ప్రేమా ఓ ప్రేమ!

నాకు ప్రేమ గురించి రాయడం రాలేదు
ఎందుకంటే! నా నరాల్లో ప్రేమన్నదేలేదు
ప్రేమను ఆలింగనం చేసుకున్న ప్రతిసారీ
అసంపూర్తిగా అంతరంగాన్నది కదిలించె!

నాకు ప్రేమపైన సరైన అవగాహనే రాలేదు
ఎందుకంటే! ప్రేమకి నిర్వచనమే తెలియదు
స్త్రీ పురుషుల ఆకర్షణయే ప్రేమన్న ప్రతిసారీ
కన్నప్రేగులెన్నో కళ్ళముందు కలుక్కుమనె!

నాకు ప్రేమ ఎక్కడా స్పష్టంగా కాన రాలేదు
ఎందుకంటే! ప్రేమపై స్వార్థకుబుసం ఊడలేదు
ప్రేమ ఒక మధురభావం అనుకున్న ప్రతిసారీ
తడి ఆరలేదన్న తనువుల తృష్ణ ఏదో తడిమె!

నాకు అందని ప్రేమని అంధత్వమని అనలేదు
ఎందుకంటే! ప్రేమలో కన్నీరిడని కళ్ళే చూడలేదు
ప్రేమప్రక్రియకి పరిస్థితులేవని ప్రశ్నించిన ప్రతిసారీ
తడుముకుంటూ తలాఒక తాత్పర్యం జవాబై రాలె!

నాకు ప్రేమతో సత్సంబంధం ఎన్నడూ కూడలేదు
ఎందుకంటే! అందిన ఆశగా ప్రేమ నాకచ్చిరాలేదు
అందుకేనేమో ప్రేమపై రాయాలనుకున్న ప్రతిసారీ
వేదన వరదలో పదాలు ప్రవహిస్తూ పరిహసించసాగె!

56 comments:

  1. ప్రేమ గురించి పద్మార్పితకే (ప్రేమార్పిత) తెలియదు అంటే ప్రేమే ప్రేమించడం మానేసి ప్రేమను వదిలి మీ పంచన చేరుతుంది.
    ప్రేమ ఒక మధురభావం అనుకున్న ప్రతిసారీ
    తడి ఆరలేదన్న తనువుల తృష్ణ ఏదో తడిమె!EXCELLENT

    ReplyDelete
    Replies
    1. ప్రేమకి నా పై అంత ప్రేముందంటారా సంధ్యగారు :-)

      Delete
  2. ప్రేమకి ఎవరైనా అర్థం ఏం చెప్పగలరు. ఎవరి అనుభవం వారు చెప్తారు. కవిత చాలా బాగుంది చిత్రం సూపరుంది.

    ReplyDelete
    Replies
    1. అంతేకదండీ....దేనికైనా ఎవరిభావం వారిదే.

      Delete
  3. ప్రేమంటే తెలిసిందా?
    కొందరికది సరదా ...
    తొలగిందా ప్రేమ పరదా?
    మిగిలిందా నిట్టూర్పుల వరద ...

    ReplyDelete
    Replies
    1. అంత సులభమా చెలుసుకోవడం
      ప్రేమంటే అంతుతెలియని అగాధం
      ప్రేమను అందరికీ పంచడం సులభం
      ఒక్కరికే దక్కాలి అనుకోవడం స్వార్థం

      Delete
  4. పద్మా !
    ప్రేమ గురించి తెలియదంటూనే యిన్ని రకాల ప్రేమలను ప్రస్తావిస్తున్నావ్ . ఇక తెలిస్తే అమ్మో యింక ఊహించలేను సుమా !

    నీకు తెలుసో తెలియదు , నీ చిత్రాలకు హొయలు ఒలకటం బగా తెలుసు కదూ ! .

    ReplyDelete
    Replies
    1. తెలియని దాని గురించి అందంగానే చెప్పొచ్చు...ఊహలేకదండీ!
      తెలిసింది చెబితేనే....తంటాలు.:-)
      నాకు హొయలు గురించి అంతగా తెలీదు కానీ కుంచెకది చాలా బాగా తెలుసునండి :-)

      Delete
  5. మీకు ప్రేమ గురించి తెలీదు అంటే నమ్మే అంత పిచ్చోళ్ళం అయిపోయామంటారా పద్మార్పితగారు. మీ భావాలన్నీ అటుతిరిగి ఇటు తిరిగీ చెప్పేవి ప్రేమకావ్యాలేకదా!

