర్లండి.

      Delete
  19. ఏంటి ఇంతలా ప్రేమించి ఇంకెవరికో అప్పగించడం ధైర్యవంతుల లక్షణం కాదు. సాధించుకోమని ధైర్యాన్ని చెప్పే ఇంకో కవిత వ్రాయబోతున్నారా :)

    ReplyDelete
    Replies
    1. ధైర్యంలేనివాడు ప్రేమించడానికే అర్హుడుకాడేమో మహీ....అయినా డైరెక్ట్ రాయమని చెప్పొచ్చుకదా ;-)

      Delete
  20. ఇలా అప్పగింతలు సాధ్యమో అసాధ్యమో తెలీదు కాని, మిమ్మల్ని అర్థం చేసుకోవడం మాత్రం అనితరసాధ్యం పద్మార్పితగారు :)

    ReplyDelete
    Replies
    1. అనికేత్.....అర్థం చేసుకుని ఏమైనా ఆటోబయోగ్రఫీ రాస్తావా ఏంటి :-)

      Delete
    2. Varmaji...U support me too :-)

      Delete
  21. Konchem ee images yela generate chesaro cheppandi

    ReplyDelete