ప్రేమహంతకుడు..

"ప్రేమించు ప్రేమను నీవు ప్రేమతో పంచూ
అది రెట్టింపు ప్రేమను నీకు అందించు..."
పద్మ ప్రేమకే అర్పితమని కబుర్లెన్నో పలికి
ప్రేమ భావాలను మనసు నిండా నింపితే
ప్రేమించి ప్రేమించానని భరోసా ఇవ్వమంటే..
బలమైన బంధానికి బానిసను మన్నించమనె!
ప్రేమించిన మనసు బ్రతకడం రాక చావలేక
అనుకున్నది ఒకటి జరిగె మరొకటని వగచి
మార్గం మార్చి నడువ చేయి అందించమంటే..
కన్నవాళ్ళు కాళ్ళే కాదు చేతులూ కట్టేసారనె!
నచ్చింది చేయాలనుకుంటే అడ్డురాని ఆటంకాలు
నచ్చనివి వద్దనడానికి వంకలెన్నోనని మనసంటే
ప్రాధాన్యతనిబట్టే ప్రణయమైనా పని ఏదైనా అని..
ప్రేమించడానికి అవసరంలేని మిగతా అవయవాలనె!
జీవితపు చివరిమజిలీ వరకూ భంగిమలు మారుస్తూ
ప్రేమను నాలో చంపేసిన నా ప్రేమికుడికి నజరానా..
నవ్వుతూ బ్రతుకుతున్నాననే భ్రమని కలిగించానంటే
ఇంట గెలవకపోయినా నా ప్రియుడు రచ్చ గెలుస్తాననె!  

75 comments:

  1. ప్రేమ హంతకుడు అంటే ఏ తల్లో తండ్రో అనుకున్నాను..మీరు ఏకంగా ప్రేమికుడినే హంతకుడ్ని చేసారు. మీరు దేనికైనా సమర్ధులు. చిత్రాల ఎంపికలో మీకు మీరే సాటి.

    ReplyDelete
    Replies
    1. భయం లేకుండా ప్రేమించినప్పుడు సమర్ధించుకోవడంలో తప్పులేదేమో!

      Delete
  2. ప్రేమించడానికి మనసు అది కాదనుకుంటే మరే అవయవం చేయలేని పని మనసు వ్యధ చెందడము.
    ప్రేమలో తప్పని వేదన. కవితను అలరించిన తీరు తెన్ను ప్రియుడిని తిట్టినట్లు ప్రేమిస్తున్నట్లు ఉంది.

    ReplyDelete
    Replies
    1. మనల్ని మనం తిట్టుకోవాలి కానీ ఎదుటివారిని తిడితే ఊరుకోరుగా

      Delete
  3. రాక రాక వచ్చారు
    రసవత్తంగా రాయకుండా
    హత్యలు హంతకుడూ
    అంటూ హారర్ పుట్టిస్తున్నారు
    గాప్ తీసుకోకండి..
    ప్రేమను కంటిన్యూ చెయ్యండి!

    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత ఎప్పుడూ ప్రేమేనా అంటూ తిట్టుకుంటూ తిడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారుగా.

      Delete
  4. నజరానా బాగుంది. టైటిల్ తప్పుగా పెట్టారు. ప్రేమ నజరానా అని ఉంటే బాగుండేది.ఎవరి ప్రాధామ్యాలు వారికి ఉంటాయి కదా ? కన్నవాళ్ళనూ గౌరవించాలి.

    ReplyDelete
    Replies
    1. నాకు తట్టలేదు సుమా...ప్రేమ నజరానా బాగుంది టైటిల్.
      కన్న వారి తరువాతే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎందులోనైనా సరే.

