విజయవిస్తరి

ప్రతీబాటా మంచిదని ఎంచి పయనించబోవ
నాకంటూ ధ్యేయంలేని దిశ, గాలి ఎటు వీస్తే
అటు దిశమార్చి అవాంతరాలని అడ్డుకోలేక
వేగప్రవాహ ఆటుపోట్లలో కొట్టుకునిపోతున్నా!

కళ్ళుకనే స్వప్నాలని అనుక్షణం మార్చేస్తూ
కలలకు రెక్కలుకట్టి వీధిలో విహరించమంటే
దారితెలియక తిరుగుతున్నాయి దిక్కుతోచక
అయినా మరేదో కోరి రూపకల్పనలే చేస్తున్నా!

మనసు కాలినా ఆశల మిణుగురులపై జాలితో
మరిగెడి మైనంలో వత్తి లేకపోయినా వెలిగిస్తూ
స్పష్టత లేని మంత్రాలనే ఉఛ్ఛరించా ఆశచావక
నిర్దిష్టత కోసమని నన్ను నేనే వశీకరించుకున్నా!

ఇప్పుడు బలవంతంగా ఆనందాల గొంతునులిమి
ఎంచుకున్నా రహదారిని నానీడకి నన్నే జతచేసి
ఇకపై నా ధృఢసంకల్పాలకు నా శ్రమే దిక్సూచిక
గమ్యమే స్వాగతం అంటే విజయ విస్తరి వేస్తున్నా!

16 comments:

 1. jindagi har khadam ek nayee jung hai

  ReplyDelete
 2. తిరుగులేదు...ఇలా ఫాలో అయితే విజయాలే విజయాలు. చిత్రంలో మనోఃబలం, మీ వాక్యాల్లో ఆత్మస్తైర్యం మెండుగా కనబడుతున్నాయి.

  ReplyDelete
 3. స్పష్టత లేని మంత్రాలనే ఉఛ్ఛరించా ఆశచావక
  నిర్దిష్టత కోసమని నన్ను నేనే వశీకరించుకున్నా!
  self defense manchidi

  ReplyDelete
 4. మీ ప్రతీ అక్షరంలోనూ నిరాశతోపాటు ఆత్మనిబ్బరం కూదా గోచిస్తుంది. చిత్రం కూడా సరిపోయింది పద్మగారు.

  ReplyDelete
 5. ఎంచుకున్నా రహదారిని నానీడకి నన్నే జతచేసి
  ఇకపై నా ధృఢసంకల్పాలకు నా శ్రమే దిక్సూచిక..ఇన్స్పైరింగ్ మాటలు

  ReplyDelete
 6. inspiring words with nice art.

  ReplyDelete
 7. మీకు అన్నింటా విజయోస్తు పద్మార్పితగారు.

  ReplyDelete
 8. తిరుగులేని విజయాలు మీ సొంతం

  ReplyDelete
 9. మీ ప్రేరణా వాక్యాలు విజయపధ సోపానాలు. బాగున్నాయి.

  ReplyDelete
 10. బాగుంది మీ ఆత్మవిశ్వాసం

  ReplyDelete
 11. మనసు కాలినా ఆశల మిణుగురులపై జాలితో
  మరిగెడి మైనంలో వత్తి లేకపోయినా వెలిగిస్తూ
  మంచి పదప్రయోగం పద్మార్పిత.

  ReplyDelete
 12. మీ అందరి ఆప్యాయతాస్ఫూర్తి స్పందనలకు నెనర్లు. _/\_

  ReplyDelete
 13. ఎన్ని సుడిగుండాలు చుట్టిముట్టినా, ప్రళయం ముంచెత్తినా మనల్ని పోరాదేలా చేసేది ఒక్క ఆశావాదం... ఆశావాదాన్ని అంతరంగానికి ఆభరణంగా చెప్పొచ్చు... కానీ ఈ ఆభరణాన్ని ధరించే సామర్థ్యం కేవలం స్తిర చిట్టులకి.. ధీరులకే ఉంటుంది... మీరు ధీరత్వంలో డాక్టరేట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ... సూపర్ పోయెం...మాడం జి....

  ReplyDelete