అటు ఇటుకాని.,

నింగిలోని చుక్కలు వీడ్కోలు పలకడమే తడవు
గరిక కొనల్లోని సూర్యుడు మేల్కొన్నది మొదలు
ఉండీ లేనట్లున్న జ్ఞాపకాల నడుమ రాయబారమే
ముఖకవళికలకి రంగులద్దుతూ అలజడి చేస్తుంటే
తలుపు తడుతున్న సంబరాలే కరిగి కలవరపడె!! 

ఆకునీడ దాగిన పూలు గాలి తాకిడికి కదులుతూ
చిరుజల్లులు తమని తడిపి నేల తాకవని తలుస్తూ
నవ్వులు రువ్వ అంతలో ఆకశాన్న ఉరుము మెరవ
తెరిపి కోసం ముడుచుకున్న ఆకుల్ని తడుముతుంటే
సాంగత్యాన్ని తాళలేని కాండమే కరకుగా విరిగిపడె!!

హృదయాన్ని అద్దంలో చూపలేని ప్రకృతి పరవశంతో
తలపులని తట్టిలేపి అస్థిరమైన రూపాన్ని కానుకిచ్చి
తేలికవని మనసుని కరిగిపోనిచ్చి కుదుటపడమని 
పల్లపు లోయలో దాగని జ్ఞాపకాలని పారిపోమనంటే
దిక్కుతోచని గమ్యం అవిటిది అయిపోయి మూలపడె!!

43 comments:

  1. awesome painting
    superb poetry padma
    keep rocking my dear..

    ReplyDelete
  2. జ్ఞాపకాల దొంతెరలు.. జలతారు వెన్నెలలు
    మూగబోయిన గొంతుకలో.. పలుకలేని భావాలు
    చూసే కన్నుల్లో చెమరింతలు.. దారి కానరాక తడబాటు
    ఎగిసే అలలపై తేలియాడే నురగలా.. వీచే గాలి తరగలా..
    అపుడపుడు నవ్వులు.. వెనువెంటే నిట్టుర్పులు
    అలసిన మదినిండా.. పెనవేసుకునే తలపులు
    కాసింత పలవరింత.. కాసింత కలవరింత..
    అద్భుతమైన రంగుల దివిలో మంచుపువ్వుల నవవసంతం విరాజిల్లగా..
    మనసే హాయిరాగం కొఱకు గడిచిన నవ్వుల క్షణాలను వెతికేనుగా..

    The Ambience of this Poem all of a sudden takes one into a magical world of trance. All majestic moments have come across the mind.

    Awesome Poem Padma Gaaru

    హ్యాపి శయన ఏకాదశి
    వైకుంఠ తొలి ఏకాదశి శుభాభినందనలు మీకు పద్మ గారు..

    ~శ్రీ~
    శేషతల్పశాయి.. ళోళోళోళోఆయి

    ReplyDelete
    Replies
    1. అహ్లాదమైన పదాలు శ్రీధర్.ఆశిస్సులు-హరినాధ్

      Delete
    2. ధన్యోస్మి హరినాథ్ సర్

      Delete
  3. ముఖకవళికలకి రంగులద్దుతూ అలజడి చేస్తుంటే
    తలుపు తడుతున్న సంబరాలే కరిగి కలవరపడె
    కలత చెందెను హృదయం చదివి.

    ReplyDelete
  4. జీవితాన్ని అందమైన ప్రకృతితో ముడిపెట్టి, చివరికి నిరాశ నిసృహతో అంతం ముగింపు పలకడం నచ్చలేదు. చిత్రంలో కోమలాంగి కూడా అదే పంధాలో ఉన్నప్పటికి బాగుంది-హరినాధ్

    ReplyDelete
  5. చిరుజల్లులు తమని తడిపి నేల తాకవని..అయ్యో ఏం ఎంజాయ్ చేస్తాం!

    ReplyDelete
    Replies
    1. వేడి సెగలున్న చోట చినుకు తడి ఉండదంటారు.. కాని మనసు పడే వేదనంతా వేడి సెగలు రేపినపుడు.. కునుకు రాని కన్నుల వెంట తడి తేమ ఉంటుంది ఎందుకో మరి..!

      ~శ్రీ~

      Delete
  6. గిట్ల పరేషాన్ జేస్తివి
    ఏం చేసేది అర్పితమ్మ

    ReplyDelete
  7. తేలికవని మనసుని కరిగిపోనిచ్చి కుదుటపడమని
    పల్లపు లోయలో దాగని జ్ఞాపకాలని పారిపోమనంటే
    తెరిపి కోసం ముడుచుకున్న ఆకుల్ని తడుముతుంటే
    సాంగత్యాన్ని తాళలేని కాండమే కరకుగా విరిగిపడె!!
    మీకు ఇలాంటి పదాలు కొట్టినపిండి.చాలా బాగావ్రాశారు.

