ఎంతెంత దూరం!

నీకూ నాకు మధ్యన అంతా శూన్యమే కదా..
ఒక రాత్రి మరో పగలు అన్న సన్ననిపొర తప్ప
మనసులో నీవు, బయటికి కనబడుతూ నేను,
ఒకరికొకరం పరిచితులమైనా తెలియని ఆంతర్యం!
నాతోపాటుగా నువ్వూ మౌనంగా నడుస్తుంటావు
ఎందుకంటే చెప్పుకోడానికి మాటలేం మిగల్లేదుగా
నీగురించి నాకు, నాగురించి నీకు అంతా తెలిసినా..
ఒక్కోసారి నిశ్శబ్దం మాట్లాడతానని మొండికేస్తుంది
అంతలోనే ఆలోచనలు ఆనకట్టగా అడ్డుకుంటాయి!
ఉరుకు పరుగుల్లో ఇంకెక్కడ సమయం మిగిలిందని
ఉబుసుపోని కబుర్లు చెప్పుకుని సంభాషించుకోడానికి
నన్ను తలచి నీవు నిన్ను తలచి నేను నవ్విన క్షణం,
అది చాలదా ముచ్చట్లు ముగిసాయని మురియడానికి!
ఇంకా ఏదో దగ్గరవ్వాలన్న అత్రుత నీలో నాలో ఎందుకు
రా...ఇకనైనా నువ్వక్కడ నేనిక్కడ ఒకటిగా నిదురించేద్దాం
కలలోనైనా కొన్ని అనుభూతులను ఆస్వాధించుకుందాం!!

31 comments:

  1. అత్యద్భుతముగా పదాలను భావాల్లో ముంచి తీసారు. ఏమని వర్ణించను మరేమని వ్యాఖ్యానించను.. మనసు పొరల్లో జ్ఞాపకాల ఒరవడి.. నిజమే అక్కడ ఇక్కడ అంటు ఫిజికల్ దూరమే వారిలో.. (అజ్జి మ కాఁయి కుఁ.. వాతే ఆరికోని పద్మగారు).. కృతజ్ఞతలతో సర్వ రసామృత పదకవిత ఉషోదయం 06:35 17 11 2015

    ReplyDelete
    Replies
    1. కనుసన్నల్లో కానరానిది మనోనేత్రం తో అవలీలగా చవి చూస్తున్నా
      భావాలన్ని పదాలలో తేలియాడుతుంటే ఒక్కోకటి పోల్చుకుంటున్నా
      మనసు పలికే భాషలు భావాలు మరి మనసుకే పరిమితమంటున్నా
      ఏడేడు వందల దూరాన్ని ఎదుటే కనులకెదుటే అలవోకగా చూస్తున్నా

      కృతజ్ఞతలతో
      ~శ్రీ~

      Delete
    2. బ్ర్యాకేట్స్ లో ఉన్న పదాలకి అర్దం:
      (ఇంక నేను ఏమి చెప్పాలి..మాటలు రావట్లేదు పద్మగారు)

      Delete
    3. Life is an encyclopaedia of abstract thoughts, beautiful mornings, cheerful moments, delightful days, energetic emotions, funfilled friendliness, goodness redefined, happiest smiles, inquisitive inspirations, joyful moments, kind gestures, lively thoughts, magnificient moments, novel ideas, optimistic overviews, positive spirit, quality thoughts, rejuvinating reviews, serene visuals, thrilling moments, unique bonds, versatile variations, wonderful times, xclusive xcitements (e omitted), youthful memories, zeal refined.

      Delete
    4. आम तौर पर ज़िन्दगी के पल भी ख़ास लम्हें बन जाते हैं सही बात है कि नहीं पद्मा जी।

      Delete
    5. Wonderful detail Sridhar ji , Wow !

      Delete
    6. ఇంకా ఏమైనా భాషల్లో చెప్పడం మరిచారా శ్రీధర్ జీ :-)బాగుందండోయ్

      Delete
    7. This comment has been removed by the author.

      Delete

  2. హమ్మయ్య ! మళ్ళీ జనాల్లో పడ్డారు పద్మార్పిత వారు :)

    జిలేబి

    ReplyDelete
  3. ఎడబాటు మౌనగీతమా పద్మా ;)

    ReplyDelete
  4. మీ కవితలో దూరం చాలా దగ్గరైనట్లుంది :-)

    ReplyDelete
  5. అమ్మో అమ్మో అర్పితమ్మో....మీ పై అక్షర అమ్మోరు పూనిందా ఏంటి యమజోరుగా రాసేస్తున్నారు. శభాష్ కుడోస్ దివ్య కవితాప్రవాహానికి అభినందనం.

