నా అస్త్రాక్షరాలు

క, చ, ట, త. ప లు కౌగిలించిన అక్షరాలను

డు, ము, వు, లు విభక్తులు ఏవనడిగాయి...

వియ్యమొందాలనుకున్న ద్విత్వ అక్షరాలను

గుణింతములు గుణగణితము ఎక్కడన్నాయి...

సంధికార్యమిది అనుకున్న సంయుక్తాక్షరాలను

సమాసాలు సమాధానంగా ఛంధస్సుని కోరాయి...

సంస్కృతంటూ సిగ్గుపడుతున్న సంశ్లేషాక్షరాలను

ప్రకృతి-వికృతులు పకపకనవ్వుతూ ప్రశ్నించాయి...

భాషాభాగాలని బరిలోదింపిన మహాప్రాణాక్షరాలను

వత్తులే కాదు లింగములు లేవంటూ విడదీసాయి...

అలంకారాలు అందంగా అద్దలేదని నా అస్త్రాక్షరాలను

భావవ్యాకరణమేకాదు తెలుగుభాషలేని కవితన్నాయి!

65 comments:


  1. Amazing! Extraordinary!!

    ReplyDelete
  2. పరవస్తు చిన్నయసూరి ఉండి ఉంటే పద్మమిచ్చి పద్మార్పిత ఫ్యాన్ అయిపొయేవాడేమో

    ReplyDelete
    Replies
    1. నా ఈ పదప్రాస ప్రయోగాన్ని చూసి పిచ్చి పద్మ అనే వారేమో :-)

      Delete
  3. భాష కందని భావాక్షరాలు ,.చిత్రాక్షరాలు, మీసొంతం,
    కానీ, ఎవరినీ నొప్పించని, సున్నితమైన ఓ మానస సరోవరాలు మీ కవితలు.
    తమదైన ప్రత్యేకతని చాటుకొనే అద్భుత ప్రయోగాలు మీ వాఖ్యాలు.
    పద్మా...మనస్సుకు ప్రశాంతత తెస్తాయి మీ రాతలు. ఓ ఆత్మీయ వెన్నెల తరకలు.(ఈ మాటలన్నీ నా సొంతమే ఎవరినీ అనుసరించినవి కావు :-))

    ReplyDelete
    Replies
    1. నా రాతలు గీతలు చిత్రవిచిత్రాలు ఏమోకాని.....మీరాజ్ గారు మెచ్చుకుంటే మాత్రం మనసు పరవశిస్తుంది( ఈ మాట నిజం)

      Delete
  4. అక్షరాలు మిమ్మల్ని కౌగిలించుకున్నాయి, విభక్తులు మీ పద ఆభరణాలాయే. ద్విత్వాక్షరాలు మీ కవితకు లోలాకులు. మీ చేతి వేళ్ల కదలికలు.. అక్షరం ఇంటు అక్షరం అని గుణించగా వచ్చే పదాలు. సంయుక్తాక్షరాలు మీ కవన నేత్రాల కాటుకలు. మీ భావావేశమే చంధస్సు. మీ కుంచె నృత్యమే ఆ కవితకు సమాసం. మీ భావాక్షరమే సౌందర్యం...ఇక సంశ్లేషమెందుకు...? మీ కవితలే ప్రకృతి, వికృతి చిరునామా ఎక్కడో మరి.. ? భాష భాగమయ్యి మీ దగ్గరకు పరిగెత్తుకొచ్చి పద శిల్పాలవుతున్నాయి. మహా ప్రాణాక్షరాలు మీ కలఝరితో ప్రాణప్రతిష్ట పొందుతున్నాయి. ఇన్ని అలంకారాల అందాలతో పదపద్మాలు రాత్రే కాదు, పగటి పూట తెలుగు కాంతులతో వికసిస్తుంటే... ఎవరండి అన్నది... పద్మార్పిత.. కవితలో తెలుగు లేదన్నది..... బ్యూటిఫుల్... ఆ పడుచు అందంలా...