    ReplyDelete
  8. ఒక్క ముక్కలో:అద్భుతం

    ReplyDelete
    Replies
    1. ನಿಜಂ ಚೆಪ್ಪೋದ್ದು ಸಂಧ್ಯ ಶ್ರೀ ಗಾರು.. ಈ ಕಮೆಂಟ್ ಲಾಗಾನೇ ಮೀಕು ಪದ್ಮಗಾರಿ ಕವಿತ ಅರ್ದಂ ಕಾಲೇದು ಕದಾ.. ಅಂದುಕೇ ಒಕ್ಕ ಲೈನ್ ಲೋ ಕಮೆಂಟ್ ಚೇಶಾರು.. ಔನಾ..!

      Delete
    2. అటు ఇటుకాని సందిగ్ధత..
      ఎటు తేల్చలేని నిస్సహాయత..
      అగమ్యగోచరమగు నిర్లిప్తత..
      ఇవన్ని కలగల్పి రాశారేమో పద్మ గారు..
      అందుకే కవితకు కమెంట రాస్తే ఉద్విగ్నత.. 🙄

      Delete
  9. ఆకునీడ దాగిన పూలు గాలి తాకిడికి కదులుతూ
    చిరుజల్లులు తమని తడిపి నేల తాకవని...సున్నిత భావప్రకంపనలు మీ కవితాచిత్రాలు

    ReplyDelete
    Replies
    1. Check Out this Flower:
      Diphylleia Grayi..
      When Raindrops fall on the Petals of the Flower, they turn Translucent, but otherwise when dry, exhibit white flowers.

      See Lyrebird too.. The Multi modulatory Mimicking Bird.

      Thank You..
      Jai Sriram

      00:01

      Delete
  10. చివరిలో వైకల్యాన్ని అంటగట్టారు జీవితానికి. విషాదం మీకు కడు ప్రియం కామోసును పద్మార్పితకు.

    ReplyDelete
  11. మీరు అటు ఇటు పదాలతో ఆడుకుని అక్షరాలతో ఆడుకుంటున్నారు. ఏమి అనగలం చెప్పండి

    ReplyDelete
  12. అటు ఇటు కాని ఆటబొమ్మలు మనుషులు అని చెప్పి కళ్ళు తెరిపించారు.Picture extraordinary painting.

    ReplyDelete
    Replies
    1. Life is nothing but, a mix of emotions, amalgamated with best and worst moments.
      When the mind feels elated, even a painful journey seems to be enjoyable. It is not how a situation can change a person. It is but how a person reacts to a situation.
      Everyone has tears, Everyone has pain, life is a bridge that connects humanity with divinity.
      Whatever we possess today, is just a matter of what we hold physically. For a small acorn can hold a huge oak inside. Is it not Nayani Gaaru


      *Acorn: Scrat*
      Ice Age Part 5, Collision Course.15 07 2016 3D Animation

      23:55 19 07 2016

      Delete
  13. తెరిపి కోసం ముడుచుకున్న ఆకు, బాగుంది ఎప్పటిలా.

    ReplyDelete
  14. అదిరింది మీ భావుకవిత్వం చిత్రం.

    ReplyDelete
  15. మీరు కవిత రాసి పాతరోజుల్ని మరోమారు గుర్తు చేసారు. ధన్యవాదం.

    ReplyDelete
  16. उन हाथों को याद रखना जो ज़िन्दगी के हर कदम पर अपनी साया बिछायी हो
    उन बातों का कदर करना जो पराया ही सही अपनापन का एहसास दिलायी हो
    वक्त किस समय पर कैसी मोड ले यह किसको पता
    साँसे कब तक चले इसका किसे क्या अन्दाज़ा
    उन हाथों को याद रखना जो ज़िन्दगी के हर कदम पर अपनी साया बिछायी हो
    उन बातों का कदर करना जो पराया ही सही अपनापन का एहसास दिलायी हो
    कभी फ़ूलों की महक वाली प्रकृति भी न जाने तूफ़ान का ज़ोखिम उठा लेती है
    कभी हँसता चेहरा पर उदासी और मायूसी आँसू से दस्तख़त कर जाती है
    उन हाथों को याद रखना जो ज़िन्दगी के हर कदम पर अपनी साया बिछायी हो
    उन बातों का कदर करना जो पराया ही सही अपनापन का एहसास दिलायी हो
    मेहमान हैं धरती पर चन्द दिनों के न फ़िर लौट आयेगी ये अलबेला जिन्द़गानी
    सिर्फ़ होंठों पर शब्द व यादें दिमाग में रह कर दोहरायेगी अपनी अनोख़ी कहानी
    उन हाथों को याद रखना जो ज़िन्दगी के हर कदम पर अपनी साया बिछायी हो
    उन बातों का कदर करना जो पराया ही सही अपनापन का एहसास दिलायी हो

    ~श्रीधर भूक्या

    ReplyDelete
  17. హృదయాన్ని అద్దంలో చూపలేని ప్రకృతి పరవశంతో
    తలపులని తట్టిలేపి అస్థిరమైన రూపాన్ని కానుక ఇవ్వడం బాగుంది.

    ReplyDelete
  18. శైలి మార్చిన నూతనత్వం కవితలో కనిపించింది. పెయింటింగ్ బాగుంది.