      Delete
  5. ఈ పుచ్చకాయ ప్రేమ అన్న పదం వింటేనే కంపరం కలుగుతుంది. మీరేమి వ్రాస్తున్నారో ఎందుకు రాస్తున్నారో అర్ధం కాదు👤🙋

    ReplyDelete
    Replies
    1. ప్రేమంటే అది కేవలం స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణకు పర్యాయ పదం అంటే నాకూ ఒళ్ళంతా కంపరం పుడుతుంది. ప్రేమ దాని భావ స్వరూపాలూ కలిగే సాధక బాధలు నా భావాలకి ఆలోచనలకు అక్షర రుపమే ఈ నా రాతలు తప్ప ఎవరినో ప్రేమించి ఎందరినో ఉద్దరించే ఉద్ధేశం లేదండి.

      Delete
  6. ప్రేమ ఒక్కటే మనిషి ప్రాణం అనుకోవడమే పైత్యం...అది స్త్రీ పురుషుల మధ్య ఉన్నది మాత్రమే అనుకోవడం మరో పెద్ద నేరం.

    ReplyDelete
    Replies
    1. మీతో నేనూ ఏకీభవిస్తాను.

      Delete
  7. ప్రాధాన్యతనిబట్టే ప్రణయమైనా పని ఏదైనా

    ReplyDelete
  8. మనసు ఒక్కటే ప్రేమంటూ పాకులాడేది
    మిగతా అవయవాలు చక్కగా మనకి అవసరమైన పనులు చేసి తృప్తినిస్తాయి..హా హా హా
    పెయింటింగ్ పోస్ట్ను తలదన్నింది.

    ReplyDelete
    Replies
    1. వన్‌ ప్లస్‌ వన్‌ ఈజ్‌ ఈక్వల్‌ టూ వన్‌ అండ్‌ వన్‌ ప్లస్‌ వన్‌ (1+1=1–1+1)ప్రేమకు నిర్వచనం ఇవ్వడం అసాధ్యమే కాదు, అనవసరం కూడా.

      Delete
  9. madam andarilo prema undali preminchali ani chee meru enduku premanu chapesinaru/ vadu.

    ReplyDelete
    Replies
    1. naaloe preama pai bhaavam maarindi ante...

      Delete
  10. మీ ప్రేమను చంపడం ఏమిటి వింత?

    ReplyDelete
    Replies
    1. నాలో ప్రేమను నేను చంపుకునే అధికారం లేదంటారా!?

      Delete
  11. prema 1 part ante life ante prema okate kadu.

    ReplyDelete
  12. premanu hatya chesina vaariki siksha cheppaledu madam
    chala pedda neram chesar siksha katinamveyandi

    ReplyDelete
    Replies
    1. siksha vesinaa tappinchukunTaaru kondaru.

      Delete
  13. ప్రేమ పెరిగి పరిపక్వత చెందితే ఇంక హత్య ఎలా చేస్తారు?

    ReplyDelete
    Replies
    1. ప్రేమ గుడ్డిది అయినప్పుడు పరిపక్వత కరువౌతుంది

      Delete
  14. ప్రేమోన్మాదం ఏమైనా పీక్ స్థాయికి వెళ్ళిందా ఏమిటీ అనుకుని చచ్చాను సుమా..అంతా ట్రాష్ అహా అహా!

    ReplyDelete
    Replies
    1. భయపడకండీ...అంత త్వరగా పోనుగా నేను :)

      Delete

    2. మీరూ జిలేబిలా వదలకుండా వాయగొడతానంటున్నారా పద్మార్పిత గారు :)



      జిలేబి

      Delete
  15. సృష్టి స్థితి లయ కారకుడై
    విశ్య మంతటను వ్యాపించి యున్న
    జగన్నాధుడైన
    ఆ పరమేశ్వరుడు  - విశ్వ ప్రేమికుడు .

    పరమేశ్వర సృష్టి యైన
    విశ్వాంతరాళంలో
    కొంత భాగమైన మనభూమిపై
    జీవించే సమస్త జీవరాశి
    కాధార భూతుడైన
    కర్మ సాక్షి
    శ్రీ సూర్య నారాయణుడు -  జీవ ప్రేమికుడు .

