నవరసాల నేను...


నవరసాలుపంచ నేను నటినికాను
అభినయానికి అర్థం ఏం అడగను!!
అలంకారాన్నేకాని అంతరంగినికాను
అర్ధించి అనురాగాన్ని ఏం ఆశించను!

తిలకించి తరించే గాజుబొమ్మను నేను
శృంగారమే ఎరుగని నేనేం అలరించను!
శాంతి అలల కోమలినేకాని కడలినికాను
కోపిష్టినంటూ క్రోధాన్ని ఎవరిపై చూపను!
బిడియమేకాని భీతిల్లని వీరనారిని నేను
భీభత్సం సృష్టించి ఎవరిని భాధపెడతాను!
పరుషపదాలను ఎన్నడూ నే పలుకలేను
కలువబాలనైన నేను కరుణ చూపెడతాను!
అద్భుతమనే మెప్పుకై ఆశించే స్వార్ధిని నేను
హాస్యపు హరివిల్లునై విరబూసే పద్మార్పితను!

50 comments:

 1. కాను కాను ..అంటూనే నవరసాలు ఒలికించారు. :)
  బావుంది.

  ReplyDelete
  Replies
  1. మీ అభిమానం అలా పలికించింది. ధన్యవాదాలండి.

   Delete
 2. అద్భుతం! ఇంతకన్నా చెప్పడానికి మాటలు రావడంలా...How can u write with such a feeling?
  ప్రతీ పదం ఎంతో నచ్చేసింది...మళ్ళీ మళ్ళీ చదివేయాలి...అభినందనలు

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి అనుగారు. ఏదో అలా అంటారు అభిమానంతో. సదా ఉండనీయండిలాగే దీన్ని..

   Delete
 3. అర్పితా కాస్త మాలాంటివారిని దృష్టిలోపెట్టుకుని అప్పుడప్పుడు ఒకటో రెండో పోస్ట్లతో అలరించు. గత వారం రోజులుగా పస్తు పెట్టావు:) చూడు ఇప్పుడే నీ పోస్ట్ చదవగానే కడుపునిండింది. చక్కగా సున్నితంగా భవాలని చెప్పడం ఎక్కడ నేర్చావో కాని అందరినీ అలరిస్తున్నావు. అయినవారికి దూరంగా ఉన్న మాకు నీ కవితలే ఆక్సిజన్ అయ్యింది. ససా ఆశీర్వధిస్తున్నా ఆనందంగా ఉండు> హరినాధ్

  ReplyDelete
  Replies
  1. హరినాధ్ గారు మీ అభిమానాశ్శీస్సులు.....ఎప్పటికి తరిపోకూడదని కోరుతూ...నెనర్లండి.

   Delete
 4. ప్రారంభం , ముగింపు చాలా బాగున్నాయి . నవరసాలలో రసం తగ్గిందని తప్పక నే ,చెప్పక నే , చెప్పాలి . తిలకించి తరించే గాజుబొమ్మను నేను అన్నట్లుగా వున్న చిత్రం చాలా చాలా బాగున్నది , ఆడవాళ్లకు వుండవలసిన ,కావలసిన వన్నీ ఆ చిత్రంలో వున్నాయి . హ్యాట్స్ ఆఫ్ .

  ReplyDelete
  Replies
  1. ప్రారంభం నుండి నవరసాలని పూర్తిగా కవితలో పండించాలని ప్రయత్నించాను ముగింపువరకు, కాని కొన్ని అంతగా పండలేదనేది వాస్తవం. కనీసం చిత్రంలో అయినా అవి కనబడినందుకు సంతోషమండి. ;-)

   Delete
 5. అసలు నవరసాలని ఒక లిస్ట్ లా రాయలేని నాలాంటివారికి నవరసాల సుమమాలికని అందించావు. అభినందనలు అందుకోండి.

  ReplyDelete
  Replies
  1. తెలుగమ్మాయికి నవరసాల గురించి నేను చెప్పాలా :-)

   Delete
 6. నవరసాలు ఛూపించారు మరి..
  నవరత్నాలు ఎప్పుడో...

  ReplyDelete
  Replies
  1. శ్రావణమాసంలో బంగారంతో పాటు నవరత్నాల ధరలు కూడా పెరిగాయంటండి.....ఇప్పుడు మీరు అడగడం బాలేదిలా :-)

   Delete
 7. Rasam sambar matrame telisina naku navarasalu chepparu. photo is simply superb.

  ReplyDelete
  Replies
  1. Thank you....maree rasam sambar tho poelcharu ante meeru tappaka boejana priyule ;-)

   Delete
 8. పద్మర్పితా గారు ఏ అంశం రాసిన మీకు మీరే సాటి ... అభినందనలు

  ReplyDelete
  Replies
  1. నా బ్లాగ్ కి స్వాగతం....అది అంతా మీ అభిమానమండి.