    ReplyDelete
  19. ఎటు కాని జీవితాలు నిరాశ నిట్టూర్పులు :)

    ReplyDelete
    Replies
    1. రేపన్నది శ్వాస మాత్రమే..
      శ్వాస లేకుంటే శాశ్వతమిక గాఢ నిద్ర..
      జీర్ణమయ్యాకా ప్రాణమే నిలవదు..
      నీడలా వెంట వచ్చేది ఏది..
      వెలుగులో దేహపు చీకటే నీడన్నది..
      చీకటిలో ఆత్మజ్యోతి వెలుగన్నది..
      కరిగిన మైనపు చమురులాటి దేహానా..
      వెలుగు ప్రసరించేదే ఆత్మజ్యోతి..
      ఆ జ్యోతి కూడా కొండెక్కే సమయం రాక మానదు..

      స్వస్తి

      Delete
  20. కలవరపాటులో కునుకు కూడా మరచి
    తత్తరపాటులో నిన్నే నీవు మరిచి
    ఏవరి రాకకై ఎదురేగి ఈ నిరీక్షణ బేలా
    కారడవిలో ఆకులైనా లేని చేట్టు క్రింద ఎంత సేపని ఇలా

    మీ కవిత కు ప్రేరణ ఐన చిత్రానికి నా మార్కు కవితాక్షరి పద్మగారు..

    ReplyDelete
    Replies
    1. హ్యాపి గురుపూర్ణిమ మరియు సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ (సింహాద్రి అప్పన్నా) గిరి ప్రదక్షిణ ఆషాఢ మాసోత్సవ శుభాభినందనలు పద్మార్పిత గారు

      Delete
    2. కనురెప్పలు నీ రాకకై ఎదురు చూసి వేసారే
      చెవులు నీ పిలుపుకై స్పందించాలని ఆరాటపడే
      ఆశకు అడియాసకు నడుమ ఏకాకినై
      కాలానికి కలలకి నడుమ వారధినై
      తపన తాపత్రయాల వెల్లువలో గళం మూగదై
      జీవమున్నా తోలుబొమ్మలా ఆడుతు
      దారం తెగిన గాలిపటంలా రెక్కలు తెగిన పంఛిలా
      వాసంతం విడిచి ఆకురాలి మోడుబారిన వనంలా

      పద్మ గారు.. నేను మీ కవితాక్షర ఝరికి మాత్రమె వైవిద్యంగా కమెంట్ చేస్తున్నా కదా అని ఈ సారి చిత్రానికి తగిన భావం జోడించి వ్రాస్తే ఇదుగోండి ఇలా అమరినాయి..! అచ్చు తప్పులేమైన ఉండవచ్చు..అర్దం తప్పైతే క్షంతవ్యుణ్ణి.. !!

      జై శ్రీమన్నారాయణ
      రాధమాధవ

      ~శ్రీ~
      నవనీతచోర నందనందన

      Delete
    3. After going through your poem, the following quotation flashed in my mind, Padma Arpita Gaaru:

      There comes a time, when you have to stop crossing oceans for people who won't even cross a puddle for you.

      Shivam Shankaram
      ~Sri~

      Delete
  21. పల్లపు లోయలో దాగని జ్ఞాపకాలని పారిపోమనంటే touching words mam. Fantastic painting.

    ReplyDelete
    Replies
    1. గడిచిన మధుర ఘట్టాలనే మనసు జ్ఞాపకాలుగా మలచి పదిలంగ దాచుకుంటుంది..
      గడిచిన తీపి కబురులనే మనసు ఊసులుగా చిత్రించుకుంటుంది..
      గతించిన హాయి రాగాలనే మనసు నెమరేసుకుని ఓలలాడుతుంటుంది..

      Delete
  22. అటు ఇటు కాకపోవడం అన్యాయం కాదా :-)

    ReplyDelete
    Replies
    1. న్యాయాన్యాయాల బేరిజు వేసి చేసేదేమున్నది..
      మంచి అనేది మనిషిలో ఉంటే అదే చాలన్నది..
      రేపటి రోజున కన్నీరే చెంపను తడిమితే..
      ఒక్క క్షణం చిరు నవ్వు సంతకం చేస్తే..
      మనసనే పూదోటలో భావాల మిణుగురులు..
      వెలుగు ప్రసరించే మానసికొల్లాసపు సమిధలు..

      ~కేశవ మాధవ మధుసూదన~

      Delete
  23. మంచి పట్టుగల కవిత.

    ReplyDelete
    Replies
    1. సముద్రిక పట్టు
      కాంచిపురం పట్టు
      ఉప్పాడ పట్టు
      గద్వాల్ పట్టు
      ధర్మవరం పట్టు
      మైసూరు పట్టు
      ఉడుము పట్టు

      వీటిలో ఏ పట్టు కల్కి గారు 😛

      Delete
    2. శ్రీధర్ బుక్యా గారు

      చిత్రిక పట్టు :)

      జిలేబి

      Delete
    3. ☺ జిలేబి గారు

      Delete
  24. _/\_అందరికీ అభివందనములు_/\_

    ReplyDelete