    భూమిపై విస్తరించిన
    సమస్త జల తరు గిర్యాది వనరుల ద్వారా
    జీవాన్ని పొదివి పట్టుకొని కాపాడు
    ప్రకృతి మాత  - పృధివీ ప్రేమికురాలు .

    ఆయాయి కాలాలలో అవతరించి
    పుడమి జనుల నుద్బోధించి
    మానవ జాతికి మార్గ నిర్దేశం చేసి
    సజీవంగా మానవ జాతి హృన్మందిరాలలో
    కొలువున్న ప్రవక్తలు  - మానవ ప్రేమికులు .

    సృష్టి ధర్మాచరిత
    సహ జీవన మాధుర్యం నుండి
    బిడ్డలను కని , పెంచి ,
    అవ్యాజానురాగాన్ని పంచే
    తలి దండ్రులు  - సంతాన ప్రేమికులు .

    మానవులను
    పశుత్వం నుండి వేరు
    విజ్ఞానాన్నందించే
    ఉపాథ్యాయ గురువులు - శిష్య ప్రేమికులు .

    మానవ జాతి సుఖజీవనం కోరి
    జీవిత మంతా
    ప్రయోగ శాలల కంకితమై
    క్రొత్త క్రొత్త ఆవిష్కరణల నందించే
    సైంటిస్టులు  - మానవ మనుగడ ప్రేమికులు .

    శారీరక , మానసిక దయనీయ స్థితిలో
    తమ వద్దకు వచ్చిన
    రోగులకు
    స్వాస్థ్యాన్నందించే
    వైద్య నారాయణులు - మానవారోగ్య ప్రేమికులు .

    అడుగడుగున మానవ హితమే
    మహోన్నతాశయంగా
    జీవన యానం సాగించే
    సాహితీ మూర్తులు ,
    కళాకారులు ,
    కార్మికులు ,
    నిరంతర - జన హిత ప్రేమికులు .

    కానీ , -----
    పరమేశ్వరుణ్ణి కూడా
    అసంబధ్ధ కర్మ క్రతువుల లోకి లాగి
    జనం అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని
    అజ్ఞానాన్ని బోధించే అంధ విశ్వాసులు –

    పరమేశ్వర నిబధ్ధమై
    నిర్దుష్టమై
    నిర్దిష్ట గమనంలో సాగే
    విశ్వాంతరాళ
    జ్యోతిశ్చక్రానికి
    వక్ర భాష్యాన్ని కట్టి
    పరతత్త్వంలోనే
    చెడు వెదికే కార్తాంతికులు  -

    నిరంతరం జన జీవనంలో ఉన్నామని
    జనాన్ని భ్రమింప జేస్తూ
    ప్రజా సేవలో తరిస్తున్నామని భ్రమింపజేస్తూ
    స్వార్థం తప్ప
    జనహిత మెరుగని
    నీతిబాహ్యులైన
    యావత్ రాజకీయ నేతలు  -

    పడుచు ప్రాయపు
    ప్రలోభాల నధిగమించు
    బలిమి లేక
    మోహావేశాలకు
    బానిసలై
    పెడత్రోవ పట్టి
    బాధ్యతలను విస్మరించే
    యువతీ యువకులు  -

    వీళ్ళంతా , -----
    ఎప్పటికీ
    ప్రేమికులు కాలేరు .
    కేవలం
    కాముకులు .


    ReplyDelete
    Replies
    1. ఎక్సెలెంట్...అమోఘమైన వివరణ విశ్లేషణ.

      Delete
    2. అత్యంత సరళంగా వ్రాసినా చెర్నాకోల్ తో వీపు పై చరిచి మేలుకొల్పినట్లు ఉంది మీ సుధీర్గమైన వ్యాఖ్య. నేను సింపుల్ గా రెండు ముక్కల్లో వ్రాసానని తిట్టుకోకండి.

