నూతనాధ్యాయం


అన్ని రోజులు ఒకేలా ఉండవులే అనుకుని
పాడైన హృదయాన్ని పీకి పడేయడం రాక
నడుస్తున్న బాటలో కొత్త అర్థాలే వెతుకుతూ
నూతనోదయానికి నాణ్యమైన నాంది వేసున్నా!

ఫలించని స్వప్నాలే విలువనెరిగి పరావర్తించి
సఫలీకృతం అవ్వాలని అదృష్టాన్నే నమ్ముకోక
పట్టుదలతో నాకు నేనే ప్రేరణగా మారి నడుస్తూ
పిల్లకాలువ సాగరం చేరదని నదిని వెతుక్కున్నా!

శిల్పం కూడా ఒకప్పటి రాయేనని తెలుసుకుని
అల్పజ్ఞానంతో మట్టిలో మాణిక్యానికి వెలకట్టలేక
మండే సూర్యుడూ మంచే చేయునని నవ్వుతూ
ఆలోచనాసక్తికి కాస్త యుక్తి చేర్చి అడుగేస్తున్నా!

ఒడిదుడుకాటుపోట్లు, పొరపాట్లు సాధారణమని
పోరాడ్డమే పని అనుకుని ప్రతిఫలం ఏం ఆశించక
అలుపన్నాదే లేకుండా నిశ్శబ్ధంగా యుద్ధం చేస్తూ
విజయం
వరించి చేసే శబ్ధానికై ఎదురుచూస్తున్నా!

73 comments:

  1. కవితాసాంతానికి ప్రత్యుత్తర వ్యాఖ్యానించటానికి పదాలు వెతుకుతున్నా
    నిన్న మొన్నటి అక్షరాలకే భావాలను వెలికి తీయగా ఉలితో చెక్కి పదును పెడుతున్నా
    జీవితం అక్షర సత్యమో భావ మిథ్యో తెలియక సతమతమగుచున్నా..

    నూతనోధ్యాయమనె పదకావ్యము బహుచక్కని రీతిలో ఆవిష్కృతం చేశారు పద్మగారు..!

    ReplyDelete
    Replies
    1. బహుభాషా ప్రావీణ్యులు మీకు మాటలకి కొదవా :-)

      Delete
    2. Same feel Sridharji :-) tappavu manaku E tippalu

      Delete
    3. Anthenantaaraa Aakaaksha gaaru.. Sare.. Chesedemundikaa.. Hari Rama Govinda :-)

      Delete
    4. మరో పదమూడూ నిమిషాల్లో నూతన వసంతంలో అడుగిడుతున్న పద్మగారికి జన్మదిన శుభాభినందనలు

      ~శ్రీ~

      Delete

  2. విజయ దుందుభి మారు మ్రోగు నూతనోధ్యాయ విన్నూత్నోదయం

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడే మొదలాయె అప్పుడే విజయమా :-)

      Delete
  3. Replies
    1. నూతనోదయం/అధ్యాయం అన్న మీమాసంలో తప్పు దొర్లింది. సరిచేసిన మీకు వందనం._/\_

      Delete
  4. మండే సూర్యుడూ మంచే చేయునని నవ్వుతూ
    ఆలోచనాసక్తికి కాస్త యుక్తి చేర్చి అడుగేస్తున్నా!

    Good....Good !

    ReplyDelete
    Replies
    1. థ్యాంకులు...థ్యాంకులు :-)

      Delete
  5. మీకు మీరే కాదు ప్రేరణ మాకు కూడా మీరు ఇన్స్పిరేషన్

    ReplyDelete
    Replies
    1. ఏమో చూడాలి ఎంత వరకు సక్సెస్ అవుతానో

      Delete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. ఆడితే కాలో చెయ్యో విరిగేట్లుంది...అందుకే కాంగా కూర్చుని రాసుకుంటానండి :-)

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
    5. This comment has been removed by the author.

      Delete
    6. This comment has been removed by the author.

      Delete
    7. This comment has been removed by the author.

      Delete
    8. @Gadepalli Venkatji...lyricist కూడానా మీరు, అదుర్స్ :-)

      Delete
    9. This comment has been removed by the author.

      Delete
    10. This comment has been removed by the author.

      Delete
  7. పిల్లకాలువ సాగరం చేరదని నదిని వెతుక్కున్నా...మొత్తం ఆధారపడక మీ దారిలో మీరు క్రొత్తఅధ్యాయాన్ని సృష్టించండి.

    ReplyDelete
    Replies
    1. అలాగే అదే ప్రయత్నం చేస్తాను

      Delete
  8. that's U, start new era.