    ReplyDelete
    Replies
    1. అదేంటండి....తెలియనిది తెలీదు అన్నాను....కొడతారా ఏంటి :-)

      Delete
  6. అదేదో సినిమాలో మోహన్ బాబుగారి డైలాగ్....
    "తిరుపతిలో లడ్లూ
    సినిమా యాక్టర్ దగ్గర డబ్బులూ"
    పద్మార్పితకి ప్రేమ గూర్చి తెలీదంటే
    అహ హా హా.....అవగాహన లేదు అనడం హాస్యాస్పదం.:-)
    అవును ఇంతకీ మనలో మాట....ఇన్నాళ్ళు ప్రేమాన్వేషణ చేయడానికి వెళ్ళారు సరె....ఇలా తెలీదంటూ తెలియనివెన్నో చెప్పారు. కవిత అదిరింది.

    ReplyDelete
    Replies
    1. అన్నీ తెలుసునంటే ఎక్కడలేని డౌట్లు అడుగుతారని ఇలా తప్పించుకుంటున్నా... :-)

      Delete
  7. బొమ్మను గురించి వివరిద్దాం అనుకున్నాను కాని అటువైపు తిరిగి ఉంటే ఏం చెప్పను. మొహం చూసే ఏమీ చెప్పలేను....అయినా ఆ పనేదో సతీష్ గారు చూసుకుంటారని వదిలేసానులెండి.:-)

    ReplyDelete
    Replies
    1. సినిమా డైలాగ్స్ చెప్పారుగా.....ఇంకేం కావాలి చెప్పండి :-)

      Delete
  8. స్త్రీ పురుషుల ఆకర్షణయే ప్రేమన్న ప్రతిసారీ
    కన్నప్రేగులెన్నో కళ్ళముందు కలుక్కుమనె!
    సున్నితంగా కొరడాతో కొట్టారండి. నేటితరం ప్రేమలన్నీ స్వార్థంతో కూడుకుని ప్రేమంటే ఐ లవ్ యూ అని చెప్పి వాటేసుకునే కోణంలోనే తప్ప అనుబంధాలకి విలువను ఇవ్వడంలేదన్న వేదన. చాలా చాలా బాగుంది మీరు చెప్పిన తీరు దానికి తగిన చిత్రం .

    ReplyDelete
    Replies
    1. నా భావాన్ని మీదైన కోణంలో బాగాచెప్పారు. థ్యాంక్యూ


      Delete
  9. ప్రేమకి నిర్వచనం ఈరోజుల్లో చాలా సింపుల్ లవ్ యూ అని ఎంత త్వరగా చెప్పగలరో అంతే త్వరగా హేట్ యూ అని కూడా చెప్పగలరు. అదొక్కటే ప్రస్తుత ట్రెండ్. దానికి తగినట్లుగానే సినిమాలు సీరియల్స్ కూడా. తల్లిదంద్రులు పిల్లలకి స్వేచ్చని ఇస్తే వారు ప్రేమించడంలో మాత్రమే ఆ స్వేచ్చని సద్వినియోగ పరుచుకుంటున్నారు. ఇది చాలా బాధాకరం.
    స్త్రీ పురుషుల ఆకర్షణయే ప్రేమన్న ప్రతిసారీ
    కన్నప్రేగులెన్నో కళ్ళముందు కలుక్కుమనె!
    నిజమే...అర్థం చేసుకుంటే ఈ వాఖ్యాలలో అఘాధమంత లోతైన వ్యధ భావముంది. మరచిపోయాను అనుకున్న ప్రేగుబందం పై మాటలతో కలుక్కుమంది. ఇలా మనసుని స్పర్శించగలగడం నీకే వచ్చు. నీ కవితల్లో నువ్వు నాకెప్పుడూ ఉన్నతంగా సున్నితమైన మనసున్న ప్రేమమూర్తిగానే కనిపిస్తావు అర్పిత-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. హరినాధ్ గారు మరిచిన ప్రేగుబంధాన్ని గుర్తుచేసి బాధపెడితే మన్నించండి. నాపై మీ అభిమానానికి ధన్యవాదాలు.