   Delete
 9. చాల చాల చక్కగా రాసారు. మీ బావుకతకు వేనవేల జోహార్లు నేస్తమా... నాకైతే అన్నమయ్య కీర్తన ఒకటి గుర్తుకు వచ్చింది మీ కవిత చదువుతుంటే.

  నవరసములదీ నళినాక్షి|
  జవకట్టి నీకు జవి సేసీ||

  శౄంగార రసము చెలియ మొకంబున|
  సంగతి వీరరసము గోళ్ళ|

  రంగగు కరుణరసము పెదవులను|
  అంగపు కుచముల అద్భుత రసము||

  చెలి హాస్యరసము సెలవుల నిండీ|
  పలుచని నడుమున భయరసము|
  కలికి వాడి కన్నుల భిభత్సము|
  అల బొమ జంకెనల నదె రౌద్రంబు||

  సతి రతి మరుపుల శాంతరసంబది|
  అతి మోహము పదియవరసము|
  ఇతవుగ శ్రీవేంకటేశ కూడితివి సతమై యీమెకు సంతోష రసము||

  Sridhar Bukya (http://kaavyaanjali.blogspot.in/)

  ReplyDelete
  Replies
  1. ముందుగా మీకు అభివందనాలు....చక్కని అన్నమయ్యగారి కీర్తనను చదివించారు.
   నా భావాలని మెచ్చి స్పందించే మీ ఆస్వాధమదికి మరోవందనం.

   Delete
 10. baagundandi Padmagaru.. pic kuda aptga undi.. bloglokamlo anni rasajharulalo meere.. ccongrats..

  ReplyDelete
  Replies
  1. ఏదో ఎక్కడో నా కవితలో లోపించిన విషయం మీ కమెంట్లో చూసాను....నిర్మొహమాట అభిప్రాయాన్ని తెలియజేస్తే ఇంకా అనందించేదాన్ని. మీ స్పందనకు నెనర్లండి.

   Delete
 11. అర్ధించి అనురాగాన్ని ఏం ఆశించను! .
  బిడియమేకాని భీతిల్లని వీరనారిని నేను ... . beautiful lines..beautiful pic.

  ReplyDelete
  Replies
  1. అక్షరశ్వాసతో అలరించే మీకు ఈ అక్షరాలు అందంగా తోచినందుకు అభివందనం అలీగారు.

   Delete
 12. బాగుందండీ.. మంచి ప్రయత్నం :-)

  ReplyDelete
  Replies
  1. వేణుగారూ....మీ స్పందనకు నెనర్లండి.

   Delete
 13. LOL. reminds me of srilaxmi from chantabbai. ;)

  ReplyDelete
  Replies
  1. Wow...Its an good compliment for me :-) thank Q.

   Delete
 14. మీరు నవరసాలు పంచే నటి కాకపోయినా కవిత్వంలొ అన్ని రసాలూ పండించగల వీరనారే..శాంతి, కరుణ అంటూ మా హృదయాలను తట్టిలేపుతూ ఎల్లపుడూ కవితలతో కుస్తీ పడే మీకు "కవితా శిరోమణి" బిరుదు ఇవ్వాల్సిందే :):):)

  ReplyDelete
  Replies
  1. మరీ అలా శిరోమణి అంటూ నెత్తిన బిరుదెట్టి మునగచెట్టెక్కిస్తే....పెఢేలున పడిపోతానేమోనండి..... :-) మీ అత్మీయ స్పందనలను మించిన బిరుదులు నాకెందుకండి, అవే చాలు.

   Delete
 15. I am really appreciating your guts and boldness.But to be frank as a friend feeling little bit insecurity:)for this there is no reason. Padma you are multi talented personality. Keep it up.

  ReplyDelete
  Replies
  1. Mahee thanks for you compliments & comments.Whatever I am its an Gods gift, Dont be so possessive my friend :-)

   Delete
 16. అతి సున్నితమైన సుతిమెత్తని హృదయం,పొంగిపొరలే భావుకత,నవరసాల నవరంగ్ పద్మార్పితఎదలో నిరాశ పాళ్ళు పెరుగుతున్నాయేమో అనిపిస్తుంది నాకు!దీనికి పరమౌషధం పరిపూర్ణ ఆశావాదమే!

  ReplyDelete
  Replies
  1. భావాల వెల్లువలో నిరాశాపాళ్ళు పెరిగినట్లు గ్రహించిన మీ మనోచాకచక్యానికి మహావందనం. తప్పకుండా ఆశావాదపు ఔషధాన్ని రెండౌన్సులు ఎక్కువగా పుచ్చుకుంటాను ఇక మీదట :-)
   మీ అభిమానానికి ధన్యవాదాలండి.