    ReplyDelete
  9. పట్టుదలతో నాకు నేనే ప్రేరణగా మారి నడుస్తూ
    పిల్లకాలువ సాగరం చేరదని నదిని వెతుక్కున్నా! fantastic lines

    ReplyDelete
  10. Replies
    1. సరిచేసానండి...ధన్యవాదాలు

      Delete
  11. కొంప కొలంబో చేసే కవిత్వం అనుకుంటే, ప్రేరణనిచ్చే పద్యం తో మళ్ళీ కొత్తగా ఉదయించారు అర్పితా... మజ్జారే మజా... ఖుదొస్ దోస్త్....

    ReplyDelete
    Replies
    1. అంత సులువుగా కొంప కొలంబో కానిస్తానా చెప్పండి. :-)

      Delete
  12. ఒక ఉదయం పుట్టాలంటే మునుపటి రోజు సూర్యు అస్తమించాలి. అది ప్రకృతి. గొప్పైన భావాలు కొన్ని అస్తమయాలతోనే పురుడుపోసుకుంటాయి. ప్రకృతికి ఒక ఆకృతిని ఇచ్చిన మీ మొదటి నాలుగు పంక్తులు నిజంగానే క్రొంగొత్త భావాలకు పునాదులు పరుస్తున్నట్టు ఉంది.
    ధీరులకు విశ్వాసం పట్టుసడలదు. మార్గం మూసుకుందని వెనుకకు మరలరు. ప్రక్కన దాగిఉన్న మరో తలుపును అన్వేషించి స్వయం ప్రేరణతో పనులు పూర్తీ చేస్తారు. మీ రెండవ స్టాంజాలో, అలాంటి బలమైన నమ్మకం ధ్వనిస్తోంది. స్వప్నాలు సాకారం చేసుకోవాలనే తపన ఉంది. పిల్ల కాలువ సంద్రం చేరదు. నిజమే. నదిని వాహనంగా చేసుకొని సాగరంలో చేరి, దాన్నీ మధించగలదు. మీ భావాల్లో ఇలాంటి ప్రేరాత్మక పదాలు మీకే కాదు, చదువరులకూ ఎంతో ఉత్తేజాన్నిస్తాయి.
    ఆలోచన ఉంటె సరిపోదు దానిపై ఆసక్తి, ఆసక్తికి తోడూ యుక్తీ కలిస్తే ఇక ఎవరికైనా అడ్డనేది ఉంటుందా? మండే సూర్యుడైనా తలొంచి సలాం చేయాల్సిందే. మాణిక్యాలు మట్టిలో ఉన్నా మేరవాల్సిందే....
    భగవద్గీత 2-47
    " కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
    మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఅస్త్వకర్మణి || "
    మీ చివరి పంక్తులు ముమ్మాటికీ నిజం! అదే భగవత్గీత కూడా చెబుతున్నది. ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా ప్రతిఫలం ఆశించక పోరాడడం మీ వంతైతే విజయం ఎప్పటికీ మీ వైపే... చాలా మంచి వాక్యాలు అందించారు. వెరీ ఇన్స్పైరింగ్ పోయెం మేడం. సలాం!!
    (04.04.2015) ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు!! _/\_

    ReplyDelete
    Replies
    1. sorry.... thats 04-12-2015

      Delete
    2. ఫ్యాన్స్ బ్లాగ్ లో క్రియేట్ చేసిన వీడియో ఎక్సలెంట్...అదరగొట్టేసారు

      Delete
    3. మీ ఇన్స్పిరేషనే లేకపోతే నేను ఇలా రాయలేను...
      _/\_ మాటలు రావడంలేదు మీ బ్లాగ్లో పోస్ట్ చూసి._/\_

      Delete
  13. సాగిపొండి కొత్తదారిలో...సూపర్ పిక్

    ReplyDelete
  14. సున్నితభావంతో అలరించారు. చిత్రం చూడముచ్చటగా ఉంది.

    ReplyDelete
  15. శిల్పం కూడా ఒకప్పటి రాయేనని తెలుసుకుని
    అల్పజ్ఞానంతో మట్టిలో మాణిక్యానికి వెలకట్టలేక
    మండే సూర్యుడూ మంచే చేయునని నవ్వుతూ
    భవ్యమైన ఆలోచన...హరినాధ్

    ReplyDelete
    Replies
    1. మీబోటి పెద్దల ఆశిస్సులు_/\_

      Delete
  16. పాత తుపాకీలో కొత్త తూటాలు...హా హా హా

    ReplyDelete
    Replies
    1. ఈ తుపాకీ తూట్లు/కమెంట్స్ ఏంటో :-)

      Delete
  17. స్పటిక స్వచ్చత గల్గు భావనా పటిమల
    పద్మార్పితకు శత వర్ష శుభము
    తెలుగు సంస్కృత పద తియ్యందనాలల్లు
    పద్మార్పితకు శత వర్ష శుభము
    చదివించు గుణమున్న చక్కని కవితల
    పద్మార్పితకు శత వర్ష శుభము
    రమణీయ శృంగార రస మనోజ్ఞ రచనా
    పద్మార్పితకు శత వర్ష శుభము

    కవితలే గాదు చిత్రలేఖనము గాన
    మాది కళల కాణాచి పద్మార్పిత కివె
    జన్మదిన శుభా కాంక్షలు , చక్కని ప్రతి
    భలకు సన్మంగళాని భవన్తు , స్వస్తి .