      Delete
  10. Behte ashkon ki zuban nahi hoti,
    lafzon mein mohabat bayaan nahi hoti.
    Mile jo dosti to kadar karna,
    kismat har kisi par meharban nahi hoti.
    Pyaar tho pyaar hee hai Padmarpita...

    ReplyDelete
    Replies
    1. pyaar toe pyaar hai magar usea baanTnea mea hii kushee hai.(ప్యార్ తో ప్యార్ హై మగర్ ఉసే బాంట్నే మే హీ కుషీ హై)

      Delete
  11. ప్రేమ గురించి రాయడం రాలేదు....ఇది మీరన్న మాటలుకాదు. మాకేం తెలీదని ఇండైరెక్ట్ గా అన్నట్లుంది. కవితంతా ప్రేమగురించి చెప్పి ఏం చెప్పలేదు ఏం రాయలేదు అంటే ఎలాగండీ పద్మాజీ

    ReplyDelete
    Replies
    1. ఇదేం మాటల గారడి నాయనా :-)

      Delete
  12. నాకు ప్రేమ ఎక్కడా స్పష్టంగా కాన రాలేదు
    ఎందుకంటే! ప్రేమపై స్వార్థకుబుసం ఊడలేదు
    ప్రేమ ఒక మధురభావం అనుకున్న ప్రతిసారీ
    తడి ఆరలేదన్న తనువుల తృష్ణ ఏదో తడిమె!
    భావతరంగాలు విరిసాయి ఈ పదాల్లో.

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చాయిగా... భలే భలే.:-)

      Delete
  13. చాలా బాగుందండి కవిత. మనసంతా ప్రేమతోనిండినవారే ఇలా రాయగలరేమో. ఎటొచ్చీ ఈ వేదనను మాత్రం వదలరు కదా !!
    ( Just fun Madam )

    ReplyDelete
    Replies
    1. ఇంతకీ ప్రేమ, వేదనా, వైరాగ్యం, హాస్యం...దేన్ని వదిలేయమంటారు.

      Delete
  14. ప్రేమపై మీకున్న నిర్ధిష్ట అభిప్రాయం ప్రసంశనీయం

    ReplyDelete
  15. ప్రేమను ఎడాపెడా ఆడుకోవడంలో మీరు ఎక్స్పర్టా ??

    ReplyDelete
    Replies
    1. పద్మార్పితతో ఆడుకుంటే పర్వాలేదు
      ప్రేమతో గేమ్స్ ఆడొద్దు...:-)

      Delete
  16. "తెలీదు అన్నంత తెలివైనపని
    తెలుసును అన్నంత తెలివితక్కువతనం ఇంకొకటి లేదంట" అలా ఉంది మీరన్న మాటలు. ప్రేమకి పరిభాష ఏంటని ఎవరైనా అడిగితే నేను చెప్పే అడ్రస్ పద్మార్పిత బ్లాగ్....padma4245.blogspot.com

    ReplyDelete
    Replies
    1. నయనిగారు ఇలా ప్రేమ ప్రేమ అంటూ అడ్రస్ ఇచ్చి మరీ ఉసిగొల్పుతారా :-)

      Delete
  17. నాకు ప్రేమతో సత్సంబంధం ఎన్నడూ కూడలేదు
    ఎందుకంటే! అందిన ఆశగా ప్రేమ నాకచ్చిరాలేదు
    అందుకేనేమో ప్రేమపై రాయాలనుకున్న ప్రతిసారీ
    వేదన వరదలో పదాలు ప్రవహిస్తూ పరిహసించసాగె!
    వేదన ఎందుకు రాస్తున్నారు అని మేము అడక్కుండా కంక్లూజన్ ఇచ్చారన్నమాట. బాగుంది :)

    ReplyDelete
    Replies
    1. ఇలా కూడా ఉపయోగపడిందన్నమాట :-)

      Delete
  18. బహుశా ఇది ప్రేమలో పండిపోయి వచ్చిన ఫ్రస్ట్రేషన్ ఏమో పద్మ. అందుకే దేనిపైనా ఎక్కువ మమకారం కూడదు . నాకు కవిత ఈ కోణంలో అర్థమైంది.