      Delete
    3. ఏది ప్రేమ ఏది కాదు అనే క్లారిటీ ఇవ్వడానికి నేను చాంతాడంత ప్రయత్నం చేశాను .
      మరి ,
      నీహారిక గారి లాంటి భావనా వైదుష్యం గలవాళ్ళు మరింత
      పదునైన క్లారిటీ ఇవ్వొచ్చుగా .

      Delete
    4. ప్రేమ గురించి పైన చాలా మంది చాలా చక్కగా వ్రాసారు.

      మేమిద్దరం వ్యతిరేక దృవాలం కనుకనే కలిసి ఉండగలుగుతున్నాం. ఇద్దరూ సుతిమెత్తని వారైతే జీవితం బోరు కొడుతుంది.ఇద్దరూ పందెం కోళ్ళు అయితే ఎవరో ఒకరు చచ్చిపోతారు.

      ఇద్దరికీ సరిపడనపుడు కొన్నాళ్ళు దూరంగా ఉండడం నేను ఎంచుకున్న విధానం. చాలా జంటలలో తమకేది కావాలో స్పష్టత ఉండదు. భాగస్వామి నుండి చాలా ఆశిస్తారు.దానికోసం బాధపడతారు.

      మనకేది కావాలో మనమే సాధించుకోవాలి లేదా నోరుమూసుకు పడిఉండాలి.అంతే కానీ భాగస్వామిని మారమని అనడం నాకు నచ్చదు.తను ఎలా ఉండాలో అలాగే ఉండనిచ్చి మనం మారితే సరిపోతుంది.

      వివాహం అంటే ఇద్దరు కలిసి జీవించాలనుకోవడం. వేర్వేరు వాతావరణంలో పెరిగినవారు కలిసి జీవించడం అనేది ఎంత కష్టమైన క్రియ ?

      వివాహాన్ని నిలబెట్టుకోడానికి ఎంత ఓర్పు ఉండాలి?

      టగ్ ఆఫ్ వార్ జరుగుతూ ఉంటే మనల్ని మనం అధ్యాత్మికంగా మార్చుకోవడం ఆటోమేటిగ్గా జరిగిపోతుంది.

      భార్యా భర్తలే ప్రేమించుకోవాలా ? విశ్వమంతటినీ ప్రేమించాలి కదా ? ఇంటిలో వాళ్ళనే ప్రేమించలేకపోతే విశ్వం లో ఉన్న అందరినీ ఎలా ప్రేమించగలుగుతాం ?

      పెద్దలు కుదిర్చిన పెళ్ళిలో ప్రేమను వెతుక్కుంటున్నాను కానీ ప్రేమంటే ఏమిటో తెలియడం లేదు అడిగారు కాబట్టి చెప్పాను పద్మార్పిత గారికి ధన్యవాదాలు.

      స్రీకి బాధ్యత నేర్పవలసింది పురుషుడే, పురుషుడికి హక్కులు నేర్పవలసింది స్త్రీ, ఇద్దరూ కలిస్తే మనువు. మనువు అంటే జీవితం !




      Delete
    5. మీ క్లారిటీ బాగుంది . మీరు చెప్పిన దానిని బట్టి --
      బంధంలో కట్టి పడేసేదీ , అవసరమైనప్పుడు సర్దుకు
      పోవడం నేర్పించేదీను .

      Delete
    6. మనకేది కావాలో మనమే సాధించుకోవాలి లేదా నోరుమూసుకు పడిఉండాలి.అంతే కానీ భాగస్వామిని మారమని అనడం నాకు నచ్చదు.తను ఎలా ఉండాలో అలాగే ఉండనిచ్చి మనం మారితే సరిపోతుంది.
      ------------------------------------------
      Very True

      Delete
    7. ప్రేమలోనే కాదు సహజీవనంలో మరి ఎందులోనైనా సరే సర్దుబాటు అవసరం అంటారా నీహారికగారు...భళా బాగాచెప్పారు మాడంగారు.

