మారిన సమయపు మాయావలయం చూస్తూ మేల్కుని
కనులు మూసుకుని గడిపే కాలాన్ని కలగంటున్నావేమో!
తామరాకుపై నీటిబొట్టంటి ప్రేమసంతకాన్ని గుండెపై చూసి
ఆవిరైన నీటిరాతల్లో తీపిజ్ఞాపకాలు వెతుకుంటున్నావేమో!
వెన్నెల్లో కానరాని వెలుగును వేకువ వెలుగుల్లో వెతుక్కుని
ఆశతో మరోమారు మరపురాని బంధాన్ని పేనుతున్నావేమో!
దూరమైపోయిన ఆనందం గుండె గుర్తుల్లో దాచిందంతా తీసి
నేలనింకిన నిరాశకి ఎత్తుపల్లాల బాటని చూపుతున్నావేమో!
ప్రేమంటే రెండుశరీరాల కలయిక కాదన్న సిద్ధాంతం వల్లించి
ఆటుపోట్లు లేని జీవితమేలేదన్న వేదాంతం వల్లిస్తున్నావేమో!
లవ్ అంటే అర్ధం చేసుకుని ఉండటం కాదు. జీవిస్తున్నాం అనే భ్రమలో బ్రతకడం.
ReplyDeleteఆటుపోట్లు లేని జీవితమేలేదన్న వేదాంతం..super
ReplyDeleteఅశాశ్వతమైనది శాశ్వతముగా...
ReplyDeleteశాశ్వతమైనది అశాశ్వతముగా...
అని భ్రమింపచేసేదే మాయ!!
అందరూ భ్రమలోనే బ్రతుకుతున్నారు.
why so imagination?
ReplyDeleteఏమో ఏమో అంటూ మనసుని తేటతెల్లం చేసారు కవితలో
ReplyDeleteకామాన్ని కప్పిపుచ్చడానికి కవులు వ్రాసిన అందమైన పేరు "ప్రేమ" అని సినారె గారు వ్రాసారుగా !
ReplyDeleteభ్రమలో లేను !
మీరు క్లారిటీ ఇచ్చారుగా ఇంక భ్రమ తొలగిపోయే.
ReplyDeleteఅంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా
ReplyDeleteఆశ నిరాశేనా మిగిలేది చింతేనా..
అంతా ఒక ఇల్యూజన్....భ్రమ లేదా భ్రాంతి అనబడే జీవనవిధానం.
ReplyDeleteమనసు మార్చుకో లేదా మనసు చంపుకో బ్రతకాలంటే ఎలాగోలా చావు !
జీవితమే ఒక భ్రాంతి
ReplyDeleteప్రేమ ఉన్నంత వరకూ ఏదీ కనబడదు అంతా బ్రహ్మాండంగా గోచరిస్తుంది ప్రేమ తొలగిపోయి భ్రమలు కరిగిపోయినప్పుడు వాస్తవ వ్యక్తిత్వాలు బయటపడతాయి.
ReplyDeleteభ్రమ అనేది ఎన్నో మనోరుగ్మతల లక్షణం, నమ్మిన వారిపై వ్యక్తి పై విశ్వాసం మరియు అవగాహన లేనప్పుడు అంటుకునే రుగ్మతే భ్రాంతి. ఒత్తిడి, భయం, ఆందోళన, భ్రాంతి,ప్రేమ, అతిగా నమ్మడం, న్యూనతాభావం, ఆత్మవిశ్వాస లోపం ఇవన్నీ భ్రమలో భాగాలు.
ReplyDeleteGandhi puttina desham lo now everything is imagination.
ReplyDeleteheart touching bitter illusion
ReplyDeleteప్రేమించే హృదయానికి ఎప్పటికీ శాంతి లేదు..
ReplyDeleteజీవితంలో ఇంక భ్రాంతియే కానీ కాంతి లేదు..
నేలనింకిన నిరాశకి ఎత్తుపల్లాల బాటని చూపుతున్నా..different
ReplyDeleteMissing your posts madam.
ReplyDeleteభ్రమా?
ReplyDeleteNo never
mee kavitalu baguntayi
ReplyDeletekonasaginchandi
మీ కవితలు కరువైనవి ఎందుకు?
ReplyDeleteమీ స్పూర్తి వ్యాఖ్యలకు ...పద్మార్పిత అభివందనములు_/\_
ReplyDeleteభ్రమపడి బ్రతకడం సుద్ధ వేస్ట్
ReplyDeleteadbhutam
ReplyDelete