స్నేహమే ప్రేమగా మారుతుంటే సై అన్నాను
బంధాన్ని గట్టి పరచాలని బావాని పిలిచాను
బావలో బలం లేదంటే నిజమేనని నమ్మాను
మామాని పిలిచి మమతానురాగాలే చిలికాను
మరులుగొలిపేంత మత్తులేదంటే ఊరకున్నాను
కన్నా అంటూ పిలిచి కపటమేలేదని తెలిపాను
కలవరింతపెట్టే పిలుపంటే కామోసనుకున్నాను
ముద్దుపేరుతో పిలిచి మురిపాలు గుమ్మరించాను
ముద్దులియ్యమంటే హద్దు దాటేనని మానేసాను
నా విశ్వమే నువ్వంటూ వీడకని వేడుకున్నాను
వలపు పొరకు బంధం అక్కర్లేదంటే ఇంకేమనను
ఆప్యాయంగా అల్లుకున్న అస్థిర బంధాన్ని నేను
తుప్పట్టిన లాంతరు వెలుగులా నవ్వుతున్నాను!
సంబంధాల నుంచి ఆఫీసు సంబంధాల వరకూ అన్నింటా నేటి తరం యువతీయువకులు ఫాస్ట్‌గా నిర్ణయాలు తీసుకుంటూ జీవితాల్ని అస్థిరం చేసుకుంటున్నారు. ఆరోగ్యకరమైన అనుబంధాలు మనిషికి శాంతినిస్తాయి. ఆనందాన్ని పంచుతాయి. ఆరోగ్యాన్నిస్తాయి. కష్టసుఖాల్లో నలుగురి అండదండలనూ అందిస్తాయి.ఆ బంధాలు, అనుబంధాలకు ఏ గోడలూ అడ్డురావు. చక్కని చిత్ర కవనం అందించారు.
ReplyDeletekashatalu sukhalu eavaina navvutu undu.
ReplyDeleteNice pic padma.
భావోద్వేగాలు ఘర్షణ పడితేనే ఏ బంధమైనా తెగిపోయి స్థిరత్వాన్ని కోల్పోతుంది. దేన్నైనా సున్నితంగా పరిష్కరించుకోవడం మంచిది.
ReplyDeleteపిలచినా బిగువటరా...
ReplyDeleteఈ నయగారము ఈ వయ్యారము.
ఈ నవ యవ్వనమానగ నిను నే పిలచినా బిగువటరా...అని పాడుతూ అడగండి...హ హ అహా
కపటంలేని ప్రేమ ముందు ఏదైనా దిగదుడుపే కదా హైరానా పడనేల?
ReplyDeleteనీ మాటలు వరములై
ReplyDeleteహృదయ తలుపులు తడుతుంటే
నీ వాలు చూపులు బాణాలై
నా గుండెను మెలిపెడుతుంటే
నీ ఆశయాలు మలుపులై
నా గమ్యాన్ని నిర్దేసిస్తుంటే
నీ నవ్వులు పువ్వులై
నా మనసులో పరిమళిస్తుంటే
నిన్ను మరవలేని స్థితి
ఏమి దిక్కుతోచని పరిస్థితి
నీకై వేచిచూస్తూ అలసిపొయాను..
అస్థిర బంధంలో భావం చిత్రంలో కనబడుటలేదు
ReplyDeleteఅయినా ఏదో బలమైన కారణం లేకుండా మీరు పెట్టరు అనే అనుకుంటున్నాను.
Good picture with post
ReplyDeleteబాగున్నారా అర్పితగారు?
ReplyDeleteNic pic madam.
తుప్పు పట్టిన లాంతరులా నవ్వు..కొత్తగా బాగుంది
ReplyDeleteGood one
ReplyDeleteబాగుంది
ReplyDelete
ReplyDeleteబలహీనమైన బంధానికి బలమైన బ్యాండ్ వెయ్యలేరు
పిలుపులో ఏముంటుంది చెప్పండి
ReplyDeleteవడ్డించే వాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా అందుతాయి అన్నీ.
అభిమానం ఉంటే రారా పోరా అని పిలచినా బాగుంటుంది అదే కోపంగా ఉన్నప్పుడు రామా అని పిలిచినా బూతు అనిపిస్తుంది. అయినా విఢూరం కాకపోతే మీరు పిలిస్తే పలుకని వారు ఎవరండీ..మంచి కవితా తగిన చిత్రాన్ని అందించారు.
ReplyDeleteNICE
ReplyDeleteపద్మార్పితా ఇంకెన్నాళ్ళు ఈ బంధాలు బాధ్యలు అంటారు? :)
ReplyDeleteఏ బంధంలోనైనా మధ్య మధ్యలో సవాళ్ళు లేకపోతే జీవితంలో మజా ఏముంది?
ReplyDeleteఏ బంధమైనా స్నేహంతో ఆరంభమై,. ప్రేమతో అంతం అవుతుంది అనుకుంటాము కాదు వ్యధతో అంటారు మీరు...
ReplyDeleteకార్తీకపౌర్ణిమ శుభాకాంక్షలు.
ReplyDeleteస్థిరంగా అడుగు వేస్తె బంధం గట్టిపడుతుంది ఏదైనా
ReplyDeleteఅందరికీ వందనములు.
ReplyDeleteyour are talented.
ReplyDelete