వద్దన్నా వ్యక్తుల్ని వార్తాపత్రికలా చదివేస్తుంది
ఏదోకరోజు రూపం వెనుక దాగింది చూస్తుంది
వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది!
దాచింది చదవలేనిదేదో నెమ్మదిగా తెలుస్తుంది
అంత వరకూ ఆగని లోకం ఏదేదో ఊహిస్తుంది
వ్రాయని అంశాల పెద్దనిఘంటువే దాగుంటుంది
ప్రపంచానికి కనబడని మరోకోణమే మనిషన్నది!
కన్న కలలను బ్రతికించుకునే హక్కు నీదీ నాది
ఎవరికి తగ్గ నైపుణ్యం వారిలోనే కుదించబడుంది
నువ్వు నువ్వే నేను నేనేనన్న ప్రత్యేకత మనది
నిజం నేస్తమై సహనం సన్నిహితగా ఉంటానంది!
నవ్వు వెనుక వ్యధను దాచే వ్యక్తిత్వం కొందరిది
మదిగాయానికి చేసే మోసపూరిత అలంకారమది
మనసువిప్పి నవ్వక బహిరంగంగా ఏడ్వలేనన్నది
నిజాన్ని ఎందుకు చూపకున్నామో తెలియకుంది!
మ్యాడ్ మెంటల్ పిచ్చి పైత్యం పట్టిన లోకం ఇది
వారిది కాక ఎదుటివారి జీవితాన్ని చదువేస్తుంది
ఇతరులు మనలా ఉండాలని ఎందుకో కోరుతుంది
అందుకే మతిలేని లోకాన్ని వదిలేయమంటుంది!
లోకం వెర్రిది కాదండీ మనం మనుషులం పిచ్చి వాళ్ళం.
ReplyDeleteచక్కని శైలి
ReplyDeleteపొందికతో అమరిన అక్షరాలు
Yes...truth mam
ReplyDeleteపిచ్చి పాడు లోకం
ReplyDeleteతెలిసింది
తెలియంది
చెప్పి చేసి
నిన్ను నన్ను
నాశనం చేసి
తమాషా చూస్తుంది
మనము అదే పిచ్చి లోకంలో బాగానే వున్నాము. అయినా ఈ జనానికి వచ్చిన బాధేంటి? మన లోకానికి, వాళ్ళ లోకానికి చాలా తేడావుంది అదే వాళ్ళ బాధ.
ReplyDeleteGood afternoon Arpita
ReplyDeleteGood post after long gap
కళ్ళు ఉన్న సమాజం
ReplyDeleteచదివేది మనసును కాదు
మోసం చేసే సమాజం
మానవత్వం చూడదు
ముప్పుతెచ్చే సమాజం
చెప్పిన మాట వినదు
వెర్రితలల సమాజం
వెక్కిరించడమే చెస్తుంది
వెర్రిబాగుల సమాజం
విస్తుపోయి చూస్తుంది
వ్రాయని అంశాల పెద్దనిఘంటువే దాగుంటుంది avunu nijame
ReplyDeleteలోకం తీరు తెన్నుల విశ్లేషణ బాగారాసారు
ReplyDeleteప్రేమకు వ్యధలకు ఏదో అవినాభావ సంబంధం
ReplyDeleteఅందుకే ప్రేమించిన వారు వేదనకు గురి అవుతుంటారు
అరె ఏమిటిలోకం పలుకాకుల లోకం... మనసన్నది ఒకపిచ్చి మమతన్నది మరో పిచ్చి
ReplyDeleteలోకం ఎన్నో అంటుంది అది దాని నైజం.
ReplyDeleteలోకులు పలుకాకులు వాగుతూనే వుంటారు వాగనీ...
ReplyDeleteనీ అంతరాత్మకు నిజం చెప్పుకో నీదైన ఓ మనసు కోసం రేపటి నీ జీవితం...
పాగల్ లోకంలో ప్యార్ పుట్టించే మీకు ఈ నిరాశ ఏల పద్మార్పిత బాలా
ReplyDeleteమీరు మీరుగా ఉంటేనే అందరికీ నచ్చుతారు
ReplyDeleteఎవరి కోసం మారిపోతే ఎలా మేడంజీ
duriya ki dastoori hai
ReplyDeleteమ్యాడ్ మెంటల్ పిచ్చి పాగల్ :)
ReplyDeleteలోకం పలురకాలు
ReplyDeleteఅందరూ మనలాగే ఆలోచించరు
అలా అనుకోవడం తప్పు కదమ్మా
మ్యాడ్ మెంటల్ పిచ్చి పైత్యం పట్టిన లోకం ఇది 100%
ReplyDeleteలోకాన్ని వదిలి వేసి ఎక్కడ జీవించాలి?
ReplyDeleteమన మానసికస్థితి ఎట్లాగు ఉన్నదో అన్నదానిని బట్టి మనకు లోకం తదనుగుణంగా కనిపిస్తుంది. మనస్సు ఆనందభరితంగా ఉన్నప్పుడు ఎంతో అందమైనలోకంగా కనిపించినదే విషాదఘడియల్లో శూన్యంగా అనిపిస్తుంది. వేదాంతికి లోకం ఒక గురువులాగ కనిపిస్తున్నది కదా అదే లోకం పామరదృష్టికి పిచ్చిదిలాగా కనిపిస్తున్నదీ అంటే లోపం మన దృక్కోణంలోనే ఉందన్నమాట. పిచ్చిలోకం అనే మనిషికూడా అదే పిచ్చిలోకంలో భాగమే - ఆ లోకం పిచ్చికి తానూ ఎంతో కొంత కారణమే అని అనుకోవటం ఉపయోగించవచ్చును.
ReplyDeleteమానసికస్థితిని అనుసరించే భావాలు అలోచనలు కలుగుతాయి. ఈ విషయాన్ని చక్కగా తెలియజేసారు. ఆలోచనల్ని మార్చుకుంటే ప్రపంచాన్నే మార్చవచ్చు. ఎలా ఉండాలో నేర్పిస్తుంది ఏకాంతము, ఎలా ఉన్నామో చెబుతుంది సమాజము అదే లోకం.
Deleteలోకంలో మనిషి కళ్ళున్నా చూడలేక, చెవులున్నా వినలేక, నోరున్నా మాట్లాడలేక, మనసున్నా స్పందించక, మేధస్సు ఉన్నా ఆలోచించక అసత్యమనే ప్రపంచానికి ... మధ్యలోని జీవితం మాత్రం మనచేతుల్లోని సత్యం. ... లోకం తీరు తెన్నులను తీరు మార్చడం మనచేతుల్లోనే ఉంది పద్మ
ReplyDeleteమానసిక ఒత్తిడికి లోనైన మనిషికి లోకం తీరు ఒకలా అన్ని జయాలు చవిచూసిన మనిషికి లోకం అందంగా కనబడుతుంది. ప్రస్తుతం నీవు ఒత్తిళ్ళకు లోనౌతున్నట్లు గోచరిస్తుంది. ఏమంటావు పద్మార్పితా.
ReplyDeleteఅందరి ఆదరాభిమాన స్పందనలకు అర్పిత అభివందనములు.
ReplyDeletelokam pichidi manchidi anedi anubhavame nerputundi.
ReplyDelete