    ReplyDelete
    Replies
    1. మీరు రాసిన వ్యాఖ్యలు నా తరపున కూడా పద్మార్పితగారికి. నేను మీ అంత భావయుక్తంగా రాయలేను అందుకే మన్నించాలి

      Delete
    2. సతీష్ గారు..ఇలా వ్యాకరణం మొత్తం నా అక్షరాల్లో విశ్లేషించి విశదీకరిస్తే ఏం జవాబివ్వను...ధన్యవాదాలు తప్ప _/\_

      Delete
    3. యోహంత్....భావయుక్త భాషే అక్కర్లేదు అభిమాన అక్షరాలు తప్ప :-)

      Delete
    4. అవును యోహాంత్... భావంలో ఏముంది అభిమానంలోనే అంతా ఉంది. దీనికి మన్నింపులు దాకా ఎందుకండి. పద్మగారు మీరు చెప్పింది కరెక్ట్.

      Delete
  5. మీ ప్రతి అక్షరం ఓ భావాస్త్రంలా ,తన ప్రావీణ్యాన్ని చూపడంలో మీ అక్షర అస్త్రశస్త్రాలు సఫలమయ్యాయి పద్మగారు .

    ReplyDelete
    Replies
    1. విక్టరీ నాదేనంటారా :-) హుర్రే

      Delete
  6. ఏం చెప్పానో తెలీదు ..
    ఏంచేప్పాలనుకున్నాతో తెలీదు
    మొత్తనికి మీ కవితాపటిమతో..
    ఉవ్వెత్తున ఎగిసిపడే
    నాలోని భావోద్వేహం హద్దులు
    దాటుతోందేమోనన్ని చిన్నమీమాంశ
    అయినా భావాలను బందీలుగా ఉంచి
    మనసనే జైల్లో పెట్టినంతమాత్రాన
    మదిలో కలిగే అలజడి కార్యి రూపం
    దాల్చక పోయినా చెప్పేది చెప్పక మానునా నేను

    ReplyDelete
    Replies
    1. చెప్పాలనుకున్నవి అన్నీ చెప్పేసి ఏం చెప్పాలో తెలీదు అంటారా :-)

      Delete
  7. Telugu grammar tho inta glamorous ga rasarandi:-) matalakantani bhavaani raatalato chepparu:-)
    as usually pic super:-))

    ReplyDelete
    Replies
    1. GRAMMAR GLAMOROUS GIRL ane birudu ivvochchugaa Sruti :-)

      Delete
  8. తెలుగుభాష కొలనులో విరిసిన కలువలరాణివి నీవు అర్పితా.....ఒకటికి నాలుగుసార్లు చదివి నాకు తెలియని వ్యాకరణాన్ని నీవు సంధించిన అస్త్రాక్షరాలలో తెలుసుకుని తబ్బిబై నిన్ను ఏ విధంగా అభినందించాలో అర్థంకాక, ఆగలేక చివరికి వ్యాఖ్యలిడుతున్నాను. నిన్నుకన్న తల్లిదండ్రుల జన్మధన్యం అనిపించింది ఎందుకో ఈ కవిత చదువుతుంటే. నీవు సరస్వతీ మానసపుత్రికవి. ఆవిడ కూర్చునే సింహాసనం శ్వేతపద్మం అని కాబోసు నీపై అంత మక్కువ :-) హృదయ తన్మయత్వ అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. హరినాధ్ గారు...మీ అభిమానం చూస్తుంటే అప్పుడప్పుడు నాపై నాకే ఈర్ష్య కలుగుతుంది.....నిజంగా ఇలా మీ అందరి అభిమానం పొందడం నా అదృష్టం. అభివందనం._/\_

