షాక్ సరసం

కన్నుగీటి కొంటెగా కోమలిని రమ్మంటే...
మాపటేల సరసం పగటిపూట వలదనెను!
సంధ్యవేళ సరదాపడి నడుముపై గిల్లితే...
సన్నజాజులు విరియలేదంటూ నవ్వెను!
మోజుగా ముద్దాడి కోరి కౌగిలిలో బంధిస్తే...
ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై ఎదపై వాలెను!
మనోహరుడిగా మారి మరులు గొలిపితే...
మరో ఏడు జన్మలకు తోడునీడ తాననెను!
ప్రేయసని ప్రియంగా పిలిచి ప్రాణమడిగితే...
ప్రీతిగా పెకిలించి పువ్వుల్లో పెట్టిస్తాననెను!
వేయిరాత్రుల వెన్నెల ఒకేసారి కోరుకుంటే...
ముసిగానవ్వి మన్మధుడికే మతితప్పుననెను!
ఆ మాటవిని సర్రున షాక్ కొట్టి సొమ్మసిల్లితే...
నుదుటిపై ముద్దాడి చాలునా సరసమనడిగెను!

21 comments:

  1. What a shock.....!?
    Padmarpita is back :-)

    ReplyDelete
  2. :) Sometimes 'Veraha' kavita sometimes Romantic... do you read lot of 'Keats' poetry?. Good one, baagundandi.

    - Ramesh

    ReplyDelete
  3. నిజంగానే షాక్ ఇచ్చారు పద్మగారు. మొన్ననే మీ ఓల్డ్ పోస్ట్లు చదువుతూ ఈ మధ్యకాలంలో ఇలా రాయడం లేదని :-)

    ReplyDelete
  4. సరసాలాడింది అతడైతే ఈమె షాక్ ఇవ్వడం ఏంటో? కాస్త మాకు విరిస్తారా. ఏం అనుకోకండి మేము ఇందులో అక్షరం తెలియని అభాగ్యులం :-)

    ReplyDelete
  5. గడసరి పిల్లలా కనిపించే అమాయకత్వంలో చాగిన కొంటెభావాల చిన్నది... సొమ్మసిల్లితే గానీ సరసానికి రాదన్నమాట.!

    ReplyDelete
  6. Good one...but I am unable to understand da last 4 lines? Plz let me know...

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. బావా మరదళ్ల సరసాలకి అంతు లేదు కామోసు
    ఒకరినొకరు చూసుకొని బోర్ కొట్టిందేమో ఒకరి వెంట ఒకరు కదిలారు ఆరు బయటకి
    కాలక్షేపానికి ఎక్కడికెళ్ళిన బందులు ధర్నాలు అంటూ అతలాకుతలమవ్వుతుంటే వేరే దారి లేక ఇంటి దారి పట్టకా స్టేషన్ యార్డ్ కనీ బయలుదేరారు.
    ఎర్రగా OHE మీద రాసారు "Caution: Unwired Turn outs", "Danger: 25KV Over Head Equipment Mast" అని చూసిన పాపానికి పోలేదు
    ప్రేయసి కులుకుతుంటే వయ్యారంగా కదులుతుంటే ఒకరినొకరు వెంట పడుతూ ఆటపట్టిస్తూ ప్రియుడు వెళ్ళక వెళ్ళక Earthing Wire నే పట్టుకోవాలా..!

    చేసిన నిర్వాకానికి కళ్ళు బైర్లు కమ్ముతూ సోమ్మసిల్లాడు పాపం ఆ ప్రియుడు. చమటలు కారుతూ ట్రాక్ పక్కన ప్రియుణ్ణి లాగుతూ ఇంటి ముఖం పట్టింది ప్రేయసి.

    మీ కవితకు కుసింత వ్యంగ్యం కలిపి వడ్డించిన వ్యాఖ్యానం ఇది. ఏమైనా తప్పులుంటే మన్నించండి పద్మ గారు.

    ReplyDelete
  9. నవరసాలను ఆలవోకగా పలికించడంలో అందెవేసిన కవయిత్రి మీరు.. అభినందనలతో..

    ReplyDelete
  10. Nice padma garu..


    -Roopa

    ReplyDelete
  11. అలక మెలిక కులుకు పలుకు అచ్చట ముచ్చట ఆప్యాయత అన్యోనత భావుకత పరిపక్వత మీ ఈ కావ్యానికి అలంకరణ పద్మగారు. వేల కుసుమాల సమ్మేళన మిశ్రమిత భావానురాగం మీ కవితకే చెల్లుతుంది.
    మాయలు ఎరుగని ప్రణయాన్ని కూసింత ప్రేమ "పవర్" కలగలిపి "కరెంటు కోతల" కాలం లో ఇలా ఆలోచించడం అది మీకే సాధ్యం "కలువభామ" గారు. :P

    ReplyDelete
  12. తెలంగాణా సమైఖ్యాంధ్రా అంటూ ఆంధ్రప్రదేశ్ అంతా హాట్ హాట్ గా ఉంటే
    మీరు కవ్వించే కొంటె కవిత్వం వ్రాయడం నిజంగా "షాక్ సరసమే" ;-)

    ReplyDelete
  13. ఈ వెయ్యి వాల్ట్ ల షాక్ ఏంటండి :-)

    ReplyDelete
  14. తవిక బాగుంది కానీ, ఈ షాక్ అనే ఆంగ్ల పదం పంటి కింద రాయిలా వుంది, ఏదయినా తెలుగు పదం వాడితే బాగుండేదేమో!

    ReplyDelete
  15. కొంటే కోమలి కన్నుగీటి రమ్మన్న క్షనమే అల్లుకపోవాలనిపిస్తుంది మళ్ళీ అ ఆవకాశం వస్తుందో రాదో అని అదీ సాయం సంద్యివేల సన్నజారి పరిమళాల సాక్షిగా కోమలి సరసంలో కోటివీణలు మీట ...నోట మాటరాలేని ఆ అద్బుత ఘడియలను అక్కున చేర్చుకొని ఆవురావురమంటూ అక్రమిస్తున్న పండువెన్నెల సాక్షిగా సయ్యదమై సరసమాడుచుండగా కలువ కన్నుల కన్నెది ...కాస్త నీ ప్రాణం ఇవ్వవూ అని అడిగితే ఇవ్వకుండా ఎలా ఉండగలము .. అవసలే అమృత ఘడియలు కొరివచ్చిన పడుచు పరువాల సాక్షిగా ఆనందాన్ని అనుభవించాకా బొందిలో ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత

    ReplyDelete
  16. పద్మా అప్పుడప్పుడూ సరసంలో షాక్స్ అవసరమే :-)

    ReplyDelete
  17. పద్మార్పితా నీవు సకల కళాకోవిధురాలివేకాదు సరసంతోపాటు చతురోక్తుల కోమలివి కూడా - హరినాధ్

    ReplyDelete
  18. కొంటే కోమలి షాక్ ఎలాఉన్నా...కోమలి వేసుకున్న ఓణీ పచ్చరంగు, అంటే నాదే :-)

    ReplyDelete
  19. ఈ షాక్ ని సహృదయంతో చదివి ఎంజాయ్ చేసినవారికి చేయనివారికి కూడా వందనాలు.

    ReplyDelete
  20. ఆలస్యంగా చూసినా.....చదివి ఆనందించేలా చేసారు. బాగుంది మీ షాక్ ట్రీట్మెంట్

    ReplyDelete
  21. mee Shock sarasam chalaa baagundi super:-))

    ReplyDelete