జ్ఞాపకాలు భద్రంగా ఉంచిన బీరువా నా గుండె
అందులో నా భావ ప్రపంచాన్ని భద్రం చేసాను!
అంతరంగ ఆనందపు సాక్షిపత్రాలను పదిలపరిచి
లోతుగాయాన్ని దాచే తాపత్రయం చేస్తున్నాను!
హృదయం స్పందించడం మరచి కొట్టుకుంటుంటే
అలవాటుగా ఊపిరి పీల్చి గాలినే వదిలేస్తున్నాను!
వాగ్దాన వాక్యాలు వివరం చెప్పమని ప్రశ్నిస్తుంటే
రాలిన ఆకులతో లయబద్దంగా పాడుతున్నాను!
ప్రాణంపోయినా పర్వాలేదని మది శ్వాసతో అంటే
పాతజ్ఞాపకాల పరుపు పరచి పరామర్శిస్తున్నాను!
చివరాఖర్న శాశ్విత నిద్రలోకి జారిపోతూ కూడా
నాటి పరిచయపరిమళ అత్తర్ని ఆస్వాధిస్తున్నాను!
జ్ఞాపకాల చాకుతో గుండెను కోసారు.
ReplyDeleteమదిని తాకే భావాలు.
ReplyDeleteTouching poetry
ReplyDeletestrong internal feelings mam.
ReplyDeleteఅంతర్గత భావలహరి పెల్లుబికిన వేళ...
ReplyDeleteఅర్హతలేనివారికి హృదయం ఇస్తే
ReplyDeleteదయాధర్మం దారి తప్పునేమో
తగినవారికి తగు బలమిచ్చి
సహనం క్షమ సఖ్యతనిచ్చి
జవము జీవము జీవనమీవే
మధుర హృదయ ఆత్మ బలమీవమ్మా !
వ్యధాభరితం
ReplyDeleteహృదయం స్పందించడం మరచి కొట్టుకుంటుంటే****
ReplyDeleteLong gap-పాతజ్ఞాపకాల పరుపు
ReplyDeleteజ్ఞాపకాల బీరువా భద్రం.
ReplyDeleteహృదయం స్పందించడం మరచింది కవితకి
ReplyDeleteస్మృతిపధంలో పయనించండి.
ReplyDeleteఅందరి ప్రేరణావాక్యాలకు వందనం
ReplyDeleteso sweet
ReplyDelete