      Delete
    8. ఎవరికైనా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు దాన్నో పెద్ద సమస్యగా భావించి మనకి అనుగుణమైన ప్రతికూలాంశాలను వెతుక్కుని సానుకూలంగా ప్రవర్తిస్తే ఎవరైనా సర్దుబాటు ధోరణికి వచ్చేస్తారు. ఒకసారి సర్దుబాటు ధోరణికి అలవాటుపడితే మనతో ఆడుకుని అన్నిటా సర్దుకుని పొమ్మనే ప్రమాదం కూడా ఉంది అందుకే ఒకో వ్యవహారానికి ఒకోలా స్పందించాలి అనుకుంటాను నామట్టుకు నేను.

      Delete
    9. >>>ఒకసారి సర్దుబాటు ధోరణికి అలవాటుపడితే మనతో ఆడుకుని అన్నిటా సర్దుకుని పొమ్మనే ప్రమాదం కూడా ఉంది >>>

      నిజం చెప్పారు.సర్దుకుపోతుంటే ఇదొక అమాయకురాలు నేనేది చెప్తే అది చేసేస్తుంది అనేసుకుంటారు.నాతో వారు ఎలా ప్రవర్తిస్తారో నేనూ అలాగే ప్రవర్తించడం మొదలుపెట్టా.అపుడు నువ్వు అమాయకంగా ఉండేదానివి కదా ఇపుడు తెలివిమీరిపోతున్నావు అనడం మొదలుపెట్టారు.

      నాన్న దగ్గర ఉన్నపుడు అమాయకంగా పెరిగాం.ఇపుడు ఇలా (అతి)తెలివిమీరేలా తయారుచేసుకుంది వాళ్ళే,ఎవరు చేసుకున్న ఖర్మ వాళ్ళు అనుభవించవలసిందే కదా ?

      Delete
    10. నీహారికగారూ...మీ రీసెర్చ్ బాగుందండి. ప్రేమను సర్దుబాటు ధోరణితో కట్టిపడేసారుగా :)

      Delete
  16. ప్రేమ పై పగబట్టినారా?
    లేక ప్రియుడి పై కక్ష?

    ReplyDelete
    Replies
    1. ఎవరి పై కక్ష కట్టి ఏం సాధిస్తాము చెప్పండీ...అందర్నీ ప్రేమిస్తే హాయి.

      Delete
  17. ప్రేమను పుట్టించిన వాడికి చంపడం చేతకాదు అలా అనుకుంటే అసలు ప్రేమను పుట్టించ వలసిన అవసరము లేదు. అది ఎప్పుడు ఎవరిపై పుడుతుందో తెలియదు.

    ReplyDelete
    Replies
    1. అలా తెలీదు అని గాలికి వదిలెయ్యలేం కదండీ.

      Delete
  18. అసలు ప్రేమకు సరైన నిర్వచనం తెలుసుకుని ప్రేమిస్తే ఇటువంటి జాడ్యాలు అంటుకుని యువత పాడైపోరు అనుకుంటాను. ప్రేమికులు ఇచ్చిపుచ్చుకునే మీమాంసలో కొట్టుకుని ఉన్మాదులుగా మారిపోతున్నారు అనిపిస్తుంది. మంచి ఆలోచనాత్మకమైన విధానంతో సాగింది కవిత. చిత్రము చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ప్రేమకు సరైన నిర్వచనం ఇప్పటి వరకూ ఎవరూ చెప్పలేదు.
      జీవితం ఒక బాధ. ఆ బాధకు ఔషధం ప్రేమ. ప్రేమ ఒక బాధ. ఆ బాధకు ఔషధం లేదు – మీర్జా గాలిబ్‌ అంతటి వారే ఇలా అర్థం అయ్యి అర్థం కానట్లు చెప్పారు...ఇక నాబోటి వాళ్ళు ఎంత?.