    ReplyDelete
    Replies
    1. మీకు అర్థమైన తీరు అమోఘం

      Delete
  19. మాయావిశ్వానికి ప్రేమే సర్వం, అదే వారి జీవం:-)

    ReplyDelete
    Replies
    1. మీది మరో లోకం :-)

      Delete
  20. ప్రేమను ఇంత భావయుక్తంగా వర్ణించిన మీకు ధన్యవాదాలు. ప్రేమకు ఏం కావాలో చెప్పిన మీ చిత్రానికి జోహార్లు.
    మీ చిత్రంలో తృష్ణంతా ప్రేమకు నిర్వచనాన్ని వెదికే పనిలోనే ఉంది. ప్రేమ గురించి తెలియదని తప్పించుకోడం న్యాయం కాదు. ప్రేమ చిరునామా కోసం పరితపిస్తున్న... మనసుకి ప్రతిరూపం మీ చిత్రం. రవ్వల గాజుల లాంటి కలలు పంచే చేయి కోసం ఆ బోసి చేతులు ఎందురు చూస్తున్నాయి. జీవితాంతం తోడుండే బంగారు బంధనాన్ని పెనవేసే ప్రేమ కోసం ఆచ్చాదన లేని మెడ ఆరాటపడుతోంది. జడగంటల అల్లరి మనసు చిలిపి ఊసులతో గాలిలో తేల్చే... స్నేహం కోస... ఒదిగిన నల్లని కురులు ఆశలు పెంచుకుంది. ఆత్మాభిమానాన్ని ఎప్పుడూ తన కౌగిలిలో బంధించి.. తనతోనే ఉండి, తనలోనే కలిసిపోయే చీరలాంటి... ప్రేమికుడి కోసం పడతి మది ఆలోచనలు పరుగులు తీస్తోంది. ఇవన్నీ కలగలిసిన వలపు దరిచేరి... దిద్దే కుంకుమ రేఖ... చిరునామా దొరకకే... ఆ ముగ్దమనోహరముఖారవిందం నిశీధివైపు చూస్తోంది. ఈ భావాల సంఘర్షణలోనే.... సమాజంలో నేడు పేరుకుపోయిన ప్రేమ అంధత్వం, ప్రేమ వ్యంధత్వాలపై ఇలాంటి వేదన వ్యక్తం చేసిందనుకుంటా... పద్మ. ఏమంటారు.... అంతేనా....

    ReplyDelete
    Replies
    1. అయ్యా కొత్తురిగారు దండాలండి.....చిన్నప్పుడు మీరు రంగులు కుంచెలు మింగేసి ఉంటారు. అవి మీ మనసుని, మెదడుని మెలిపెట్టి మీ చేత ఇలా రాయిస్తున్నాయనుకుంటాను. కవితకి తగిన చిత్రం అంటే పద్మార్పితగారు పెట్టే అమ్మాయిల హొయలు అనుకున్నానే కాని అందులో ఇంత అంతరార్థం ఉంటుందని మీ వల్లనే తెలిసింది. ఒకో చిత్రం ఇన్నేసి భావాలు చెప్పేస్తే నేను చెప్పడానికేముంటు అచేతనంగా నోరువెళ్ళబెట్టి చూడ్డం తప్ప.

      Delete
    2. సతీష్ చాలా అభుతంగా వివరించావు. నాకు చిత్రాలని చుసి ఆనందించడమే తప్ప ఇంతలా గమనించి చూసి మరీ కవితకి తగ్గ చిత్రాన్ని పెడతారిని నీ వల్లే తెలిసింది. ఆశ్శిస్సులు-హరినాథ్

      Delete
    3. ఈ మధ్యకాలంలో మీరు చిత్రాలపై వ్యాఖ్యలిడడం మొదలెట్టాక నాలో కాస్త బెరుకుతనం మొదలైనమాట వాస్తవం. ఎక్కడ ఏ తప్పుచేస్తే దొరికిపోతానో అని. మీతో ఏం అనిపించుకోవలసి వస్తుందో అని కాదండి. మీకు అంతుచిక్కకుండా దాగుడుమూతలాడాలని :-) కానీ అలా జరగడంలేదు. నాకన్నా అత్యద్భుతంగా చిత్రభావాలని చదివేస్తున్నారు. ఇంక అనడానికేముందండి...సలాములిడ్డం తప్ప.

