రూపు మార్చేయ్

మగువనంటూ మదిలోన మదనపడింది చాలు
మదం ఎక్కిన వాడి మగతనాన్ని మసిచేసెయ్!

వెకిలిచేష్టల వారిని వద్దంటూ వారించింది చాలు
వెన్ను వంచి వాడి నరాల్లో వణుకు పుట్టించేయ్!

చంకలోని పసివానికి చనుపాలు ఇచ్చింది చాలు
ఛాతీని చూసి చొంగ కార్చిన వాడి కళ్ళు పీకెయ్!

నలిగిపోయి నలుగురిని న్యాయం అడిగింది చాలు
నడిబజార్లో వాడ్ని నిలబెట్టి నపుంసకుడ్ని చేసెయ్!

సహనానికి మారుపేరు స్త్రీ అంటే సహించింది చాలు
శంకించిన వాడు పతి అయినా పైత్యం పిండేసెయ్!

కామించు అంటే కాదనలేక కుమిలిపోయింది చాలు
కాళిలా మారి వాడి కంఠాన్ని కదంతో తొక్కిపారెయ్!

52 comments:

  1. ఏందక్కా...చండీ వేషం యేసినావ్. మస్తు భయ్యంగుంది

    ReplyDelete
    Replies
    1. గిట్ల భయపడితే గెట్లా తంబి

      Delete
  2. చాలా బాగా రాస్తున్నారండి..బెష్!!!


    ReplyDelete
  3. అమ్మ, ఆలి, అక్క చెల్లిగా అణిగిమణి ఉంటే చెల్లదు. తప్పక మారవలసిందే. టైంలీ పోయం మాడం

    ReplyDelete
    Replies
    1. అవసరాన్నిబట్టి మారక తప్పదు కదాండీ

      Delete
  4. అమ్మలా అనురాగాన్ని పంచడమే కాదు
    భగ భగ మండే అగ్నిగుండంలా మారిపో!

    ReplyDelete
  5. అధ్భుతం-
    ఆడదంటే అబల కాదు సబల అని అక్షరాలతో ఉసిగొల్పి ధైర్యాన్ని అందిస్తున్నారు. నూతన సంవత్సరంలో మరిన్ని స్ఫూర్తిని ఇచ్చే కవితలతో అలరిస్తారని ఆశ్శిస్తున్నాము.

    ReplyDelete
  6. Fire in every sentence...keka

    ReplyDelete
  7. మీరు మాత్రమే వ్రాయగలరు ఇలా, ఎవరినైనా శాసించేలా

    ReplyDelete
    Replies
    1. నాకన్నా బాగా వ్రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు యోహంత్

      Delete

  8. బామ్మో ! ఇక్కడేదో విప్లవ వాదం ప్రజ్జ్వ రిల్లు తోంది :) జర దూరంగా వెళ్లి పోదారి :)

    ReplyDelete
    Replies
    1. ఇలా దూరంగా పారిపోతే ఎలాగండి :-)

      Delete
  9. కళ్ళు పీకెయ్! తొక్కిపారెయ్! వణుకు పుట్టించేయ్! పిండేసెయ్! మసిచేసెయ్! అమ్మో ! కాళిక ! చండీక ! భయ్యం ! అగ్ని ! భగ భగ ! సల సల !

    ReplyDelete
    Replies
    1. ఇదేదో ముందరికాళ్ళకి బంధము వలె గోచరించు చున్నది ఆచార్యా :-)

      Delete
    2. పీకేయ్, తొక్కేయ్ ..అని మీరు అంటే మాత్రం కారణం లేకుండా ఎందుకు చేస్తారు :-)

      Delete
  10. కొత్తదనంతో కదం తొక్కి కదనరంగంలో దూకే నవీన ఝాన్సీ రాణి లా ఉన్నారు. కొత్తదనం అంటే అక్షరాలలో రూపు మార్చారు.; భావాల్లో మారలేదు. చిత్రంలో రూపు మారింది; చిత్రం ఎంపికలో రూపుమార్చలేదు. నిజం! మీ పాత కవితలు గమనించినట్లైతే చాలా వరకూ అంతర్లీనంగా ఇలాంటి భావాలే కనిపిస్తాయి. దృవాల్లో సూర్యుడు ఎప్పుడు ప్రశాంతంగానే కనిపిస్తాడు కానీ, అక్కడ ఎప్పటికి అగ్ని జ్వలిస్తూనే ఉంటుంది. మీ కవితలూ అంతే నివురుగప్పిన ‘విప్లవం’. ఇండైరెక్టుగా మగజాతిని ఏకిపడేసిన చాలా కవితలకు ఎంతోమంది భుజాలు తడుముకున్నారు. తిట్టకనే తిట్టి గజగజ లాడించిన మీ ఎన్నోకవితలకు భిన్నం ఈ కవిత. ఈ కవితలో భావాలు మారలేదు. మీరు వ్యక్తపరచిన విధానం మారింది. ఈ కవిత గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. ఇంతటితో శెలవు మేడం... సలాం!!

