తడి-సడి

చిట పట చినుకుల అందెల సడిలో తడిసి ముద్దై
గూటికి చేరి ముంగురులను మారాం చేయబోకన్న
మూతి ముడుచి జడలో ఒదిగిపోతే ఎంత అందం
వేడివేడి పకోడీలు చేతికందిన....ఆహా ఏమి భాగ్యం!

 

జడివానలో జోరుగా నడిచి సంధ్యవేళ ఇంటికి వచ్చి
తడి ఆరబోస్తూ మధురగీతాలు మనసార వింటున్న
చలిగాడు బయటపడలేక ఉడుక్కుంటే భలే సంబరం
మిరపకాయ బజ్జీలు చెంత చేరిన....అదే కదా స్వర్గం!



కుండపోతగా కురిసేటి వర్షాన్ని కిటికీలోంచి చూస్తూ
చేతిగాజులు సవ్వడికి చిలిపిఊహలే అల్లుకుంటున్న
పెదవులే హరివిల్లై విరియగా మురిసి నవ్వె ఆకాశం
చిల్లుగారెలు ఎందుకో చిన్నబోయె...ఏమీ చిద్విలాసం!



24 comments:

  1. "వాహ్వా..వాహ్వా"..అనే భజన బృందం ఇంకా రాలేదేవిటబ్బా..

    ReplyDelete
    Replies
    1. వచ్చామబ్బా ఓ నా ఓలేటబ్బా.... భజన దేవుడికే చెస్తారు. పద్మార్పిత గారిని దేవతతో పోల్చిన మీ తీరు ప్రశంసనీయం. మీకు దండేసి దండంపెట్టాలనుంది వోలేటి సార్... Your words are just volatile not worthy. మర్చిపోయా.. నెత్తిన ఒక టెంకాయ కూడా కొట్టాలనుంది. మీరు కూడా మాకు దేవుతో సమానం.

      (ఒకళ్ళని ఎత్తిపొడవకపోతే నిద్దురరాదేమో ఎందరోమహానుభావులని రాసే ఈ మహామహా మహానుభావుడికి....)

      * Sorry I hurt some one .

      Delete
    2. ఏం వొలెటి సర్...మీకు భజన చేయడంలేదని జలస్సా

      Delete
    3. @ P.fans -"పద్మార్పిత" కి మీ నిత్య పూజా విధానం బావుందండి.. మీలాంటి భక్తులున్న మీ "దేవత" కి ఎంత అదృష్టం..

      Delete
    4. @అమృతవల్లి.... "అంతే కదప్పా...

      Delete
    5. ఎందరో మహానుభావుల్లో మీరు ఒకరు, మీలాంటి వారు ఈర్ష్యాధ్వేషాలకు అతీతులు. మీరే ఇలా అంటే మాబోటి భజన బృందం ఏమైపోవాలి వోలేటిసారువారు.

      Delete
  2. నేనొచ్చినా మీ యెంట..వాహ్వా వాహ్వా అనేదా

    ReplyDelete
  3. nice painting with yummy delicious words :)

    ReplyDelete
  4. సవ్వడి చేసిన చినుకులు మిగిల్చిన వర్షపు తడి ని సంధర్భంగా ఎంచుకొని మీదైన చిలిపి భావాలకు చక్కగా అక్షరీకరించారు. చిత్రం ఎంపిక చాలా బావుంది. కవిత చదవగానే చిల్లిగారెలు చెసుకునీ మరీ తిన్నానంటే మీరు నమ్మరేమో!

    ReplyDelete
  5. చలిగాడు బయటపడలేక ఉడుక్కుంటే భలే సంబరం
    మిరపకాయ బజ్జీలు...అర్జంటుగా మిరపకాయ బజ్జీలు తినవలసిందే

    ReplyDelete
  6. మిర్చి మంటకి బదులు కడుపు మంట ఎవరికో ఎందుకో. షూట్ యట్ సైట్ ఆడర్స్

    ReplyDelete
  7. సేం టు సేం, ఎవరైనా వేడి వేడిగా చెతికి అందిస్తే ఎంత బాగుండు.

    ReplyDelete
  8. తడి తడి తపనలు
    వేడి వేడి పకోడీలు

    ReplyDelete
  9. ఈర్ష్యపడే వారు ఈగతో సమానం అనుకుని తీసిపారేయండి
    అసలు విషయం ఇంతకీ చిల్లుగారె ఎందుకు చిన్నబోయినట్లు చెప్మా

    ReplyDelete
  10. గరం గరం చాయ్ కే సాత్ మస్తు మజా

    ReplyDelete
  11. ఒడిలో తడి తపనల సడి
    మది కోరిక వినదే ఇక
    విహంగమై విహరిస్తే
    కరకర లాడే పకోడీలు
    కరముల గాజుల భజంత్రీలు .. వాహ్వా

    ReplyDelete
  12. మీ తడి చేసిన సడితో ఒళ్ళంతా జిల్ జిల్

    ReplyDelete
  13. వాన చినుకులు మీ తనువు తాకి అక్షరాలుగా రాలాయనుకుంటా. తడి సడి చేస్తోంది. చిలిపి ఊహలా, అల్లరి వల్లరిలా,
    నండూరి ఎంకీలా... మీ చిత్రం చూస్తే అదే గుర్తొచ్చింది. వాన చినుకు కన్నె మనసు తాకితే తాకితే మేలి ముత్యమై కరిగిపోతుంది. ఆ తడి సవ్వడి చేస్తుంటే మనసు ఆవిరై ఎక్కడికో వెళ్లిపోతుంది. వహ్వా... వహ్వా.

    ReplyDelete
    Replies
    1. నేనొప్ప నేనొప్ప...మీరు బృందంలో లేను కాను అన్నారు కదండీ సతీష్గారు :-) హ హా :-)

      Delete
  14. బాగు బాగు, వాహ్వా వాహ్వా, ఛీ ఛీ, హా హా, భలే భలే అని అననుగాక అనను పద్మా :-) నాకు అసలే బిడియం భయం కూడాను :-)

    ReplyDelete
  15. మా ఊరిలో పడనా వద్దా అన్నట్లు పదిచుక్కలు పడి స్టాప్ అయిపోతుంది. ఇంకేం తింటాము చెప్పండి బజ్జీలు పకోడీలు.

    ReplyDelete
  16. తడి చేసిన సడి కడు రమ్యం.

    ReplyDelete
  17. ఎండ కొడుతుందే

    ReplyDelete