      Delete
  9. పదాలను అస్త్రాలుగా మార్చి సందింపగా అర్జునుని చెలికత్తెవో
    లేక పదాలే నెర్వలెదని పదునైన భావాలను ఇంపుగా బాణాలుగా చేసి సంధించిన ఏకలవ్య కు సమానురాలివో
    తన యుద్ధ మెలుకువలతొ ఆంగ్లేయుల భరతం పట్టిన ఝాన్సి లక్ష్మి బాయి స్వరుపానివొ
    తన రాజ్యం కోసం సమరించి వీర కాకతీయ వంశంలో విరబూసిన రుద్రమదేవి అంశానివో
    ఏదేమైనా కవితలోని ప్రతి పదవిన్యాసం ప్రతి విభక్తి సమాసం సమపాళ్ళలో వడ్డిచ్చిన పంచ భక్ష్య పరమాన్నం లాంటి మీ కవితకు నా ఈ కవిత నీరాజనం పడుతుంది పద్మ గారు.

    నా కవితలకు స్ఫూర్తి నాలోని మిగిలిపోయిన గత ప్రేమపు ద్వేషమే, ఇప్పుడది మసక బారి
    కవితలు ఎప్పుడో ఒకప్పుడు వస్తున్నాయి, నా ద్వేషాన్ని నా కవితల్లో ప్రేమగా మలిచి అందించాను
    కాని మీరు భావాలను సమంగా ఏర్చి పేర్చి కూర్పు చేసి బహుచక్కని కావ్య మాలికలా తయారు చేస్తున్నారు
    మీ కవితలకు ఎవరు స్ఫూర్తి అని అడగను అడిగిన మీరే మీ కవితలకు కర్త క్రియ కర్మ అంటారు
    మీ అమ్ములపొది లో ఇంకెన్ని 'పదు'నైన బాణాలు ఉన్నాయో ఆ శరాఘాతం మా మనసుని తాకి హాయి కలిగిస్తూ ఓ అమ్మ లాలిపాటలా మమ్ము తాకు వేళా ఏంటో దూరం లేదని అనుకుంటూ మరో మారు మీ ఈ అస్త్ర శాస్త్రాల కావ్యానికి వేన వేల జోహార్లు పద్మగారు.

    (నోట్: ఇందులో నా కవితల గురించిన ప్రస్తావన పబ్లిసిటీ కోసమైతే అస్సలు కాదని తెలియపరుచుకుంటున్నాను)

    ReplyDelete
    Replies
    1. Errata: పైన వ్యాఖ్యాలొ 'ఎంతో' కు బదులుగా 'ఏంటో ' అని అచ్చయ్యింది దానిని సవరించి అని చదువుకోగలరు.

      Delete
    2. శ్రీధర్ గారు...అస్త్రాక్షరాలతో ఏదో కవితా యుద్ధం చేద్దాం అనుకుని సంసిద్ధురాలిని కాబోతుంటే మీరు ఏకంగా రణరంగంలో వీరవనితని అంటే ఎలాగండి....ఇంక కవితలుమాని కత్తిసాము నేర్చుకోవాలి :-)
      మీ మసగబారిన ద్వేషపు క్రీనీడల నుండి మీరు బయటపడి మున్ముందు మనోల్లాసభరిత కవితలతో ఆనందింపజేయాలని కోరుకుంటాను, మీ జోహార్లకి నమస్కారాలు.

      Delete
  10. అమ్మబాబోయ్ ఇంతటి పరిజ్ఞానమా! అసలు పేరే అచ్చుతప్పులు లేకుండా తెలుగులో వ్రాయడం చేతకాని వారున్న నేటికాలంలో.....మీకు హ్యాట్సాప్ పద్మార్పిత మాడమ్.

    ReplyDelete
    Replies
    1. నటన జీవితం అని పెట్టుకున్న మీ పేరు చెప్పండి మేడం.....అది నేను అచ్చు తప్పులు లేకుండా రాయగలనో లేదు చూసి అప్పుడు అనండి :-) థ్యాంక్యూ

      Delete
  11. extremely good knowledged post with sensible thoughts padma. maintain this standard

    ReplyDelete
  12. Amazing! .. wah....la jawab..