    ReplyDelete
    Replies

    1. అభిమానిగారు...రూపం ఏదైనా నాది కాదండోయ్, అవసరం అనుకున్నప్పుడు అలా రూపాంతరం చెందాలని. అంతే thank you.

      Delete
  11. ఆల్ఖైదాలో జాయిన్ అయ్యారా... :-) కవిత కెవ్వు!

    ReplyDelete
    Replies

    1. ష్...గట్టిగా అనకండి, అరెస్ట్ చేస్తారు :-)

      Delete
  12. అనురాగాన్ని చూపించే ఆడది అవసరమైతే ఆదిశక్తి అవతారం ఎత్తాలని చెప్పారు.
    అర్పిత అమ్మోరుతల్లి అవతారం ఎత్తినట్లుంది కవితతో...

    ReplyDelete
    Replies
    1. ఏది...ఆ అవసరం రాలేదు, రాకూడదని

      Delete
  13. సహనానికి మారుపేరు స్త్రీ అంటే సహించింది చాలు
    శంకించిన వాడు పతి అయినా పైత్యం పిండేసెయ్!ఎవరైనా స్పేర్ చేసేది లేదు :)

    ReplyDelete
  14. కాళిక కేళిక
    ధూళిక వధూళిక

    ధోంగత ధేయిత నాట్య సుగానరతే
    జృంభిత పద గుంభిత రక్తారుణ నేత్రయుతే
    జయ జయహే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని

    పద్మార్పితే!

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ...శాంతింపజేసారు :-)Happy new year in advance Sir

      Delete
  15. శాంతి శాంతి శాంతి
    ఇంత ఉగ్రరూపం చూడలేం

    ReplyDelete
    Replies
    1. మీకు ఆ భయం వలదు నందుగారు :-)

      Delete
  16. ప్రస్తుతం ఇలాంటి న్యాయమే అవసరం లోకంలో మగమానవ మృగాలకి

    ReplyDelete
    Replies
    1. ఆడవాళ్ళు కూడా ఉన్నారు లిపిగారు, కాని వేరో విధంగా.

      Delete
  17. ఆహా ఇంత కోపం ఎందుకు?

    ReplyDelete
  18. కేవలం స్త్రీలే హింసించబడుతున్నారు అనుకోవడం మీ అపోహ పద్మార్పితగారు. పురుషూ బాధించబడుతున్నారు కానీ పైకి చెప్పుకోరు, చెప్పుకున్నా నమ్మరు. మరి వారి మాట ఏమిటో సెలవీయండి.

    ReplyDelete
  19. నలిగిపోయి నలుగురిని న్యాయం అడిగింది చాలు
    నడిబజార్లో వాడ్ని నిలబెట్టి నపుంసకుడ్ని చేసెయ్!
    సూపర్ డూపర్ లైక్

    ReplyDelete
  20. సహనానికి మారుపేరు స్త్రీ అంటే సహించింది చాలు
    శంకించిన వాడు పతి అయినా పైత్యం పిండేసెయ్!
    ఆడవాళ్ళని ఉసిగొల్పుతున్నారా మాపైన మాడంజీ

    ReplyDelete
    Replies
    1. చెడుని సంహరిచాలనే తప్ప ఉసిగొల్పడాలు లేవండి

      Delete
  21. కామించు అంటే కాదనలేక కుమిలిపోయింది చాలు
    కాళిలా మారి వాడి కంఠాన్ని కదంతో తొక్కిపారెయ్..మారక తప్పని కాలం

    ReplyDelete
    Replies
    1. అన్నింటా కాదండి!

      Delete
  22. పద్మార్పితా...చండీయాగం ఏదైనా తలపెట్టినావా ఏమి. ఏకంగా మగజాతినే ఏకిపడేసావు. సరదాకి అన్నాను.
    చాలా చక్కగా వ్రాసావు.
    అభినందనలు-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. మీకు తెలియకుండా ఏం యాగాలు సర్:-)

      Delete
  23. మీరు ఇక్కడ ఇంత ఉగ్రరూపం ఎత్తినా...ప్రశాంతంగా ఉన్న వాతావరణం చూస్తుంటే నమ్మశక్యంగా లేదండోయ్.
    కవిత విషయానికి వస్తే...ఊగుతూ ఊపేస్తుంది :-)

    ReplyDelete
    Replies
    1. మీరు ఇలా అని నిప్పు రాజేయకండి :-)

      Delete
  24. జయజయహో స్త్రీ విప్లవం జయహో ☺

    ReplyDelete