      Delete
  19. ప్రేమను నమ్ము ప్రశ్నించకు
    ప్రేమను కోరు నియంత్రించకు
    ప్రేమను పొందు యాచించకు
    ప్రేమను అంగీకరించు వద్దనకు
    ప్రేమను నీవు పంచు త్రుంచకు
    ప్రేమను రుచి చూడు చెరపకు

    ReplyDelete
    Replies
    1. ప్రేమిస్తే ఇంకేం చెయ్యలేము :)

      Delete
  20. preminchu premanu panchu annavadu trunchadu.

    ReplyDelete
  21. ప్రేమ చచ్చిపోతే మళ్ళీ పుట్టుకొచ్చే కొత్త మార్గం చెప్పండి. అంతేకానీ ప్రేమ చచ్చించి అని ఏడవడం ఎందుకు?

    ReplyDelete
    Replies
    1. Balugaru మార్గాన్వేషణలో ఉన్నా...

      Delete
  22. ప్రేమ అనేది అందరి మధ్యా ఒకేలా ఉండదు. మనం ఆ బంధం నుంచి ఆశించే దానిపైనే ప్రేమ ఆధారపడి ఉండదు మన మనస్తత్వం వ్యక్తిత్వం మీద ఆధారపడివుంటుంది. కొందరికి ప్రేమ అంటే ఎప్పుడూ కలిసివుండడం, మరికొందరికి ప్రేమ అంటే ఇద్దరూ అన్ని విషయాల్లోనూ ఒకేలా ఆలోచించడం, ఒకే అభిరుచి కలిగివుండడం అయితే మరికొందరికి ప్రేమ అంటే ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేసుకోవడం ఇచ్చిపుచ్చుకోవడం అవ్వొచ్చు. ఇలా విభిన్నంగా ఉండే వాటికి నిర్వచం ఇదని ఖచ్చితంగా నిర్వచించలేము. ఎవరికి వారే వారికి తోచినది ప్రేమ అనుకుంటారు.

    ReplyDelete
    Replies
    1. Gopalgaru ప్రేమించడం ప్రేమను పంచడం...ఎవరి ఇష్టం వారిది అంటారు మొత్తానికి

      Delete
    2. ప్రేమంటే మనిషిలో కాదు మనసులో మార్పు తెస్తుంది
      ప్రేమిస్తున్న వ్యక్తితో పదే పదే మాటలు పంచుకుంటేనో,
      తనతో గంటల తరబడి గడిపేస్తేనో, ప్రతి క్షణం తనతో కలిసుంటేనో ప్రేమ అవ్వదు...
      తనకి దూరంగా ఉన్నా కూడా జ్ఞాపకాలను ఆస్వాదిస్తూ మనస్సుకీ మనస్సుకీ మధ్య ఉన్న సంబంధమే ప్రేమ!