    ReplyDelete
  13. ముందుగా మీ అస్త్రాక్షరాలకు పుష్పాంజలి......మీరు బ్లాగ్ లో కవితాశిరోమణిగా వెలుగుతారని ఎప్పుడో తెలుసునండి అది ఇప్పుడు చూస్తున్నాం. అభినందనలు మీ ప్రతి "భావాక్షరానికి" ( ఇది మీదగ్గర విన్న మొదటిమాట నాకు చాలా ఇష్టమైన తెలుగు పదం)

    ReplyDelete
    Replies
    1. యోహంత్....నేను కాదు శిరోమణినిని.....నిన్ను అభినందించాలి, అసలు తెలుగు రాని నువ్వు అక్షరాలు నేర్చుకుని అనతికాలంలోనే ఇంతందంగా రాస్తున్నందుకు.

      Delete
  14. అంత్యప్రాసతో పండిన కలువ భావాలకు చందస్సులే చిన్నబోతుంటే ఇలా భాష లేని కవితలని మమ్మల్ని బాధ పెట్టడం ఎందుకండి ?

    ReplyDelete
    Replies
    1. హమ్మయ్య....నా అంత్యప్రాసల యవ్వారం ఎలా చెప్పనా అనుకుంటే మీరే తెలుసుకుని నన్ను బాధావిముక్తురాలిని చేసారుగా ఇంకా మిమ్మల్ని బాధపెడతానా ! :-)

      Delete
  15. తెలుగుతనమే కాక వ్యాకరణ వివరణతో కవిత చాలా బాగుంది పద్మగారు

    ReplyDelete
    Replies
    1. నా ఈ ప్రయత్నం సఫలీకృతమైనందుకు ఆనందం.

      Delete
  16. అన్ని కళలు, ప్రతిభలు మీ ఒక్కరి సొంతమేనా ? మాకు కూడా ఏవైనా కొన్ని నేర్పించరాదా? :) ఈ కవిత పై కమెంట్ చేసే ప్రతిభ నాకు లేదు చదివి ఆనందించి ఆహా ఓహో అనుకోవడం కన్నా.

    ReplyDelete
    Replies
    1. అమ్మో! ఆహా ఓహో అనే అంత గొప్ప మెచ్చుకోలు మనసు మీసొంతం....ఇంకేం కావాలి చెప్పండి మీకు మీరే ఆనందంగా ఉండగలరు ఇలా :-)

      Delete
  17. సంస్కృతంటూ సిగ్గుపడుతున్న సంశ్లేషాక్షరాలను
    ప్రకృతి-వికృతులు పకపకనవ్వుతూ ప్రశ్నించాయి...
    చాలా బాగా వ్రాసారు పద్మార్పిత గారు! అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. మీ ప్రోత్సాహకరమైన వాక్యాలు నన్ను మరింత బలోపేతురాలిని చేసి కవితలు మరింత కమ్మగా రాయడానికి ప్రేరణనిస్తున్నాయి. ధన్యవాదాలు.

      Delete
  18. మీ కలంలో క్లిష్టమైన వ్యాకరణం కూడా చక్కని కవితలా ఒదిగిపోయింది పద్మార్పిత గారూ.. అభినందనలు..

    ReplyDelete
    Replies
    1. క్లిష్టమైనవి ఇష్టంకదా నాకు...దానికి మీ అందరి సహకారం కూడా తోడుందిగా....థ్యాంక్యూ.

      Delete
  19. medam I couldn't understand much about this poetry bcoz iam very poor in telugu. but as per comments I understood that you are rocking star in creating sensational artistic poetry. congratulations.