    ReplyDelete
    Replies
    1. ఐ గిరి నందిని నందిత మేదిని విశ్వవినోదిని నందనుతే జయజయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే.. అక్షర అమ్మోరు అనంటే నాకు త్రిశక్తి గుర్తుకు వచ్చింది ఆకాంక్షగారు.. దివ్య మంగళస్వరూపిణి తానే కదా మరీ..

      Delete
  6. రెండు హృదయాలు ఒక్కటై దగ్గరయ్యాక ఇంకేముంటుంది అక్కడ...అవును! ఇద్దరికీ మధ్యన అంతా శూన్యమే కదా... రాత్రికీ పగలుకీ తేడా ఎడబాటులో ఉంటుందేమో కానీ ఇలా ఒకరిఒడిలో ఒకరున్నప్పుడు రాత్రీ పగలు అనే సమస్యలే ఉండవు. ఉన్నదల్లా ఒక్క ఆప్యాయతే...
    అనేకసార్లు అనంతాలు మాట్లాడుకున్న హృదయాలు ఒక్కోసారి నిశ్శభ్దాన్ని అసరాకోరి ఆలోచనలో పడతాయి. ఉరుకూ పరుగుల జీవితంలో తడిలేని తనం అంటుక్కున్నాక మళ్ళీ ఏదో కోల్పోయిన క్షణం. ఇద్దరిమధ్యా అగాధాన్ని చీలుస్తూ నవ్వుల పువ్వులు పూయిస్తూ... కొన్ని కబుర్ల కాలక్షేపాలు... ఎదురుచూపులూ... అలకలూ... ఎన్నున్నా దగ్గరవ్వాలనే ఆత్రుత మాత్రం అలానే ఉంటుంది.. నిస్సహాయతతో కలలో నైనా కొన్ని అనుభూతులు పంచుకోవడానికి సిద్ధమౌతూ ... అంటూ చాలా మంచి ఎండింగ్ ఇచ్చారు... సూపర్బ్...
    ‘’ కథానాయకి భావాలని అందంగా అక్షరీకరించడం ఒక ఎత్తు ... అద్భుతమైన చిత్రం ఎంపిక ఇంకో ఎత్తు... ఎత్తుగడలో ఆరంభమైన మీ నూతన శైలి చివరివరకూ రమ్యంగా సాగి అలరించింది... సలాం మేడం!!

    ReplyDelete
    Replies
    1. విశ్లేషణ విశదికరణ తాత్పర్య తత్వబోధ అమోఘం..
      ~శ్రీ~

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. చాలా బాగా విశ్లేషించారు. వివరణాత్మకం-హరినాధ్

      Delete
    4. నిజం , అధ్బుతమైన భావం అది , Padmaarpitha Fans వివరణ చదివాక నా చెలియ మనసు నాది కావడం ఎంత అదృష్టం అని మళ్ళీ ఇంకోసారి అనిపించింది .

      Delete
  7. నన్ను తలచి నీవు నిన్ను తలచి నేను నవ్విన క్షణం,
    అది చాలదా ముచ్చట్లు ముగిసాయని మురియడానికి!

    Wonderful lines!

    ReplyDelete
  8. గిట్ల ప్రేమముచ్చట్లు సెప్పితే మస్తుగుంటది మీరు

    ReplyDelete
  9. మనసులోని భావాలకి చక్కని కవితారూపం

    ReplyDelete
  10. రెండు మనసులు కలిసిన తరువాత దూరం శరీరాలకే అని చాలా భావయుక్తంగా చెప్పావు అర్పితా-హరినాధ్

    ReplyDelete
  11. One of your best kavita madamjee..excellent

    ReplyDelete
  12. మీకు జనం నాడి తెలుసు అందుకే ఇంతలా రాసేస్తున్నారు :-)

    ReplyDelete
    Replies
    1. జనం వేడి తెలుసు అని ఉండా లేమో :)

      జిలేబి

      Delete
  13. మొదటి నుండి చివరి వరకు కవిత సున్నితంగా సాగింది. అభినందనలు

    ReplyDelete
  14. మంచో చెడో...స్పందనలతో అభిమానాన్ని అందించి రాయడానికి స్ఫూర్తినిస్తున్న అందరికీ పద్మార్పిత నమస్సుమాంజలులు_/\_



    ReplyDelete