      Delete
  23. నిజానికి ప్రేమకు సమగ్ర స్వరూపం అంటూ ఏదీలేదు. అది ఎప్పుడూ సాపేక్షమైన విలువను కోరుకుంటూ నిస్వార్థంతో మెలగాలి అనుకుంటుంది. అందుకే తరచుగా స్త్రీ పురుషులు "నాకు నీ మీద ఉన్నంత ప్రేమ నీకు నా మీదలేదు" అని నిందలు వేసుకుంటూంటారు. అయినా ప్రేమకు కొలమానమే లేనప్పుడు ఎవరికి తోచిన విధంగా వారు కొలుచుకోవడం అమాయకత్వం అనుకోవాలి. ప్రేమనేది చచ్చిపోతే మళ్లీ బ్రతికించడం కష్టం. బలవంతంగా బ్రతికించాలని ప్రయతిస్తే విచిత్ర రూపన్ని సంతరించుకుని అబాసుపాలౌతుంది. దీనికన్నా ఒకరిని ఒకరు ధ్వేషించుకోవడం నయం, ప్రస్తుతం జరుగుతున్నది అదే. ప్రేమను నిలుపుకోవడానికి శాశ్వత పరిష్కారాలు, చిట్కాలు లేవు. కానీ, ఒకరి నుంచి ఒకరు ఎక్కువ ఆశించకపోతే ఎక్కువ వ్యధ చెందము అనిపిస్తుంది. ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం ఎంత ఉండాలో అంతే పరిమితిని గీసుకుని హద్దుల్లో ఉండడం ఉత్తమం. అలా ఎవరి హద్దుల్లో వారు ఉండి ఎక్కువ ఆశించనప్పుడు ఏ బంధంలోనైనా అవిశ్వాసాలు, అనుమానాలు, ఈర్ష్యలు, మనస్పర్ధలు, గొడవలు అనేవాటిని నియంత్రించ వచ్చును. ఏదైనా ఎవరి ప్రాధాన్యత అవసరాన్నిబట్టే దేనినైనా ఇచ్చిపుచ్చుకుంటారు అనేది నిర్విదాశం అది ప్రేమైనా మరేదైనా.

    ReplyDelete
    Replies
    1. నమస్కారములు.

      Delete

    2. ప్రేమ ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఎవరైనా ప్రేమించకుండా ఉండలేరు. లోకమంతా ప్రేమమయం. ప్రేమకు ధనవంతులు, పేదవారు అన్న తేడాలుండవు. చదువుకున్న వారు, చదువుకోని వారు అన్న వ్యత్యాసం ఉండదు. ఒకానొక ప్రేమకు వయస్సు కూడా పెద్ద కారణం కాదు. మనసులు రెండు ఒక్కటైతే చాలు ప్రేమ అంకురిస్తుంది. అభిరుచులు, అలవాట్లు ఒక్కటిగా ఉంటే చాలు ప్రేమ బీజం త్వరగా పడుతుంది. ఇద్దరూ ఒకే ఆలోచన గలవారైతే ప్రేమ ఫలిస్తుంది లేదనుకుంటే మరణిస్తుంది అంతే దాన్ని ఎవరూ హత్యచేయరు.

      Delete
    3. గోవర్ధనశర్మ సర్...ఇప్పటి వరకూ మీ మాటకు ఎప్పుడైనా తిరుగు ఉంటే కదండీ! అయినా మీ ముందు నేనెంత? నా పాండిత్యమెంత? మీకు వందనములు_/\_

      Delete
    4. సమీక్షగారూ...మీరు మరో కోణంలో ప్రేమావిష్కరణ చేసారా!!!???

      Delete
  24. ప్రణయమారుతీయం.

    ReplyDelete
  25. ప్రేమలో నీరు కూడా షర్‌బత్‌లాగే అనిపిస్తుంది అదే వక్రించింది అనిపిస్తే పాయసం కూడా విషంలా ఉంటుంది. Twisted poem madam.

    ReplyDelete
    Replies
    1. వాహ్...రుచితో పోల్చారా?

      Delete
  26. ఆరని జ్వాలలు
    ఆగని కన్నీల్లు
    చీకటి రాత్రులు
    గమ్యంలేని దారులు
    శ్వాస ఆగుతుంది
    ప్రాణం పోదు...
    కన్నులు మూసిన
    తెరిసిన అంత శూన్యమే
    కోరుకున్న ప్రేమ దూరం అవుతుంటే
    ప్రాణం పోదు మనసు చావదు...

    ReplyDelete
  27. ఇంట గెలవకపోయినా నా ప్రియుడు రచ్చ గెలుస్తా

    ReplyDelete
  28. Marvelous blog creation

    ReplyDelete