పసందైన మావ


పొలసచేప పట్టుకురా పులుసు చేసిపెడతానంటే
పుష్కరాలతోపాటు పొలసచేపా పారిపోయిందని
ఎర్రనీటి గోదారల్లె ఎగిరెగిరి పడితే ఎలారా మావ!?

నాటుకోడినే కోసి నీటుగా ఇగురు పెట్టనా అంటే
కండలేని కోడితింటే వేడిచేస్తాదని కాదుకూడదని
పందెంకోడిలా పైపైకి వస్తున్నావు ఏందిరా మావ!?

పొటేలు మాంసాన్నే మసాలాపెట్టి వండేదా అంటే
కొవ్వుపెంచే మటన్ అంటేనే మొహం మొత్తిందని
మురిపంగా చెప్పక మొరటుగా గిల్లినావు మావ!?

రొయ్యలు అయినా తేరాదా వేపుడైనా చేస్తానంటే
వెన్నుపూసలు వంగిపోయినవి తింటే వాతమని
వద్దు వద్దంటూ రోషంగా అరుస్తున్నావేల మావ!? 

పీతలైనా తెచ్చి చింతకాయలేవేసి వండనా అంటే
పీతలేం ఒద్దు ఒలుసుకుని తినడమే పెద్ద పనని
పప్పుకూడే చాలు అంటావు పసందైన నా మావ!?

23 comments:

  1. madam sunday night super vindu bhojanam. meru keka.

    ReplyDelete
  2. చాలారోజులకి మనసారా నవ్వుకుని ఎంజాయ్ చేసాము. ఈ మధ్య మీరు ఇలాంటివి ఎందుకో రాయడం తగ్గించేసారు. మీకు ఇలా రాసి మెప్పించడం వెన్నతో పెట్టిన విద్య వంటిది

    ReplyDelete
  3. మాంసాహార వ్యతిరేక ప్రచారం
    శాకాహార ప్రోత్సాహక ప్రచారం
    ఇలా కూడా చెయ్యొచ్చు నన్నమాట!
    యెర్రత్రికోణం ప్రచారంలా అభాసుపాలు కాదు కదా?

    ReplyDelete
  4. హా హా చాలా రోజులు అయ్యింది మీరు ఇలాంటి పోస్ట్ పెట్టి, సరళరీతిలో హాస్యం అందించారు

    ReplyDelete
  5. గన్ షాట్ రక్తికట్టించారు.

    ReplyDelete
  6. ఆహా ఏమి రుచి అనుకున్నంతట్లో మటుమాయం చేసి పప్పన్నం పెట్టారు. మొత్తానికి కబుర్లతో ఆకలిని తీర్చారు.

    ReplyDelete
  7. గదని గిదని ఏం పెట్టక పప్పు కూడెడ్తివి ఏమమ్మో :-)

    ReplyDelete
  8. అదేం మావో, ఖర్చు చూసి వద్దన్నాడు కామోసు. అయినా మీకు పసందైతే మాకేటి :-)

    ReplyDelete
  9. మొత్తం మాటలతోనే మురిపించేసి తినడానికి పప్పు పెడితే నోరుమూసుకుని తింటే పసందు మావ కాకపోతే మాత్రం మీరు ఊరుకుంటారా ఏంటి. :)

    ReplyDelete
  10. అదరగొట్టావు పద్మా.. చాలా బాగవ్రాసావు.

    ReplyDelete
  11. ఎట్టెట్టా ముక్కలేనిదే ముద్దైనా దిగని మావ పప్పుకూడు చాలన్నాడా....కడు విచిత్రిముగనున్నది, కడుపులో ఏమైనా తేడా చేసి ఉంటుంది. :-) చిత్రం కేక.

    ReplyDelete
  12. నవరసాలు సమపాళ్ళలో అందించడం అర్పితగారికే చెల్లింది.

    ReplyDelete
  13. రొయ్యలు అయినా తేరాదా వేపుడైనా చేస్తానంటే
    వెన్నుపూసలు వంగిపోయినవి తింటే వాతమని
    వద్దు వద్దంటూ రోషంగా అరుస్తున్నావేల..ఆరోగ్య సూత్రాలు సరసంతో చెప్పారు.

    ReplyDelete
  14. సొగసరి తన వయ్యారాలు ఒలకబోస్తూ తన మామను అది తేలేదు, ఇది తేలేదు అని సిన్గారంగా ఆటపట్టించడం చాలా వరకు జానపద గీతల్లో కనిపిస్తాయి. జానపదాల్లో ఇలాంటి సన్నివేశాల ఔన్నత్యం ఉట్టిపడుతుందని షుమారు మెజారిటీ జనాల అభిప్రాయం. అయితే ఇక్కడ ‘పద్మార్పిత బ్లాగ్’లో మాత్రం ఇది తప్పని రుజువుతోంది... చాలా ఒద్దికైన పదాలతో సులభమైన పదబంధాలతో ఒకింత శృంగారాన్ని అంతరంగా రంగరించి పసందుగా మా ముందుంచారు... అద్భుతం అని ఒక్క మాటలో చెప్పలేం.. కాని తప్పడం లేదు... సూపర్బ్...
    మీ చేపల కవిత గుర్తొస్తోంది ఇది చదువుతుంటే.......

    ReplyDelete
  15. పద్మా అబ్బో ఏంటిది...ఇలా ఎంకి పిల్లవై జింకపిల్లలా రాసేసావు. హా హా చాలా చాలా బాగుంది డియర్

    ReplyDelete
  16. మీరు ఈ మధ్య కాళిదాసు చెల్లెలిలా రాసేస్తున్నారు. ఏమైందో ఏమోనని ఆందోళన హా హా హా అదరహో అదర.

    ReplyDelete
  17. మీ మావ భలేమంచోడు అందుకే మీకు నచ్చాడు. బాగుంది పద్మగారు

    ReplyDelete
  18. బాగుంది పద్మగారు
    కొత్తగ వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers, మరియు interviews అన్నీటి గురించి తెలుసుకొవలి అనుకొంటె ఇప్పుడె చదవండి మీ Spice Andhra News

    ReplyDelete
  19. అచ్చతెలుగు జానపదంతో అలరించారు

    ReplyDelete
  20. అందరికీ అభివందనములు_/\_

    ReplyDelete
  21. Nice chala bagha rasaru

    ReplyDelete