ఆరంభంలోనే శృతిమించిన శృంగారం దక్కదని తెలిసి
మాటలెన్నో చెప్పి ప్రేమతేనెకత్తి మదిలో దించి పోతూ
హాస్యం హద్దులు దాటినా పర్వాలేదని కబుర్లెన్నో చెప్పి
కరుణరసపు గూటి చిరునామా చెప్పమని బ్రతిమిలాడి
ఓపిక నశించి విసుగు చెందితే రౌద్రం వద్దని వేడుకుని
ఏదోలేనని నవ్వితే వీరత్వం తమదని తెగమురిసిపోయి
విరగబడి నవ్వి భయంకరమైన చిత్ర విన్యాసాలెన్నో చేసి
భీభత్సాన్ని సృష్టించి అన్నీ అద్భుతం అనేలా మరపించి
ఏది ఏమైనా శాంతం వహించాలంటూ పాఠాలు చెప్పడం
ప్రేమలో కొంగ్రొత్త విద్యలంటూ ప్రేమించబడలేని రానినాడు
వలలో పడ్డ పిట్ట ఉసురు మనకేల అనుకోవడం దశమరసం
నవరసాలు మనల్ని కాదు పొమ్మని పరుల చెంత చేరితే
అన్నీ కలిసిన ఎందుకూ కొరకాని ఈ దశమరసం ఉత్తమం!!
చాలా రోజుల తరువాత కొత్తపంధాలో వ్రాశారు
ReplyDeleteఅర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. చిత్రం బాగుంది.
నవరసాలు చాలవని మీరు మరో కొత్త రసం అదే దశరసం కనుగొన్నారు విజయదశమి రోజుల్లో...భేష్ పద్మార్పిత
ReplyDeleteఏమైనారు మాడంజీ
ReplyDeleteనో రిప్లైస్
నో పోస్ట్
నో ఎంటర్టైన్మెంట్
శృంగారం
ReplyDeleteవీరం
కరుణ
అద్భుతం
హాస్యం
భయానకం
బీభత్సం
రౌద్రం
శాంతం
దశరసం
పద్మార్పితం :)
(మనస్సువ్రాయవద్దని హెచ్చరిస్తున్నా వ్రాస్తున్న వ్యాఖ్య!)
ReplyDeleteపద్మార్పిత గారూ, దశరసం అన్న పదం అంత ఉచితం కాదు. దశమరసం అనటం సరిగా ఉంటుంది. ఈ సలహా నచ్చకపోతే, యీ అల్పజ్ఞుడిని క్షమించండి.
(ఈ సలహాను తప్పుపట్టే అందరికీ విన్నపం. తరచుగా ఇక్కడకు రాను కాబట్టి మరలా స్పందించలేకపోతే మీరూ మన్నించాలని విఇజ్ఞప్తి)
శ్యామలరావుగారు అర్థవంతమైన సవరణ సూచించారు . మనస్సు రాయవద్దని...నచ్చకపోతే ...అల్పఙ్ఞుడిని... విన్నపం ... ఇన్ని మాటలు అవసరమా ? సలహా బాగుంది . బాగున్నప్పుడు ఎవరైనా స్వీకరిస్తారు . ఇందులో ఎవ్వరూ భేషజానికి పోరు .
Deleteమిత్రులు రాజారావు గారు, నా పూర్వానుభవాన్ని దృష్టిలో ఉంచుకుంటే అసలు నేనీ బ్లాగులో వ్యాఖ్యలు చేయటానికి మనస్సు అంగీకరించదు. కాని ఒక్కొక్కసారి బలీయమైన ఏదో ఒక ఔచిత్యం కారణంగానో మరేదో కారణం మనమనస్సును మనమే సముదాయించుకొనవలసి రావచ్చును. ఇది అటువంటి సందర్భం. ఇకపోతే ఇలా ఉబోసలు ఇచ్చి చీవాట్లు తినటం వలన నాకు అసవరం కాదు కాబట్టి ముందే అలా ఎవరూ ఆగ్రహించి తిట్టకుండా మన్నింపు కోరటం. నేటి వారికి నాబోటివాడి మాట చాదస్తంలా కనిపిస్తే ఆశ్చర్యం ఉండదు కదా.
Deleteమనం వ్యాఖ్యానించే బ్లాగుదారు మనల్ని లెక్కచేయరని
Deleteమనం నిష్కర్షగా అనుకున్న పక్షంలో నేనైతే అస్సలటు
వెళ్ళను . అలా వెళితే , మనకు పాండితీ ప్రకర్ష ప్రద
ర్శించుకునే దురద ఎక్కువనుకునే ప్రమాదం కూడా కద్దు .
నమస్కారములు శ్యామలీయంగారికి, రాజారావు గారికి...మీబోటివారు నా బ్లాగ్ చూడ్డమే నేను ఎంతో గొప్పగా ఫీల్ అవుతాను. శ్యామలీయంగారు నా తప్పుల్ని సరి చేసి సలహాలు ఇస్తుంటే ఆనందం పైగా తెలియనివి తెలుపుతున్నారని మీ ఎడల గౌరవం పెరుగుతుందే తప్ప ఏదో అనుకుని అంటానని ఎప్పుడూ అనుకోవద్దని మనవి.
Deleteఇక మీరు "దశం రసం" అని చెప్పేవరకు ఆ ఆలోచనే నాకు తట్టలేదు. దశదిన, దశావతారం అంటారు కదా అలాగే దశ రసం అనుకుని దశరసం అని రాసి పొరపాటుచేసాను. మీ "దశమరసం" తో పరిపూర్ణత చేకూరింది పదానికి. మీ ఆదర సద్భావం ఎల్లప్పుడూ కోరుకుంటూ...పద్మార్పిత _/\_
శ్యామలీయంగారు నా నోటి మాట మీ వాక్యాల వెంట. పద్మార్పిత కాదనే భరోసా
ReplyDeletenavarasaalanu koorchina teeru konchem tikamaka
ReplyDeleteఆరంభంలో శృతిమించిన శృంగారం-గమ్మత్తుగా వ్రాశారు
ReplyDeleteనవరసాలను చూసి నవ్వి
ReplyDeleteప్రాముఖ్యత లేదు పొమ్మని
అన్నీ అడ్డదొడ్డం అనుకుని
సరిపడదనిసరిపడదని ఎరంగి
చిర్రు బుర్రులు ఆడలేక
నవ్వమని సందేశం ఇచ్చి
చివరకు బేరమాడి
దశమ రసం శ్రేష్టం అంటివి
భావాలకు బానిసలు.
ReplyDeleteమీ బ్లాగ్లో నవరసాలు పండిస్తారు కనుక మీకు దశమరసంతో పనిలేదులెండి.
ReplyDeleteArtham ayyindi
ReplyDeleteartham kanatlu undi
అందరి అభిమాన ఆదరణలకు నమస్కరిస్తూ...పద్మార్పిత _/\_
ReplyDeleteచిరునామా చెప్పమని బ్రతిమిలాడి
ReplyDeleteWISH YOU AND YOUR FAMILY HAPPY DIWALI
ReplyDeleteదశమరసం అంటూ దంచికొడతారేమో అనుకుంటే ఇలా నిరాశ పరిస్తే ఎలా...
ReplyDeleteనిమ్మ రసం
ReplyDeleteదానిమ్మ రసం
బత్తియా రసం
నారెంజ రసం
కరివేపాకు రసం
వేపాకు రసం
శొంఠీ రసం
ఇన్ని రసాల నడుమ పాదరసం
ఆ పాదరసం సర్రున ఎగబాకక ఉంటే మంచిద్