    ReplyDelete
    Replies
    1. First of all I am very much thankful to you for being trying to understand my telugu language which is sweet but tough in learning. Niranjan this is a poetry with telugu grammatical words gimmicks :-)

      Delete
  20. కచటతపల ఖడ్గ కౌశలమ్ములు జూపె
    డుమువుల బరిశెలతొ దుమ్ము రేపె
    పండితుల తలలకు పట్టిన బూజెల్ల
    దులపరించె పద్మ తెలుగు కవిత .
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. అర్పిత పదములే పూరేకులాయె
      అస్త్ర అక్షరాలన్నీ అలసి సేదతీరె
      పద్మ పసిబాలికై బరిలోకి దిగిన
      మీ ఆశిస్సులే అక్షింతలాయెన్
      *** పద్మార్పిత _/\_

      Delete
  21. పద్మా నీకెక్కడింత జ్ఞానం
    అప్పుడు లేదు ఈ పరిజ్ఞానం
    నీ ప్రతిభాకౌసల్యానికి వందనం
    అందుకే నీ కవితలకి దాసోహం

    ReplyDelete
    Replies
    1. మహీ నీవు కవితలు అల్లినా
      నాటి గుర్తులు మారిపోవునా
      చెలిమి పాత మైత్రిని వీడునా
      తెలియక దాసోహమన తగునా

      Delete
  22. చాలా చాలా బాగుంది. ఎలా రాస్తారో మీరు.. అద్భుతం

    ReplyDelete
    Replies
    1. ఎలా రాస్తాను అంటే ఏం చెప్పను అంతా విశ్వం మాయేమో :-)

      Delete
  23. మీ అక్షర అస్త్రాలకు శతకోటి ప్రమాణాలు చేస్తే కొన్నైనా కరుణిస్తాయేమో మేము కూడా కవితలు వ్రాసేటప్పుడు. అసలు ఇలాంటి ఐడియాలకి మీకు ఎలా వస్తాయండి. సింప్లీ సూపర్బ్.

    ReplyDelete
    Replies
    1. ప్రమాణాలు చేస్తే ప్రతినమస్కారాలు చేయగలనే కాని కవితలేం చెప్పగలను అభిలాషిణి.....అందుకే కలిసి రాసేద్దాం కవితలు

      Delete
  24. అద్భుతంగా తెలుగుభాష వ్యాకరణాన్ని కవితలా మలిచారు. అభినందనలు అర్పిత.

    ReplyDelete
    Replies
    1. ప్రేరణగారికి ధన్యవాదాలు.

      Delete
  25. పద్మార్పితా ! ఆనందంతో కళ్ళు చెమ్మ గిల్లాయి కవిత పూర్తిగా చదివాక . పూర్తిగా భిన్నమైన కవిత . అందరినీ మెప్పించగలిగావ్ . అదే నీకు భగవంతుడు ఇచ్చిన ఓ మంచి వరం. నీ చేయిని అట్టి పెట్టుకున్న ఆ కలం ఎంత అదృష్టం చేసుకుందో ఎల్లప్పుడూ నీ చేతి వ్రేళ్ళ మధ్యే ఉంటుంది. ఇంత మంచి కవితలను అందిస్తున్న మీకు నా అభినందనలతో కూడిన 'కృతజ్ఞతలు'.
    -శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. శ్రీపాదగారు....భగవంతుడిచ్చిన వరంతో పాటు మీ అందరి అభిమానం ఉండబట్టేనేమో ఇలా మీ అందరి మన్ననలని పొందగలుగుతున్నాను. అభివందనాలు మీ స్ఫూర్తిదాయక స్పందనకు.

      Delete
  26. ఇంత కష్టమైన వ్యాకరణాన్ని మీరు కవితల్లో మలిచేస్తే తెలుగులో ఫెయిల్ అయిన నేను ఏం కమెంట్ రాయగలను పద్మార్పితగారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు అనికేత్.

      Delete
  27. ఎప్పుడో చదివిన తెలుగువ్యాకణ పుస్తకం తెరగవేసి కమెంట్ పెట్టడానికి ఇన్ని రోజులుపట్టింది :-)

    ReplyDelete
    Replies
    1. మళ్ళీ మీ పాతరోజులు గుర్తుచేసానన్నమాట :-)

      Delete
  28. అమ్మో ఏదో అనుకున్నా, ఒక జ్ఞానభాఢాగారం మీరు

    ReplyDelete