   Delete
 17. నవరసాలు కవితలో కుమ్మరించి బొమ్మలో పంచిన తీరు అద్భుతం.

  ReplyDelete
  Replies
  1. సృజనగారు.....ఎప్పుడూ మీరు చూపించే అభిమానం నన్ను ప్రేరేపిస్తూనే ఉంటుందండి. ధన్యవాదాలు!

   Delete
 18. పద్మార్పితగారు.....మీరు ఏది చెప్పినా సున్నితంగా మనసుకి హత్తుకునేలా చెప్తారు, కానీ ఎందుకో ఇక్కడ చిత్రం కొందరికి నచ్చలేదు అని నాకు అనిపిస్తుంది. నాకు కొద్దిసేపు అలా అనిపించిన మాట వాస్తవం. మీదైన రీతిలో వివరణతో మనసు కుదుటపడుతుందేమో :) అన్యదా భావించకండి.

  ReplyDelete
  Replies
  1. అనికేత్.......నిర్మొహమాటంగా మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు థ్యాంక్యూ.
   ఇంక చిత్రం విషయానికి వస్తే....నేను అసలు కవితలో నవరసాల్లో కొన్నింటిని సరిగ్గా చెప్పలేకపోయాను, అవి కనీసం చిత్రంలో అయినా కనిపించాలి అనుకున్నానే కాని అంతకుమించి ఇంకేం అందులో గోచరించలేదు. అయినా ఏ చిత్రమైనా చూసే కళ్ళకి, అస్వాధించే మనసుని బట్టి అందులోని హంగులు, రంగులు కనిపించి అభిప్రాయాలు మారతాయనేది జగమెరిగిన సత్యం. దానికి నేనిచ్చే వివరణ ఏపాటిది చెప్పు.;-)

   Delete
 19. "1 & only Padmarpita"..u showed ur true guts..Mee kavita chala nachindi andi...dont stop...Keep going..dont turn back with -ve comments..
  :)

  ReplyDelete
  Replies
  1. Ramya after a long time with inspiring words. Take care & thank you dear. ;-)

   Delete
 20. "నవరసాలొలికించ..." అంటూ మొదలుపెట్టుంటే మరింత పరిపూర్ణత ఉండేదేమో!
  Just a thought.
  ఏ ఆలోచనకైనా చక్కని కవితా రూపాన్నిస్తున్న మీ భావుకత కి అభివందనం!
  భావానికి తగ్గ పెయింటింగూ చక్కగా అమరింది.

  ReplyDelete
  Replies
  1. నిజమే ఇలా మొదలెట్టి ఉంటే ఇంకా బాగుండేది....Nice thought.
   మీ భావుకత కళాస్పందన నాకెప్పుడూ స్ఫూర్తిదాయకమే.Thank You.

   Delete
 21. అష్టవిధ నాయకిల హావభావాలను అక్షరాలలో ఒలికించేరు...బాగుంది..

  ReplyDelete
  Replies
  1. అక్షరాల్లో ఒలికిస్తే నటిని కాను కదా ;-)....హమ్మయ్య, మీ కమెంట్ తో మది ఊగిసలాడె...ఆనందంగా ధన్యవాదాలు.

   Delete
 22. ఏం రాదు రాదంటూనే అద్భుతంగా అన్ని రసాలు పండించారు.

  ReplyDelete
  Replies
  1. నా అమాయకత్వం తెలిసిన మీరు ఇలా అంటే ఎలా యోహంత్ :-)

   Delete
 23. ఏదో అనాలనుకుని బ్లాగ్ కి వస్తాను
  ఎన్నో చెప్పాలనుకుని చెప్పలేను
  చదవకూడదని చాలాసార్లు చదివేస్తాను
  కోపమో నిస్సహాయతో తెలియదు కమెంట్ పెట్టకూడదు అనుకుంటూనే పెట్టేస్తాను
  ఎందుకని అనుకుంటే సమాధానం దొరకని ప్రశ్నవి నీవని తెలిసి ఏం మాట్లాడను

  ReplyDelete
  Replies
  1. అమ్మో....ఇన్ని భావాలా???? అన్నీ నెగిటివ్ థాట్స్ లోను పాసిటివ్ కనిపిస్తుంది అందుకే నచ్చింది. అయినా నాపై ఎందుకండి అంత కోపం.:-)

   Delete
 24. super mee gurinchi chaala correct ga chepparandi..:-))

  ReplyDelete
 25. Aunaa naa gurinchi naakanna meeke baga telusannamaata :-)

  ReplyDelete