      Delete
    4. ఆకాంక్ష....భలే భలే, కొత్తూరిగారి చిన్ననాటి ముచ్చటొకటి తెలిపినావు :-) నిజమా సతీష్ గారు.

      Delete
  21. ప్రేమ ఒక మధురభావం అనుకున్న ప్రతిసారీ
    తడి ఆరలేదన్న తనువుల తృష్ణ ఏదో తడిమె!
    తృష్ణ తడిమినా నిగ్రహం కోల్పోనివారు కూడా ఉంటారు. వారి గురించి కూడా ప్రస్తావిస్తే బాగుండేది. మీ ప్రతీ పదంలో ప్రేమ ఉన్నప్పుడు మీకు ప్రేమ గురించి తెలియకపోయినా భావాలు అవే పొంగి పొర్లుతాయి.

    ReplyDelete
    Replies
    1. నాలో నేను నందూగారు అన్నట్లు....ప్రేమపై ఎవరి భావాలు వారివి. ప్రేమలో మునిగి తేలేవారు కొందరు. తృష్ణతో తహ తహలాడేవారు కొందరు. తప్పదుకదా మహీ.

      Delete
  22. ప్రేమంటే పదార్థం కాదు రుచులు చూడ్డానికి

    ReplyDelete
    Replies
    1. ప్రేమ దక్కినవారు కదా రుచులు చూస్తారు.

      Delete
  23. ప్రేమకు ప్రతిపదార్థం చెప్పగల మీరు రాయలేననడమా? ప్రతి పాదంలోనూ ప్రేమకు నిర్వచనమిదీ అని చెప్తూ మనసులోని వేదనను ఆవిష్కరించారు పద్మార్పితాజీ.. చిత్రం అలా మొఖం చాటేసి వుండడం ఈ కవితకు నిండుదనాన్నిచ్చింది.. అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. నాకు తెలిసిన అర్థమే చెప్పగలిగాను....థ్యాంక్యూ వర్మగారు.

      Delete
  24. నాకు తెలిసి ప్రేమ పై మీకున్న భావాలు చాల గొప్పవి. మీరు తెలియదు అని తెలివిగా రాసిన ప్రతి అక్షరంలో ప్రేమ కనిపిస్తుంది. దాచి ప్రయోజనం లేదులెండి ;-)

    ReplyDelete
    Replies
    1. దాచడంలేదు యోహంథ్...మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా.

      Delete
  25. ఎప్పటిలాగే బాగున్నాయి కవిత బొమ్మ కూడా

    ReplyDelete
    Replies
    1. లిపిగారు ఎందుకో ముభావంగా ఇస్తున్నారు సమాధానం. అలిగారా నాపై.

      Delete
    2. అలా ఏం లేదండి.

      Delete
  26. 'ప్రేమలో కన్నీరిడని కళ్ళే చూడలేదు' 'అందిన ఆశగా ప్రేమ నాకచ్చిరాలేదు' ... అద్భుత భావాలు. ప్రేమ, తృప్తి అనే వాటిని భావనల్లోనే బతికించుకోవాలి తప్ప, నిత్య జీవితంలోకి తీసుకురాలేం. తీసుకురాడానికి ప్రయత్నిస్తే అవి కోరికలుగా రూపాంతరం చెందుతాయ్. తీరకుండా బాధిస్తాయి. అప్పుడు వాటి విలువ తరిగిపోతుంది. అయినా మిమ్మల్ని మీరు ఇంతగా ప్రేమించుకుంటున్నప్పుడు ప్రేమ అచ్చిరాకపోవడం ఏంటి!

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగ్ కి మీ స్వాగతం. .ప్రేమపై మీ సున్నిత భావాలని ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలండి.

      Delete