    ReplyDelete
    Replies
    1. చాలాబాగుంది పద్మార్పిత పై పద్యము.

      Delete
    2. చక్కటి ఆశీర్వచనం

      Delete
    3. @రాజారావుగారు....అనిర్వచనీయ భావం మీ అభిమాన ఆప్యాయతాక్షరాలకు
      మీరు అందిస్తున్న స్పూర్తి వచనాలకు...ధన్యవాదాలు.

      Delete
  18. నడుస్తున్న బాటలో కొత్త అర్థాలే వెతుకుతూ
    నూతనోదయానికి నాణ్యమైన నాంది వేసున్నా...Good luck and Birthday wishes too.

    ReplyDelete
  19. ప్రతీ లైన్ లో ఆత్మవిశ్వాసం కనబడుతుంది. సాగిపోండి విజయంవైపు మీదైన బాటలో.

    ReplyDelete
    Replies
    1. అలాగే ప్రయత్నిస్తాను.

      Delete
  20. పసందైన పదునున్న పద్మ పదాలు
    మురిపించేను నీవైన మనోభావాలు
    అందరినీ అలరించేవే అర్పితాక్షరాలు
    మీకు మా జన్మదిన శుభాకాంక్షలు!
    మీరు వ్రాసినట్లు రోజుకి ఒకటి వ్రాయడం నావలన కాదు. నాలుగు లైన్స్ వ్రాసి చదువుకుని నాకు నేనే మురిసిపోతున్నాను. మీరూ మురవండి మరి నా పాండిత్యాన్ని చదివి :-)

    ReplyDelete
    Replies
    1. బాగా శెలవిచ్చారు ఆకాంక్ష గారు..
      మురిసి మురిసి ముత్యము వాన చినుకాయేనా..
      ముసిరి ముసిరి వాన కాస్త తూఫానాయేనా..
      అల కడలిని చూసి భీతిల్లి సూర్యునికే చమటలు పట్టి సంద్రం ఉప్పగా మారేనా..

      ఏవిటి అలా చూస్తున్నారు.. ఇది వితక.. ఇటుకటు మార్చి రాశానంతే..😛 సరదాగా..

      Delete
    2. నాలుగు లైన్స్ లో నన్ను పొగిడేసారుగా...థ్యాంక్యూ ఆకాంక్ష ;-)

      Delete
  21. Very nice. Your poetry is always inspiration for the beginners like me.

    ReplyDelete
    Replies
    1. thanks a lot for encouraging comments.

      Delete
  22. మరిన్ని పుట్టునరోజులు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే

    ReplyDelete
  23. హ్యాపీ పుట్టునరోజు అక్కో...ఖుషీ ఖుషీ గుండాలే ఎప్పటికీ.
    మంచి మంచి కవితల్ మస్తుగ రాయాలే

    ReplyDelete
  24. అక్కడక్కడ పద్మ
    ఎక్కడో ఒక పద్మ
    అరుదుగా ఒక పద్మ
    అపురూపమైన పద్మ
    ఆత్మబంధువు పద్మ
    అమ్మలాటిది పద్మ
    పుట్టినరోజు పాపాయి పద్మ
    పసిమనసు పద్మ
    దేవుడిచ్చిన కానుక
    తీయనైన స్నేహం
    రతనాల అక్షరాల
    వాణి వీణాపాణి మనపద్మ

    ReplyDelete
  25. అందమైన కవితలతో అందరినీ ఆనందపరుస్తూ నీవు ఆయురారోగ్యాలతో ఆనంగా ఉండాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు

    ReplyDelete
  26. నడుస్తున్న బాటలో కొత్త అర్థాలే వెతుకుతూ
    నూతనోదయానికి నాణ్యమైన నాంది వేసున్నా
    ఇలాగే కొనసాగనివ్వండి. జన్మదిన శుభాకాంక్షలు పద్మార్పిత

    ReplyDelete
  27. many more wishes on your birthday

    ReplyDelete
  28. Wishing you many many more returns of the day padma

    ReplyDelete
  29. దీర్ఘాయుష్మాన్భవ

    ReplyDelete
  30. నువ్వు ఇటువంటి మరెన్నో వేడుకలు జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ..పుట్టిన రోజు శుభాకాంక్షలు-హరినాధ్

    ReplyDelete
  31. ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు...

    ReplyDelete
  32. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా నమస్సుమాంజలులు_/\_

    ReplyDelete