మనిద్దరం..


నాకు తోడుగా నువ్వుండు...జీవించడం నేర్పుతాను
గమ్యాన్ని నువ్వు చేరుకో...దారి నేను చూపిస్తాను
సంతోషంగా ఉండు...కావలసినవి నేను కూరుస్తాను
ప్రశ్నలు విశ్లేషిస్తూ ఉండు...జవాబులు విపులీకరిస్తాను
మాటపెగలని మనస్పర్ధలపై నీళ్ళు చల్లేద్దాం రా ఇద్దరం..
      
కష్టం నేననుకోకు...నీ నుండి నేను ఏమీ కాంక్షించను
నా ధైర్యాన్ని నీవు శంకించకు...దానికర్థమే నేనౌతాను 
స్నేహితుడిగా నువ్వుండు...దాన్ని నే నిలుపుకుంటాను
సంకోచాలు చెరిపేస్తుండు...ఆనందరాశులు కుమ్మరిస్తాను
ఎటూ కాని మన విడివిడి కధల్ని కలిపేద్దాం రా ఇద్దరం..

నన్నంటి నాతో ఉండు...లోటుపాట్లకు ఆస్కారం ఇవ్వను 
మనమధ్య మాటలేలనకు...మనసు మొత్తం పరుస్తాను
బంధమే లేదనకు...బ్రతుకు బావిలో నీతో మునుగుతాను
నీతో కలిసుండే ప్రయత్నం...నేను కాటికేగే వరకు చేస్తాను  
ఆపై నువ్వూనేను తూర్పూ పడమరకీ పయనిద్దాం ఇద్దరం..

28 comments:

  1. ప్రేమైక జీవుల ప్రణయ ప్రమాణం.

    ReplyDelete
  2. ప్రేమ సాంగత్యంలో ఓలలాడం అంటే ఇదేనా?

    ReplyDelete
  3. నువ్వూనేను తూర్పూ పడమరకీ పయనిద్దాం.

    మళ్ళీ చెరొక దారా ?

    ReplyDelete
  4. సరి సమానం
    ఇద్దరూ ఇద్దరే

    ReplyDelete
  5. అద్భుతహా:

    ReplyDelete


  6. లేదనకోయ్ బంధమ్మే
    నీ దానిని నే గలను తనివిగన రారా
    నా దరి పద్మనురా నా
    లో దర్శించితిని నిన్ను లోన వెలుపలన్


    జిలేబి

    ReplyDelete
  7. మీరు మీ భావాలు ఎప్పుడూ శోచనీయమే

    ReplyDelete
  8. ధైర్యానికి నిలువుటద్దం మీ ప్రతిబింబం
    అచ్చ తెలుగు పదాల ఎంకి పద్మార్పిత

    ReplyDelete
  9. మరో తురాయి మీ కవితల కిరీటంలో

    ReplyDelete
  10. ఊహలు మనిషిని నాశనం చేస్తాయో..

    ReplyDelete
  11. నేనెప్పుడూ నీతోనే ఉంటా... నీ లోనే ఉంటా..
    అంత ప్రేమ సాధ్యం కాదురా అంటారు ఈ మనోవృద్ధులు. శరీరాలు, ధనంలో సుఖాన్ని వెతుక్కునే అల్పజీవులు. ఎందుకు బతుకుతున్నామో తెలుసుకోలేక. సృష్టిలోని బంధాలన్నీ ఇంతే అనుకుంటారు. అల్ప మనుషులు, అల్ప సంతోషాలు. వీళ్లకు ప్రేమించడమే కాదు, ప్రేమించహబడమూ తెలియదు, రాదు అనుకుంటాను. కొద్దిగా వర్షంలో తడిసి, అబ్బా... తడిసి పోయాను, అని ఆరబెట్టుకునే మనుషులు. అహాన్ని ఎలా వీడతారు. నాది అనే భావనలోనే చిక్కుకొని దానిలోనే అందరిని కుదించి చూస్తారు. ఒక్కసారి బైటకు వస్తే ఎంత ప్రేమమయం. మనిద్దరిలా ఈ లోకం. ఎంత సుఖం... ఆత్మపరమాత్మల సంయోగంలా... నీలా నాలా...ఏమంటారు

    ReplyDelete
  12. Mee Prema Manasuki nenu daasoham aipoyam.

    ReplyDelete
  13. " నువ్వూనేను తూర్పూ పడమరకీ "
    అతడు తన యెదలో నిండి నిరంతరం ఉదయిస్తూనే ఉండాల ,
    తను అతని హృదయమంతా పండి అతనిలో అస్తమిస్తూనే
    ఉండాల .
    అద్భుతమీ మమేకం .

    ReplyDelete
  14. స్నేహితుడిగా నువ్వుండు...దాన్ని నే నిలుపుకుంటాను
    ఒక్కరు మాత్రమే నిలుపుకోవడం ఎలా?
    ఇద్దరిలోనూ ఉండాలేమో...

    ReplyDelete
  15. adbhuta pranaya kavyam.

    ReplyDelete
  16. ప్రేమించడం చాలామంది చేస్తారు, కానీ ప్రేమ విలువైంది కాదు దాన్ని నిలబెట్టే నమ్మకం విలువైంది

    ReplyDelete
  17. Amazing writings mam.

    ReplyDelete
  18. ప్రేమతత్వం మెండుగ నిండిన కవిత.

    ReplyDelete
  19. మన విడివిడి కధల్ని కలిపేద్దాం రా extraordinary.

    ReplyDelete
  20. ఒకరి లోటుపాట్లు ఒకరు ఎత్తి పొడుచుకోక
    సజావుగా జీవితం సాగడమనేది ఒక కల.

    ReplyDelete
  21. మీ అందరి అభిమానానికీ పేరు పేరునా పద్మార్పిత నమో:వందనములు.

    ReplyDelete

  22. ఏమండోయ్ పద్మార్పిత గారు

    ఓ అనాని తుస్సు యెవరో మీకు కళ్యాణ మయిందా అని సందేహపడుతున్నారు కాస్త చూద్దురూ :)



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కాలేదని మీరు చెప్పకపోయరా? :)

      Delete
    2. ఖచ్చితంగా పెళ్ళి అయింది

      Delete
  23. గుండెల్లో గుచ్చారు.

    ReplyDelete
  24. చాలా రమ్యమైన భావం. చక్కని వ్యక్తీకరణ. శుభాభినందనలు, పద్మార్పితగారూ. 👏👏👍

    @chandu1302

    ReplyDelete